Previous Page Next Page 

బెస్ట్ జోక్స్ పేజి 2


    ఇంటి ఓనర్- ఆ ఇంట్లో అద్దెకు రావాలనుకుంటున్న ఏకాంబరాన్ని ఇంటర్ వ్యూ చేస్తోంది.
    "చూడు- అద్దె పే చేస్తున్నాం కదాని మీ ఇష్టమొచ్చినట్లు న్యూసెన్స్ చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా అరుపులు, కేకలు, శబ్ధాలు- అనేవి నాకస్సలు వినబడకూడదు- అర్ధమయిందా?"
    "అయింది మేడమ్!"
    "మీకు అరచి కేకలేసే పిల్లలున్నారా?"
    "లేరు మేడమ్"
    "మీ ఇంట్లో టీవీ, రేడియో, మ్యూజిక్ డెక్, హార్మోనీ, పియానో లాంటివేమయినా ఉన్నాయా?"    
    "అవేమీ లేవు మేడమ్-"
    "నువ్వూ. మీ ఆవిడా కొట్టాడుకుని కేకలేసుకుంటూంటారా?"
    "అస్సలు లేదు మేడమ్- చాలామెల్లగా మాట్లాడుకోవటం అలవాటు మాకు-"
    "ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిన్న శబ్దం కూడా మాకు సరిపడదు-"
    "ఒకే ఒక్క శబ్దం వస్తుంది మేడమ్- మరి దానికి మీరు ఓకే అంటే......?"
    "ఏమిటా శబ్దం?"
    "నేను రైటర్ని మేడమ్! పెన్ తో కాగితం మీద రాసేప్పుడు ఆ శబ్దం వస్తూంటుంది."

    "మనం కేరళలో పుట్టకపోవటం చాలా అదృష్టం! కదా రాణీ?"
    "ఎందుకలా అంటున్నావ్?"
    "ఎందుకేమిటి? మనకి మళయాళం ఒక్క ముక్క కూడా రాదు కదా!"

    ఓ చిన్న పిల్లడు దారి తప్పిపోయాడు. ఒక పోలీస్ అతనిని ఇంటికి చేర్చాలని ప్రయత్నించాడు.
    "నీ పేరేంటో చెప్తే మీ ఇంట్లో వాళ్ళకు చెప్తానోయ్-"
    "మా వాళ్ళకు నాపేరు తెలుసండీ"

    "మమ్మీ! నీకెప్పుడయినా విపరీతమయిన తలనొప్పి వస్తుందా?"
    "మీరింట్లో చేరి అల్లరి చేస్తున్నప్పుడు రాకేమవుతుంది?
    "పాపం అమ్మమ్మ! ఎంత బాధపడిందో-"

    "ఒరేయ్- కాళ్ళు లేకుండా నేలమీద ఫాస్ట్ గా పరుగెత్తేదేంట్రా?"
    "నీళ్ళు-"

    "నువ్ నిద్రపోయే ముందు లాస్ట్ లో ఏం చేస్తావ్ రా?"
    "మిగతా వాళ్ళంతా నిద్రపోయారో లేదో చూస్తా-"

    "చూశావా శిరీషా! అక్కడ టీషర్ట్ వేసుకుని నిలబడ్డాడు చూడు! వాడిని చూస్తే మండిపోతోంది నాకు- పెద్ద రోగ్ లాగున్నాడు-" మండిపడుతూ అంది రజని.
    "కానీ పాపం వాడు అసలు నీ వేపే చూడటం లేదు కదా- ఆ సినిమా పోస్టర్ వంక చూస్తున్నాడు-"
    "అదే- అందుకే నాకు మండేది-"

    ఒక కంపెనీ మేనేజర్ తన అసిస్టెంట్ మేనేజర్ని పిలిచాడు.
    "మనం ఈ మధ్య ఒక ఎకౌంట్స్ క్లర్క్ ని అపాయింట్ చేసుకున్నాం- గుర్తుందా?"
    "ఉంది సార్"
    "వాడిమీద నాకు డౌటుగా ఉంది- దొంగ చూపులూ- వాడూనూ-"
    "ఛ! వాడలా కనబడినంత మాత్రాన అలా అనుకోకూడదు సార్-"
    "అలా కనబడ్డాడని కాదోయ్- వారం నుంచీ అసలు కనబడటం లేదని-"

    "హాయ్ ముకుంద్- నిన్న క్రికెట్ మాచ్ సూపర్బ్ గా ఆడావనుకో- కంగ్రాచ్యులేషన్స్-"
    "నేనాడటం ఏమిటి నా మొఖం! డకవుట్ అయ్యాను కదా-"
    "నీ ఆట అద్భుతం అని మరి మీ ఆపోజిట్ టీమ్ వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారేంటి?"

    ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ "అరె- మనదేశం మీద అభిమానం ఉండాలయ్యా! టాక్స్ లు చిరునవ్వులతో కట్టటానికి అలా ఫీలవుతారేంటి- నాకర్ధం కాదు?"
    "టాక్స్ లు కాష్ రూపంలోనే కట్టాలని అనుకున్నా సార్-"

    "డాక్టర్- నిజం చెప్పండి! నేనింకెంత కాలం బ్రతుకుతాను?" ఒకావిడ డాక్టర్ నడిగింది-
    "ఖచ్చితంగా చెప్పలేను గానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను- ఇక నుంచీ స్టార్టయే కొత్త టీవీ సీరియల్స్ మాత్రం చూడకండి-"

    "మనీషా! నిజం చెప్పవే! ఆ రాకేష్ కి వాళ్ళ మావయ్య విల్లులో ఇచ్చిన యాభైలక్షల కోసమే నువ్ రాకేష్ ని పెళ్లిచేసుకున్నావ్ కదూ?"
    "అక్కడే నాకు మండేది! వాళ్ళ మావయ్య ఇచ్చాడని కాదు. ఇంకెవరిచ్చినా నాకు ఓకే-"

    "నిజం చెప్తున్నారా ఉమేష్! నా లైఫ్ లో నేను పైకి రావటానికి మూడే మూడు ఉపయోగపడినయ్-"
    "ఏమిట్రా అవి?"
    "లిఫ్ట్, ఎస్కలేటర్, మెట్లు-"
    "నేను ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నా గాళ్ ఫ్రెండ్ అక్కడే కలుసుకుంటుంది నన్ను- తెలుసా?"
    "అలా ఎలా?"
    "ఏముంది? నా క్రెడిట్ కార్డ్ తీస్తే చాలు- క్షణాల్లో వాలిపోతుంది-"

    "నాకు తెలీక అడుగుతున్నా! ఈ డాక్టర్లు, నర్సులు ఆపరేషన్ థియేటర్ లో మాస్క్ లు ఎందుకువేసుకుంటారు?"
    "అది గూడా ఎరుకలేదుబే? వాళ్ళల్లో ఎవళ్ళు ఏం తప్పు జేసినా ఎవళ్ళు జేసిందీ- ఇంకొకళ్ళకి తెలీకుండా ఉంటానికి-"

    "మా బాస్ ని మచ్చిక చేసుకోవాలంటే ఏం చేయాలి?"
    "అది కూడా తెలీదా? మంచి జోక్ ఒకటి మీ బాస్ మాంఛి మూడ్ లో ఉండగా చెప్పేసెయ్-"
    "ఆపనెప్పుడో చేశా! అయినాగానీ ఆ జోక్ కి నవ్వకపోగా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు"
    "పిచ్చివాడా! అందుకే జోక్ లెప్పుడూ ఆఫీస్ లో చెప్పకూడదు. ఆదివారం నాడొక్క రోజే వాళ్ళు రిలాక్స్ డ్ గా ఉంటారు గనుక..."
    "అర్ధమయిందిలే- రేపాదివారమే బాస్ ఇంటికెళ్ళి జోక్ చెప్తా!"
    "అదే పరమ తెలివితక్కువ పని! ఆదివారం  నాడు బాస్ నవ్వాలంటే-శుక్రవారం సాయంత్రం బాస్ ఇంటికెళ్ళి జోక్ చెప్పాలి!"

    కేవలం రికమండేషన్లతో, లంచాలతో ఐఏఎస్ లయిన ఇద్దరు బార్ లో కూర్చుని లాండ్ గ్రాబర్ ఇప్పిస్తోన్న మందుకొడుతున్నారు.
    "నేను గొప్ప ఇంటెలిజెంట్ ననే కదా- ఐఏ ఎస్ లో సెలెక్ట్ చేసుకున్నారు. కానీ మా అబ్బాయి ఎంత తెలివి తక్కువ వాడో చెప్తే నువ్ ఆశ్చర్యపోతావ్-" అన్నాడొకడు.

 Previous Page Next Page