ప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!
posted on Feb 6, 2024 @ 1:43PM
ఎప్పుడూ అలసటగా, బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ, మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా? ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు..
60 గ్రాముల వేయించిన శనగలు
2 ఖర్జూరాలు.
1 అపటిపండు
1 గ్లాసు పాలు
బెల్లం రుచికి సరిపడా
తయారువిధానం..
ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి. అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే.
ప్రయోజనాలు..
ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి.
ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో కాల్షియం వల్ల కేవలం 15 రోజుల్లోనే శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్ కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది.
*నిశ్శబ్ద.