నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తింటే?
posted on Mar 7, 2024 @ 11:39AM
మీకు నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందా తినేసయ్యండి. హాయిగా నిద్ర పొండి. సుఖంగా నిద్రపోవాలంటే సహకరిస్తుంది. లేదా ఏదైనా చిరుతిండి తింటే నిద్రవస్తుందా అంటే నిద్ర వస్తుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనిషి అన్న వాడు 7 నుండి 8 ఘంటలు నిద్రపోవాలి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కాని ప్రపంచంలో 3 వ వంతు అమెరికన్లు సరిపడా చాలినంత నిద్ర పోవడం లేదని నిపుణులు గమనించారు. అల్లా ఒక సారి నిద్ర లేమి సమస్య దీర్ఘకాలంగా ఉంటె వ్యక్తి శారీరకంగా మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది.
ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ప్రతి రోజు నిద్రపోవడం పడుకునే ముందు టి .వి ఫోన్ ,లి మీ నిద్రను పెంచుతాయి. మీఆహారం లో కొద్ది పాటి మార్పు చేసుకుంటే నిద్ర సరిపోతుంది ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.సాయంత్రపు గాలులు తగ్గ్గిన వెంటనే నిద్రకు ముందు ఏదైనా స్నాక్ తీసుకుంటే నిద్ర మత్తు వస్తుంది.దీనివల్ల మీనిద్ర సమయాన్ని కొంతవరకు మీరే స్వయంగా అలవాటు చేసుకో వచ్చు.దీనివల్ల మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మీరు నిద్ర పోయే ముందు వెచ్చటి పాలు గ్లాసుడు తీసుకుంటే నిద్రకు సహకరిస్తుంది. అయితే ఇది పాత పద్దతే కావచ్చు ఇది పాత బడిపోయిన సలహా అని మీరు ఎద్దేవా చేయచ్చు. వివిధ రకాల నట్స్,సీడ్స్,బలమైన ఆహారం సేరోటో నిన్ ను ఉత్పత్తి చేస్తాయి,అమినోయాసిడ్స్నిద్ర పోయేలా చేస్తాయి. ఆల్మండ్స్ బాదం పీనుత్స్ పల్లి పప్పులు మెలటోనిన్ పదార్ధాని ఇస్తాయి. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రపోయే పద్ధతి ని అలవాటు చేస్తుంది.