Previous Page Next Page 

లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 2

 

    'అమ్మో! పర్స్ కొట్టేశారు -- పిక్ పాకెట్ - పిక్ పాకెట్ ---"
    ఆ కేకతో బస్ మీద కేగబడుతోన్న వాళ్ళంతా వెనక్కు తగ్గి, ఎవడి జేబులో వాడు చెక్ చెసుకుంతుంటే భావానీశంకర్ హాపీగా బస్ ఎక్కేశాడు. బస్ స్తార్టయాక మళ్ళీ బస్  స్టాప్ లో కాండేటే అతని భుజం తట్టాడు.
    "పర్సులు జేబులో పెట్టుకుని అమ్మాయిలకు సైట్ కొడుతూ బస్ లెక్కటానికి ట్రై చేస్తే ఇలాగే అవుద్ది మరి!" హేళనగా ఇకిలించాడు.
    భవానీశంకర్ జాలిగా అతని భుజం తట్టాడు.
    "నీయవ్వ ! మళ్ళీ రెండోసారి కూడా చావు దెబ్బ తిన్నావ్ కదురా! నా దగ్గర పర్సు లేదసలు-" ఆ శాల్తీ మొఖం మాడింది గానీ పక్కనున్నోడు విరగబడి నవ్వుతున్నాడు.


                                               ***
    "తెలుగు ఎక్స్ ప్రెస్ " టీవీ అన్న బోర్డు వంక ఆనందంగా చూశాడు భవానీశంకర్.
    క్రాఫ్ మరోసారి దువ్వుకుని రిసిప్షనిస్ట్ దగ్గరకు నడిచాడు.
    "వాట్ కేనాయ్ డూ ఫర్ యూ?" రిసిప్షనిస్ట్ గ్లామర్ ఒలకబోస్తూ పలుకరించింది.
    "మీ గ్లామర్ గాళ్స్ తల్చుకుంటే చాలా చేయగలరు -- మీ సిఈఓ తో నాకు ఇంటర్యూ ఏర్పాటు చేయగలరు. నాకు మీ ఛానెల్లో జాబ్ చేయాలని మీ ఎండీ గారికి రికమెండ్ చేయగలరు-"
    "ఓ - టీవీ జర్నలిస్ట్ ఇంటర్యూ కొచ్చారా?"
    "ఇంటర్యూ జస్ట్ ఫార్మాలిటీ అనుకోండి! మీలాంటి బ్యూటిఫుల్ అండ్ సెక్సీ గాళ్ రికమెండ్ చేశాక కాదనే కెపాసిటీ ఎవడి కుంటుంది? అవునా కాదా? ఆమె కన్ ఫ్యూజ్ అయిపోతోంది."
    "మీ కాల్ లెటర్ ఇస్తారా?"
    "హలో! ఇవి లెటర్స్ రాసుకునే రోజులు కాదు అంతా ఏస్ ఏమ్ ఎస్ ! ఇదిగో - మీకో న్యూస్ తెలుసా? మనం మాస్ కమ్యునికేష్న్స్ ప్లయింగ్ కలర్స్ తో స్వీప్ చేశాం! స్టార్ బాగోక ఇక్కడి కొచ్చాగానీ స్టార్ చానెల్లో ఉండాల్సిన స్టార్ మనది డియర్!"
    ఆమె ఇబ్బందిగా చూసింది.
    "ప్లీజ్ - డియర్ అనకండి -"
    "అనకూడదా! స్ట్రెంజ్ గా ఉందే! మీ ఊరు ఖచ్చితంగా ఏ ఇంటిరియర్ విలేజో అయుంటుంది. ముక్కూ మొఖం తెలీని వాళ్ళు స్టేజ్ మీద ముద్దులతో గ్రీట్ చేసుకుంటున్నారు. టీవీ చానెల్లో చూళ్ళేదా? చాలా కాంతి సంవత్సరాలు వెనుకబడినట్లున్నారు. ముందుకి రా ఫ్రెండ్! రా! కదలిరా! స్టార్ టీవీ పిలుస్తోంది-"
    ఆమె ముఖంలో కొంచెం భయం కనిపించింది.
    వెంటనే కొంచెం రన్నింగ్ టైప్ లో సి.ఈ. ఓ రూమ్ లోకి పరుగెత్తింది. అప్పుడే ఆ డస్క్ మీదున్న ఫోన్ - కొంపలు మునిగినట్లు - మోగటం మొదలుపెట్టేసరికి -- టక్కున ఫోన్ అందుకున్నాడు భవానీశంకర్.
    "హలో! ఎవరు బ్రదర్ మాట్లాడేది! కేకే రాజా? హాయ్ రాజా- వాట్ కెన్ అయ్ డూ ఫర్ యూ? వ్వాట్ ? నేనేవరా? ది గ్రేట్ భావానీశంకర్- కాబోయే - కాబోయే ఎంట్లే - అల్ మోస్టాల్ కన్ ఫర్మ్ డ్ అనుకో - చానెల్ న్యూస్ డెస్క్ ఇన్ చార్జిని! ఏంటి? నా పేరేప్పుడూ వినలేదూ, కనలేదా ? ఇంకో గంట తర్వాత కేవలం నా పేరు తప్ప నీకింకేమీ కనిపించదు. వినిపించదు. అదీ మన లెవల్! ఏంటీ ? ఏమీ అర్ధం కావటం లేదా? హలో - నేను మాస్ కమ్యునికేషన్స్ జర్నలిజంలో - విజువల్ మీడియాలో -- ఒకటేంటి? అన్నిట్లోనూ టాప్ స్కొరర్ ని! నన్ను సెలక్ట్ చేసికొకపొతే తెలుగూ ఎక్స్ ప్రెస్ ఒనర్ని తెలుగు ప్రజలంతా ముక్తకంటంతో బండబూతులు తిడతారు కామ్రేడ్- ఇంతకూ నీకెవరూ కావాలో చెప్పరా ఈ సోదంతా ఎందుకు........."
    'అయ్ వాన్ట్ సి.ఈ.ఓ. ! -" కోపంతో రగిలిపోతూ అరచిందా గొంతు-
    "వ్వాట్/ సి.ఈ.ఓ కావాలా? ఎందుకు రాజా! మీ సి.ఈ.ఓ అయితే పీకుతాడు - నేను పీకలేనని డౌటా? చూడు రాజూ! నా సంగతి నీకింకా తెల్సినట్టు లేదు - ట్రాక్టర్ తో దున్నినట్లు దున్నుతా! తెల్సా! ఎవర్నయినా సరే! చాలెంజ్-
    "ఈడియట్! ముందు మా సి.ఈ.ఓ ని లైన్ లో పెడతావా లేదా?' ఇంకా ఆవేశంతో రెచ్చిపోతూ అందా గొంతు.
    "ఏంటి ? ఇడియట్టా? నీ లాంగ్వేజ్ కొంచెం చిల్లర్ లెవల్లో ఉంది కామ్రేడ్! స్కౌండ్రల్స్ అండ్ గూండాస్ కాలేజ్ లో వదిలిన బాపతా? అయినా గానీ నిన్ను నువ్ రెక్టిపై చేసుకోడానికి సమయం మించిపోలేదు -- రోజూ ఈవెనింగ్ టెన్ టూ టెన్ థర్టీ నేనే నీకు ఇంటర్నేషనల్ కోచింగ్ ఇస్తా! నారూమ్ కిరా!" హౌటు కంట్రోల్ యంగర్" అన్న సబ్జెక్ట్ లో నేను ఎక్స్ పర్ట్ ని -"
    "బ్లడీ హెల్! ముందు మా సి.ఈ.ఓ. కి కనేక్షనిస్తావా లేదా?"
    "చూశావా ? లాంగ్వేజ్ ఎంత వరస్ట్ గా వస్తోందో? అలా చిల్లరగా మాట్లాడలనిపించటం -- ఒక మెంటల్ డిజార్దర్! ఆ కోర్కెతో ఫైట్ చెయ్ బ్రదర్! ఖచ్చితంగా విజయం సాధిస్తావ్- ఇంతకూ నీ పేరేంటి?"
    "యూ బ్లడీ రాటెన్ ఎగ్! అయాం యశ్వంత్ రాజ్, తెలుగూ ఎక్స్ ప్రెస్ టీవీ ప్రోప్రయిటర్! అండర్ స్టాండ్?"
    భవానీశంకర్ హాపీగా ఫీలయ్యాడు.
    "ఓ! సో ----యూ ఆర్ ది ప్రోప్రయిటర్? గ్లాడ్ టు మీట్ యూ జెంటిల్మన్! కానీ ఆ సంగతి -- ముందే చెప్తే కొంచెం రెస్ ఫెక్ట్ ఇచ్చే వాడినిగా! అదీగాక ఇంకెన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం! ఖుల్లమ్ ఖుల్లా!"
    "రాస్కెల్ - ముందా ఫోన్ వదుల్తావా లేదా?"
    "ఛ! నీ లాంగ్వేజ్ బి యాండ్ రిపేర్ బ్రదర్! కుక్కలా ట్రయినింగ్ సెంటర్ వాడొక్కడే నిన్ను సెట్ రైట్ చేయగలదు - అందులో చేరిపో-"
    "య్యూ య్యూ ...." అంటూ పెద్ద కేక దాని వెనుకే ఫోన్ రెండు మూడు వేల ముక్కలయిన శబ్దం వినిపించింది.
    అప్పుడే రిసెప్షనిస్ట్ హడావుడిగా వచ్చింది.
    "సి.ఈ.ఓ ." గారు రమ్మంటున్నారు-"
    "నేను చెప్పలేదూ ? టాలెంట్ ని ఎవరయినా సరే కౌగలించుకొని గుండెలకు హత్తుకుంటారు డియర్ -"
    ఆమె చిరాగ్గా చూసింది గాని అప్పటికే భవానీ చీఫ్ ఎడిటర్ రూమ్ లో కొచ్చేశాడు.
    "హాయ్ కామ్రేడ్! నేనే భవానీ శంకర్ ని! భవానీశంకర్ అనే జీనియస్ ఎవరు? ఎలా ఉంటాడు? నాతొ మనసు విప్పి మాట్లాడతారా లేదా ? ఇలా ఎన్నో ఇమేజినేషన్స్ తో మీరు తలక్రిందులయిపోతుండి ఉంటారని నాకు తెలుసు."
    అంటూ బలవంతంగా అతని చేయి అంద బుచ్చుకుని ఇంకా బాగా బలవంతంగా కరచాలనం చేశాడు భవానీశంకర్.
    'చూడు మిస్టర్......" కోపంగా ఏదో చెప్పబోయడతను.
    "యస్ కామ్రేడ్! మీ పిలుపులో అర్ధం తెలిసిపోయింది -- ఈ క్షణం నుంచే నువ్ మా న్యూస్ ఇన్ చార్జివి! నిజానికి నీకున్న టాలెంట్ కి నీకు ఎకాఎకిన సి.ఈ.ఓ . జాబే ఇవ్వవచ్చు -- కానీ ఈ జూనియర్ గాళ్ళు ఏడుస్తారు - కాబట్టి ఒకవారం డెస్క్ గా పనిచెయ్ - తర్వాత మళ్ళీ రివ్యూ చెద్దాం - " అని నాతొ చెప్పాలని తెగ ప్రయత్నిస్తున్నారు - కదూ ?"


 Previous Page Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }