15. మెల్లకన్ను ఉంటే అదృష్టమా?
మీనాక్షిముక్కు ముచ్చటగా, నోరు చిన్నదిగా, బుగ్గలు నున్నగా వుంటాయి. కాని ఏం లాభం! ఆమెకు వున్న మెల్లకన్ను ఆ అందాన్నంతా పడు చేసింది. చిన్నప్పటినుంచి ఆమెకు మెల్లకన్ను వుంది. మెల్లకన్ను ఆ అమ్మాయికేంతో అదృష్టం అని పెద్దవాళ్ళు భావించారు. తీరా పెద్దద్దయ్యే సరికి మెల్లకన్ను అమ్మాయి మాకు వద్దంటూ చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకులు ముఖం మీదే చెప్పేశారు. అదృష్టం అనుకున్న మెల్లకన్ను మోదలుకే మోసం అయింది.
మీనాక్షి తల్లిదండ్రుల మాదిరిగానేచాలామండి మెల్లకన్నుని అదృష్టంగా భావిస్తారు. కాని మెల్లకన్ను కొందరిలో పుట్టుకతో వచ్చేలోపం. మరికొందరికి ఆ తరువాత రకరకాల అలవాట్లు వలన వస్తుంది. అందుకు మెదడులోనివ్యాధులుకూడా కారణమవుతాయి. అర్ధంతరంగా వచ్చే మెల్లను కూడా అదృష్టంగానే భావించి సంతావుశోస్తే ప్రాణానికే అపాయం కలగవచ్చు.
మెల్లకన్ను రావడానికి కారణం కన్ను గుద్దు కదలికలను అదుపు చేసే కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయక పోవడమే. మజ్జిగ చిలికే కవ్వాన్ని రెండువైపులా వుండే తాళ్ళతోసమానంగా పట్టుకుని లాగితే కవ్వం చక్కగా కుండమధ్యలో తిరిగినట్లే, కన్ను గుద్దుకి ఇటూ_ అటూ, కిందా_ పైనా వుందే రిబ్బను లాంటి సన్నటి కండరాలు కంటిని చక్కగా అదుపుచేస్తాయి. రిబ్బను లాంటి కంటి కండరాలు ఏ ఒక్కటి అయినా సమానంగా పని చేయకపోతే కన్నుగుద్దు కదలికలో తేడా వస్తుంది. రెండు కళ్ళల్లోని గ్రుడ్డ్లు సమానంగా కదులుతున్నప్పుడు కళ్ళు చూడడానికి ముచ్చటగా వుంటాయి. అలా కాకుండా ఒక కన్ను ఒకవైపు, మరొక కన్ను మరో వైపు చూస్తున్నట్లు అనిపిస్తే తేడా కనిపిస్తుంది.
కదలవలసిన దీతిలో కదలని మెల్లకన్ను అంటారు. పుట్టుక తోనే మెల్లకన్ను వచ్చేవాళ్ళకి కంటి గుద్దుకి సంభందించిన కండరాలలో హెచ్చుతగ్గులు వుంటాయి. అందువలన కంటిగుద్దు కదలికలో మార్పు ఏర్పడి మెల్లకన్ను అవుతుంది. ఇలా మెల్లకన్ను వున్నవారికి కంటిగుడ్డుకి సంభందించిన కండరాల్ని ఆపరేషనుచేసి సరైనపద్దతిలో వాటిని అమరుస్తే కంటి గుడు కదలికలో అ స్తవ్యసతతపోయి, రెండు గుడ్ల కదలిక సమానంగా చూడముచ్చగా యుంటుంది. కంటి మెల్ల లేకుండా పోతుంది. నేత్ర వైద్యులు ఈ ఆపరేషన్ ను చాలాతెలికిగా, నైపుణ్యంగా గుర్తించి కంటి పరీక్ష చేసి సరైన కళ్ళజోడు ఇస్తే మెల్లకన్ను లేకుండాపోతుంది.
కంటి గుడ్డు కండరాల కదలికను అదుపు చేసే నరాల కేంద్రం మెదడులో వుంటుంది. ఆ కేంద్రం ఏ కారణమైనా దెబ్బతింటే కంటి గుడ్డు కదలికలకు కారణమయ్యే కొన్ని కండరాలకి పక్షవాతంవస్తుంది. అప్పుడు కూడా మెల్లకన్ను ఏర్పడుతుంది. పుట్టుకతో వచ్చే మెల్ల కన్ను వలన వస్తువు దూరాన్ని సక్రమంగా అంచనా వెయలేక పోవడం సహజమవుతుంది. కంటి కండరాలకు పక్షవాటం రావడానికి సాధారణంగా మెదడు రక్త నాళాలలో రక్తం గడ్డలాగా ఏర్పడటం కారణం. కొన్ని మెదడు వ్యాధులవలన కూడా మెదడులోని నరాలు దెబ్బతిని మెల్లకన్ను రావచ్చు. అటువంటి వ్యాధులలో వైరస్ ఎన్ సేఫిలైతిన్, పోలియో ఎన్ సేఫిలైటిన్ చెప్పుకోతగ్గవి. అలాగే కంటి దగ్గరలో ఏర్పడిన కణుతులు, తగిలిన దెబ్బలు కొత్తగా మెల్లకన్ను రావటానికి కారణం అవుతాయి. అందువలన అమ్తక్లు ముందు మెల్లకన్ను లేకుండా తరువాత మెల్లకన్నుఏర్పడుతూ వుంటే అద్ర్తుష్టం మనల్ని వారిస్తోందని భ్రమపడక వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకొనటంఅవసరం!
****
