"ఒకేసారి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తే తట్టుకోలేరు. ముందుగా మీ బ్రెయిన్ ని ప్రిపేర్ చేద్దామని."
"నా బ్రెయిన్ అంత వీక్ కాదులే ఎలాంటి విఘాతాలనైనా తట్టుకుంటుంది."
"అలాగా? సరే" అంటూ అవతల్నుంచి ఫోన్ పెట్టేశాడు.
"ఎవరు?" అనడిగింది భ్రమరాంబ అతని మొహంలోని ఆందోళన గమనించి.
"ఎవరో తారాచంద్రట. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు" అన్నాడాయన.
* * *
విశారదకు ఎంతకూ నిద్ర పట్టలేదు. రాజాచంద్ర బయటకు వెళ్ళి గంటన్నర దాటిపోయింది. ఎక్కడకు వెళ్ళాడో తెలీదు. అసలలాంటి సమయాల్లో అతనికి బయటకు వెళ్ళే అలవాటు లేదు. ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాల్లో ఇది కూడా ఒకటి.
ఇహ భరించలేక స్లీపింగ్ టాబ్లెటేమయినా వేసుకుందామని వాడ్రోబంతా వెదికింది. ఎక్కడా కనబడలేదు.
బీరువా తెరిచి అందులో ఏమయినా కనిపిస్తాయేమోనని చూసింది.
బట్టల అడుగునుంచి ఫోటోలేవో కిందపడ్డాయి. ఒంగి తీస్తూ యధాలాపంగా వాటివైపు చూసి ఉలికిపడింది."
"ఏమిటిది?"
రెండు ఫోటోలు ఒక స్త్రీ అచ్చం తన మాదిరే ఉంది తన వయసే ఉంటుంది. కళ్ళూ, ముఖకవళికలూ ముమ్మూర్తులా తననే పోలి ఉన్నాయి.
రెండో దాంట్లో ఆమెనానుకుని రాజాచంద్ర నిలబడి ఉన్నాడు.
విశారద కాళ్ళకింద నేల కదలినట్లయింది.
తల తిరిగినట్లయింది. అతి ప్రయత్నంమీద నిలదొక్కుకుని, తూలుకుంటూ మంచంమీద వాలిపోయింది.
14
ధర్మేంద్ర డ్రైవ్ చేస్తున్న కారు ట్రాఫిక్ ను ఛేదించుకుంటూ సుతిమెత్తగా సాగిపోతుంది. పక్కన వినూత్న కూర్చుని ఉంది.
"ధర్మేన్! నాకు మనసేం బాగా లేదు. ఎక్కడికైనా చాలాదూరం తీసుకెళ్ళి అల అలా తిప్పెయ్."
"ఏం జరిగింది?"
"మా మదర్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నామీద ఆంక్షలు విధించటానికి ప్రయత్నిస్తోంది."
"ఎందుకని?"
"అదే తెలియటంల్లేదు."
ధర్మేంద్ర మౌనంగా ఊరుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు.
"ధర్మేన్ నేను నీతో తిరగటం మా మదర్ కిష్టం లేదు" అంది వినూత్న కొంచమాగి.
"పోనీ నాతో స్నేహం మానెయ్ వినూత్నా!"
"ధర్మేన్! దయచేసి జోక్ చెయ్యకు. ఈ ప్రపంచంలో ఎవరికైనా దూరమవుతాను గాని, నిన్ను మాత్రం దూరం చేసుకోలేను."
వినూత్న కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
* * *
కారు ఊరి శివార్లలోకి వచ్చి కొంతదూరం సాగి ఓ గ్రేప్ గార్డెన్ ముందాగింది.
వాచ్ మేన్ వచ్చి తలుపు తీశాడు.
కారు లోపలకు ప్రవేశించి గెస్ట్ హౌస్ ముందు నిలబడింది.
ధర్మేంద్ర కారు దిగాడు.
వినూత్న కూడా దిగి అతన్ననుసరించింది.
గెస్ట్ హౌస్ డోర్ తెరిచి లోపలకు తీసుకెళ్ళాడు.
"బ్యూటీఫుల్" అంది వినూత్న సినిమా సెట్టింగులా ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ చూసి.
ధర్మేంద్ర ఫ్రిజ్ తీసి సోడాలూ, ఐస్ బయట పెట్టి తరువాత విస్కీ బాటిలూ, గ్లాసులూ టీపాయ్ మీద అమర్చాడు.
"వినూత్నా!"
"ఊఁ."
"ఉడ్ యూ మైండ్ టు టేక్ లిటిల్ డ్రింక్?"
వినూత్న నవ్వింది. "లెట్ మి టేస్టిట్ టుడే."
విస్కీ గ్లాసుల్లో పోసి సోడా కలిపాడు. ఐస్ క్యూబ్స్ వేశాడు.
"ఛీర్స్."
గొంతు భగ్గుమంది గుండె గొల్లుమంది.
సెకండ్ పెగ్ నరాలు ఘాటుగా మండుతున్నాయి. చెంపల్లోకి కళ్ళలోకి వెచ్చటి ఆవిరి.
పైట పక్కకి జారి చిన్నారి యౌవనాలు అమాయకంగా కవ్విస్తున్నాయి.
ధర్మేంద్ర కళ్ళలో ఎర్రటి జీరలు. ఈ సృష్టిని పిప్పి పిప్పి చెయ్యాలి. తాననుభవించి, ఆస్వాదించని అందమంటూ పృథ్విలో ఉండకూడదు.
తాను మొగసిరిగల మొగాడు.
ఈ కన్నెపిల్లలు తనకోసం ఆరాటపడే కలువభామలు.
గ్లాసుకింద పెడుతూ ఆమె వంక చూశాడు.
ఫెంటాస్టిక్!
అందాలలో ఎన్ని వైవిధ్యాలు!
తనివితారా, అవకాశమున్నంతవరకూ జుర్రుకోవాలి.
"వినూత్నా!"
"ఊఁ"
"ఆర్ యూ ఆల్ రైట్."


