Home » Kommuri venugopala rao » భారతి

    "భారతీ! అంతిమ విజయం  నీదేనని  సంబరపడకు. గోవిందరావును  ఒకసారి  ఓడించటం  కొరివితో  తల  గోక్కోవటమే  అవుతుంది" అని అక్కడ వుండి ఇంకా అవమానం  పెంచుకోవటం  ఇష్టంలేక  గబుక్కున వెనుదిరిగాడు. నిమిషం ముందు గడియ వేసిన  చేత్తోనే  గడియ తీసి, తొందర తొందరగా  చీకట్లోకి  నడిచాడు.

    భారతి  చప్పున  పరిగెత్తి  తలుపులు  గడియ పెట్టింది. ఆపిల్ పండు  కోసుకునేందుకు  అందుబాటులో వుంచుకున్న  చాకు  తనకెంత మేలు చేసింది! నిజంగా అతన్ని హత్య  చేస్తానని  బెదిరించింది తనేనా!

    హృదయంమీద  చెయ్యి వేసుకుని  అదురుతూన్న  గుండెని  గట్టిగా  అదుముకుంటూ, ఆ తలుపుల  కానుకుని  నిలబడిపోయింది  భారతి. ఆమె నుండి  ఓ నిట్టూర్పు వెలువడింది.


                                 *    *    *


    భారతి  ఇంటి నుండి  బయటకు  వచ్చి ఆ చీకట్లో  ఎత్తుగా  పెరిగి, దెయ్యాలలా  నిలబడి వున్న  చెట్ల క్రిందగా  వడివడిగా  నడుస్తూన్న  డాక్టరు  గోవిందరావు....మరు నిమిషంలో  తనని తాను తిట్టుకోవటం  ప్రారంభించాడు. ఛీ, ఛీ! తను  ఎంత పిరికితనంగా  ప్రవర్తించాడు? అనుభవశాలి, ఎన్నో సందర్భాలలో ఎందరో హేమా హేమీల్ని గడగడలాడించిన  మహామేధావి. ఒక సుకుమార స్త్రీ చిన్న కత్తి చూపించి, బెదిరించేసరికి  పులిలాంటివాడు పిల్లిలా  మారిపోయాడు. ఛీ ఛీ! ఎంత అవమానం! అతని  ఆవేశం, అతని అహంకారం, అతని కాంక్ష__నాలికలు జాచుకుని  సెగలతో  బయటకు బుసలుకొడుతున్నాయి. రేప్రొద్దున్న  ఈ విషయం  అందరికీ తెలిసిపోతుంది. భారతికి తనమీద కక్ష సాధించటానికి ఇదే  సమయం విజయగర్వంతో  ఈ విషయం బహిరంగ పరుస్తుంది. తను ఆమెకు  లొంగినట్లయిపోయాడు.

    వెనక్కి  తిరిగివెళ్ళి ఆమె కుటీరంలో  ప్రవేశించి  ఎలాగైనా  బలాత్కారం  చేద్దామా  అనుకున్నాడు. ధైర్యం చాలలేదు. భారతి గుర్తువస్తూంటే అతని వ్యామోహం  వెయ్యింతలై  వ్యాపిస్తూంది. వికారంతో  దహించుకుపోతున్నాడు.

    కాలికేదో  మెత్తగా  తగిలినట్లయి  త్రుళ్ళిపడి, "ఎవరిది?" అన్నాడు చలించే కంఠంతో.

    ఆ చీకట్లో  ఎక్కడ ఏముందో గుర్తుపట్టటం  కష్టంగా  వుంది. "నేను బాబూ! లక్ష్మిని!" అన్న జవాబు  వినిపించింది ఎదుటి నుంచి.

    కళ్ళు  తీక్షణంగా  చేసి  చూశాడు. తన కాలు తగలగానే  ఆమె లేచి నిలుచున్నట్లుంది. తన భుజాలదాకా  వచ్చిన ఆమె ఆకారం  కొద్దికొద్దిగా  తెలుస్తూంది.

    "ఇంత రాత్రివేళ  దారికడ్డంగా  కూర్చుని  ఏం చేస్తున్నావు?" అనడిగాడు కోపంగా.

    "నేను దారికడ్డంగా  కూర్చోలేదు బాబూ. చెట్టుక్రింద  వున్నాను. మీరే దారితప్పి వచ్చారు."

    అతనో నిమిషం  జవాబుకోసం  తడుముకుని  "అసలిప్పుడు  ఇక్కడేం చేస్తున్నావు చెప్పు?" అన్నాడు కర్కశంగా.

    లక్ష్మి నవ్వినట్లయింది. పైన  చెట్ల ఆకులు  గలగల లాడాయి. "నిద్ర పట్టకపోతే  ఇలా  ఎక్కడైనా  కూర్చుని  కాలం  గడపటం  నా కలవాటు బాబూ!"

    డాక్టరు ప్రసన్నుడయ్యాడు, ఆమె అతనికెంత  దగ్గరగా  నిలబడి వున్నదంటే__అతను చేతులు  రెండూ ముందుకు జాచినట్లయితే, వాటి మధ్య  తను సులభంగా  ఇమిడిపోతుంది.

    అంతలో  హఠాత్తుగా  అతనికి  ఆమె చేరువలో  ఉన్నట్లు స్పురించి, చాలించాడు. ఎటు చూసినా  గాఢ తిమిరం, కుతకుతలాడే  మనస్సు, ఆయాచితంగా  లభించిన ఒంటరితనం.

    క్షణంలో  నిర్ణయానికి వచ్చాడు.

    ఆమె భుజాలచుట్టూ  చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ  "లక్ష్మీ!" అన్నాడు కంపిత స్వరంతో.

    ఎదురుచూడని  ఈ సంఘటనకు  నిర్ఘాంతపోయి, వెనువెంటనే తేరుకుంటూ  "ఛీ, వదలండి బాబూ! నన్ను చూస్తే అసహ్యం వేయడం లేదూ?" అంది.

    ఆయన కా సమయంలో  లక్ష్మి అనే పిల్ల  ఆ వాతావరణంలోకి  ఎందుకు వచ్చిందో తెలుసుకునే యుక్తాయుక్త జ్ఞానం  నశించింది. అందమైనది, బలమైనది, అసూయపడే వయసు....అంతవరకే  ఆలోచించ గలుగుతున్నాడు.

    "ఎందుకూ అసహ్యం? నీకేం తక్కువ?" అంటూ మరింత  ఆవేశంతో  దగ్గరకు  లాగేసుకుంటున్నాడు.

    లక్ష్మి  ఓపికపట్టి  అతని చేతుల నుండి  విడిపించుకునేందుకు  ప్రయత్నిస్తూ "అదేమిటి బాబూ, నేను కుష్ఠు రోగినని  మరిచిపోయారా? నన్ను పరీక్ష చేయటానికీ, నా దగ్గిర  నిలబడటానికీ  కూడా చీదరించుకునేవారు. ఒక్కసారిగా  ఇలా మారిపోయా రెందుచేత?" అంది.

    తన నుంచి  విడిపించుకునేందుకు  ఆమె చేసే ప్రయత్నాన్ని  విఫలం చేయటానికి  అతను ప్రయత్నించటంలో  వగర్పు కూడా వస్తూంది. ఆమె భుజాలు మరింత గట్టిగా  పట్టుకుని "ఆఁ సింగినాదం. నాకిప్పుడేమీ  గుర్తుచేయకు. నీకు మాత్రం  ఇది మంచి అవకాశం  కాదా ఏమిటి? ఉండు. అలా పెనుగులాడకు" అంటూ తనవైపు పొదుపుకుంటూ, ఆమె ముఖంలో ముఖం  వుంచటానికి  ప్రయత్నిస్తున్నాడు.

    అతని ఒంట్లోంచి  ఆవిరి, మాట తడబడుతూంది. అక్కడే__ఆ నేలమీదే  ఆమెను  క్రింద పడవేయటానికి సిద్ధపడుతున్నాడు.

    లక్ష్మి స్తంభీభూతురాలు  కాలేదు. శక్తినంతా  ఉపయోగించి, ఎక్కడలేని బలమూ తెచ్చుకుని, అతన్నో తోపు తోసింది.

    డాక్టరు ఆ చీకట్లో  వెనక్కి వాలి  తూలి, నేలమీద  పడిపోయి నడుం విరిగినట్లయి, "అబ్బా!" అన్నాడు బాధగా.

    "దుర్మార్గుడా!" లక్ష్మి గొంతు  కటువుగా  వినిపించింది. "ఒక్క కేక  వేశానంటే  నలుగురూ  పరుగెత్తుకు వచ్చి నిన్ను పచ్చడి చేస్తారు., ఉద్యోగరీత్యాగాని, తప్పనిసరై కాని  కొన్నాళ్ళు  ట్రీట్ మెంట్ ఇచ్చావు. ఆ కనికరంతో  వదిలిపెడుతున్నాను. ఒళ్ళు  జాగ్రత్తగా  పెట్టుకుని  మసులుకో.

    ఆమె అక్కడి నుంచి చరచరమని నడిచి వెళ్ళిపోయింది.

    డాక్టరు క్రింద పడినపుడు  నడుం విరగటమే కాదు. చేతిని ఊత కోసం  నేలమీద బలంగా  ఆనించటంలో  ఏ తుప్పుపట్టిన  మేకో  కసుక్కున  గ్రుచ్చుకుంది. దాని బాధ తరువాత  తెలిసి, బలవంతంగా రెండోచేత్తో ఊడబెరికేశాడు. చేతికి తడిగా  తగిలింది, రక్తం కారుతున్నట్లుంది.

    'దొంగ రాస్కెల్. నన్నింత  దెబ్బతీస్తుందా? ఒక్కరోజు ఇన్ని  పరాభవాలా? వీళ్ళిద్దర్నీ  అంతు తేల్చిపారేస్తాను. ఈ గోవిందరావంటే  ఏమనుకుంటున్నారో?' అని తిట్టుకుంటూ కష్టంమీద లేచి  నిలుచున్నాడు. నడుంపోటు, చెయ్యి సలుపు....ఆ చీకట్లో  కదల్లేక కదులుతూ  పది నిమిషాల తరువాత  ఎలాగో ఇంటికి వచ్చి  పడ్డాడు.

    లైటు  వెలిగించి, చేతికి ఉన్న  గాయం  చూసుకున్నాను. మేకు బాగా లోతుగానే  దిగబడి ఉండాలి. రక్తం బాగా కారుతూంది. వాష్ బేసిన్ దగ్గరకు  వెళ్ళి ముందు చెయ్యి కడుక్కుని  వచ్చి, తరువాత అల్మైరా తెరిచి  డ్రెస్సింగ్ సామానులు  తీసుకుని  ప్రయాసమీద  గాయానికి  కట్టు కట్టుకున్నాడు.

    సెప్టిక్ అవుతుందేమో! ధనుర్వాతం  వస్తుందేమో! ఆ భయంతో వణికి పోయాడు. ఒక పెన్సిలిన్ ఇంజక్షన్ పొడుచుకున్నాడు. రెండో దానికి  పనికివచ్చే  ఇంజక్షన్ తన దగ్గరలేదు. ఆ ఆసుపత్రిలోనే లేదు.

    పగతో, కోపంతో, భయంతో  మంచంమీద  చేరి  ఆలోచనలతో  మండుతూ  నిద్రపోవటానికి  ప్రయత్నించాడు.

    అట్లా  మురికి, మసిలి ఏ తెల్లవారుఝాముకో  కన్ను  మూశాడు.

    అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి ప్రొద్దు ఎక్కింది. పనివాడు వచ్చి వసారాలో  నిలబడి "అయ్యా! అయ్యా!" అని పిలుస్తున్నాడు.

    మంచంమీద నుంచి  లేవబోయాడు. ఒళ్ళంతా  పచ్చి  పుండులా  ఉంది. సలసల  కాగుతూన్నట్లనిపించింది. కణతలు  బ్రద్దలై పోతున్నాయి. అతి కష్టం మీద  లేచి  తలుపు  తీసి వచ్చి  మళ్ళీ  పడుకున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra