Home » Mucherla rajani sakuntala » గెస్ట్ హౌస్

"థాంక్యూ సర్..."
"బై మైడియర్ యంగ్ బోయెస్..." అంటూ అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడ్నుంచి కదిలాడు రాబర్ట్...

                                       * * *
"థాంక్యూ సర్..." సిన్సియర్ గా తన కృతజ్ఞతలు తెలియజేసింది తరళ.
నచికేత దగ్గర్నుంచి రాబర్ట్ సరాసరి తరళ దగ్గరికి వెళ్లాడు. క్రితం రోజే రాబర్ట్ తరళ ఆచూకి తెలుసుకున్నాడు. పీటర్సన్ గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు రాబర్ట్. అప్పుడే తరళ, పరమహంస సాయంతో చిత్రావతి అడవికి సంబంధించిన విషయాలన్నీ సేకరించింది.
పరమహంసను కలుసుకునే ప్రయత్నం నచికేతగానీ, అతని ఫ్రెండ్స్ గానీ చేయడంలేదని అర్ధంయ్యేక రాబర్ట్ చిత్రావతికి సంబంధించిన వివరాలు నచికేత వాళ్లకు అందేలా చేసింది. దీనివల్ల వాళ్లు జాగ్రత్త పడతారని.

                                                                             * * *
ఆ గదిలో పరమహంస, రాబర్ట్, తరళ వున్నారు.
కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం తాండవమాడింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
"ఏం చేద్దామంటారు?" రాబర్ట్ అడిగేడు ప్రొఫెసర్ పరమహంసని.
"నేనూ అదే ఆలోచిస్తున్నాను. చిత్రావతి వెనుక పెద్ద మర్మం వుంది. దాన్ని చేధించడానికి మనకు హిబ్రో భాష తెలిసిన మనిషి కావాలి" అన్నాడు పరమహంస.
"హి...బ్రో...నా?" ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్.
"అవును...నేను ప్రపంచం అంతా పర్యటించాను. రకరకాల గ్రంథాలు సేకరించాను. అందులో తాళపత్ర గ్రంథాలూ వున్నాయి.
హిబ్రో భాషలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలోని బిత్రోచి  గెస్ట్ హౌస్ కు సంబంధించిన రహస్యం దాగి వుందని నా అనుమానం. ఈ తాళపత్ర గ్రంథంతోపాటు నాకో మ్యాప్ దొరికింది. కేవలం తెల్లటి సిల్క్ లాంటి గుడ్డమీద ఎరుపు రంగు అక్షరాలు వున్నాయి.
రక్తంలా కనిపించే ఈ రంగు అప్పట్లో ఒక రకమైన ద్రవ పదార్ధం కావచ్చు. ఎన్నేళ్లయినా చెదిరిపోని స్వభావం దీనిది. ఈ మ్యాప్ లో ఉన్న అడవిని పరిశీలిస్తే చిత్రావతి అడవినే పోలివుంది. దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ తాళపత్ర గ్రంథంలోని హిబ్రో భాష తెలిసిన వాళ్ళు కావాలి..." పరమహంస తేల్చి చెప్పాడు.
"యూనివర్శిటీలో ట్రైచేస్తే..." అడిగాడు రాబర్ట్.
"ఆ ప్రయత్నాలన్నీ అయిపోయేయి..." పెదవి విరిచి అన్నాడు పరమహంస.
"అయితే నేను మరో చోట ట్రై చేస్తాను...ఈ లోగా మీరు చిత్రావతి అడవికి మనం వెళ్ళే మార్గం మరోటి వుందేమో ఆలోచించండి..." చెప్పాడు రాబర్ట్.
అలాగేనన్నట్టు తలూపాడు పరమహంస. రాబర్ట్ లేచి..."ఈ రోజే మన ప్రయాణం...నచికేత వాళ్ళు ఓవైపు అడవిలో ఎంటర్ అయ్యేలోగా మనమూ మరో మార్గం గుండా వెళ్లాలి" అన్నాడు.
తరళ 'అలాగే' నన్నట్టు తలూపింది.

                                     * * *
అడవి మార్గం గుండా వెళ్తోంది గూడ్సుబండి.
చాలా నెమ్మదిగా వెళ్తోంది.
మలుపులు తిరుగుతూ చాలా స్లోగా వెళ్తున్న గూడ్సుబండిని చూస్తోంటే నచికేతకు బాల్యం గుర్తుకు వచ్చింది.
చిన్నప్పుడు రైలు పట్టాలకు దూరంగా నిలబడి, గూడ్సుబండి వెళ్తుంటే ఎన్ని డబ్బాలు ఉన్నాయో లెక్కించేవాడు.
 చివరి డబ్బాలో గార్డు పచ్చ జెండా ఊపుతుంటే తనూ చేయి ఊపేవాడు. గార్డు తనని చూసి నవ్వేవాడు. అప్పట్లో ప్యాసింజర్ బండ్లు వచ్చినా ఇదే హడావిడి.
"ఏయ్...నచీ...ఏమిటాలోచిస్తున్నావ్?" విలియమ్స్ భుజాలు కుదిపి అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చాడు.
ఆ చివరి డబ్బాలో గార్డు ఓ ప్రక్కన కూచొని వున్నాడు. అతని ఎదురుగా పీటర్సన్...డేనియల్...నచికేత, అతని ఫ్రెండ్సూ  వున్నారు.
పీటర్సన్ ఏమీ మాట్లాడడం లేదు.
మౌనంగా కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు. గార్డు కళ్ళు మూసుకున్నాడు. చిత్రావతి దగ్గర వీళ్లని దించడానికి, ఎవరికీ తెలియకుండా తన డబ్బాలో ఎక్కించుకునేందుకు అతనికి బాగానే డబ్బు ముట్టింది.
ప్రభు చాలా టెన్షన్ గా ఫీలవుతున్నాడు. తనకు తెలియకుండానే తమ వెనుక ఏదైనా గూడు పుఠాణీ    జరుగుతుందా?
ఆ ఆలోచననే అతనికి వణుకు తెప్పించింది.
విలియమ్స్, సూరజ్, సూర్యనారాయణల పరిస్థితి కూడా ఇంచుమించు అలానే వుంది.

                                       * * *
చీకటి పడింది.
గూడ్సు చిత్రావతి రైల్వే స్టేషన్ ముందాగింది. స్టేషన్ లో కరెంటు పోయినట్టుంది. అంతా చీకటి చీకటిగా వుంది.
పీటర్సన్, డేనియల్ దిగారు. వాళ్ల వెనకే నచికేత, అతని ఫ్రెండ్సూ దిగారు. వాళ్లని దింపేసిన గూడ్సు రైలు వెళ్లిపోయింది. వీళ్ళు చీకటిలోనే బయలు దేరారు.

                                        * * *
డేనియల్ టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు.
అతన్ని మిగతా వాళ్ళు అనుసరిస్తున్నారు.
ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు.
నచికేత పీటర్సన్ వైపు తిరిగి
"మీరెలా వెళ్తారు?" అని అడిగారు.
పీటర్సన్ కోపంగా నచికేత వైపు చూసి...
"మీకు సంబంధం లేని ప్రశ్నలు అడగొద్దు..." అన్నాడు కఠినంగా.
నచికేత మౌనంగా ఉండిపోయేడు.
ఒక్కక్షణం వెనక్కి తిరిగి వెళ్లిపోతే బావుండన్న ఫీలింగ్ కలిగింది ప్రభుకు.

                                        * * *
చాలా దట్టమైన అడవిలా కనిపించింది. చుట్టూ చెట్లు, జన సంచారం లేదు.
అందరి బ్యాగులు వీపులకు వేలాడుతున్నాయి.
ఒకటి...
రెండు...
మూడు...
ఐదు...
పది...
ఇరవై...నిమిషాలు గడిచాయి. ఇరవై ఒకటవ నిమిషం సరిగ్గా ఐరన్ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చారు.
ఆ ఫెన్సింగ్ పక్కన పెద్ద బోర్డు...శిథిలావస్థలో ఉన్న బోర్డు అక్షరాలు అస్పష్టంగానే వున్నాయి.నిషిద్ధ ప్రాంతం...అన్న హెచ్చరిక నల్లటి ఆ బోర్డు మీద పెద్ద అక్షరాలతో...
విషసర్పాలు, జంతువులు, నరమాంస భక్షకులు సంచరించు ప్రాంతం అది. ఈ అడవిలోకి ప్రవేశించుట నిషిద్దం...దీనిని ప్రమాదకరమైన చోటుగా హెచ్చరించడమైనది.
ఆ అక్షరాలు చూసి సూరజ్ వొణికిపోయేడు.
"వెనక్కి వెళ్లిపోదామా?" భయంగా అన్నాడు సూర్యనారాయణతో సూరజ్.
నచికేత సూరజ్ భుజం తట్టి, మాట్లాడవద్దన్నట్టు సైగ చేశాడు.

                                       * * *
బలమైన ఇనుప తీగలతో ఉన్న ఫెన్సింగ్ అది.
ఇనుప తీగ తుప్పు పట్టివుంది.
ఆ ఫెన్సింగ్ ఎక్కడనుంచి మొదలై, ఎక్కడివరకు ఎండయ్యిందో కూడా తెలియనంత గజిబిజిగా వుంది.
ఫెన్సింగ్ మధ్య పెద్దగేటు...అది ఇనుపతీగలతో పూర్తిగా అల్లబడిన గేటు...మధ్య మధ్య ఇనుప తీగలు ముళ్లలా చొచ్చుకుని వచ్చాయి. ఆ గేటులో నుంచి ఎవరూ దూరకుండా చేసిన ఏర్పాటు అది.
ఫెన్సింగ్ కూడా ఇంచుమించు అలానే వుంది. నచికేత మరోసారి పరిశీలనగా చూసేడు.
పీటర్సన్ నోరు విప్పాడు.
"ఈ ఇనుప ఫెన్సింగ్ నుంచి ఈజీగా వెనక్కి రాగలరని అనుకుంటున్నారేమో. అది కుదరని పని. ఎందుకంటే...ఐరన్ పెన్సింగ్ కు పై భాగంలో అక్కడక్కడా ఒక రకమైన విషం పూయబడి వుంది.
పొరబాటున మీరు ఈ ఫెన్సింగ్ దాటే ప్రయత్నం చేస్తే ఆ ఫెన్సింగ్ ఏ మాత్రం మీ శరీరంలోకి చొచ్చుకుపోయినా విషప్రయోగం జరిగి చచ్చిపోతారు..."
పీటర్సన్ మూటలువిని భయంతో బిగదీసుకుపోయారు.
"కమాన్...కమాన్...మూవ్" అంటూ పీటర్సన్ తన జేబులో ఉన్న పొడవాటి తాళం చెవిని బయటకు తీసాడు.
ఆ తాళం చెవి కొత్తగా తయారు చేయించినట్టు వుంది.
"చెప్పింది చేయడమే తప్ప. మరే విషయమూ అడగొద్దన్న" పీటర్సన్ కండిషన్ గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయేడు నచికేత.
'పీటర్సన్ తాళం చెవిని కీ హోల్ లో పెట్టి బలంగా తిప్పేడు.
చిన్న శబ్దం...
తర్వాత తాళం విడిపడింది...చాలా పెద్ద తాళం..ఊడి పడ్డాక కూడా తెరుచుకోవడానికి చాలా సమయం పట్టింది.
కొన్ని సంవత్సరాలుగా ఆ గేటు తెరవనందున గేటు తుప్పు పట్టింది. అదో రకమైన విచిత్రమైన శబ్దంతో గేటు తెరుచుకుంది.
"ఆల్ ద బెస్ట్" చెప్పాడు పీటర్సన్ ఆ ఐదుగురివైపూ చూస్తూ...
ఐదుగురూ లోపలికి అడుగు పెట్టారు.
"ఐరన్ ఫెన్సింగ్ కు విషం పూయడమేమిటి? మనల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్లడం లేదు కదా?" అన్నాడు విలియమ్స్ నచికేతతో...

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra