Previous Page Next Page 

మహిమ పేజి 2


    తండ్రీ కొడుకూ మొహాలు చూసుకున్నారు. "ఓకే యంగ్ లేడీ! బయట కాసేపు వెయిట్ చేయండి. ఇంకా కొందరున్నారు ఇంటర్వ్యూకి. వారిని కూడా ఇంటర్వ్యూ చేశాక, కొద్ది నిమిషాలలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినవారి పేర్లు ప్రకటిస్తాం. గుడ్ డే..." అన్నాడు అవినాష్ జైన్, కంపెనీ ఛైర్మన్.
    "థ్యాంక్యూ సర్" మర్యాద పూర్వకంగా అని మహిమ బయటికి వచ్చింది.
    ముప్పావుగంట తరువాత మహిమకి లోపలికిరమ్మని పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఎందుకో తను సెలెక్ట్ అవుతానన్న నమ్మకం కలిగింది మహిమకి. ఆ నమ్మకం వమ్ముకాలేదన్నట్లు, "కంగ్రాట్స్ మిస్ మహిమ! యూ ఆర్ సెలెక్టెడ్! మీ జీతం, పెర్క్స్, మీ బాధ్యతలు, మా రూల్స్ అన్ని వివరాలు ఈ ఫారంలో ఉన్నాయి. చదివి మీకు అంగీకారం అయితే సంతకాలు పెట్టి ఇచ్చి వెళ్ళండి. మా నిబంధనలు అంగీకరిస్తే మీరు రేపే జాయిన్ అవ్వచ్చు" కాగితాలు అందిస్తూ అన్నాడు అవినాష్.
    కాగితాలు ఒకసారి చకచక చదివేసి అంగీకారంగా తల ఆడించి, "థాంక్యూ సర్!" అంటూ సంతకాలు పెట్టింది.
    "బై ది బై ... మీకు అకామడేషన్ ఉందా? మీరు ఉండేది ఎక్కడ? ట్రాన్స్ పోర్ట్ ఉందా?" విశాల్ వివరాలు అడిగాడు.
    "నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఏదన్నా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గాని, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ గాని చూసుకోవాలి. ప్రస్తుతం మా కజిన్ బ్రదర్ దగ్గర దిగాను".    
    "అలాగా. ఎందుకడిగానంటే... ఈ ఆఫీసులో పనిచేసే అమ్మాయిలు ఐదారుగురు కలిసి, దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని షేర్ చేసుకుని ఉంటున్నారు. జస్ట్ ఎ మినిట్" అంటూ ఇంటర్ కమ్ నొక్కి "సోనీ, మన ఆర్టిస్ట్ సెక్షన్ లో పనిచేసే సీమని ఒకసారి రమ్మను" అన్నాడు విశాల్.
    కాసేపటికి సీమ లోపలికి వచ్చి వినయంగా నమస్కారం చేసింది.
    "ఆ, సీమా, ఈమె మహిమ. కొత్తగా మన కంపెనీలో చేరుతున్నారు. ఆమెకి అకామడేషన్ కావాలి. మీ అపార్ట్ మెంట్స్ లో ఏమన్నా ఖాళీ ఉందా? మీ దాన్లో లేకపోతే ఇంకో రెండు మూడు ఉన్నట్టున్నాయి గదా, ఎనీ వేకెన్సీ?" విశాల్ ఆరాతీశాడు.
    "వారం కిందట నయన సింగిల్ బెడ్ రూమ్ తీసుకుని వెళ్లిపోయింది. తను ఆ రూములో వర్షతో షేర్ చేసుకు ఉండవచ్చు సార్" అంది సీమ.
    "సో, మీకు ఈ ఏర్పాటు నచ్చితే సీమతో ఈ విషయం మాట్లాడి, అపార్ట్ మెంట్ చూసుకుని సెటిల్ చేసుకోండి" అవినాష్ ఫైలు తీసుకుంటూ అన్నాడు.
    "థాంక్స్ సీమగారు ! అకామడేషన్ వెతుక్కునే బాధ తప్పించారు" బయటికి వచ్చాక మహిమ అంది. "రండి నా క్యాబిన్ లో కూర్చుని మాట్లాడుకుందాం" సీమ తన సీటువైపు దారితీస్తూ అంది.
    ఎస్టాబ్లిష్ మెంట్... ఇంత పెద్ద కార్పొరేట్ లెవల్లో ఉంటుందని అనుకోలేదు మహిమ. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ ఆఫీసు. అందమైన పరదాలు, పూలగుత్తులు. చిన్న చిన్న క్యూబిక్స్. ప్రతి సీటు ముందు కంప్యూటర్లు. ఎవరి పనులు వారు నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు. ఆ అంతస్తులోనే వందమందిదాకా ఉన్నారు. ఒక్కో అంతస్తులో ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్. చూస్తుంటే సంతోషంతో మహిమ మనసు నిండిపోయింది. ఇలాంటిచోట ఉద్యోగం దొరకడం తన అదృష్టం. ముద్రా కమ్యూనికేషన్స్ లో సీటు రావడమే ఒక అదృష్టం అనుకుంటే, చదువగానే ఇంత పెద్ద అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగావకాశం తన అభిరుచికి తగిన అవకాశం.
    "సీమగారూ, మీ ప్లేస్ మెంట్ ఏమిటి?" సీమ చూపించిన సీట్లో కూర్చుంటూ అడిగింది మహిమ.
    "కాల్ మీ సీమ. గారులు అవి అక్కరలేదు. నేనిక్కడ ఆర్టిస్ట్ ని. వచ్చిన కాప్షన్స్ కి బొమ్మలు గీయాలి. పత్రికలలో ప్రకటనలకి".
    "ఓ! చిత్రకారిణి అన్నమాట. ఐ యామ్ హ్యాపీ టు మీట్ యూ" అంది మహిమ సంతోషంగా.
    "మా అపార్ట్ మెంట్స్ లో మూడు బెడ్ రూముల ప్లాట్లు రెండు అద్దెకి తీసుకున్నాము. ఇక్కడ పనిచేసే అమ్మాయిలం కొందరం కలిసి ఒక్కొక్క రూములో ఇద్దరం ఉంటున్నాం. డ్రాయింగు, కిచెను, డైనింగ్ కామన్. మూడు గదులకు మూడు బాత్ రూములు.
    "మరి భోజనం... వంట చేసుకుంటారా అంతా కలిసి?"
    "అబ్బే ... ఈ ఉద్యోగాలతో అంత ఓపిక ఎక్కడ? ఒక పనమ్మాయి ఉంది. అన్ని పనులు తనే చేస్తుంది. ఆరుగురికి వంట, ఇంటిపని అంతా తనే. బాగానే జీతం ఇస్తాం. ఖర్చు సమంగా పంచుకుంటాం".
    "ఓ గ్రేట్ అన్నీ బాగున్నాయి. నా రూమ్మేట్ ఎవరు" కుతూహలంగా అడిగింది.
    సీమ నవ్వి "నేనే! ఇఫ్ యూ డోంట్ మైండ్!" వర్ష రూముకి నా రూమ్మేట్ వెడతానంది.
    'బాగుంది. ముందొచ్చి సెటిల్ అయింది మీరు. మీకే ఏదన్నా అభ్యంతరం ..."
    "నో నో ! చూడగానే నువ్వెందుకో నచ్చేశావు. నిజానికి వర్ష రూములో ఖాళీ ఉంది. కాని నిన్ను నా రూమ్మేట్ చేసుకోవాలనిపించింది" భుజం తట్టి ఆప్యాయంగా అంది సీమ.
    "థాంక్స్ సీమా ..." మహిమ మనస్ఫూర్తిగా అంది. "ఓకే డన్! ఇవాళ మీతో వచ్చి ఇల్లు చూసి, రేపు లగేజ్ తెచ్చుకుంటా".
    "సరే. అలా అయితే ఓ అరగంట రిసెప్షన్ లో కూర్చో పని పూర్తిచేసి వస్తా".
    మహిమ రిసెప్షన్ వైపు నడిచింది. సీమ వచ్చేలోగా ఓసారి ఆఫీసంతా చుట్టి రావాలనిపించింది. రిసెప్షన్ లో అడిగింది. ఆమె నవ్వి తల ఊపి "ఫిప్త్ ఫ్లోర్ నుండి మొదలుపెట్టండి. విజువల్ సెక్షన్! ఇంటరెస్టింగ్ గా ఉంటుంది" రిసెప్షనిస్ట్ సలహా ఇచ్చింది. లిఫ్ట్ లో ఐదో అంతస్తుకి వెళ్ళింది మహిమ.


 Previous Page Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }