Home » Balabhadrapatruni ramani » Haddulunnayi Jagrattha


    కొంగు తలమీద నుండి కప్పుకుంటూ -
    
    "మీరూ, నేనూ వెళ్ళేది ఒకరింటికేనా?" అడిగాను.
    
    ప్రదీప్ తెలీదన్నట్లుగా భుజాలు ఎగురవేశాడు.
    
    ఊరు దగ్గర పడుతున్నకొద్దీ అతనితో ఇంక దగ్గరగా వుండేది కొంతసేపే అన్న బాధ నాకు పెరిగిపోతోంది. అతను వెనక సీటు అతని దగ్గర నుండి డైలీ పేపర్ అందుకుని వార్తలు చదువుతున్నాడు. అసలు నాతో మర్యాదకయినా మాట్లాడటంలేదు. 'స్పెసిమన్' కసిగా అనుకున్నాను.
    
    మద్దిపాలెంలో బస్ దిగగానే నీలిమా వాళ్ళ తమ్ముడు బండి పెట్టుకుని ఎదురుచూస్తూ కనిపించాడు.
    
    "అక్కా! ప్రయాణం బాగా జరిగిందా?" అని అడిగాడు.
    
    "ఆ....చాలా బాగా" అని ప్రదీప్ వైపు చూశాను.
    
    "ప్రదీప్ గారూ రండి.....బావగారు చెప్పారు మీరు కూడా ఇదే బస్ లో వస్తారనీ" అన్నాడు నీలిమ తమ్ముడు శ్రీను.
    
    "శ్రీనూ! ఆయనెవరూ?" అడిగేసాను.
    
    "బావగారి ఫ్రెండ్ ఈయనకీ హైదరాబాద్ లో చాలా బిజినెస్ లు వున్నాయి" వాడు రహస్యంగా చెప్పాడు.
    
    ప్రదీప్ బండి ఎక్కి కూర్చుంటూ "వాట్ శ్రీనూ....సిటీలో కనిపించని బ్యూటీఫుల్ కలర్స్ కనిపిస్తాయా పెళ్ళిలో...ఈ సిటీ గర్ల్స్ ని చూసి చూసి విసుగొచ్చేసింది" అన్నాడు.
    
    నేను వుడుక్కుంటూ "సిటీ అమ్మాయిలు అంత వెగటు పుట్టారా? ఇక్కడ ఏ అచ్చమాంబనో చూసి చేసుకుంటే సరీ." అన్నాను.
    
    "పెళ్ళా! అది ఎవరితోటైనా బోరే!" అన్నాడు ప్రదీప్.
    
    శ్రీను పెద్దగా నవ్వేశాడు.
    
    "శ్రీనూ....అసలు ఏర్పాట్లు జరిగాయా లేదా?" అతను వెనక్కి తిరిగి కన్నుకొడుతూ అడిగాడు.
    
    "ఆ...ఆ!" శ్రీను తల వూపాడు.
    
    "ఏమిట్రా అవీ?" నేను శ్రీను చెవిలో అడిగాను.
    
    "మీకు చెప్పేవి కావు" అన్నాడు వాడు.
    
    "అతి కుతూహలం మంచిది కాదు" అన్నాడు ప్రదీప్.
    
    "మీకిద్దరికీ ప్రయాణంలో పరిచయం అయిందా?" అనుమానంగా అడిగాడు శ్రీను.
    
    "అస్సలు కాలేదు. పక్కసీట్లో కూర్చుంటే ఇందాకా చూసానంతే!" అన్నాడు ప్రదీప్.
    
    నేను నోరు తెరిచి ఆశ్చర్యంగా చూసాను.
    
    "ఫ్లేవర్ ఆప్ రూరల్ ఇండియా!" అతను ముక్కులు ఎగబీలుస్తూ అరటితోటల మధ్య నుండి వెళుతుండగా అన్నాడు.
    
    గోచీ పోసి కట్టుకున్న చీరలతో లయబద్దంగా అడుగులేస్తూ నెత్తిమీద కట్టెలమోపులని బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్న పల్లెపడుచుల కొప్పుల్లోని మందారాలు కళ్లిప్పి ఆశ్చర్యంగా చూస్తున్నట్లున్నాయి.
    
    ప్రదీప్ బ్యాగ్ లోంచి కెమేరా బయటికి తీసి "వా! వండర్ ఫుల్....అందమంటే అదీ...హైహీల్స్ తో చెక్కబొమ్మల్లా నడవడం కాదు!" అన్నాడు.
    
    "ఎవరికి చెపుతున్నారూ?" నేను ఉక్రోషంగా అడిగాను.
    
    "నాకే!" అనేసాడు ప్రదీప్.
    
    నీలిమ నన్ను చూసి చాలా సంతోషించింది. నాకూ తెలియని సంతోషంగా ఉంది. మగపెళ్ళివారికి విడిది ఎక్కడిచ్చారో అడిగి తెలుసుకున్నాను.
    
    నీలిమ అక్కయ్యతోబాటు ఫలహారాలు పట్టించుకుని విడిదికి వెళ్ళాం. లేత నాచురంగు చుడీదార్ లో జుట్టు క్లిప్ వదిలేసి....చాలా శ్రద్దగా తయారయ్యి వెళ్ళాను.
    
    నీలిమకి కాబోయే హజ్బెండ్ ప్రసాద్ కి నీలిమ అక్క "మాధవి ఐ.ఎ.ఎస్ కి ప్రిపేర్ అవుతోంది. మా నీలూకి బెస్ట్ ఫ్రెండ్" అని పరిచయం చేసింది.
    
    "ఓ....కాబోయే కలెక్టర్ గారన్నమాట! గ్లాడ్ టు సీయూ!" అతను నమస్కారం పెట్టాడు.
    
    సీరియస్ గా కార్డ్స్ ఆడుతున్న ప్రదీప్ తలఎత్తి చూశాడు.
    
    నేను పలకరింపుగా నవ్వాను.
    
    అతను నవ్వలేదు. తల తిప్పుకున్నాడు.
    
    పెళ్ళిలో కూడా అతను ఫ్రెండ్స్ తో చేరి నవ్వడం పరికిణీ ఓణీల్లో తిరుగుతున్న సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిల్ని ఆటపట్టించడం చూస్తూనే వున్నాను. కాని అతను నావైపు చూడలేదు.
    
    మెరూన్ రంగు సెల్ఫ్ డిజైన్ పట్టుచీరలో వైట్ అమెరికన్ డైమండ్స్ నెక్లెస్, చెవులకి జూకాలు పెట్టుకుని తయారయిన నాకేసి అందరూ ప్రశంసగా చూస్తున్నారు. అతను మాత్రం పట్టించుకోడం లేదు. నా కళ్ళన్నీ అతనిమీదే.
    
    రాత్రి భోజనాలప్పుడు వడ్డించే నెపంతో దగ్గరకివెళ్ళి మాట్లాడాను. "హలో...నన్ను గుర్తుపట్టారా? నా పేరు మాధవి."
    
    అతను నా వైపు చెయ్యి జాపాడు.
    
    "హలో...మీరు చాలా అందంగా వున్నారు. నాతో వాకింగ్ కొస్తారా?"
    
    నేను ఆ చేతిలో చెయ్యివేసి "వస్తాను" అన్నాను.
    
    వెన్నెల్లో అతని పక్కగా నడుస్తుంటే ఏదో సాధించినంత తృప్తిగా అనిపించింది.
    
    ప్రదీప్ ఆగి "ముట్టుకోవచ్చా?" అడిగాడు.
    
    నేను అతని చేతిని గట్టిగా పట్టుకున్నాను.
    
    "పెళ్ళి అయ్యేదాకా వర్జిన్ గా వుంటానన్నారు. పెళ్ళి అయిపోయింది!" నన్ను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.
    
    "ఎవరి పెళ్ళి?" ఆశ్చర్యంగా అడిగాను.
    
    "మీ ఫ్రెండ్ పెళ్ళి!" నా పెదవులని అందుకుంటూ చెప్పాడు.
    
    "నో....నా పెళ్ళి దాకా వుండాలనుకుంటున్నాను" దూరం జరుగుతూ చెప్పాను.
    
    "ఐనో! యూ ఆర్ స్టబ్బర్న్!" అన్నాడు.
    
    "ప్రిన్స్ ఫుల్డ్ అనుకోవచ్చుగా!" అన్నాను.
    
    "నా దృష్టిలో చాలా కొద్దిమంది మాత్రమే అలా ప్రిన్స్ ఫుల్డ్ గా వుంటారు. గాంధీ మహాత్ముడూ.... వివేకానందుడూ లాగా వాళ్ళకి మీలాగా సంఘర్షణా....ద్వైదీభావం వుండవు. నిన్నటినుండీ నేను మీ వైపు చూడటం లేదనీ, మాట్లాడటం లేదనీ ఎంతగా కొట్టుకుపోయారో నాకు తెలుసు" అన్నాడు.
    
    నేను తలెత్తలేకపోయాను.
    
    "ఈ వయసులో ఇలా వుండడమే సహజం. అపోజిట్ సెక్స్ అంటే ఆకర్షణ కలిగితే అది నేరం, అపరాధం అనుకోనవసరంలేదు. కానీ మీ భావాలకి విలువనిచ్చి నేను బలవంత పెట్టడంలేదు. అసలు బలవంతంగా చేసే ఏ పనీ నాకు ఇష్టం వుండదు. శృంగారంలో అది మరీ అసహ్యం" అన్నాడు.
    
    ఆ మాటలు విన్నాకా నేను ధైర్యంగా తలెత్తాను, ఐ.ఎ.ఎస్.కి ప్రిపేర్ అవుతున్న సివంగిలాంటి నన్ను అంత సిగ్గుపడేటట్లూ, అతనికోసం పాకులాడేట్లూ చేసిన అతనికి ఆ నిమిషంలోనే వశమైపోయాను.
    
    "ఐ థింక్ ఐయామ్ ఇన్ లవ్" అన్నాను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra