Next Page 

పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 1

 

                               పార్ట్ టైమ్ హాజ్ బెండ్

                                                                          యర్రంశెట్టి శాయి

 

                           

 

    ఆ అమ్మాయిలో ముందు ఆకర్షించేది "ముందు ' అందాలే!
    పైగా కౌంటర్ మీదకు వంగి పెదాలు బిగించి రాస్తోంటే - లోనెక్ జాకెట్ వ్యూ-
    భూకంపం వచ్చినట్లు మరింత సేక్సీగా , అందంగా.
    ఎన్ని యుగాలయినా ఆ దృశ్యం చూస్తూ నిలబడి పోవచ్చు.
    "క్వాలిఫికేషన్ ?" తలెత్తకుండానే అడుగుతోంది.
    "సెక్స్ స్పెషలిస్ట్ "
    ఉలిక్కిపడి తలెత్తి చూసింది.
    బిగించిన పెదాలు అందంగా విచ్చుకున్నాయ్.
    భూకంపాలు ఆగిపోయాయ్.
    అలా తలెత్తి చూసే చూపుల సంగతి తనకు తెలుసు.
    అక్కడే మొదలవుతుంది కధ!
    "వ్వాట్" విస్మయం .
    "అదే! ఎమ్ . ఏ. తెలుగూ లిటరేచర్ ."
    "మరిందాక ఏదో అన్నారేమిటి?"
    "లిటరేచర్ లో మేము చదువుకున్నదంతా సెక్సే కదా! రాధికా స్వాంతనం మీరెప్పుడయినా చదివారోలేదో ......చదవక పొతే చదవండి ! భారత స్త్రీల కది 'మస్ట్' అని నా ప్రైవేట్ అభిప్రాయం. వాత్సాయనుడి కామ సూత్రాలు బలాదూర్! ఉదాహరణకి రాధిక కృష్ణుడి మీద విరహంతో వేగి , కాగిపోతూ ....."
    తనక్కావలసిన ఎఫెక్ట్ వచ్చేసిందా అమ్మాయి కళ్ళల్లోకి.
    పూర్తీ ఎదురు ------
    "అహహ! ఇప్పుడెం వద్దులెండి !" గొంతులో గాబరా!"
    "ఇదే నాకు నచ్చనిది ! సెక్సంటే పాపం అని మన లేడిస్ అనుకుంటారు. మా ప్రెండ్ శ్రీవల్లి కూడా ఇంతే ......" తనక్కావలసినంత నిషా ఇస్తున్నాయ్ ఆమె ముఖంలో ఫీలింగ్స్.
    "ప్లీజ్! ఇంక ఆ టాపిక్ వదిలేదాం!" పైట సర్దుకుంటుంది.
    "బాగుంది! మొదలు పెట్టింది. మీరు ....మధ్యలో అపేయమంటే ఎలా?"
    "ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు ?" మళ్ళీ పెదాలు బిగించి రాసుకుంటూ అడిగింది.
    "దేనికయినా రడీయే! అన్నింట్లోనూ అనుభవం ఉంది.
    "అంటే?"
    "చదువుకుంటూ చాలా పార్ట్ టైం ఉద్యోగాలేశాను ! లేడీస్ టైలరింగ్ దగ్గర్నుంచీ పట్టు చీరాల డ్రైక్లినింగ్ వరకూ!"
    ఆమె కిసుక్కున నవ్వేసి చప్పున నవ్వు కంట్రోల్ చేసేసుకుంది.
    "మరీడా, అన్ మారీడా?"
    "మీకిది కన్వీనిఎంటయితే అది ఓకే!"
    ఆమె పెదాలు విడివడినాయ్. కనుబొమ్మలు ముడిపడినాయి.
    "నాకు కన్వీనియెంట్ ఏమిటి?"
    "అంటే .....ఏది రాస్తే నాకు ఉద్యోగం గారంటీగా వస్తుందో అది రాయమని పరసనల్ రిక్వస్ట్ ! అంతే! నో డబుల్ మీనింగ్స్ !"
    ఆమెకింకా అనుమానం తొలగినట్లు లేదు.
    "ఫాక్ట్ ఏమిటో అది చెప్పండి!' కొంచెం కటువుగానే అంది.
    "తప్పదంటే సరే! చెప్పేస్తాను! బాచులర్ నే౧ అయితే బ్రాకెట్లో స్కిల్డ్ ' అని రాయండి !"
    "స్కిల్డేమిటి ?"
    "అందరూ స్కిల్డ్ లేబరా అన్ స్కిల్డ్ లేబరా అని అడుగుతున్నారు. అందుకని వీలయినచోటల్లా స్కిల్డ్ అని రాస్తే ఉద్యోగం దొరుకుతుందని ఆశ! ఆహా! మీకో విషయం చెప్పాలని ఇందాకతినుంచి అనుకుంటున్నాను."
    "ఏమిటది?"    
    "మీరు పెదాలు బిగించినా, వదులు చేసినా కూడా చాలా అందముగా ఉన్నారు. మా శ్రీవల్లీ కూడా ...."
    ఆమె సిగ్గుపడినా ఆ విషయం బయటకు పోక్కనీకుండా మానేజ్ చేసింది.
    "ప్లీజ్ మైండ్ యువరోన్ బిజినెస్."
    "మీరు కొంచెం కన్ ఫ్యూజన్ లో ఉన్నట్లున్నారు. నేను చేస్తొందదే......."
    ఆమె కాగితం మీద ఇనీషియల్ వేసి ఇచ్చింది.
    "లోపలికెళ్ళండి!"
    "ఎవరి లోపలికి?"
    ఆమె మళ్ళీ నవ్వకుండా ఉంటానికి ప్రయత్నిస్తోంది.
    "ఆ ఇంటర్ వ్యూ రూమ్ లోకి -------"
    "ఓ! అదా! థాంక్యూ వెరీమచ్! మీ రుణం ఉంచుకోవడం నా కిష్టం లేదు. మీ కిష్టమయితే ఏదొక రూపంలో తీర్చేద్దామని వుంది! ఆఫ్ కోర్స్ ఎక్స్ ప్ట్ కాష్!"
    ఆమె ఇంకా వినిపించుకోవటం లేదు.
    "నెక్ట్స్!"
    ఇంకో యువతి వచ్చి నిలబెడేసరికి ఇంటర్యూ రూమ్ లోకి నడవక తప్పలేదు.
    ఇద్దరున్నారు లోపల .
    ఒక మధ్యవయసు స్త్రీ, కొంచెం ఏజ్ డ్ సూట్ వాలా!
    ఆమె వయసు సుమారు నలభయ్ వుంటుంది గానీ ముప్పయ్ కి ఎడ్జస్ట్ చేస్తోంది.
    ఇద్దరూ గుర్రం మీదేక్కే జాకీల్లా తన మీద స్వారీ చేయడానికి సిద్దంగా వున్నారు.
    "గుడ్ మాణింగ్......" చిరునవ్వు కొంచెం ఒలకబోస్తూ-
    "గుడ్ మాణింగ్ " లేడీ రెస్పాండ్ చేసింది.
    తన గురించి రాసిన పేపరంతా ఆమె చూస్తోంటే "ప్లీజ్ సిడౌన్ ' అన్నాడతను.
    "యువర్ నేమ్ ఈజ్ సురేష్?" అడిగిందామె.
    "జనరల్ పబ్లిక్ కి! చాలా నార్మల్ గా మాట్లాడ్డానికి ప్రయాట్నం.
    "అంటే?" విచిత్రంగా చూస్తోంది.
    "అదే .......మీకు తెలీందేముంది? కొంచెం క్లోజ్ గా వుండేవాళ్ళు ------ఐ మీన్ మరీ క్లోజ్ గా వచ్చేసినప్పుడు మాత్రం ఒకోళ్ళూ ఒకోరకంగా పిలుస్తారు కదా! అంటే లేడీస్ ----మా శ్రీవల్లి అయితే 'డార్క్ డెవిల్' అంటుంది. అంటే చీకటి పడితే చాలు డెవిల్ అయిపోతానంట."
    ఆమె ముఖం ఎర్రబడింది . కళ్ళల్లో కోపం తొంగి చూసింది కానీ అతను నవ్వేశాడు.
    "అన్సర్ టు ది పాయింట్ ! ఓకే ?" అడిగిందామె.
    "యస్ , మేడమ్!"
    "మాది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక షిప్ట్ డ్యూటీలుంటాయ్ . మాణింగ్ ఎనిమిది గంటల కల్లా డ్యూటీలో ఉండాలి. మరీ అంత పెందరాడే నిద్రలేవగలరా?" గొంతులో కొంచెం హేళన!
    "నా మొఖం మీద మొదటి సూర్య కిరణం మా కిటికీ లో నుంచి పడగానే టక్కున నిద్రలేవటం అలవాటు మేడమ్! చిన్నప్పటి నుంచి.

Next Page