కొవ్వు పదార్థాలు గుండెకి మంచిదేనా?
posted on Mar 20, 2024 @ 1:30PM
నూనె పదార్ధాలు,బాగా కొవ్వు ఉన్న పదార్ధాలు తింటే హై బిపి గుండె జబ్బులకు దారి తీస్తుందని.అందరికీ తెలుసు.అసలు ఎలా ఏర్పడుతాయో తెలుసా? మనం తీసుకునే ఆహారం లోనే కొవ్వు కడుపులోకి చేరుతుంది,కలిసి పోతుంది. అది రాక్తనాలాలకు చేరుతుంది.కొన్నాళ్ళు గడిచాక రాక్తనాళా లలో చేరి నిలువ ఉంటుంది కొవ్వు రక్త నాళాల లోపలి గోడల మీద పేరుకుంటుంది. ఇలా పేరుకు పోవడం మూలంగా రక్తనాళాల లోపలి మార్గం ఇరుకుగా ఉండి దీనితో రక్త నాళం లో రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడి అది హై బిపి కి దారి తీస్తుంది. ముఖ్యమైన అవయవాలకి చేరాల్సిన రక్త ప్రవాహానికి అవరోదం ఏర్పడే సరికి రకరకాల జబ్బులు ఏర్పడతాయి ఆజబ్బులు ఈ క్రింది రకాలుగా వుంటాయి. గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళాలు ఇరుకుగా ఉండడం తో చాతిలో నొప్పి వస్తుంది.
గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళం ఏదైనా పూర్తిగా పూడిపోతే పక్షవాతం వస్తుంది. శరీరంలోని ఏదైనా అవయవానికి రక్తాన్ని తీసుకుపోయే నాళం పూడుకుపోయినా గాంగ్రీన్ ఏర్పడుతుంది. ఆయా కుటుంబాలలో ఎవరికన్నా గుండెజబ్బులు లేదా హై బిపి లాంటివి వున్న వాళ్ళు తాము తీసుకునే ఆహారంలో కొవ్వు తక్కువ వుండేట్లు గా చూసుకోవడం చాలా అవసరం. గుండె కవాటం మూలంగా,లేదా గుండే కవాటం లోపం మూలంగా కూడా రక్త నాళాలలో సమస్యలు రావచ్చు.