Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి


స్టెన్ గన్ లు సోల్జర్లు జెట్ విమానాలు రాకెట్ల సమూహాలు
ఒక్కొక్క యుద్ధంలో మనుష్యుల్ని చంపి నాగరికతను రక్షించే
అద్భుత చారిత్రక ఘట్టాలలోన
ఆస్తికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాల
మనుష్యుల్ని మరచి పరమ సత్యాలను తరచి పైకితీసే
ఆవేశపు మధ్యాహ్నపు ఎండలలోన
నాలుగురోడ్ల కూడలిలో నిలబడి
సౌఖ్యనగరానికి దారి తెలియక
సైన్ పోస్టు మీద మిధ్యాలిపి డిసైఫర్ చెయ్యలేక
జిగీషువుల జిజ్ఞాసవుల ముఖాలు వెలవెలబోతున్న సమయాన
అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో ఉరిపోసుకు చనిపోయాడు.

    *     *     *       
                ---1960

రాజమండ్రి పాటలు

వరదకన్న ముందు భయం పెనువరదలాగ వచ్చింది
భయం మీద రాజమండ్రి తెప్పలాగ తేలుతోంది
అంచులు మోసిన గోదావరి ఆకాశం కిందికి దిగినట్టు వుంది
ముచ్చటగా రైలు వంతెన ముత్యాల వడ్డాణంలా అమరింది
ఇంకొంచెం ప్రయాణం హెచ్చితే ఎక్కడుంది రాజమహేంద్రవరం
మానవుల గర్వం నగరాల సర్వం ప్రకృతియందు శ్రీకృష్ణార్పణం
ఊరంతా ఆదుర్దా ఊదారంగులో తిరుగుతోంది
గుడిసెల్ని చూస్తే పాపం మేడల కేమిటో నామర్దా
కన్నీరుకీ పన్నీరుకీ మున్నీరుకీ నీరు సమానం
అయితే గోదావరి ఏ నీరు - ఏడ్వనీరు, చావనీరు!

        2

అర్ధరాత్రివేళ
వానలో చలిగాలిలో
అంత పెద్ద నగరమూ వణికిపోతోంది
మధ్య మధ్య
మసక మసక విద్యుద్దీపాలు
వృద్ధ నగరమాత చత్వారపు నేత్రాలు
వానలో చలిగాలిలో
నిద్రలో నిశ్శబ్దంలో




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.