Previous Page Next Page 
రాగోదయం పేజి 48


    ఆనాటి నుంచి వూరిలో కూలీలంతా ఒకటయ్యారు. సమయం వస్తే రైతుల్ని దెబ్బతీయాలనే నిర్ణయించుకున్నారు. కుమ్ములోని నిప్పులాగా పగ పొగ వేస్తూనే వుంది.
    పది పదిహేను రోజుల తర్వాత తోటవైపు వెళ్ళాడు చౌదరి. ఆ సమయంలో తోటలో ఎవరూ లేరు.
    మెకానిక్, తోటమాలి, కావలివాడు అన్నీ అయిన తమ్మన్న భార్య లక్ష్మీ మాత్రం పశువులకి గడ్డి కోస్తూ వుంది.
    ఆమెని చూడగానే చౌదరి నరాలు జివ్వుమన్నాయి.
    ఈ మధ్య రాజకీయాలతో ఎత్తుకు పై ఎత్తులతో అతనికి తోటకు వచ్చే అవకాశం కానీ అక్కడ లక్ష్మిని చూసే అవకాశం కానీ రాలేదు.
    "గడ్డి కోస్తున్నావా ?"
    చౌదరి పిలుపు విని చూసి నవ్వింది లక్ష్మి.
    దాని నవ్వు ఆరో మన్మథ బాణం. దాని చూపు మరుని తూపు, దాని ఒళ్లూ కామ జల్లు, దాని కళ్ళూ అసమశరుని బళ్లు.
    "వాడెక్కడ ?"
    "నువ్వు డబ్బిచ్చినా వంటగా, టౌనుకు పోయినాడు. సినిమా జూచి వస్తనన్నాడు."
    "సినిమానా ? సిన్నమ్మనా."
    "అన్నీ చూసొస్తాడు."
    "సర్లే! గడ్డి మళ్ళా కోస్తువుగానీ రా!"
    కొడవలి అక్కడే పెట్టి చౌదరిని అనుసరించింది.
    ఇద్దరూ ఇంజన్ రూం దగ్గరికి వెళ్ళారు.
    అక్కడ చౌదరి కోసం ఓ మంచం మీద ఓ బెడ్డింగ్ వుంటుంది ఎప్పుడూ, అది రిలాక్సింగ్ స్టేషన్.
    వెళ్ళి మంచం మీద వాలగానే తనూ వెళ్ళి అతని ఒళ్ళో ఒరిగిపోయింది. లక్ష్మిని చప్పున కౌగిల్లోకి తీసుకుని హద్దు దాటిన వ్యామోహంతో ముద్దాడేడు.
    కిల కిల నవ్విందది.
    "అబ్బ! నవ్వకే నరాలు తోడేస్తున్నాయి.
    "కొత్త సుకమన్నట్టు చూస్తావే! ఏందిది? శాన్నాల్లయిందనా!"
    "నువ్వు నాకెప్పుడూ కొత్తే !"
    "అతని చేతులు చిలిపిగా నర్తిస్తున్నాయి."
    "అన్నీ మాటలే. మేం పని చెయ్యనీకే !"
    "నీకేం లోటయిందే"
    "లోటుగాక! చాకల్దాన్ని చాకల్దాన్నే గదా! వుంచుకున్నది పెండ్లా మయితాదా! దొంగ తిండి కడుపు నిండతాదా!"
    "కడుపు నిండలేదా." చిలిపిగా అడిగాడు.
    "ఎంతయినా వాడు తిమ్మిగాని కొడుకే. నీ కొడుకయితాడా ఏమన్నానా?"
    "చౌదరి మాటాళ్ళేదు."
    అదీ రెట్టించలేదు.
    అందాన్ని ఆనందాన్ని ఆస్వాదించారు. మోహం వరద తగ్గింది."
    "మొన్న యీ సమయంలో చచ్చిపోయినాంలే."
    "ఏం ?"
    "ఇంజనంతా యిప్పి, మూట కట్టి, సాకిరి గుడ్డల్లో కట్టుకుని మా యిల్లు చేర్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది."
    "నీ మొగుడు మెకానిక్కే కాదు. మాజిక్ మాస్టర్ కూడా. వాడొచ్చి సోముగాని విషయం చెప్పేదాకా నాకు తెలియదు. ఆ ఆలోచన చెప్పిందీ వాడే."
    "ఊ వాడి ముఖం. ఆడి నాయాలు. నే జెప్పినా ఆ వూసు వాడికి, మద్దెన నాబం నీకు."
    "లక్ష్మీ" ముద్దాడేడు చౌదరి ఊపిరి సలపలేదు ఇద్దరికీ కొద్దిసేపు.
    "అందుకేనే ఆ పొలం నీ మొగుని పేర పెట్టించినా. అది నాకెందుకు. వాడిని దెబ్బతియ్యాలనే. దాంతో తల్లీ కొడుకుల పొగరణుగుతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS