మహిమ
డి. కామేశ్వరి
"సో, యూ ఆర్ ఫ్రమ్ 'ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్' అహ్మదాబాద్! అయామ్ ఇంప్రెస్ డ్ విత్ యువర్ బయోడేటా" మైమ బయోడేటా కాగితాలు పరిశీలిస్తూ అవినాష్ జైన్ అన్నాడు.
"థాంక్స్ సార్! మీ ప్రకటన నన్నూ ఇంప్రెస్ చేసింది. 'మీలో భావుకత ఉందా? భావాన్ని మాటల్లో పొదగగల సృజనాత్మకశక్తి మీలో ఉంటే, మీరే మాకు కావాల్సినవారు' ప్రకటనలోని వాక్యాలను తన నోటివెంట వినిపిస్తూ, మహిమ చిరునవ్వు నవ్వింది.
ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థి అంత నిర్భయంగా, అంత ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం తనకు నచ్చినట్లు అవినాష్ ముఖంలో మెచ్చుకోలు. పక్కనే కూర్చున్న కొడుకు విశాల్ వంక భావగర్భితంగా చూశాడు. ఆమెనే పట్టిపట్టి చూస్తున్న కొడుకు కళ్ళల్లో మెరుపు ఆయన దృష్టిని దాటిపోలేదు. ఈసారి కాగితాల మీదనుంచి మహిమ ముఖంవైపు తిరిగింది ఆయన చూపు. తెలుపు పసుపు కలిసిన ఛాయ, భుజాలవరకు కత్తిరించిన జుత్తు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే కళ్లు. సగం చేతుల కుర్తా, లూజు సల్వార్, మెడకి వేలాడుతున్న చున్నీ, కుడిచేతికి రెండు బంగారు గాజులు, ఎడమచేతికి వాచి, వేలికి చిన్న ఉంగరం, చెవులకి చిన్న డైమండ్ దుద్దులు, నుదుట బొట్టు, కళ్లకి కాటుక. సింపుల్ గా ఉన్నా ఏదో తెలియని హుందాతనం, దర్జా ఆమె వేషంలో కనిపించింది.
"సో, యూ థింక్ యు హావ్ గాట్ ఆల్ దట్ క్వాలిటీస్" చిరునవ్వుతో అడిగాడు.
"అందుకేగా ఇంటర్వ్యూకి వచ్చాను" అదే చిరునవ్వుతో జవాబిచ్చింది.
"ఓకే, లెటజ్ సీ!" అంటూ ఒక్క క్షణం అలోచించి, "చూడండి మిస్ మహిమ ఒక డోర్ మేట్ ప్రకటనలో 'మీ పాదాల ముందు మా అందాలు' అని ఉంది. అది అంత సహజంగా ఉందని నాకనిపించలేదు. అవే పదాలు ఉపయోగిస్తూ అంతకంటే అర్థవంతంగా, సహజంగా ఉండేట్టు మార్చి చెప్పగలరా?" అని అడిగాడు.
మహిమ ఒక్కక్షణం ఆలోచించి... "మా అందాలు మీ పాదాలముందు" అనాలి. కాని నాకెందుకో 'మా అందాలు మీ పాదాలకోసం' అంటే ఇంకాస్త అర్థవంతంగా ఉంటుందనిపిస్తోంది".
మొహంలో భావం మార్చకపోయినా ఆయన కళ్ళల్లో ప్రశంస కనపడింది. "సరే, ఒక కొత్త డిటర్జెంట్ పౌడరు మార్కెట్ లోకి రావాలి. ఎన్నోరకాల సబ్బులు, పౌడర్లు ఉండగా కొత్త ప్రోడక్ట్ ని ఆకర్షణీయంగా మార్కెట్ చెయ్యాలంటే ... ఎంతో ఆకర్షించే, ఆకట్టుకునే ప్రకటన ఉండాలి. అలాంటి ఒకటి ఏదన్నా చెప్పగలరా?" కంపెనీ డైరెక్టర్ విశాల్ అడిగాడీసారి. మహిమ రెండు నిమిషాలు కళ్లు మూసుకుంది. తరువాత కళ్లు తెరిచి విశాల్ వంక సూటిగా చూస్తూ "మా కొత్త డిటర్జెంట్ పౌడరునే వాడమని మేము చెప్పము. కానీ వాడితే మాత్రం మీరు మమ్మల్ని క్షమించరు ... 'ఇన్నాళ్లు ఆలస్యం చేసినందుకు'! ప్రజలను పాజిటివ్ అప్రోచ్ కంటే నెగెటివ్ అప్రోచే ఎక్కువ ఆకర్షిస్తుందని నా ఉద్దేశం" నిబ్బరంగా ఇద్దరివంకా చూస్తూ అంది మహిమ.
ఒక్కక్షణం ఇద్దరూ విస్మయంగా చూస్తుండిపోయారు. తరువాత తేరుకుని చప్పట్లు కొట్టి, "వెల్ సెడ్ మహిమ" అన్నాడు అవినాష్ ఆనందంగా. విశాల్ అయితే అభినందనపూర్వకంగా చూస్తుండిపోయాడు.
"సరే, ఇది చెప్పండి. ఒక ప్రొడక్షన్ తయారీలో ప్రకటనల కోసం ఎంత వరకు ఖర్చుపెట్టడం సబబుగా ఉంటుంది?" అవినాష్ అడిగాడు.
"ఓ ప్రొడక్షన్ బయటికి రావాలంటే వంద రూపాయల్లో ఇరవై రూపాయలు మెటీరియల్ కాస్ట్, ఇంకో ఇరవై ప్రొడక్షన్ కాస్ట్, నలభై రూపాయలు ప్రకటనలకి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. వందకి ఇరవై శాతం లాభం మిగలకపోతే నష్టపోతారు".
"నలభై శాతం ప్రకటనలకి ఖర్చు చెయ్యడం అవసరమా?"
"ఆ ఖర్చు తప్పనిసరి. ఏదన్నా వస్తువు తయారుచేయడం సులభమే కానీ, మార్కెటింగ్ కష్టం. వస్తువు తయారయ్యాక ప్రజలలోకి వెళ్లి అమ్ముడవకపోతే ఏం లాభం? అంచేత ప్రకటనల ఖర్చు తగ్గించి లాభం పెంచుకోవాలనుకోవడం అవివేకం" మహిమ నిష్కర్షగానే చెప్పింది.
"కొత్త ప్రోడక్ట్ సరే, మరి పాతవీ, మార్కెట్ లో నిలదొక్కుకున్న వాటికీ అంత ఖర్చు అవసరమా?"
"అవసరమే! రోజురోజుకీ మార్కెట్ లోకి ఎన్నో కొత్త రకాల వస్తువులు వస్తున్నాయి. వినియోగదారుడు కొత్తవాటి మోజులో పాతవి మర్చిపోకుండా ప్రకటనలు వస్తుండాలి. అంతగా అయితే ఒక పదిశాతం ఖర్చు తగ్గించుకునే వీలుండచ్చు..."
"ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ లాభాలు తగ్గిపోవడం, కాంపిటీషన్ పెరిగి పోవడంతో ఎక్కువ ఖరీదు పెడితే వినియోగదారులు కొనరని, వెయిట్ తగ్గించి అదే ధరకి అమ్ముతున్నారన్న విషయం బయటికి వచ్చింది. దాన్ని మీరెలా సమర్థిస్తారు?"
"అవును సార్! కొంతమంది చాలా తెలివిగా సబ్బులు, టూత్ పేస్టులు, సబ్బు పౌడర్లు వగైరా వాటి డిజైన్లు, షేపులు మార్చి వెయిట్ తగ్గించి లోటు భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అది వినియోగదారుడిని మోసం చెయ్యడం కిందకి వస్తుంది. ఒకసారి నమ్మకం, విశ్వాసం కోల్పోతే ఆ కంపెనీని జనం నమ్మరు. కనుక అది మంచి పద్ధతి కాదు".

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }