Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

  

    మిగతా అందరూ తెల్లబోయి చూస్తుండగా, లీలా సుందరి వారందరి వద్దా వీడ్కోలు తీసుకుని _ సుదర్శనతో కలసి వెళ్ళిపోయింది. "నిజంగానే కుర్రాడిది మంచి చొరవ _ " అని నిట్టూర్చారు కొందరు పెద్దలు.

    "సుదర్శనంగాడు గొప్ప ఛాన్స్ కొట్టాడు _" అనుకుని లోలోన బాధ, అసూయలతో బాధపడ్డారు. కొందరు యువకులు.

    కొద్ది క్షణాల్లోనే ఆ ప్రాతం ఖాళీ అయింది.

                                                                            21
 
    మర్నాడు మధ్యాహానానికి ఓ ట్రక్కులో యాభైమంది మెరికల్లాంటి యువకులు దిగారా ఊళ్ళో. వాళ్లెవరో ఊరి వాళ్ళకు మొదట్లో తెలియలేదు. కానీ లీలాసుందరి రెండ్రోజుల్లో చేయబోయే గ్రూపు డాన్సుకోసం వాళ్ళోచ్చినట్లు తర్వాత తెలిసింది.

    'సినిమా డ్వాన్సులు ప్రత్యక్షంగా చూసే అదృష్టం మనూరికీ కలిగిందన్న మాట _" అనుకుని కొందరు సంతోషించారు.            

    "డాన్సేం కర్మ _ సినిమా యాక్టర్ని చూసినట్లే ఉంది, లీలాసుందర్ని చూస్తే _" అనుకున్నాడు గవరయ్య,నిన్న రాత్రి చూసిన నాట్యం అతడి శరీరాన్ని వేడెక్కించింది. తండ్రి కూడా అక్కడే ఉండడం వల్ల, రంగస్థలం మీదకు వెళ్ళి స్వయంగా  లీలాసుందరి సభినందించాలన్న అతడి కోరిక నెరవేరలేదు. స్టేజి మీద ఆ సమయంలో తండ్రి ఉన్నందుకతడికిమహా మంటగా ఉంది.

    "అరవయ్యేళ్ళున్నాయి. బుద్ధుండోద్దూ - కురాల్ల కంటె అన్యాయంగా పడిచస్తున్నాడు. ఆడదంటే _" అని మనసులో విసుక్కున్నాడు గరవయ్య.

    "దానికి మాత్రం బుద్ధుండోద్దూ? ఊళ్ళో నాలాంటి కుర్రాళ్ళు౦డగా మా నాన్ననే ముందేన్నుకుంది?" అంటూ అతడు లీలాసుమ్దరి మీదా చిరాకు పడ్డాడు. మళ్ళీ అంతలోనే _ "అయినా దానికి ముసలేంటీ , పడుచేంటీ .... దాని క్కావలసింది డబ్బు ..... ముసిలాడయితేనే దానికి లాభం కూడాను. ఒళ్ళరాకుండా డబ్బు సంపాదించవచ్చు.... అనుకున్నాడు,

    గరవయ్య మనసు పరిపరి విధాల పోతోంది.

    "అయినా అది నన్ను చూసు౦టు౦ది. నామీద దానికి మనసయీ ఉంటుంది. మా నాన్న వంకపేట్టి నాతో కులుకుడా మానుకుంటో౦దేమో __ తెలివయినదే ?" అని ఆశపడ్డాడతడు మళ్ళీ. కానీ అంతలోనే _ "అయినా నేను చలమయ్య కొడుకునని దానికేలా తెలుస్తుందీ ?' అనుకుని నిరుస్తఃపడ్డాడు.

    "ఏమయినా వచ్చేది మా యింటికే కదా! ఏదో ఛాన్సు దొరక్కపోదు. ఈ రాత్రిళ్ళు వదలకూడదు......

    ఇలా రకరకాలుగా, పలువిధాలుగా లీలాసుందరి గురించి మనసులో పరితపిస్తున్న గరవయ్య ఆలోచనకు రాజారావు పలకరింపు పుల్ స్టాఫ్ పేట్టింది.

    "ఏమిటి గరవయ్యా? ఒక్కడివీ దుకాణం దగ్గర కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నావేమితీ విశేషం ...?" అన్నాడు రాజారావు.

    గరవయ్యకు వెంటనే తన ఆలోచనలు స్పురించి, రాజారావుకి చెప్పడానికి సిగ్గుపడి మొహమాటంగా నవ్వి ఊరుకున్నాడు.

    అతడి సమాధానం కోసం ఎదురుచూడకుండా __ "అరకేజీ సగ్గుబియ్యం, వందగ్రాముల కిస్ మిస్, పదిహేను గ్రాముల ఏలకులు ...." అంటూ రాజారావు శుశాకారికి తన లిస్టు చెప్పేశాడు. "ఈ లిస్టు చెప్పేశాడు.

    "ఈ వేళేమీ పండక్కాదే .... మీ ఇంట్లో విందు భోజన మేవరికీ?" అన్నాడు గరవయ్య, మాట మార్చడానికి అవకాశం దొరకి.

    "లీలాసుందరికి....."

    గరవయ్యతో పాటు షాహుకారు కూడా కుతూహలంగా రాజారావు వంక చూశాడు __ "మరి పగలయితే _ ఆవిడ గారేక్కడికి రాలేనంది?" అన్నాడు గరవయ్య ఉండబట్టలేక.

    "అది అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి, ఉంటుంది. మిగతా వాళ్ళు _ అవిడికి రాత్రి అవసరమయితే నేను పగలవసరమయ్యాను. ఏమయినా పగటి పనులూ, రాత్రిపనులూ వేరు గదా ....." అన్నాడు రాజారావు.

    "అవున్లెండి __" అన్నాడు గరవయ్య మొహమాటపడుతూ.

    "పోనీ _ నువ్వూ విందు భోజనానికి రాకూడదూ __ నాకో మగతోడూ ఉంటుంది,నీకు లాలసుందరి పరికాహయమూ అవుతుంది ....." అన్నాడు రాజారావు.

    గరవయ్య ముందు తెల్లబోయాడు. రాజారావు వేళాకొళమాడుతున్నాడా అని తర్వాత అనుమానించాడు. అయితే అతడికి వెళ్ళాలనే ఉంది. మొహమాటం ఆ ముక్క చెప్పాదానికి అడ్డొచ్చింది. అయితే రాజారావు పట్టు పట్టి అతడ్ని ఒప్పించాడు.

    ఒక్కసారిగా గరవయ్యకు రాజరావుపై ఎనలేని గౌరవభావం కలిగింది.

    షాహుకారు సరుకులు కట్టిచ్చాడు. రాజారావు డబ్బిచ్చేశాడు. " ఇంటికే కదా __ వచ్చేస్తావా?" అనడిగాడు రాజారావు . గరవయ్య దుకాణంలోంచి లేచాడు. ఇద్దరూ ఇంటిదారిపట్టారు.

    "ఈ ఒక్కపూటకీ చేపల కూరా, రొయ్యల పులుసూ ఉండవు. తాగడానికి కూడా మంచినీళ్ళతోనే సరిపెట్టుకోవాలి మరి ...." అన్నాడు రాజారావు గరవయ్యను కవ్వించదానికా అన్నట్టు.

    "ఎవరయినా భోజనాల దగ్గర మంచినీళ్ళేతాగుతారు. భోజనమంటారా _ రోజూ మేమూ మాంసంతినం....." అన్నాడు గరవయ్య ఉక్రోషంగా.

    "ఏమో __ మీ గురువుగారి గురించి అంతా అలా చెప్పుకుంటార్లే __''

    "మా గురువుగా రెవరు?"

    "అయ్యో _ నీ గురువేవరో నీకే తెలియదూ? భలేబావమరదినే దొరికావు నాకు. నీ గురువు సుదర్శనానికి మంచి నీళ్ళ రుచి తెలియని ఊరందరికీ తెలుసు."

    గరవయ్యకు రాజారావు విసురు అర్ధమయినా _-"మంచి నీళ్ళకు , రంగు, రుచి, వాసన ఉండదని మాకు పాఠం చెప్పారు ...." అన్నాడు.

    "పాఠం చెప్పిన గురువు సుదర్శనమే కదా!" అన్నాడు రాజారావు.
గరవయ్య గరవయ్య మాట్లాడలేదు.

    రాజారావు కతడు నొచ్చుకున్నట్లు అర్ధమయింది. సంబాషణ మార్చాలని _ "అన్నట్లు లీలాసుందరి నిన్న నీ గురవింటికేవెళ్ళింది. అప్పుడు నువ్వు లేవా _ అక్కడ?" అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra