Previous Page Next Page 

బెస్ట్ జోక్స్ పేజి 3


    "నేనూ అంతే కదా! ఎన్ని సార్లు ఫ్రాడ్ చేసినా దొరక్కుండా తప్పించుకున్నా! అంత మేధావిని! అయినాగానీ నా కడుపున పరమ ఇడియెట్ పుట్టాడు" తనూ అన్నాడు రెండోవాడు.
    "మీ అబ్బాయి కన్నా మా వాడే ఇంటర్నేషనల్ ఫూల్-"
    అరగంట గడిచినా వాళ్ళ వాదన ఎటూ తేలకపోయేసరికి ఇద్దరి కొడుకుల్లో ఎవరు మహా తెలివితక్కువ వెధవో అప్పుడే తేల్చేయాలని నిర్ణయించుకున్నారు.
    మొదటి వాడు తన కొడుకుని పిలిచి "ఒరే బుజ్జీ! మార్కెట్ కెళ్ళి ఒక మాంఛి టీవీ కొనుక్కురారా" అంటూ పది రూపాయల నోటిచ్చి పంపించాడు.
    రెండో అతను కూడా తన కొడుకుని పిలిచాడు.
    "ఒర్ సజ్జీ! ఒకసారి మా ఆఫీస్ కెళ్ళి నేనింకా ఆఫీస్ లోనే ఉన్నానా- లేక ఇంటికెళ్ళి పోయానో చూసిరా" అంటూ పంపించాడు.
    బుజ్జీ, సజ్జీ మార్కెట్ లో కలుసుకున్నారు.
    "చూశావా బ్రదరూ- మనిద్దరి ఫాదర్లూ ఎంత తెలివి తక్కువ దద్దమ్మలో' అన్నాడు బుజ్జి.
    "ఆ విషయం నీకెలా తెలిసింది?" ఆశ్చర్యంగా అడిగాడు సజ్జి.
    "లేకపోతే ఏమిటి? పది రూపాయల నోటిచ్చి ఇంకేం వివరాలు చెప్పకుండా టీవీ తెమ్మంటున్నాడు"
    "మా ఫాదర్ ఇంకా దారుణం కదా! తను బార్ లోనే ఉన్నాడు కదా! ఆఫీస్ లో ఉన్నాడేమో చూసి రమ్మంటున్నాడు"
    "భలేవాడివేలే! మా ఫాదర్ ఇంకా హారిబుల్. ఎల్.సి.డి. టీవీ తేవాలా లేక ఎల్.ఇ.డి. టీవీ తేవాలా అనే విషయం చెప్పలేదు."
    "ఇంకా నయం కదా! మా ఫాదర్ తనే ఆఫీస్ కి ఫోన్ చేసి తన ఇంట్లో ఉన్నదీ లేక ఆఫీస్ లో ఉన్నదీ తెలుసుకోవచ్చుకదా- నన్ను ఇంతదూరం పంపటం ఎందుకు?"
    ఇద్దరూ తెగ నవ్వుకుంటూంటే అక్కడ బార్ లో కూడా తండ్రులిద్దరూ తెగనవ్వుకుంటున్నారు.
    "మా వాడే నిజంగా మూర్ఖుడు బ్రదర్- టీవీ కొనాలంటే కనీసం ఇరవై రూపాయలయినా ఉండాలన్న జ్ఞానం కూడాలేదు. ఇంక వీడు ఐఏఎస్ ఎలా అవుతాడో ఏమో!"
    "మా వాడూ అంతే! మొన్నే వాడికో సెల్ ఫోన్ కొనిచ్చాను కదా! దాంతో రింగ్ చేస్తే నేనక్కడుందీ తెలిసిపోతుంది కదా! వీడిని మాత్రం ఐ ఏ ఎస్ ఎలా చేయను?"

    ఒక ఆర్టిస్ట్ తన స్టూడియోలో కూర్చుని ఓ అందమయిన అమ్మాయితో మాట్లాడుతున్నాడు.
    ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ కొచ్చి ముద్దు పెట్టుకోబోతూండగా బయట కారు ఆగిన చప్పుడయింది.
    "కొంప మునిగింది. మా ఆవిడ వచ్చింది. నువ్ వెంటనే మొత్తం బట్టలు విప్పేసెయ్- లేకపోతే మా ఆవిడకి మనిద్దరి మీద అనుమానం వస్తుంది" అన్నాడతను కంగారుగా.

    ఒక కంప్యూటర్ సంస్థ చైర్మన్ ఒక చిలుకలమ్మే షాప్ కెళ్ళాడు. అక్కడ ఒక చిలుకను చూసి ముచ్చటపది "దీని ఖరీదెంత" అని అడిగాడు.
    "ఇరవై వేలు" అన్నాడు షాపతను.
    "ఏమిటి? ఒక మామూలు చిలుక ఖరీదు ఇరవై వేలా?" ఆశ్చర్యంగా అడిగాడు చైర్మెన్.
    "ఇది మామూలు చిలుక కాద్సార్! దీనికి కంప్యూటర్ మీద వర్క్ చేయటం వచ్చు-"
    చైర్మెన్ చకచకా ఆలోచించాడు. అలాంటి అరడజను చిలుకలు కొంటే తన కంపెనీకి లాభం బాగా పెరుగుతుంది.
    "ఈ రెండో చిలుక మెడకు 'యాభైవేలు' అన్న కార్డుందేమిటి మరి?"
    "ఇది ఇంకా స్పెషల్ సార్! దీనికి 'యూనిక్స్ అండ్ సి' కూడా వచ్చు"
    చైర్మెన్ ఆశ్చర్యంగా మూడో చిలుకను చూశాడు. దాని ధర 'లక్షరూపాయలు' అని రాసి వుంది.
    "మరి దీనికింకా ఏమేం వచ్చు? అంత ధరుంది" ఆశగా అడిగాడు.
    "ఇదేమీ చేయదు గానీ- మిగతా చిలుకలన్నీ దీనిని 'చైర్మన్' అని పిలుస్తాయి సార్"

    ఎనిమిదేళ్ళ కుర్రాళ్ళు ఒక సూపర్ బజార్ కొచ్చాడు.
    "నాకు ఒక లీటర్ డెట్టాల్ కావాలి" అన్నాడు.
    "లీటరా? అంతెందుకు?" అడిగాడు సేల్స్ మెన్.
    "మా ఇంటికో చుట్టం వచ్చాడు. వాడు మాట్లాడితే నాకు నీతులు చెప్తున్నాడు. అందుకని వాడు నిద్ర పోయినప్పుడు వాడి చేతులు కట్టేసి నోట్లో ముక్కులో డెట్టాల్ పోసేస్తా" అన్నాడా రౌడీటైప్ కుర్రాడు.
    "అలా చేయటం తప్పు బాబూ! అతని ప్రాణానికే అపాయం కలుగుతుంది."
    "నీకెందుకు- నువ్విస్తావా- ఇంకెక్కడయినా కొనుక్కోమంటావా?" దబాయించాడా కుర్రాడు.
    సేల్స్ మెన్ డెట్టాల్ ఇచ్చి డబ్బు తీసుకున్నాడు.
    ఓ వారం తర్వాత మళ్ళీ వచ్చి కిలో అయిస్ క్రీమ్ తీసుకున్నాడా కుర్రాడు.
    "మీ చుట్టం ఉన్నాడా- పోయాడా?" అడిగాడు సేల్స్ మెన్.
    "అదే రోజు చచ్చాడు-" లైట్ గా అన్నాడా కుర్రాడు.
    "నేను చెప్పాను కదా- అలా డెట్టాల్ పోస్తే ప్రాణానికి అపాయం అని?"    
    "ఏడ్చావ్ లే- డెట్టాల్ తో ఎక్కడ చచ్చాడు వాడు? ఆ తరువాత వేరే షాప్ లో సల్యూరిక్ యాసిడ్ తెచ్చి వాడి నోట్లో పోయాల్సి వచ్చింది-"

    పశువుల డాక్టర్ గారబ్బాయికో అనుమానం వచ్చింది.
    "నాన్నా! గుర్రానికి ఒక వేళ జ్వరం వచ్చిందనుకో! దానికి టాబ్ లెట్ ఎలా వేస్తారు?"
    "ఒక గొట్టాం తీసుకుని- దాని గొంతులోకి పోనిచ్చి అప్పుడా గొట్టాంలో టాబ్ లెట్ వేసి ఊదాలి- దాంతో అది గొంతులోకి జారేసరికి అది మింగేస్తుంది-"
    వాడు ఓ క్షణం ఆలోచించాడు.
    "ఒక వేళ మనం ఊదేలోగా అదే ఊదితే?" అడిగాడు అనుమానంగా.

    టీచర్ ఆరేళ్ళ చంటిని ప్రశ్నవేసింది.
    "చంటీ! కొంగ ఒక కాలిమీదే ఎందుకు నిలబడుతుందో చెప్పగలవా?"
    "దానికి ఒక కాలు నొప్పి టీచర్! అందుకని రెండో కాలిమీద నిలబడుతుంది" చెప్పింది చంటి.
    "ఛట్! తప్పు! అది నిద్రపోయినప్పుడు ఒక్క కాలిమీద నిలబడుతుంది. అర్ధమయిందా?"
    "అయింది టీచర్"
    "రాజూ నువ్ చెప్పు! కొంగ ఒక కాలిమీద ఎప్పుడు నిలబడుతుంది?"
    "ఒక కాలు నిద్రపోయినప్పుడు- మేలుకుని ఉన్న రెండో కాలుమీద నిలబడుతుంది టీచర్-"

    అయిదేళ్ళ రజని వాళ్ళ మమ్మీ డాడీతో చుట్టాలింటికి వెళ్ళింది. కాసేపయాక తిరిగి రాబోతుంటే "భోజనం చేసి వెళ్ళండి" అన్నారు బంధువులు.
    "అహహ- వద్దండీ- ఇంటికెళ్ళి భోం చేస్తాం" అంది రజని వాళ్ళమ్మ.
    "అలా కుదరదు- భోజనం చేసి వెళ్ళాల్సిందే" అంటూ పట్టుపట్టారు వాళ్ళు.
    "ఇంకోసారి వస్తాం లెండి! ఈసారికి వెళ్ళనీండి-" అంది రజని వాళ్ళమ్మ.
    ఈతతంగమంతా చూస్తోన్న రజనికి చిరాకేసుకొచ్చింది.
    "అబ్బ! వప్పుకో మమ్మీ! అమ్మమ్మతో వీళ్ళింట్లోనే భోజనం చేసి వస్తాం- వంట చేయవద్దు" అని చెప్పి వచ్చావుగా" అంది.

 Previous Page Next Page