తుపాను
-- అడివి బాపిరాజు
ప్రస్తావన
1
పూర్వకాలం నాల్గింటికి ప్రణయతత్వం ఏమితెలుసునా అని నా అనుమానం. ఏమీ తెలియదని నా దృడ నమ్మకం. పూర్వనాయికలు ప్రేమించారు. నాయకులకై విరహవేదన పడినారు. మదనజ్వర తాపోపచారాలు చేయించుకున్నారు. లేత అరిటాకు వీననలు, చిగురుటాకు పాన్పులు. '' ఆ మన్మథాకారుని చూడలేని కళ్ళు గాజుకళ్ళు'' అనుకున్నారు.అలాగే ఏమేమో కాంక్షలతో కుంగిపోయేవారు. వాళ్ళ ప్రేమ రైలు పట్టా ప్రేమ. ఒక మనిషిని ప్రేమించడం అంటే వాడితో దాంపత్యధర్మం అనుభవించాలన్న మాటేనా? తక్కిన వాళ్ళంతా అన్నలూ, తమ్ములూనా? అంతే ! కానీ యీ రోజుల్లో నాబోటి యువతులకు ' విచిత్ర భావ సంకీర్ణత' ఉన్నది. ఆనాటి యువతీ చరిత్రలో మానాటి యువతీ చరిత్ర ఒక అధ్యాయం కాలేదు. నాబోటి చదువుకున్న, నవయవ్వనంలో ఉన్న యువతులు కొందరం కలసి మా భాషలో ప్రేమ తత్వాన్ని తెలియజేసే పదం ఏమన్నా ఉందా అని ఆలోచించాము. పూర్వకాలములో స్త్రీలకు పురుషులకు ఉండే సంభందం రస స్వరూపంలో ఆలోచించారుగాని మానవజాతిలోని ఒక పెద్ద సమస్యగా ఆలోచించలేదు. ప్రేమ, ప్రణయం అనే పదాలలో ప్రణయానికి ప్రళయానికి ధ్వని సంభందం కనపడడంచేత, 'ప్రణయం' అనే మాటే బాగుందని అది ఏరుకున్నాం. ప్రేమ అనే పదం ' తేమ' అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని తోసేశాము. ప్రణయానికి మేము చెప్పుకొన్న అర్ధం అపారం, అద్బుతం, అంత్యంత క్లిష్టం, అస్పష్టం, ఆశ్చర్యకరం.
2
నా ప్రణయవస్త్రములోని అల్లిక జంటపోగులతో, మూడు పోగులతో, రంగు రంగుల మూలవాటపు దూప్ చాహన్ కలయికతో నిండి ఉన్నది. నేను నలుగురిని ప్రేమిస్తున్నా, కాదు ప్రణయిస్తున్నా ననుకోండి. శ్రావ్యమైన కంఠం కలిగినది ఒకరు, మంచి రూపం కలిగినది ఒకరు, మాటలపోగు ఒకరు, మౌనం, కలిగినది ఒకరు.
నిశాపతిరావు పేరును మాత్రం సార్ధకం చేసుకోడు. వట్టి నిశారావు అనవచ్చును. నల్లగా, సన్నగా , పొడుగ్గా ఉంటాడు. తెల్లని కళ్ళు, నవ్వితే తెల్లని పళ్ళు తప్ప చంద్రుని పోలిక అతనిలో ఎక్కడా లేదు. కాని అతని కంఠం మాత్రం ఉంది చూశారూ, మషామందర గంభీరతను మధించి తేర్చి తెచ్చిన వెన్నవంటిది. మనిషిని చూస్తే చీకట్లు కమ్ముతాయి. గొంతుక విప్పితే కువలయాలు విచ్చుతాయి. ఆ ప్రకాశంలో అతడు కలిసిపోతాడు.
'' నీ చేతులు కడుక్కుని ' స్వానిం కు బాటిల్సు ' నింపి వర్తకం చేసుకొనవచ్చు. నా తెల్లని చీరను అంటకు, చీర నల్లబడి పోతుంది'' అనేదాన్ని. ఇలా యేడిపిస్తూంటే అతనికి కళ్ళ నీళ్ళ పర్యంతమూ అయ్యేది. అతన్ని యేడిపించుకు తినటంలో ఇంతైనా జాలి కలిగేదికాదు నాకు.
అప్పుడు గొంతు విప్పాడా ప్రవహించేది ఒక గాఢపరిమలం మధురాతి మధురమైన మధువు., ఊళ్ళూ కోళ్ళూ యేకం చేసుకొని పరవళ్ళు త్రొక్కే మహానది. ఆ నాగస్వరం ఎదుట ఊగే పన్నగిని నేను సుడిగుండాలలో పడి కరిగిపోయిన చిన్న వాగును ! అతని గొంతుక సమ్మోగనాస్త్రం! దానిలో ఏదో తియ్యని బాధ ఉండేది. ఆ గొంతులో ఏరాగమో, ఏ పాటో ఆలాపిస్తూ, చైతన్యరహితురాలనైన నన్నా వేళ అతడేమిచేసినా దేహమూ, మానమూ,ప్రాణమూ అర్పించి ఉండేదాన్ని. ఆ గానదావానలం ముందర నా గర్యం కరిగిపోయి, నా రసజ్ఞత, నా హృదయము బయటికి స్రవించి ఆ మంటల్లో పడి బుగ్గయిపోవలసిందే.
ఇంత మహాశక్తి అతనికి ఉన్నా, అతనిలో ఒక పెద్ద లోటు ఉన్నది. నిశాపతిరావు పౌరుషం లో మార్దవం లేదు. అతనికి స్త్రీలు భోగ వస్తువులు మాత్రం అనుకుంటాడు. ' ఎలాంటి కౌశల్యము గలిగిన స్త్రీ అయినా, ఎలాంటి విజ్ఞానవతి అయినా, ఎంతటి విద్యా వంతురాలైనా అలాంటి స్త్రీ మరింత ఉత్తమమైన భోగవస్తువుగా మాత్రమే అవుతుంది' అని అతని వాదన. ఇట్టి తుచ్చ పశుత్వభావం కలిగి ఉండడం చేతనే పురుషుడయిన నిశాపతికిన్నీ, గానమూర్తియైన నిశాపతికిన్నీ సగమెరుక. స్త్రీని ముట్టుకుని గొంతుక యేత్తలేడు. గొంతుక సారించి స్త్రీని ముట్టుకోలేడు. స్త్రీ స్పర్శ మాత్రాన అతను పశువై పోతాడు. ఒళ్ళు వణికిపోతుంది. మధుపాన మత్తునిలా కళ్ళు కెంపు లెక్కి తూలిపోతాడు. కొంకర్లుపోయే అతని వేళ్ళు వనితావక్షాల పైకి ఊరువుల పైకి వాలబోతాయి.
అతని గొంతుక అంటే వెఱ్ఱి మొహంలో పడతాను. అతని గొంతుక ఆగిన మరుక్షణంలో నిండు మెలకువ వస్తుంది. నిర్వచింపలేని అతని మధుర గంభీర కంఠం నుండి స్వరమధు ప్రవాహాలు ప్రవహింపజేస్తూ అతడు ఆక్రమించివస్తే కిక్కురుమనకుండా సర్వార్పణ చేసి ఉండేదాన్ని.సంగీతం పాడుతూ గాఢ కాంక్షతో అతడు నన్ను ముట్టుకునేటప్పటికి అతని గొంతుక కొడిగట్టిన దీపంలా తుస్సున ఆరిపోయేది. అప్పుడు అతణ్ణి చూసి నా కళ్ళు కెంపులేక్కేవి. అతడు కుంగి వణికిపోయేవాడు. అందుచేత మే మిద్దరం ఒకళ్ళోకళ్ళం గౌరవించుకుంటూ దూరదూరంగా ఉంటూంటాము.
3
అల్పమూర్తి సింహంలాంటి మనిషి. అతని వక్షం విశాలమైనది. అతని భుజస్కంధం దిమ్మెసలాంటిది. అతని మెడ పోతబోసిన కంచు. బలం మూర్తికట్టి కోట్లకొలది వానలకు తడిసి, నునుపెక్కిన రాతిబండల్లాగ తిరిగిపోయిన చేతులూ, కాళ్ళూ, వీనికి తగిన ఉన్నత శరీరము, తీరైన ముఖము, కల్ప మూర్తి గ్రీకు అపోలోను మించిన సౌందర్య మూర్తి. కాని కల్పమూర్తి తన మెదడును క్రిందటి జన్మలో మరచిపోయి వచ్చాడు. చెప్పింది త్వరగా అర్ధం చేసుకోలేడు. అర్ధం చేసుకున్నది అతికిచలేడు, అటుకులేని అతని భావాలు అతన్నే కంగారు పెడతవి.
తండ్రి కావలసినంత సంపాదించి యిచ్చాడు. బంగారానికి ఏమీ కొదువలేదు. ప్రయివేటు మాష్టర్ల కష్టఫలితంగా అయిదవ పారం వరకూ ఈడ్చుకు వచ్చాడు. స్కూల్ ఫయినలు పరీక్షకు ఎంత గొప్పవారి అభి మాన మున్నా సున్నలికి మార్కులు కలిపి అతన్ని పైకి ఎట్టా నెట్టగలరు? అంతటితో చదువు చాలించాడు.

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }