Read more!

99శాతం మంది పాలకూర వండటంలో తప్పు చేస్తున్నారట.. ఎలా వండితే మంచిది? లాభాలేంటంటే.!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో పాలకూరను సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  అందుకే దీన్ని పోషకాలకు పవర్ హౌస్ అని అంటారు. విటమిన్ ఎ, సి మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, దీని వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మన ఎముకలు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండాలంటే బచ్చలికూర పుష్కలంగా తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే పాలకూర తినాలి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  పాలకూరతో సూపులు, పన్నీర్ తో కలిపి వంటలు, పప్పు వంటివి తయారు చేస్తారు. అయితే చాలామంది పాలకూర వండటంలో తప్పులు చేస్తున్నారట.

పాలకూర ఎలా వండాలంటే..

తాజాగా శుభ్రంగా ఉన్న పాలకూరను పచ్చిగానే సలాడ్ లో తినచ్చు. దీన్ని ఇతర కూరగాయాల వంటలలో చివరగా వేసి కాసింత వేపచ్చు. అయితే చాలామంది  మాత్రం దీన్ని మొదట నీళ్లలో ఉడికించి  ఆ తరువాత మళ్లీ చల్లనీళ్లో వేసి వేడి తగ్గాక పేస్ట్ చేసి కూరల్లో వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం సరైన పద్దతి కాదు. పాలకూర చపాతీలు, పాలక్ పనీర్ కూర, పాలకూర సూప్ మొదలైనవన్నీ ఇలానే చేస్తారు. ఇలా చేయడం వల్ల పాలకూరలో పోషకాలన్నీ పోతాయి. రంగు తప్ప దీన్నుండి ఏమీ లభించదు. అయితే పాలకూరను టమోటా, మిరియాల పొడితో కలిపి తింటే శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుందట.

పాలకూర తింటే కలిగే లాభాలు..

గర్బిణీ స్త్రీలకు..

గర్భిణీ స్త్రీలకు పాలకూర చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీకి అవసరమైన పోషకం. ఫోలిక్ యాసిడ్ శిశువును పుట్టుకతో వచ్చే లోపాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

మధుమేహం ..

పాలకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా  ఉంటుంది. ఇందులో ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్.   డయాబెటిక్ రోగులలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం,  ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

రక్తపోటు..

పాలకూరలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడం సులభం అవుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.

క్యాన్సర్..

క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఎముకలు..

పాలకూరలో లభించే విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాల్షియం శోషణను పెంచుతుంది. విటమిన్ కె లోపం వల్ల ఎముకలు విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి.

జీర్ణక్రియ..

పాలకూరలో ఐరన్ తో పాటు ఫైబర్,  నీటి శాతం  సమృద్ధిగా ఉంటాయి. దీని వినియోగం మలబద్ధకం సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనానికి,  జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బచ్చలికూర ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.

జాగ్రత్తలు..

పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ శరీరం  కాల్షియంను గ్రహించడంలో అడ్డుకుంటుంది. అంతేకాదు  దీన్ని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు.

అలాగే పాలకూరను ఎక్కువగా వండకూడు. ఎందుకంటే  ఇందులో ఉండే పోషకాలు నశించిపోయి ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడదు. బచ్చలికూర నుండి పోషకాలు పుష్కలంగా లభించాలంటే   ఎక్కువ ఉడకబెట్టడం మానుకోవాలి.

                                    *నిశ్శబ్ద