Home » Kurumaddali vijayalakshmi » Ardharatri Arthanadam


    "చాలా పొరబడుతున్నావ్ కిరణ్! పొరపాటున కూడా కామినీకి ఈ ;లెటర్ సంగతి చెప్పకు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కామినీవెళ్ళి వాళ్ళ బాబాయిని అడుగుతుంది. దాని వలన కొంచెం కూడా ప్రయోజనం వుండదు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైనా కావచ్చు. ఇపుడు మనం చెయ్యాల్సింది అది కాదు, వాళ్ళ వేలితో వాళ్ళ కన్నునే పొడవడం. ఎటు నుంచి ఎటు నరుక్కువస్తే వాళ్ళు శాశ్వతముగా నరకబడతారో నేను చూస్తూంటాను. నువ్వు చూస్తూ వూరుకో. ఈ క్షణంనుంచి రంగంలోకి నేనుదూకుతున్నాను. డోంట్ వర్రీ" రావుగారు అప్పటికప్పుడే ఓ పధకం పన్నుతూ అన్నారు.
    "వాళ్ళదగ్గిర సాక్ష్యాధారాలు వున్నాయి డాడీ!"
    "నీ తండ్రిని అంత తక్కువగా అంచనావేయకు కిరణ్ సాక్ష్యాదారాలు ఉపాయంగా నాచేజిక్కించుకొని వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొడుచుకు చచ్చేలా చేస్తాను. నువ్వు చూస్తూ వుండు. అంతేకాదు నువ్వు కామినీదగ్గిర మామూలుగానే భయపడుతున్నట్లు నటించు. ఏదో ఒకరోజు నీనోటితో నువ్వె "డాడీ! నువ్వు యుక్తులు వేయడంలో చాణక్యుడిని మించిన వాడవి. నీ పథకంలో నన్ను పైకి తీసుకొచ్చావ్" అని అంటావు. రావుగారు గర్వంగా అన్నారు.
    ఆ తరువాత.
    రావుగారు కిరణ్ తో తన పధకం చెప్పలేదు కాని, కొన్ని ప్రశ్నలు వేసి అనుమానాలు తీర్చుకున్నారు. తనకి కావలసిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
    "ఈ క్షణం నుంచే నిన్ను రక్షించే ప్రయత్నంలొ వున్నాను అంటూ రావుగారు కూర్చున్న చోటునుండి లేచారు.
    కిరణ్ పట్టలేని ఆనందంతో "థాంక్స్ డాడీ!" అన్నాడు.
    
                                   26
    

    "ఇక్కడ కూర్చుందాం!"
    "మీ యిష్టం!"
    "ఇక్కడయితే మన మాటలు ఎవరూ వినరు." రావుగారు అన్నారు.
    "మీ యిష్టం అన్నాను కదా!" దామోదరం తనూకూర్చుంటూ అన్నాడు.
    రావుగారు పరిసరాలను చూస్తూ కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. దామోదరం ఆయనని డిస్ట్రబ్ చేయదలచుకోలేదు. "అవసరం ఆయనిది. కబురు చేసినది ఆయన. ఆయనే మాట్లాడుతాడు. విషయమేమిటో తెలియకుండా నేనెందుకు మాట్లాడాలి. ఏవో పెద్ద కారణం లేనిది రావుగారంతటివాడు నన్నిలా రహస్యంగా కలుసుకోడానికి ప్రయత్నించడు. అంగబలము అర్ధబలము వుంది. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల తెలివి అంతకన్నా వుంది. ఇలాంటి రావుగారితో తను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ విషయాలు రాబట్టుకోవాలి. విషయమేమిటో తనకు తెలియదు. తనని బెదిరించటానికీ కావచ్చు. లేక తనవల్ల ఏదో ఉపయోగం ఉండి ఉండవచ్చు.
    ఆయన నోట్లోంచి వచ్చే మాటనుబట్టీ తనప్పుడే తెలివిగా నిర్ణయం తీసుకుంటే సరే ఏదైనా ఒకటి మాత్రము తను గట్టిగా గుర్తుంచుకోవాలి. ఇది రావుగారితో వ్యవహారం కాబట్టి, మాటలు జాగ్రత్తగా తూచి తూచి మాట్లాడాలి..."
    "ఎంత కావాలి?" ఉన్నట్టుండి రావుగారు చటుక్కున అడిగారు.
    "దేనికి? ఎంతకావాలి?" దామోదరానికి ఎంతకీ అర్ధం కాలేదు. అయోమయంగా చూశాడు.
    "మొహమాటం ఎందుకు? ఎంత కావాలో చెప్పుదామోదరం!"
    "నాకర్ధం కావటములేదు. నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదే?"
    "అఫ్ కోర్స్ నన్ను అడగక పోవచ్చు నేనొకటి, నా కొడుకొకటినా!"
    "రావుగారు అలా అనంగానే దామోదరానికి ఒకటి మాత్రము అర్ధము అయింది. ఇదేదో చాలా పెద్ద విషయమే. లేకపోతే రావుగారంతటివాడు, ఫలానా చోట మన ఇద్దరం రహస్యంగా కలుసుకొని మాట్లాడదాం రమ్మని, శాంతంగా మాట్లాడుతున్నాడు అంటే అర్ధం ఏమిటి? తను చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి" దామోదరం అనుకున్నాడు.
    దామోదరం ఏదో ఆలోచించడం చూచి "బాస్టర్డ్! డబ్బు ఎంత పెద్ద మొత్తము కావాలో లేక అడగాలో ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు." అనుకుంటూ తిట్టుకున్నాడు రావుగారు.
    గాలిలో బాణం వేస్తున్నట్టుగా "నేనడిగినంతా ఇవ్వగలరా?" అన్నాడు దామోదరం.
    గత్యంతరం లేక చేతకాని నవ్వు ఒకటి నవ్వి "ప్రతి దానికీ ఉత్తమము, మధ్యము అంటూ ఒకటి ఉంటుంది కదా! సర్వము ధారపోసి గోచీగుడ్డతో నడివీధిలో నిలబడలేను కదా! 'నువ్వు ఇవ్వగలిగినంతే అడుగుతాను' అని లెటర్ లొ రాశావు కదా! నువ్వెంత అనుకున్నావో అంతే అడుగుదామోదరం!"
    చూచాయిగా దామోదరానికి విషయము అర్ధమయింది. డబ్బు కావాలని కిరణ్ కి ఎవరో లెటర్ రాశారు. డబ్బు కావాలని లెటర్ రాసేవాళ్ళు ఈ ప్రపంచంలొ ఇద్దరే వుంటారు. "ఒకడు తన ఆప్తుడికి ఫలానా కష్టంలో ఉన్నాను. ఇంత డబ్బు పంపు" అని రాస్తాడు. మరొకడు బ్లాక్ మెయిలర్. ఇతడు ఇంత మొత్తము డబ్బు కావాలంటూ బెదిరిస్తూ రాస్తాడు. అంటే....అంటే...కిరణ్ కి ఎవరో బ్లాక్ మెయిలర్ బెదిరిస్తూ లెటర్ రాశాడన్నమాట. ఆ డబ్బు బ్లాక్ మెయిలర్ కి ఇవ్వడానికి వాడి అబ్బ బయలుదేరి వచ్చాడన్నా మాట. అంటే ఆ బ్లాక్ మెయిలర్ తనా!" దామోదరం ఉలిక్కిపడ్డాడు.
    దామోదరం ఉలిక్కిపడటము రావుగారు గమనించాడు.
    "మీరు చాలా పొరబడుతున్నారు!"
    "ఏ విషయములో" రావుగారు అడిగారు.
    "లెటర్ రాసిన బ్లాక్ మెయిలర్ ని నేను కాను."
    దామోదరమే బ్లాక్ మెయిలర్ అని మరింత గట్టిగా రూఢి అయింది రావుగారికి. "లెటర్ రాసింది వీడు. కిరణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నది వీడు. తెలివి తక్కువ వెధవ ఎలా బయట పడిపొయ్యాడో! తన నోటినుండి మాట రాకముందే లెటర్ నేను రాయలేదు. బ్లాక్ మెయిలర్ ని నేను కాదు అని ఎలా చెప్పాడు. తన వూహ సరి అయినదే. కిరణ్ నేరం చేసినట్టు తెలిసింది ముగ్గురికి. ఒకటి కామిని, రెండు దామోదరం, మూడు తను. వీడెలాగూ త్రాగుబోతు, తిరుగుబోతు. పెద్ద మొత్తము ఆశచూపి ఏకంగా కేసెట్ లని, నెగెటివ్ లని సంపాయిస్తే ఎలా ఉంటుంది?
    కామినీకి వీడికి మధ్యకూడా విరోధం పెట్టాలి. వాళ్ళిద్దరూ వేరయిన మరుక్షణం ఎడంచేత్తో దానిజుట్టూ కుడిచేత్తో వాడి జుట్టూ పట్టుకొని కీలుబొమ్మని ఆడించినట్లు ఇరువురినీ ఆడించవచ్చు.
    విషయమేమిటో పూర్తిగా అర్ధం కాకపోయినా దామోదరానికి అప్పటికప్పుడు అతి తెలివి తేటలు పుట్టుకువచ్చాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra