అంతవరకూ ఆవేశంతో ఊగిపోతున్న సి.ఈ.ఓ. సడెన్ గా "గెటౌట్" అంటూ గావుకేక పెట్టాడు.
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"అరెరే - అలా రైలింజన్ లాగా అరచారేమిటి/ ఇలా గావుకేకలు పెడుతూ దేశమంతా తిరగటం ఆరోగ్యానికి హానికరం! తెలుసా? డూ యూ నో జి.కే. జిలానీ? గ్రేట్ ఫెలో! ఒక మల్టీనేషనల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్! కానీ ఏమయింది? ఇలాగే గావుకేక లేశాడు! అంతే! అవుట్! స్పాట్ డేడ్! నేనే డెడ్ బాడీని ఇంటికి చేర్చాను-"
అతను ఆవేశంతో వణికిపోతున్నాడు.
"నీకు ఏ పరిస్థితులోనూ జాబ్ ఇవ్వబోటం లేదు. అండర్ స్టాండ్! మా బాసే స్వయంగా చెప్పాడు - నీకు జాబ్ ఇస్తే నా జాబ్ పోతుందని -"
"ఆఫ్ కోర్స్! నాటాలెంట్ చూసి నేను నిన్ను రిప్లేస్ చేయగలనని కరెక్ట్ గా ఊహించి ఉంటాడు గానీ నాకూ కొన్ని ఎధిక్స్ ఉన్నాయ్ బ్రదర్! మీరు పీస్ ఫుల్ గా రిటైర్ అయ్యేంతవరకూ మీ జాబ్ కి డోకా రానిను- ఒకే?"
అతను రకరకాల హావభావాలు ప్రదర్శించడానికి ప్రయత్నించి , అవేమీ కుదరక చివరకు రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాడు.
"నన్ను చిత్రవధ చేయకయ్యా! నీకు దణ్ణం పెడతా! వెళ్ళిపో - వెళ్ళిపోరా దేవుడా! త్వరగా ఫో-"
"ఒకే కామ్రేడ్! నీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పుడు -- నీ మీద జాలి పడటం తప్ప -- నో ఆల్టర్ నేటివ్ ఫర్ మీ! సి యు గయ్-" అనేసి బయటకు వచ్చేశాడు భవానీ -
మధ్యాహ్నం ఒంటిగంట వరకూ టీవీ ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు ఎక్కడా ఒక్క వేకన్సీ కూడా లేదు.
ఉదయం రోడ్ పక్కన బండీలో తిన్న రెండు ఇడ్లీలు కొంచెం ఓవర్ గా అరిగిపోవడం చేత -- ఆకలి సర్రుమంటూ వళ్ళంతా పాకుతోంది.
హోటల్లో ఏదయినా తిందామా అంటే జేబులో చిల్లర తప్ప ఏమీ లేదు.
తన తల్లీ, తండ్రీ -- పదేళ్ళ క్రితం హైదరాబాద్, సోమాజీగూడాలో ఒక వర్షం కురిసిన రాత్రి స్కూటర్ మీద వెళ్తూ కవర్ లేని డ్రైనేజ్ గోతిలో పడి కొట్టుకుపోయిన దగ్గర్నుంచీ తనను దూరపు బంధువు బాబూరావ్ తిండిపెట్టి ఇంతవరకూ చదివించాడు.
అయితే బాబూరావ్ కి భవానీశంకర్ అంటే ప్రేమ ఉండి కాదు.
అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్ మేంటిచ్చాడు -
తల్లిదండ్రులను డ్రైనేజ్ గోతిలో పోగొట్టుకున్నభవానీశంకర్ కి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా అతని చదువు కయ్యే ఖర్చంతా గవర్నమెంటే భరిస్తుందని-
ఆ స్టేట్ మెంట్ చూసి బాబూరావ్ లో ఆశ పుట్టింది -
భవానీశంకర్ ని దగ్గరకు తీస్తే పాతిక లక్షలూ తనే కాజేయ వచ్చనీ -- ఆ డబ్బు కాజేశాక భవానీని ఇంటి నుంచి గెంటేయవచ్చనీనీ! అయితే ఆ ముఖ్యమంత్రి తర్వాత మరో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు గానీ, ఇంరవరకూ పాతిక లక్షలు ప్రభుత్వం ఇవ్వలేదు - దాంతో బాబూరావ్ ఇరుక్కుపోయాడు -- అయితే బాబారావ్ లో ఇంకా ఆశ చావలేదు. ఇంకా ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. "నెక్ట్ ఎలక్షన్ తరువాత ఇచ్చేస్తాం" అని వాళ్ళంటూనే ఉన్నారు.
"ఎప్పటికయినా పాతిక లక్షలు గవర్నమెంట్ నుంచి వసూలు చేసిచ్చే బాధ్యత నాదంకుల్" అంటూ అతనికి భోరసా ఇచ్చాడు భవానీశంకర్.
"ఒకవేళ గవర్నమెంట్ అలవాటు ప్రకారం చెయ్యిచ్చినా -- నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి బాకీ తీరుస్తాలే! డోంట్ వర్రీ!' అన్నాడతను. ఇది భవానీశంకర్ ప్లాష్ బాక్-
"పోనీ ఆ పాతిక లక్షలకు ఇంకో పాతిక వేలిచ్చావనుకో! నేను దేశమంతా ఇంటర్ వ్యూలకు తిరగటానికి పనిస్తుందంకుల్-" అన్నాడు భవానీశంకర్ ఇంట్లో నుంచి వచ్చేసే రోజున.
కానీ బాబూరావ్ వప్పుకోలేదు.
"ఒరే భవానీ! ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వను -- అమెరికాలో హైస్కూల్ చదువు దాటితే చాలు - పిల్లల్ని బయటకు గెంటివేస్తారు , నా ఖర్మ కాలి, ఆ పాతిక లక్షలకు ఆశపడి ఇంతకాలం నిన్ను పోషించా-' అంటూ చేతులేత్తేశాడు ఎండ శరీరానికి నిప్పంటిస్తోంది.
"వాట్ టు డునౌ?" అనుకున్నాడు భవానీ చకచక ఆలోచిస్తూ. సడెన్ బ్రేక్స్ తో అటో వచ్చి అతని ముందాగింది.
"కమాన్ - అటో ఎక్కు" అన్నాడు అటో డ్రైవర్ .
భవానీ నవ్వాడు.
"రాంగ్ కారెక్టర్నీ పట్టుకున్నావ్ బ్రదర్! అటో దిగాక చార్జ్ ఇమ్మని నన్ను అడిగావనుకో! ముందు ఓ తౌజెండ్ అప్పిమ్మని నేనే అడుగుతా-'
"ముందు అటో ఎక్కరా బాడుకవ్" అన్నాడు ఆటోవాడు అతని మాటలే మీ పట్టించుకోకుండా!
భవానీశంకర్ ఉలిక్కిపడి అటో వాడి ముఖం చూశాడు.
"ఈ డైలాగ్ ఇంతకుముందు విన్నదే బ్రదర్ -- యా! యూ ఆర్ రాకేశ్ రెడ్డి -' అన్నాడు హాపీగా -
రాకేశ్ రెడ్డి చిరాకుపడ్డాడు.
"అరె- ముందు అటో ఎక్కుబే -- నీకేం దమాకుందా లేదా?"
"ఓ గాడ్! నువ్ అటో నడపటమేమిటి మిత్రమా! టాటాలూ, బిర్లాలూ ఎక్కడయినా అటో నడుపుతారా?" అంటూ అటో ఎక్కేశాడు.
అటో ఒక మోటారు సైకిల్లా దూసుకుపోతోంది.
చివరకు ఒక స్లం లో కెళ్ళి ఓ పెంకుటిల్లు ముందాగింది.
"రా" అన్నాడు రాకేష్.
ఇద్దరూ పాడుబడినట్లున్న ఆ ఇంట్లో కెళ్ళాడు.
"ఇదే మనిల్లు" అన్నాడు రాకేష్, భవానీశంకర్ కి మతిపోయింది
"ఇదంతా ఒక క్రైం పిక్చర్ చూస్తున్నట్లుంది బ్రదర్! వెంటనే నువ్ అన్ని వివరాలు సప్లయ్ చేయకపోతే ఆడియన్స్ షాక్ తో పైకెళ్ళి పోయే ప్రమాదం స్పష్టంగా కనబడుతోంది -"
రాకేష్ రెడ్డి అదేం పట్టించుకోకుండా డ్రస్ మార్చుకుంటున్నాడు.
"అల్ ఈజ్ వెల్! డోంట్ వర్రీ -- " అన్నాడు మధ్యలో.
భవానీశంకర్ ఆ ఇల్లంతా చూశాడు.
బయటకు భయంకరంగా ఉన్నా లోపల కొంతవరకూ బాగానే ఉంది.
అయితే తౌజెండ్ డాలర్ కొశ్చన్ అన్సర్ లేకుండా అలాగే ఉండిపోయింది.
కోట్ల ఆస్తికి వారసుడయిన రాకేశ్ రెడ్డి అటో డ్రైవర్ గా ఎందుకు అవతార మెత్తాడు? ఎత్తినా మహాల్స్ లో ఉండాల్సి నోడు ఇలా స్లమ్స్ లో ఎందుకుంటున్నాడు?
క్షణాల్లో రాకేష్ రెడ్డి గెటప్ మారిపోయింది.
జీన్, కాస్ట్ లీ టీషర్ట్ , వాచీ, షూస్ - ప్రిన్స్ లాగా తయారయాడు.

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }