Home » Komala Devi » Aardhana



    
    "ఆ.....అనుకుంటూనే వున్నాంగా? అ మప లక్ష్మి వెళ్ళిపోయింది. ఇక వీళ్ళకన్నీ వెర్రిబుద్దులే.....నీకేమైనా వివరాలు తెలుసా మంజూ ఆమె ఆందోళన కంఠంతో ఆతృతతో కూతురి వైపు చూచింది.    
    "ఆ....తెలుసు. రెండవ కోడలికి ముందు నుంచీ స్వతంత్రంగా వుండాలనే పెద్దకోడలు ఇంతవరకు పడనిచ్చిందికాదు. ఇక కళ్యాణికూడా వేరుబోతే బావుండుననే ఇచ్చ చూపించేసరికి అంగీకరించక తప్పిందికాదు."
    "కళ్యాణి కేమొచ్చిందంట? ఆమె విస్తుపోయింది.
    "అందుకు కారకురాల్ని నేనే"
    "నువ్వా? తండ్రి నమ్మను - అన్నట్లు చూశాడు. అతని నుదుటి పై వ్యక్తమైన గీతలు అతనెంత ఆదుర్దాపడ్తున్నది వ్యక్తీకరించినై.
    "రెండవ కోడలికి మేము కళ్యాణి దగ్గరకు అంటే వారింటికి వెళ్ళటం ఇష్టంలేదు. పోనీ పరాయివాళ్ళం కదా - అలాగే దూర దూరంగా వుందామంటే అక్కయ్య ఒప్పుకోదు. కల్యాణి మరి. వాళ్ళబావగారంటే తన కెంతో గౌరవం. ఇంటిల్లిపాది మేం వెళ్ళగానే చేసే హాడా విడికి ఆమె సహింపలేదు. కల్యాణి ఎంతో బాధకరం గానూ వుంటుంది.....మేం ఎప్పుడోగాని వెళ్ళము, కాని, కళ్యాణి పాపను తీసుకొని వెళ్తుంటుంది. వద్దంటే వినదు. మా గురించి వాళ్ళలో వాళ్ళకు మనస్పర్ధలు దేనికని మేము దూరంగా వుంటూ వచ్చాము కాని ఇంతలో మరొక సమస్య తలెత్తింది?"
    "ఏమిటది?" అన్నట్లు చూచారు తల్లీ- తండ్రీ?
    నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానుకదా? పాపను కూడా తీసికొని వెళ్ళాలనే వీళ్ళిద్దర్ని మాత్రం ఇక్కడే వుంచెయ్యాలి. కనీసం రెండు సంవత్సరాలైనా పడ్తుంది. అక్క కళ్యాణి చూచుకుంటా మంటున్నారు. డాక్టరు ఖాన్ కూడా అదె చెబుతున్నారు. ఒకర్ని అతని దగ్గర మరొకర్ని కళ్యాణి దగ్గర పెడ్తామేమో- ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు. అందుకని అక్కయ్య - కళ్యాణి వేరుబోతే మంచిదనుకున్నారు, పై భాగం కళ్యాణి వేరుబోతే మంచిదనుకున్నారు, పై భాగం కళ్యాణి కట క్రిందిభాగం చెరిసగం ఆట. మామగారు పెద్దకొడుకు దగ్గరే వుంటారట...."
    "ఎవరి తాపత్రయం వారిది" తండ్రినుదురు తుడుచుకున్నాడు. మంజు మౌనం దాల్చింది. నిమిషాలు దొర్లిపోతున్నాయి. తల్లి మాత్రం "మంచిదేలే .... మేడ ఎక్కితే భోజనాలకి, స్నానాలకి తప్ప క్రిందికి రాదటగా!
    "ఎవరు చెప్పారు?"
    "పెద్దకోడలు చెప్పింది- కళ్యాణి కివన్నీ పట్టవనుకో" ఆమె ఆలస్యమౌతుందని వంటింట్లోకెళ్ళిపోయింది. ఇంతట్లోకి ఎవరో సైకిల్ మీద వచ్చారు. లోపలికొచ్చి అతనికి ఉత్తరం అందించాడు. కుమార్ మంజును రమ్మని రాసిన లేఖ అది.        మంజు బేగ్ తెరచి స్టెతస్కోప్ తీసికొని బైటికొస్తూ అంది "నాన్నా- పాప భద్రం-దాని కంతా క్రొత్త నిద్రలేచేవేళ - ఏమైనా చేస్తే కోపగించుకో కండేం- త్వరగా వచ్చేస్తాను కూతురు ఇలా చెబుతుంటే అతను సహించలేక పోయాడు. "ఇలా మాట్లాడుతున్నావేం మంజూ పసిపిల్లలు - వాళ్ళమీద నాకేం కోపంలేదమ్మా- మీరిలా వచ్చారంటే - నేనెంతగా మారానో నీకే తెలుస్తుంది. నేను మారిపోయానమ్మా చాలా- మారాను...."
    "మంజు వెనుదిరిగి జూడలేదు, ముందుకు వెళ్తున్నదల్లా చటుక్కున ఆగింది. కొంగు భుజం మీదుగా లాక్కుంటూ స్పష్టంగా మెల్లగా అంది. "ఇంకా మారాలి నాన్నా-మీరింకామారాలి ...వారి రక్తం- మీ ప్రతి అణువులోవుంది...వారి చికిత్సవల్లకాదు- వారి రక్తమే మిమ్మల్ని కాపాడింది." ఆమె చరచర వెళ్ళిపోయింది.
    అతను తలమీద బరువు పడ్డట్లు అచేతనుడై కూర్చుండిపోయాడు. తల వేడెక్కపోతోంది. అవ్యక్తమైన అశాంతికి లోనయ్యాడు. మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు తరుముకు వస్తున్నాయి, మరుక్షణంలో అంతా శూన్యం- తన ఉనికినే మర్చిపోయినట్టు తలపట్టుకు కూర్చున్నాడు.
    ఇది నిజమా? ఇంతవరకు తనకు తెలియదే! ఎవ్వరూ చెప్పలేదే-మంజు కల్పించి చెబుతోందా" తనను ఓడించటానికి, అబద్ధం చెబుతోందో! ఏమో ఎన్నింటికో తెగించింది. ఇది మాత్రం కల్పితం కాకూడదూ. తెగించి ఇంత అసత్యం చెప్పినా చెప్పేదే మంజు!
    ధైర్యం కూడగట్టుకుని, గబగబ భార్య దగ్గరకు వెళ్ళాడు.
    ఆమె అన్నం వారుస్తోంది.
    "ఇదిగో.....డాక్టర్ కుమార్....నాకు రక్తం దానం చేశాడా? నీకు తెలుసా?"
    ఆమె హస్తాలు కంపించినై, గభాలున గిన్నె క్రిందపెట్టి భర్త ముఖంలోకి చూచింది. అతని వైఖరికి భయవద్దూ అంది "తెలుసు" ఆ స్వరం నూతిలోంచి వచ్చినట్లుంది.
    "ఐతే.... నాకెందుకు చెప్పలేదు?"
    'చెప్పొద్దన్నారు. హాస్పిటల్ లో రక్తం ఎక్కించిన సీసాలోని రక్తం - దాత - ఎవరో తెలియదుకదా? అలాగే ఇదికూడా - ని ఆయన తెలియజేయవద్దని చెప్పారు. మీకెలా తెలిసింది? మంజు చెప్పిందా?"

                             *    *    *

    అతను ఏమీ చెప్పలేదు. ఇది కేవలం మంజు కల్పన - అన్న భావన ఎక్కడో అంకురించి వున్నదల్లా ఒక్కసారి పెనుగాలికి తుడుచుకుపోయి నట్లయింది. ఎటూ తోచక అశాంతితో అడుగులో అడుగేస్తూ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. అద్దం వేసిన బీరువాముందు నుంచున్నాడు. అప్రయత్నంగా తన ప్రతిబింబాన్ని చూచుకున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని తుడుచుకున్నాడు. చేతులను, జబ్బలను చూచుకున్నాడు. "ఈ శరీరంలో అతని రక్తం ప్రవహిస్తోంది. ఆణువణువునా అతని రక్తమే. ఈ గుండె కొట్టుకుంటున్నదంటే అది అతని రక్తం వల్లనే తనీ విధంగా ప్వాస్యం పొంది తిరగ్గలుగుతున్నా డంటే అది అతని రక్తం వల్లనే! - అతని తల తిరిగి పోయింది పాప పడుకున్న మంచం మీద చతికిలబడ్డాడు అతని హృదయంలోని తుఫాను నణచలేక అశాంతితో కూర్చుండి పోయాడు ఆమె గబగబ వచ్చి భర్త సమీపంగా కూచుంది.    
    "మంజు చెప్పిందా.....వెర్రి పిల్ల... వేలాది రక్తదాతల్లో అతనొకరు- అంతే అతను రక్తదారి అని తెలిసి మీరేదో చేస్తారను కుంది ఎన్నో కోరికలతో వచ్చింది పిల్లల్ని వుంచి వెళ్ళాలని కూడా మనసులో వుందేమో! అన్నీ ఎంత అసంభవమో తెలుసు- వుండబట్టలేక ఏదో అనేసింది- మరే ఫరవాలేదు మీరు నిశ్చింతగా వుండండి. మనం ఏమాత్రం తలొగ్గినా - ఇక్కడ మనసై గల ఈకొద్ది గౌరవం మంటగలుపుకున్నవార మౌతాము." ఆమె ఏదో వాగుతోంది. కాని. కడుపులు అతను ఏదీ వినటము లేదు. మంచం పట్టెమీద తల ఆన్చి కళ్ళు మూసుకున్నాడు.    

                              *    *    *

    మంజు హాస్పిటల్ కు వెళ్ళగానే డాక్టరు గోపాలరావు ఎదురొచ్చారు. మంజును కన్సల్టేషన్ రూములోకి తీసికొనివెళ్ళాడు. కుమార్ అంత గదిలో వేరొక కుర్చీలో కూర్చుని వున్నాడు. మంజు మరొక కుర్చీలో కూర్చోగానే అన్నాడు"డాక్టర్ - లోపలగదిలో ఒక స్త్రీ వుంది. పరీక్షచేసి ఎన్నో మానమో చెప్పండి." మంజు లోపలి కెళ్ళింది.
    ఆ స్త్రీకి ముఫ్ఫై ఐదు సంవత్సరాలుండవచ్చు. కట్టు, బొట్టు, ముక్కు పుడక ఆభరణాలు చూడగానే గొప్పింటి గుజరాతీ బిడ్డని తెలుస్తోంది.
    ఆమెను బల్లమీద పరుండజేసింది. సిస్టరీ సాయంగా నుంచుంది.    
    మామూలుగా అడిగే ప్రశ్నలు అడుగుతూ కడుపుమీద చేయివేసింది.
    ఎన్నో కాన్పు?.....నెలతప్పి ఎన్ని నెలలైంది? ఆమె జవాబు లిస్తోంది. మంజు హస్తం కడుపును నొక్కింది. ఒక్కక్షణం ఆమె సంధకారం వ్యాపించింది. కళ్ళు బైర్లు క్రమ్మినట్లు క్షణం భావించింది.    
    తమాయించుకుని, ఆమె ముఖంలోకి సూటిగా చూచింది.        
    "బిడ్డ కదలిక తెలుస్తోందా మీకు?"
    "ఆ..... తెలుసుంటుందమ్మా"
    మంజు భారంగా విశ్వసించింది. స్టెతస్కోప్ ను కడుపు మీద పెట్టి బిడ్డ గుండె కొట్టుకుని శబ్దం వినటానికి ప్రయత్నించింది....కాని.....కాని గర్భవతికి - ఆరు నెలల గర్భవతికి వుండవలసిన చిహ్నాలన్నీ వున్నప్పటికీ గర్భంలో బిడ్డ లేదు.    
    చెవి సోకని ఆ శబ్దం కోసం తహతహ లాడింది స్పర్శకందని ఆ బిడ్డ కోసం పిచ్చిగా కడుపును ఎత్తుతోంది.    
    మెల్లగా వత్తండి డాక్టరుగారూ" అంటోందామె.
    మంజు హస్తం కొయ్యబారి పోయింది. చటుక్కున ఆపుజేసి ఆమె కేసి చూచింది. అప్పుడే బిడ్డ క్షేమంకోసం మాతృమూర్తి ఎంత ఆందోళన చెందుతోంది మంజుకు అవతలి గదిలో కెళ్ళటానికి మనసొప్పలేదు ఏదో నేరం చేసిన దానికి మల్లె బాధపడ్తూ అవతలి వరండాలో కెళ్ళింది. స్తంభానికానుకుని నుంచుంది. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈ కబురు తెలిస్తే ఏమంటుంది?    ఈ వార్తకు తట్టుకోగలదా? ఆరు నెలల నించి తన గర్భం పండబోతోందని గంపెడాశతో ఎదురు చూస్తోన్న ఆ మాతృ హృదయం- గర్భంలో బిడ్డలేదు. - అంటే విశ్వసిస్తుందా? ఆధాటికి తట్టుకోగలదా? ఇంత నిరాశకు మతి చలించదు కదా? హే - ప్రభూ ! బిడ్డ పుట్టిపోవచ్చు గాక - కాని కానీ ఈ శిక్ష ని స్త్రీకి వద్దు -ఎవ్వరికీ వద్దు - పగవారికి కూడా వద్దు.
    తన్ను తాను సంబాళించుకుని నెమ్మదిగా గది లోకెళ్ళింది. లోషన్ తో చేతులు కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వాళ్ళు కూచున్న గదిలో కెళ్ళింది.
    మంజు నిర్జీవంగా కుర్చీలో కూలబడింది. మెడలోవున్న స్టెతస్కోప్ బల్లమీద వుంచుతూ ఇద్దరి వైపు మార్చి మారి చూపింది. ఆమె ముఖంలో అలముకున్న చీకటిచ్చాయలను - ఆ కళ్ళలో వ్యక్తమైన వ్యధను - ఏదో చెప్పాలని - సంకోచంతో కంపిస్తున్న ఆమె పెదాలను చూచి ఇద్దరు నిర్విన్నులయ్యారు.
    "నా - మొదటి అనుభవం - మూడోప్రెగ్నంసీ' అంది.    
    ఆ గదిలో చలనం లేదు. గంభీర నిశ్శబ్దం కొన్ని క్షణాలు తాండవం చేసింది? డాక్టర్ గోపాలరావు చెయ్యి అప్రయత్నంగా తలమీదికి పోయింది జుత్తులోకి వ్రేళ్ళుపోనిచ్చి కళ్ళు మూసుకుని తలొంచుకుని కూచున్నాడు.
    భార్యాభర్త లొకరి ముఖాలొకరు చూచుకున్నారు.
    సేట్ జీ వచ్చి మరో కుర్చీలో కూచున్నారు. మంజు నుద్దేశించి ఆత్రంతో ప్రశ్నించాడు. "ఎలా వుందమ్మా - అంతా బావుంది కదా? తల్లి ఆరోగ్యం..."
    మంజు అతనికేసి చూడటంలేదు. ఆమెలో ఉత్సాహం లేదని ముభావంగా వుందని గ్రహించిన సేట్ జీ. ఠక్కున ఆపుజేశాడు.మంజుకు నోటమాట రావటంలేదు జాలిగా అతని వైపు చూసింది. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? కొండంత ఆశతో తండ్రిని కాబోతున్నావన్న గర్వంతో, ఆనందంతో దినాలు లెక్కపెట్టుకుంటున్న ఈ తండ్రికి ఏమని చెప్పాలి?
    స్థాయిపడి మృదువుగా అంది" ఆమెకు - అంత కులాసాగా లేదు. ఎక్కడ పరీక్షించారు? ఎన్నో నెల అనుకుంటున్నారు?"
    ఆయన పరీక్షగా మంజుదెస చూచాడు. "పోయిన నెల బొంబాయిలో మా ఇంటి మంత్రసాని చూచింది. ఆరునెలలని కాబోలు చెప్పింది. ఆ తర్వాత ఓడాక్టరమ్మకు చూపించాము. అంతా బావుందని చెప్పింది."
    మంజు కొంతసేపు ఆగి అంది" మరేం అనుకోకండి సేట్ జీ. ఆమెకు ఫీజు ఎంతిచ్చారు? మీ ఇంటి దాదీ ఎంత పుచ్చుకుంది?" సేట్ జీ భ్రుకుటీకరించి చూచాడు. మంజు ప్రశ్నలు అతనికి అసందర్భంగా తోచినై. దాదికో చీర. పది రూపాయలు ఇచ్చాడు. ఆ డాక్టరుకు అరవై రూపాయల బిల్లు చెల్లించాడు. ఈమె కివ్వటానికి ముఫ్ఫై రూపాయలు తెచ్చాడు. తను ఫీజు పుచ్చుకోవాలంటే వాళ్ళ ప్రసక్తి ఎందుకుతేవాలి? అతను మాట్లాడకుండా జేబులోంచి పర్సు తీశాడు. జిప్ తెరుస్తూ అన్నాడు, "ఆమెకే మందులిప్పించాలో వ్రాసిస్తే వాడ్తాము ..... ఇంకా రెండు నెలల్లో పురుడు రావచ్చు కదా ..." అతను మూడు పది రూపాయలనోట్లు బల్లమీద పెట్టాడు. మంజు నాని దెస కన్నార్పకుండా చూచింది!




Related Novels


Unnatha Sikaralu

Aardhana

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.