Home » Sri N T Rama Rao » 40 Years of TDP


                                                                                                                                                                                                               

    ఆర్ధిక సంస్కరణలు , ఐటి రంగం అభివృద్ధి పాలనా యంత్రాంగం లో సాంకేతికత, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు మొదలైన అనేక అంశాల్లో 1995 నుంచి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చూపిన సమర్ధతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపును తీసుకొస్తే, చంద్రబాబు ఆధునిక పరిపాలన విధానాలతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు. టైం మ్యాగజైన్ చంద్రబాబు నాయుడిని "సౌత్ ఏసియన్ ఆఫ్ ది ఇయర్" గా గుర్తిస్తే వరల్డ్ ఎకనామిక్ ఫొరమ్ తెలుగుదేశం ముఖ్యమంత్రి ని ప్రపంచ డ్రీమ్  క్యాబినెట్లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చేసింది. ఇండియా టుడే పత్రిక ఆయనను 'ఐటి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం' గా సత్కరిస్తే 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది.
    భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ప్రపంచ బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పించడం

    (వరల్డ్ ఎకనామిక్ ఫొరమ్ లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి
    ఆహ్వానం రావడం అనేది చంద్రబాబు నాయుదితోనే ప్రారంభమైంది.)
మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పునర్నిర్మాణ ప్రాజెక్టు పేరుతొ 1999 లో ప్రపంచ బ్యాంకు 540 మిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని రాష్ట్రానికి అందించింది. ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడానికి, పాలనా వ్యవస్థలో వృధా వ్యయాన్ని అరికట్టడానికి, ఆదాయ పెంపు మార్గాలను బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న చర్యలను ఆకర్షితమై ప్రపంచ బ్యాంకు ఈ నిధులను అందించడానికి సిద్దమైనది . అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు రుణ సహాయం చేస్తూ వస్తోంది. ఈ రుణంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆర్ధిక స్థితిగతులు, మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
    వరల్డ్ ఎకనామిక్ ఫొరమ్ లో పాల్గొనడానికి  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబు నాయుడితోనే ప్రారంభమైంది. అయన ముఖ్యమంత్రి గా 1996 నుంచి 2004 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు ఏటా స్విట్జర్లాండ్ లోని దాహాస్ లో జరిగే ఈ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యాపారఅవకాశాలను ప్రపంచానికి తెలియజెప్పడానికి, పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పనను పెంచడానికి ఈ పర్యటనలు తోడ్పడ్డాయి. విస్తృతంగా విదేశీ పర్యటనలు జరిపి, ఆంధ్రప్రదేశ్ లో కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
    ప్రపంచనేతలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని కలవడానికి ఆసక్తి చూపడం ఒక్క చంద్రబాబు విషయంలోనే జరిగింది. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి, బ్రిటన్ అధ్యక్షుడు టోని బ్లెయిర్ వరకు వివిధ దేశాల నాయకులు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తీసుకొచ్చిన మార్పులను ఆహ్వానించారు.


            

    విభజనతో అధోగతి పాలైన రాష్ట్రానికి సమర్ధుడైన నాయకుడి అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి 2014 లో పట్టం కట్టారు. పదవీభాద్యతలు చేపట్టిన ప్రభుత్వానికి అన్నీ గడ్డ్డు పరిస్థితులే . ఎటు చూసినా చిక్కుముడులే . ఆర్ధిక పరిస్థితి అనర్ధదాయకంగా ఉండటమే కాకుండా, పరిపాలన కొనసాగంచడానికి రాజధానితో పాటు కనీస వసతలు కోరవడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయినా ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు జంకలేదు. ముఖ్యమంత్రికే కార్యాలయం లేకపోయినా బస్సులోబస చేసి ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఉద్యోగులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి , వారందరూ రాష్ట్ర రాజధానికి తరలివచ్చేట్టు చేశారు. జీతాలు ఇవ్వడానికి వెతుక్కుంటున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసి కార్మికులకు 43 శాతం ఫిట్ మెంటును ప్రకటించి, రాష్ట్ర పునర్నిర్మాణం లో అందరూ కలిసి వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. ఉద్యోగులకు హైదరాబాద్ నగరంలో ఇచ్చే 30 శాతం ఇంటి అద్దె ఇవ్వడమే గాక, వారానికి అయిదు రోజుల పనిదినాలే ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు.
    హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ప్రభుత్వ వ్యవస్థకు అవసరమైన కార్యాలయాలను వాయువేగంతో నిర్మించింది. టిడిపి ప్రభుత్వం అమరావతిలో సచివాలయ కార్యకలాపాల తక్షణ నిర్వహణకు ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా అయిదు భవనాలు నిర్మించారు. పక్కనే శాసనసభ, శాసనమండలి  

    (జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని వివాదంలోకి దింపి
    పనులన్నిటిని అర్ధాంతరంగా నిలిపేసినా, ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థ
    ఇవాళ రాష్ట్రం నడిబొడ్డునుంచే నడుస్తున్నదంటే , చంద్రబాబు ప్రభుత్వం
    ఆనాడు నిర్మించిన భవన సముదాయాలే కారణం )
సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 45 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. సచివాలయ భవనాల పనులను 2016 ఫిబ్రవరి లో మొదలుపెట్టి 2016 నవంబరు కల్లా సిద్దం చేశారు. అమరావతి లో 2016 నవంబరు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పనిచేస్తోంది. ముఖ్యమంత్రితో సహా మొత్తం ఆరు వేల మందికి పైగా ఉన్నతాధికారులు , సచివాలయ ఉద్యోగులు అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
    శాసనసభ, శాసనమండలి కార్యకలాపాలు కోసం సచివాలయ ప్రాంగణం లోనే విడిగా భవనం నిర్మించారు. రెండు అంతస్తుల్లో 12 లక్షల చ.అడుగుల విస్తీర్ణం లో ఏసీ, అత్యాధునిక , సాంకేతిక సదుపాయాలతో నిర్మితమైంది. 2016 ఆగస్టులో నిర్మాణం  ప్రారంభం కాగా, అతి తక్కువ సమయములో 192 రోజుల్లో పూర్తీ చేశారు. 2017 సంవత్సరం బడ్జెట్ సమావేశాలతో మొదలు పెట్టి ఈనాటికీ, శాసనసభ, శాసన మండలి , సమావేశాలు ఇక్కడే కొనసాగుతున్నాయి. నిర్మాణం మొదలు పెట్టిన అయిదునెలలకే శాసనసభ కార్యకలాపాలు మొదలు కావడం బహుశా చాలా అరుదైన విషయం.

 

                             
    రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోసం జుడిషియల్ కాంప్లెక్స్ భవనాన్ని 8.4 ఎకరాల్లో 2.53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల్లో 17 నెలల కాలంలో చాలా వేగంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది. రాజస్థాన్ నుంచి తెచ్చిన శాండ్ స్టోన్ తో తాపడం చేసి సుందరంగా తీర్చిదిద్దిన జుడిషియల్ కాంప్లెక్స్ ను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ 2019 ఫిబ్రవరి 3 న ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమారావతిని వివాదంలోకి దింపి పనులన్నిటిని అర్ధాంతరంగా నిలిపేసినా, గవర్నర్ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి తో సహా ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థ ఇవాళ రాష్ట్రం నడిబొడ్డు నుంచే నడుస్తున్నదంటే , తక్షణావసరాల కోసమని చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు నిర్మించిన ఈ భవన సముదాయాలే కారణం. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో స్వరాష్ట్రానికి రావాల్సివచ్చినా, అతి కొద్ది కాలంలోనే పాలనాయంత్రాంగం గాడిలో పడటానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వ దక్షతే కారణం.




Related Novels


40 Years of TDP

Sri N T Rama Rao Prasangalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.