Home » Saroja sree sree » Sri Sri Samsara Prasthanam

        
    "అసహ్యంగా  మాట్లాడకు సరోజా! మాటవరసకి  అన్నానేకాని  నాకేమీ అవదు. మనవాళ్ళు ఒళ్ళంతా  కళ్ళు చేసుకొని నన్ను కాపాడుకుంటారు" అన్నారు.
    "పోనీ పిల్లల్ని తీసుకొనే వెళ్ళిపోదామండి. నేను మా తమ్ముడింట్లో  వుంటాను.కాస్త మీకు దగ్గరగా వున్నానన్న  తృప్తయినా  వుంటుంది" అన్నాను.
    ససేమిరా ఒప్పుకోలేదు.
    "నేను నీతో మాట్లాడకపోయినా  ఎప్పటికప్పుడు  నీకు నా విషయాలు తెలియజేయిస్తూ ఉంటాను. ఎప్పటి న్యూస్ అప్పుడే  తెలుస్తూ వుంటుంది. నీకు కొత్తగనక బెంగ పెట్టుకొని  మనస్సు పాడు చేసుకుంటున్నావు గానీ నాకీ సంఘటనలు  కొత్తేమికాదు  సరోజా! జైలు కూడా కొత్తకాదు" అన్నారు.
    గుండెధైర్యం  ఒక్కటే  నా ఆస్తీ పాస్తీ. నువ్వు అనవసరంగా బెంగపెట్టుకోకు" అన్నారు.
    ఆరోజూ  పగలూ, రాత్రి టెలిఫోన్లు, ట్రంకాల్స్  వస్తూనే వున్నాయి.
    'ఇక లాభంలేదు  ఈయన  వెళ్ళకతప్పరు. నన్ను తీసుకువెళ్ళరు' అని అనుకున్నాను.
    మొండికేస్తే  ఆయనతో  సాల్లేము. ఎస్ అంటే ఎస్సే. నో అంటే నోనే. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. వారికి సరేసరి.
    మర్నాడు వారి ప్రయాణం.
    ఎక్కడలేని నీరసం. భయం నన్ను ఆవరించాయి. పిల్లల్ని  జాగ్రత్తగా చూసుకోమని వెయ్యి అంపకాలు పెట్టారు. నాకు కొండంత ధైర్యం చెప్పారు.
    హైదరాబాద్ చేరగానే  టెలిగ్రామ్  మాత్రం ఇవ్వమని  గట్టిగా  చెప్పాను.
    కులాసాగా చేరినట్టు  వైరు  ఇచ్చేశారు. అంతే_ఆ తర్వాత  ఏం జరుగుతుందో, ఏమయిందో  పత్తాలేదు. నా గుండెల్లో రైళ్ళు  పరుగెడుతున్నాయి. వారి ఆలోచనలతో  గతంలోకి వెళ్ళిపోయాను.
    షష్టిపూర్తి వేడుకల గురించి చెపుతున్న  విషయాలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఒకరిద్దరు  మిత్రులు నాతో చెప్పిన  మాటలు  జ్ఞాపకం వచ్చాయి.
    "శ్రీశ్రీగారి  షష్టిపూర్తికి  హడావుడి అంతా ఇంతా కాదు. అందరం ఓ పెళ్ళికి వెళుతున్నట్టు  వెళ్ళాం. విశాఖ పట్నంలో  ఆ మూడు రోజులూ  ఓ పెద్ద పండగేనమ్మా. అంత ఘనంగా, గొప్పగా, అంత సరదాగా ఎవరికీ షష్టిపూర్తి ఉత్సవాలు జరగలేదు.
    మన పెళ్ళిళ్ళలోలాగే  అక్కడ కూడా అలకలూ, గింజుకోవడాలూ  జరిగాయి. అందుకనే పెళ్ళిలా  జరిగిందంటున్నాం.
    ఎప్పుడు  ఏది జరిగినా, ఆధునిక తెలుగు సాహిత్యానికి  సంబంధించినంత వరకూ, ఇటీవల  అన్ని ఉద్యమాలూ  శ్రీశ్రీ అనే కేంద్రబిందువు చుట్టూ పరిభ్రమిస్తూనే వున్నాయి. తన చుట్టూ  ఎంత గొడవ జరుగుతున్నా, తనకేమీ  పట్టకుండా  తన మనోవాల్మీకంలో  తాను వుండగలవారు  "శ్రీశ్రీ" అని అన్నారు. కళ్ళముందు వారే  నిల్చున్నట్టున్నారు.
    వీరికి  ప్రాణంమీద  తీపిలేదేమిటి చెప్మా! భార్యా పిల్లలమీదా కూడా  మమకారం లేదా? ఏమిటి వీరి తత్వం ?
    పోనీ_భార్యా పిల్లలమీద  ఏమీ వుండనక్కరలేదు. తనమీద  అయినా తనకి జాగ్రత్త వుండొద్దూ? అనుకుంటూ__
    "భగవంతుడా! వారికి  ఏమీ చెడు కలగకుండా  చూడు. నాకూ, నా పిల్లలకీ అన్యాయం చెయ్యకు" అని పిచ్చిదానిలా దండాలు పెట్టుకుంటూ, పోనున్న  గదిలో నుండి  కదలలేదు.
    మధ్యాహ్నం  రెండు గంటలప్పుడు  ఫోను  వచ్చింది, శ్రీశ్రీగారిని అరెస్టు చేశారని.
    అనుకున్నంతా అయ్యింది. ఏ దేవుడూ సాయం చెయ్యలేదు. నా పూజలూ పునస్కారాలూ  చెయ్యిచ్చేశాయి. ఓ విధంగా  దేవుడి విషయంలో శ్రీశ్రీగారు చెప్పిందే నిజమేమో_అనుకుంటూ  కూలబడిపోయాను.
    అరగంట  కాకుండానే  ఇద్దురు ముగ్గురు  మిత్రులు  నాకు ధైర్యం చెప్పడానికి వచ్చేశారు.
    "శ్రీశ్రీగారికి ఏమీకాదు. వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మనవాళ్ళంతా  అక్కడున్నార"ని చెప్పారు.
    "నేను వెంటనే  బయలుదేరి  హైదరాబాద్ వెళ్ళాలి. ఏం చేస్తారో నాకు తెలీదు" అని అన్నాను.
    "మిమ్మల్ని అక్కడికి రానివ్వద్దని  గురువుగారు చెప్పమన్నారమ్మా! అందుకే మేం పరుగెత్తుకొచ్చాం. రెండుమూడు  రోజుల్లో  వారు వచ్చేస్తారు. మీరు ధైర్యంగా  వుండండ"ని చెప్పి, నన్ను కదలనివ్వకుండా  తిష్టవేసి కూర్చున్నారు.
    
                          *    *    *


                                           ఆశ్చర్యం!


    మా ఇంట్లోవున్న  మిత్రులు  నాకు ధైర్యం చెబుతూ "శ్రీశ్రీగారి  గురించి మీరెందుకమ్మా  అనవసరంగా  భయపడతారు? మీరు అరవదేశంలో  కూర్చున్నారు. ఒక్కసారి ఆంధ్రాకొచ్చి  చూడండి. గురువుగారి  సంగతి తెలుస్తుంది" అని అంటూ వుండగా  మళ్ళీ ఫోను వచ్చింది. వెళ్ళి తీశాను.
    "సరోజగారు కావాలండీ" అన్నారు అటు నుంచి.
    "నేనేనండీ  మాట్లాడుతోంది. మీ పేరు?" అన్నాను.
    "పేరేదైతే ఏం లెండమ్మా. గురువుగారు  కులాసాగా వున్నారు."
    "ఎక్కడండి? జైల్లోనా ?"
    "కాదమ్మా! జైలు నుండి వచ్చేశారు. ఎల్లుండి  గురువుగారు  వచ్చేస్తున్నారు. వివరాలన్నీ చెప్తారు. మిమ్మల్ని భయపడొద్దని, తనకేం  ఫరవాలేదని, పిల్లలెలా  వున్నారని అడగమన్నారమ్మా" అన్నారు.
    "ఆఁ బాగున్నారండి. చల్లనిమాట  చెప్పారు. థాంక్సండీ" అన్నాను.
    "ఫరవాలేదమ్మా! వుంటామరి" అని ఫోను పెట్టేశారు.
    పేరు చెప్పకపోయేసరికి  నాకు సందేహం కలిగింది. ఇది ఎంతవరకూ నిజం  అన్న విషయం  తెల్సుకోవాలనే  ఉబలాటం  హెచ్చయింది. వచ్చిన మిత్రులు వెళ్ళిపోయారు.
    నేను వెంటనే ఫోను దగ్గర తిష్టవేశాను. నాకు కావలసినవాళ్ళు, బాగా పరిచయస్తులైన  ఇద్దరు ముగ్గురు మిత్రులు  హైదరాబాదులో వున్నారు. వారికి ఫోను చేసి అడిగాను.
    "భయపడొద్దు. కులాసాగా వున్నారు. వారిని జైల్లో ఎవడమ్మా  భరిస్తాడు? అయినా  చాలా గొడవలు జరిగాయి. నానారభస అయ్యింది. ఇదంతా ఫోనులో  ఇప్పుడు మాట్లాడ్డం  మంచిదికాదు. బహుశా  రేపే గురువుగారు ఇంటికి వచ్చేయొచ్చు. అలా రాకున్నా ఎల్లుండి వచ్చేస్తారు. భయపడకండ"ని  చెప్పారు.
    వాళ్ళకి కృతజ్ఞతలతోపాటు  నమస్కారాలుకూడా  చెప్పి ఫోను  పెట్టేశాను. మనసు కాస్త కుదుట పడింది.
    ఒక్కోరోజు  ఒక్కోయుగంలా  గడిచింది. ఎలాగయితేనేం  సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అంతే_ఇద్దరం టెలిఫోను గదిలోనే కూర్చున్నాం. కబుర్లలో  పడ్డాం.
    "ఏవండీ! నాకన్నివిషయాలు ఏటూ జెడ్  చెప్పాలి. మీ సంగతి అక్కడ ఎలాగో కానీ ఇక్కడ నేను మాత్రం చిత్రవధ అనుభవించానండి  అబ్బబ్బ! ఏమిటా బాధ, చెప్పడానికి  లేదు" అన్నాను.
    "నీకు  ఎంత చెప్పినా  బుద్ధిరాదు  సరోజా! నాకేం  ఫరవాలేదన్నా  వినవు కదా! నేను పుట్టిననాటినుండీ  నేటిదాకా  సుఖదుఃఖాలేవేవో  వస్తూంటే  తలదాల్చి ప్రపంచ పరిణామంలో ఆహ్వానిస్తున్నాను. జరిగిన సంఘటనలవల్ల  నాస్తికత్వం మీద నా నమ్మకం మరింత  బలపడుతోంది.నువ్వుత్త పిరికిదానివి. భయమనేది మానసికరోగం. ఎన్నెన్నో జబ్బులు పడ్డానుగానీ భయమనే  ఈ జబ్బు  మాత్రం  నా మీద పడడానికి భయపడుతూనే వుంటుంది" అన్నారు.
    "అబ్బా! హైదరాబాద్ లో  ఏం జరిగిందో  చెప్పండి" అన్నాను.
    "చెప్తాను సరోజా!" అని ప్రారంభించి  అంతా  వివరించారు.
    నాకు చెప్పలేనంత ఆశ్చర్యం, ఆవేశం కూడా కలిగింది.
    "అంత దారుణమా?" అన్నాను.
    "అవును సరోజా! అంతే. చేసేవి మాఘపు ఆదివారాలు, దూరేవి దొమ్మిరి గుడిశెలు  అన్నట్టే. మన దేశనాయకులు  కూడా వాళ్ళు అనుకున్నది అక్షరాలా చేసేస్తారు. పైకి  మాత్రం శ్రీరంగనీతులు  చెప్తారు.
    నేరం ఎదుటివాడిదేనని నిరూపించే శక్తివారి కుంది. అది ఏ శక్తి అంటావు? అధిరాకశక్తి. చెయ్యకూడని పనులు చేసెయ్యడం, అడ్డమైన దేవుళ్ళకీ మొక్కేయడం, ఆ మొక్కులతో వాళ్ళ సకల పాపాలూ  తీరిపోతాయనే మూఢవిశ్వాసం. అందుకనే చేస్తున్న పన్లకి  భయపడి, దేవుళ్ళని  ఆరాధించడం. అదే వాళ్ళలో ఆవరించిన పిరికితనం అంటాన్నేను.
    ఏం చెయ్యగలిగారు  నన్ను? అతి కష్టంమీద 36 గంటలు  జైల్లోవుంచారు. ఉంచిన ఆ కొద్ది సమయంలోనైనా  ఒక్కచోట వుంచలేక పోయారు.
    ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇంకోచోట  ఇలా తిప్పలుపడ్డారు. వాళ్ళు చేస్తున్నది అన్యాయం అని వాళ్ళకి తెలుసు. ఆ అన్యాయాన్ని  ఖండించడం కోసమే మా పోరాటం అని కూడా తెలుసు.
    ఒకవేళ  నన్ను వాళ్ళు సంవత్సరాల  తరబడి  బంధించినా నాకేమీ  బాధలేదు. కారణం నా ఒంటెత్తు  గుణం  జగద్విదితం.
    నేను నేనే. నేను నాస్తికుణ్ణి. అంటే దేవుడనే  భావానికి  బానిసని కాను. స్వతంత్రుడ్ని. దోపిడీ దొంగల ప్రభుత్వం  జరుపుతున్న  తెలుగు మహాసభల్ని బహిష్కరించండని  బాహాటంగా  చాటినందుకు నన్ను అరెస్టు చేశారు. నా విరసం జెండాను దొంగిలించారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra