అతను నన్ను దూరంగా జరపలేదు. తలమీద చెయ్యివేసి నిమురుతూ "ఆపరేషన్ అంటే డోనర్ సమస్య. డోనర్ దొరికినా అంత డబ్బు నా దగ్గరలేదు. బాధల్లా పోతానని కాదు! పనులు పూర్తవకుండా పోతున్నానే అని!

 

    నానమ్మ పెద్దదయిపోయింది. ఆ నారాయణా, లలితా టెన్త్ క్లాస్ పరీక్షకి అప్పియర్ అయ్యేదాకానైనా ఉంటే, ఆ తర్వాత చిన్నపిల్లల బాధ్యత ఈ పెద్దపిల్లలు చూసుకుంటారు" అన్నాడు.

 

    నేను అతని మాటలకి ఏడుస్తూ "నో...అలా జరగనివ్వను. డోనర్ కోసం ట్రైచేద్దాం. నాది సూట్ అయితే సమస్యేలేదు!" అనేశాను.

 

    అతను నన్ను తన వైపు తిప్పుకుని "నాకోసం ఏడుస్తున్నావా?" అన్నాడు.

 

    ఇంద్రాణి అతనితో మాట్లాడలేదన్న విషయం రాఖీ లేని అతని చెయ్యి చూస్తేనే తెలుస్తోంది.

 

    "ఐ లవ్ యూ!" ముక్కులు ఎగబీలుస్తూ అనేశాను.

 

    "నిజంగానా?" అడిగాడు.

 

    "ఇలాంటి విషయాల్లో అబద్దాలు చెప్తామా?"

 

    "అయితే...నాకు కిడ్నీ ఇవ్వటంకన్నా మహత్తరమైన పని ఒకటి ఉంది. అది ఆ మూగపిల్లలకి అండగా ఉండటం. ఆ పని చెయ్యి" అన్నాడు.

 

    నేను అంగీకరించనన్నట్లు తల అడ్డంగా వూపి "నాకు మీరు కావాలి" అన్నాను.

 

    "కానీ ఈ ప్రపంచానికి ఒక డాక్టర్ అవసరం ఇంకా ఎక్కువ కాళిందీ" అన్నాడు.

 

    అతను మొదటిసారిగా నా పేరు పెట్టి పిలిచినా సందర్భం ఇది అవకుండా ఉంటే ఎంత బావుండేదీ?

 

    అతని చెయ్యి నా గుప్పెటలో బిగుసుకుంది.

 

    "డాక్టర్లు చాలామంది ఉంటారు. మీలాంటి మానవతావాదులు నూటికో, కోటికో ఒక్కరుంటారు. యూ ఆర్ ప్రెషియస్!" నా కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. "ఈ చెయ్యి పట్టుకుని జీవితం అంతా నడవాలనుకున్నాను. ఐ కాంట్ లూజ్ యూ!"

 

    "నన్ను కాపాడాలనుకోవడం స్వార్థం. అనాధలయిన ఆ పిల్లలకి అండగా ఉంటాననీ నాకు మాటియ్యడం త్యాగం!" అన్నాడు.

 

    "నాలో అంత త్యాగగుణంలేదు" అన్నాను. నాకు ఉక్రోషం, ఆక్రోశం అన్నీ ఎగదన్నుకు వచ్చాయి.

 

    "ఆ దేవుడు...మంచివాళ్ళనే ఎందుకిలా పరీక్షిస్తాడు! మరోసారి పరీక్షలన్నీ చేయిస్తాను. హాస్పిటల్ అధారిటీస్ తో మాట్లాడి ఏదైనా చారిటీ దొరుకుతుందేమో చూద్దాం" అన్నాను.

 

    అతను ఇష్టపడలేదు. డోనర్ దొరికితే రెండు లక్షలు సంపాదించడం అంతకష్టం కాదని నచ్చచెప్పాను.

 

    "ఆ ఇల్లు కూడా తనఖాలో ఉంది. నా ఆర్ధిక పరిస్థితి మీకు తెలీదు" అన్నాడు.

 

    మా ఆర్ధిక స్థితీ అంతంత మాత్రమే! నాలేమి మీద మొదటిసారిగా కోపం వచ్చింది.

 

    "ఎట్ ఎనీ కాస్ట్... మిమ్మల్ని మాత్రం పోనియ్యను. నా శక్తి మేరకు కృషి చేస్తాను" ధృడంగా చెప్పాను.

 

    అతను నవ్వాడు. నేను ఎంతో ఇష్టపడే అతని నవ్వు! ఆ నవ్వుని నేను ఎంజాయ్ చేసే స్థితిలో లేను.

 

    "చీకటిపడ్తోంది...పద...రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు పిల్లల్ని పస్తు పడుకోబెట్టలేను కదా!" అన్నాడు.

 

    కమ్ముకొస్తున్న చీకటి చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తోంది జీవితంలో ఒక్కగానొక్క వరం కోరుకుంటే...ఎంత నిక్కచ్చిగా తిరస్కరించాడు ఆ దేవుడు? అయినా నేను ఓడిపోదలచుకోలేదు. సావిత్రిలా అతనికోసం యముడినైనా ఎదిరించదలుచుకున్నాను.

 

    'ఆనందమా! నీకూ నీటిబుడగకీ ఎంత పోలికే! తృటిలో మాయచేసి అంతలోనే ఆనవాలు కూడా లేకుండా మాయమౌతావు!'


                                  *  *  *


    రోజు రోజుకీ చంద్ర పరిస్థితి క్షీణిస్తోంది.

 

    డాక్టర్ పరబ్రహ్మంగారితో మాట్లాడాను.

 

    నాకు టెస్టులు చేయించారు. సూట్ అవలేదు.

 

    ఊహ తెలిశాకా ఇంతగా నేను ఎప్పుడూ ఏడవలేదు. టైటానిక్ షిప్ మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డ కెప్టెన్ పరిస్థితిలా ఉంది!

 

    చంద్రని హాస్పిటల్లో జాయిన్ చేశాము.

 

    రషీద్ ఆపరేషన్ నిమిత్తం డబ్బు కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంద్రాణి నగలన్నీ అమ్మినా కూడా ఇరవైవేల కంటే ఎక్కువరాలేదు.

 

    ఏవీ చెయ్యలేనప్పుడు దైవం మీద నమ్మకం పెరిగిపోతుంటుంది. నేను ప్రతి సోమవారం, శనివారం గుడికెళ్ళి అతని పేరు మీద అర్చన చేయిస్తున్నాను. 'భగవాన్! నాకెంత ఆయుష్షు ఉందో అది సగం చేసి అతనికి ఇవ్వు. కొన్ని రోజులైనా మమ్మల్ని కలిసి బ్రతకనీ...ఆ తర్వాత ఇద్దరం పోతాం!' అని ప్రార్థిస్తున్నాను.

 

    చంద్రకి అహర్నిశలూ సేవ చేస్తున్నాను.

 

    వెన్నులో నెప్పొచ్చినప్పుడు గిలగిలా తన్నుకోవడం చూడలేకపోతున్నాను. దగ్గర వాళ్ళ బాధల్ని పంచుకోలేకపోవడం ఎంత నరకం! అతని బలవంతంమీద ఆ రాత్రి నా రూంకి వెళ్ళి పడుకున్నాను.

 

    రాత్రి పదకొండు గంటలకి ఫోన్ వచ్చిందని చెప్పారు.

 

    గాభరాగా లేచి పరిగెత్తాను.

 

    డాక్టర్ పరబ్రహ్మంగారు మాట్లాడ్తున్నారు.

 

    "కాళిందీ నేను డాక్టర్ పరబ్రహ్మం" అనగానే, నా కాళ్ళు చల్లబడిపోయాయి. వినకూడనిది వినాల్సొస్తుందని ప్రిపేర్ అయిపోయాను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra