Home » Suryadevara rammohan rao » Anitara Sadhyudu


    సెక్రటరీ చెప్పడం ఆపాడు ఒకింతసేపు. నాగమ్మ ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తూండిపోయింది.  

 

    "అసలీ సంబంధం తెచ్చేవాడ్ని కాదు- కాకపోతే, ఆస్తి లేకపోయినా కుర్రాడు మంచివాడు. తెలివిగలవాడు, అందగాడని తెచ్చాను. దిక్కుమొక్కులేని, వెనకాముందు ఎవరూ లేని ఈ సంబంధం తెచ్చేవాడ్ని కాదు. కాకపోతే గొప్ప మేధావని తెచ్చాను. ఈ అనాధ సంబంధం తెచ్చి నందుకు తమరు క్షమించాలి. మరో వారంలో మరికొన్ని సంబంధాలు తెస్తాను..." భయం నటిస్తూ అన్నాడు సెక్రటరీ.

 

    ఆమె ఇంకా నోరు విప్పలేదు.

 

    "నేనప్పుడే అనుకున్నాను. ఈ సంబంధం మీకు నచ్చదని- కాని..." నసుగుతూ ఆపైమాటల్ని మ్రింగేసాడు.

 

    నాగమ్మ కుర్చీలోంచి లేచింది.

 

    ఆపైన నెమ్మదిగా కిటికీ వద్దకు నడిచింది. సెక్రటరీ ఉత్కంఠతో ఆమె అభిప్రాయనికై ఎదురుచూస్తున్నాడు. ఆమె సామంత్ ని అంగీకరిస్తే తనకు లక్షల సొమ్ముని ముట్టచెబుతాడు అర్జునరావు. కాదంటే డబ్బుకు డబ్బు పోతుంది- అనవసరపు చిక్కులు వచ్చి తనను చుట్టుముడతాయి. సరీగ్గా ఇదే సమయంలో ఆ గదికి ప్రక్కనే ఉన్న హాల్లో అర్జునరావు తన పథకం ఏ ఆటంకం లేకుండా సాగిపోవచ్చనే పూర్తి విశ్వాసంతో ఉన్నాడు.

 

    సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఆమె నోరు తెరిచి "ఈ సంబంధం నాకు నచ్చింది..." అంది నెమ్మదిగా.

 

    ముందు ఆమె ఏమన్నదో అర్థం కాలేదు -అర్థమయ్యాక ఆనందోద్వేగం సెక్రటరీని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా అర్జునరావు ఆడమన్న నాటకం ఇంకా పూర్తి కాలేదు.

 

    "అతనికి నయాపైసా ఆస్తీ లేదు. కనీసం వెనుకా ముందు కూడా తన వాళ్ళెవరూ లేని అనాధ. మీరు నన్ను క్షమించాలి. మరో రెండు వారాలు టైమిస్తే మరికొన్ని మంచి సంబంధాలు చూస్తాను..." నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు సెక్రటరీ.

 

    ఆమె తల విదిలిస్తూ-

 

    "అక్కర్లేదు. నాకీ సంబంధం నచ్చింది. ఎవరూ లేకుండా, ఏ ఆధారమూ లేకుండా, స్వశక్తితో పైకొచ్చాడంటే భవిష్యత్ లో ఎలాంటి కష్టాలనయినా అధిగమించగలడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కూడా జీవితంలో నెగ్గుకు రాగలడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎంటెక్ చేయటమే కాక, పిహెచ్ డి కూడా చేయడం అతని ఏకాగ్రతను తెలియజేస్తోంది.

 

    రోజుకో రంగంవేపు మొగ్గు చూపకుండా, ఎన్నుకున్న రంగంలోనే పైకి రావాలనే పట్టుదలను కూడా అతను సాధించిన పిహెచ్.డి. పట్టా మనకు తెలియచెబుతోంది.

 

    ఇకపోతే నాకు కావలసింది వెనుకా ముందు ఎవరూ లేని ఎలిజిబుల్ బేచులర్. అతనలాంటివాడే గదా!

 

    అతనెప్పుడూ యంత్రాల మధ్య గడుపుతాడన్నావ్... అదే ఏకాగ్రత. ప్రాణమున్న మనుషుల్ని నమ్మి మోసపోతామేమో గాని- ప్రాణం లేని ఆ యంత్రాలు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోను మోసం చేయవు..."

 

    ఆమె చివరగా అన్న మాటలకు సెక్రటరీ ఒకింత ఉలిక్కిపడ్డాడు. గిల్టీగా ఫీలయ్యాడు.

 

    "ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నా ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థయిర్యం లేనివాడే ఒంటరివాడు. ఇతను ఒంటరివాడు కాడు. కాకపోతే శారీరకమైన ఒంటరితనం ఉండవచ్చు. అది పెళ్ళయితే పోతుంది. నా మనుమరాలు అతని ఒంటరితనాన్ని తరిమి కొడుతుంది. ఈ సంబంధం నాకు నచ్చింది. ఫైల్ ఓసారి ఇలా ఇవ్వు..." అంది సెక్రటరీ వైపు తిరిగి నాగమ్మ.

 

    సెక్రటరీ ఫైలందించాడు.

 

    ఆమె సోఫాలో కూర్చుని ఫైల్ ఓపెన్ చేసి సామంత్ ఫోటోని ముందుగా చూసింది.

 

    కొద్దిక్షణాల తర్వాత ఆమె మోములో చిరుదరహాసం కదలాడింది.

 

    ఆ తరువాత సర్టిఫికెట్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి పడింది నాగమ్మ.

 

    ఆ సమయంలో సెక్రటరీ తెగ భయపడ్డాడు. పీటర్ తెచ్చిన ఆ సర్టిఫికేట్స్ బోగస్ అని ఏ మాత్రం నాగమ్మ పసిగట్టినా తన పని ఆ రోజుతో అయిపోతుందనే అతని భయం.

 

    ఆమె కళ్ళలో సెక్రటరీకి తృప్తి కనిపించింది. అప్పుడు గుండెల నిండా ఊపిరి తీసుకున్నాడు.

 

    "వెంటనే అబ్బాయిని - అమ్మాయి, అమ్మాయిని - అబ్బాయి చూసుకునే ఏర్పాట్లు చేయ్. ఫైనల్ గా ఇద్దరికి ఒకరికొకరు నచ్చితే వెంటనే వివాహం జరిపించేయాలి. పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఈరోజు నుంచి ఆ ఏర్పాట్లలో ఉండండి..." అంది ఇక వెళ్ళి రమ్మన్న భావాన్ని వ్యక్తం చేస్తూ.

 

    సెక్రటరీ వినయంగా తలూపి బయటకు వెళ్ళిపోయాడు.


                               *    *    *    *


    అది అర్జునరావు గెస్ట్ హౌస్...

 

    ఇప్పుడక్కడ అర్జునరావు, పీటర్, కనకారావు, సెక్రటరీ సమావేశమయి ఉన్నారు.

 

    "ఇంతవరకు అంతా సవ్యంగానే జరిగింది. నాగమ్మగారు ఎప్పుడూ పిలిపించే పూజారికి ఈ రాత్రికే ఓ పదివేలు కేష్ పంపించండి. సరీగ్గా మరో మూడు రోజుల్లోనే పెళ్ళి ముహూర్తం పెట్టమని చెప్పండి. ఇంత త్వరగానా అని నాగమ్మ గారడిగితే అది చాలా గొప్ప ముహూర్తమని చెప్పమని చెప్పండి. ఇక నేనెలాగూ నాయకి నా నుంచి వివరాలు లాగేందుకు తొందర పెడుతోందని నాగమ్మగార్ని టెన్షన్ లో పెడతాను. అర్థమవుతోందా?" అర్జునరావు అందరికేసి చూస్తూ ప్రశ్నించాడు.


    అందరూ అర్థమయిందన్నట్లు వినయంగా తలలూపారు.

 

    "పెళ్ళిస్థలం ఖరీదైన హోటల్ లో అరేంజ్ చేయండి. ఎందుకంటే సామంత్ వీధి మనిషి. చిల్లర మనుషులకు అతను బాగా ఎరిగినవాడై ఉంటాడు. పెళ్ళి మామూలు కళ్యాణ మండపాల్లో చేస్తే అతన్ని ఎరిగిన వాళ్ళు రావచ్చు. సామంత్ ని గుర్తుపడితే రసాభాస కావడమే కాకుండా మనం దొరికిపోతాం..."   

 

    అర్జునరావు చెప్పే సూచనల్ని నోట్ చేసుకుంటూ పోతున్నాడు సెక్రటరీ.

 

    "సామంత్ రెడీయేనా...?" కనకారావు కేసి చూస్తూ అడిగాడు అర్జునరావు.

 

    "రడీ సార్... అచ్చం దొరబాబులా తయారయ్యాడు. ఇంగ్లీషు, హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. మీరు అతని గురించి ఏ అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు..." కనకారావు కాన్ఫిడెంట్ గా అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra