Home » Mainanpati bhaskar » Claimax

తనకు తగిన శాస్తి చేస్తోంది ప్రియంవద. ఇది ఎవరి తప్పూ కాదు- కేవలం తన స్వయంకృతాపరాధమే ఇది!
ఉన్నట్లుండి పెద్ద రొదతో గాలివీచింది. నారాయణమూర్తి గాలి దెయ్యమై వచ్చి తనని చూసి విరగబడి నవ్వుతున్నట్లు భ్రాంతి కలిగింది విశ్వనాధానికి. "నా ఆస్తి కాజేసినందుకు నీకు తగినశాస్తి జరిగిందిలే! నా అస్త్తిని నివ్వేలా అనుభావిస్తావ్? నువ్వు అనుభవించవలసినది వేరే ఉంది. అది ప్రత్యక్షనరకం. అదీ ఇక్కడే. ఈ లోకంలోనే! నీ వాళ్ళచేతుల్లోనే నరకం అనుభావిస్తావ్ నువ్వు! ఆహ్హహ్హహ్హ!"
వళ్ళంతా చెమటలు పట్టాయి విశ్వనాధానికి.
ఇంతలో మళ్ళీ వినబడ్డాయి మాటలు.
ఇదీ తన భ్రమేనా లేక నిజమా!
"లేగండి బాబూ.......లేగండి! ఈడ నుంచి బేగివెళ్ళి యాడన్నాబోయి పానాలు కాపాడుకోండి బాబూ! లేగండి!"
నీరసంగా కళ్ళు తెరిచి చూశాడు విశ్వనాధం. తనమీదకి ఒంగి చూస్తున్నాడు తోటమాలి.
"అమ్మగారు వకీలుగారిని తీసుకురావడానికి వెళ్ళారు బాబూ! వకీలు చెప్పినట్లు మీరు రాయకపోతే ఏకీలుకాకీలు ఇరిచెత్తారు. తొరగా లేగండి బాబూ"
కలలోలా లేచి నిలబడ్డాడు విశ్వనాధం. వళ్ళంతా చెమటలు పట్టేశాయి అతనికి.
చావంటే భయంలేదు విశ్వనాధానికి ఇప్పుడు. నిజం చెప్పాలంటే తక్షణం చనిపోవాలని వుంది అతనికి. తనని తనే చంపెసుకోవాలని వుంది.
కానీ -
చనిపోయేముందు ఓ పని చెయ్యాలి తను ......చేసి తీరాలి.
ఆ ఆలోచన రాగానే, ఎక్కడి శక్తి తెచ్చుకుని తోటమాలి సాయంతో గేటుదాకా నడిచాడు విశ్వనాధం.
గేటుకి బొదురుకప్పంత తాళం వెళ్ళాడుతోంది!

                                                 * * *
"నేను చెప్పిన కధ అంతగా నచ్చినట్లు లేదు నీకు" అన్నాడు రైటరు వనమాలీ హరీన్ తో. అతను వయసులో చాలా పెద్దవాడు. హరీన్ ని అతను ఒక్కోసారి "నువ్వు' అంటాడు. ఒక్కోసారి 'మీరు' అంటాడు.
చిన్నగా నవ్వి అన్నాడు హరీన్ - "రొటీన్ ట్రాక్ అయిపోవడం లేదూ?"
"అయితే అది వదిలేద్దాం! మరో కధ చెబుతాను" అని మరో బాక్సాఫీసు మసాలా కధ చెప్పడం మొదలెట్టాడు వనమాలీ. "ఇద్దరూ కవల పిల్లలుంటారు. చిన్నతనంలో తప్పిపోతారు. ఒకతను పోలీసాఫీసర్ అవుతాడు. రెండోవాడు పెద్ద రౌడీ అవుతాడు."
"ఈ పాయింటు కూడా ఎన్నో పిక్చర్స్ లో వచ్చేసిందే కదా!"
"పోనీ ఇలా పెట్టుకోవచ్చు - ఒక హీరో, అతన్ని ఇద్దరూ అమ్మాయిలు ప్రేమిస్తారు. ఒకమ్మాయి లాయరు, ఒకమ్మాయి డాక్టరు."
"వద్దొద్దు"
"అలా వద్దనుకుంటే వెరైటీకోసం ముగ్గురమ్మాయిలని పెడదాం. అంటే ముగ్గురు హీరోయిన్లన్నమాట! స్క్రీన్ కలకళ్ళాడిపోతుంది. ఒక బీదింటి పిల్లా, ఒక గొప్పింటి పిల్లా, ఒక మధ్యతరగతి అమ్మాయీ..."
అవలించాడు హరీన్.
"ఇదీ నచ్చలేదా? అయితే ఇప్పుడు చెప్పబోయేదానికి తిరుగు వుండదు" అని సిగరెట్ అంటించి లేచి నిలబడ్డాడు వనమాలీ.
అద్భుతమైన హావభావాలతో అభినయిస్తూ వినేవాళ్ళు సమ్మోహితులయ్యెంత లెవెల్లో చెప్పడం మొదలెట్టాడు.
"టీనేజ్ లవ్ స్టోరీ ఇది! ఆ అబ్బాయిది ఓ పల్లె. ఆ అమ్మాయిది ఓ పొరుగు పల్లె.
"ఆ రెండు కుటుంబాల మధ్యా పచ్చగడ్డివేస్తె భగ్గుమనేంత తరతరాల వైరం. కానీ ఆ అబ్బాయీ, ఆమ్మాయి, గాడమైన ప్రేమలో పడిపోతారు."
"వనమాలీగారూ!"
"విను...దీనిలో మెయిన్ కేరెక్టర్ ఒక బిచ్చగాడన్నమాట! ఆ బిచ్చగాడు ఈ ఉళ్ళో అన్నం అడుక్కుంటాడు. పొరుగు పల్లెకు పోయి కూరానారా అడుక్కుంటాడు. రెండు పల్లెల సరిహద్దులో కూర్చుని ఆ ఉరి అన్నం ఈఊరి కూరా కలుపుకుని తింటాడన్నమాట. గొప్ప సింబాలిజమ్! ఇక్కడ నాలుగు మాంచి మాంటేజ్ షాట్స్ వేస్తె ..........అడియన్సులో నుంచి చప్పట్లు......ఈలలు......"
అసహనంగా అన్నాడు హరీన్ "రొటీన్ సెంటిమెంటల్ సాబ్ స్టాఫ్ వనమాలిగారు! మీకు ఇలాంటి కధలు తప్ప కొత్తవి తట్టకపోవడం నాకు ఆశ్చర్యంగా వుంది. సరికొత్త కధ కావాలి నాకు. నవ్యత కావాలి!"
జాలిగా నవ్వాడు వనమాలీ.
"హారీన్! అసలు మనకి బేసిక్ గా ఉన్నవే ఓ అరడజను కధలు. అవే మనకి భగవద్గీత! అవే మనకు బైబిల్! వాటినే మనం అటూ తిప్పి, ఇటు తిప్పి ప్రేక్షకుల మీదికి వదులుతుంటాం. కొత్తవాటిని భరించలేరు ప్రేక్షకులు - తిప్పికొడతారు"
అసమ్మతి సూచకంగా , తల అడ్డంగా ఆడించాడు హరీన్.
"అని భ్రమపడుతున్నాం మనం. కొత్తదన్నాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు ప్రేక్షకులు. కొత్తదనం కోసం తహతహలాడతారు కూడా! మనం స్టాక్ కేరెక్టర్స్ ని పెట్టి, పాత చింతకాయ పచ్చడిలాంటి కధలతో సన్నివేశాలతో సినిమాలు తియ్యడం వల్లనే జనం తిప్పికొడుతున్నారు. "జనం ఫలానాది తప్ప చూడరు' అని వాళ్ళ తరపున మనమే ఒక నిర్ణయానికొచ్చేయ్యడం వల్లనే వస్తున్నాయి ఈ తంటాలన్నీ!
"వనమాలీగారూ! ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత చక్కటి కధలు వుండేవి! ఎంత ఉదాత్తంగా వుండేవి మన సినిమాలు.
"ఇప్పుడందరూ ఎంతో గొప్పగా చప్పుకుంటున్న తమిళ చిత్రాలలో, కేవలం ఒవరాక్షనూ, మైళ్ళపొడుగు ఉండే డైలాగులూ, అరుపులూ కేకలూ తప్ప ఏమీలేని రోజుల్లో మనం ఎంతో నిగ్రహంతో కూడిన ఉత్తమ చిత్రాలు నిర్మించాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు పరిస్థితి తారుమారయిపోయింది. మళ్ళీ అలాంటి బంగారురోజులు రావాలని నాకోరిక!
"వనమాలీగారూ......ఎన్నెన్నో మంచి చిత్రాలకు కధలు సమకూర్చారు మీరు - ఎంతో సందేశాత్మకంగా, ఎంతో ప్రయోజనాత్మకంగా వుండేవి అవి. వాటిలో వినోదం కూడా సమపాళ్ళలో వుండేది. సినిమాల్లోకి రాకముందు మీరు రాసిన నాటకాలు ఎంత అద్భుతంగా ఉండేవి! ఆ నాటకాలు వేసే నేను పరిషత్తులలో ఫ్రైజులు కొట్టేవాడిని. మీరు రాసిన నాటకాలే నా నటనాజీవితానికి పునాది రాళ్ళయ్యాయి.
"అలాంటి గొప్పరచయిత అయిన మీరు ఇప్పుడెందుకు ఇలా మారిపోయారు వనమాలిగారూ! విప్లవభావాలతో నిప్పులు కక్కిన మీ కులం, మృదుమధుర భావాలతో వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మయిల్లాంటి అక్షరాలను సృష్టించిన మీకులం........ఇవాళ బాక్సాఫీసు ఫార్ములాకి బందీ అయిపోయిందేమీ?
"అయినా ఇంకా ఏమీ మించిపోలేదు వనమాలిగారూ! మీమీద నాకు చాలా నమ్మకం వుంది. ఈ ట్రెండ్ ని మర్చిపారేసే మంచి కధ అంటూ వస్తే అది మీ కలంలోనుంచే వస్తుంది............రావాలి! తీవ్రంగా ఆలోచించండి!" అన్నాడు ప్రాదేయపుర్వకంగా.
విని, చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు వనమాలి. తర్వాత మరో సిగరెట్ అంటించి, గుప్పున పోగవదిలి- సాలోచనగా అన్నాడు-
"నువ్వన్నది నిజమే హరీన్! కమర్షియల్ సినిమా అందరితోబాటు నన్నూ మార్చేసింది. చాలామందిలాగా నేను కూడ ప్రవాహానికి, ఎదురీదలేక, రాజీపడిపోయి మారిపోయాను. కానీ మనసులో మధన మాత్రం అలాగే మిగిలి వుంది హరీన్ - అలాగే మిగిలి వుంది!
"నేను కమర్షియల్ గా మారిపోకముందు రాసిన కధ ఒకటి ఉంది హరీన్! నిజానికి కధ పూర్తిగా రాయలేదు నేను. పదేళ్ళనుంచి సశేషంగానే వుండిపోయింది అది.
"పదేళ్ళ క్రితం మొదలెట్టి అసంపూర్ణంగా వదిలేసినా కూడా ఇప్పటికీ అది సరికొత్తగానే అనిపిస్తుంది నాకు. ఆ కధ నీకు వినిపిస్తాను హరీన్! ఆ లైన్ గనక నీకు నచ్చితే, దాన్నే డెవలప్ చెయ్యొచ్చు మనం."
అని వనమాలీ కధ చెప్పడం సాగించగానే, చెవులప్పగించి వినడం మొదలెట్టాడు హరీన్, కరుణా.
అది మామూలు కధ కాదనీ, తాము ఒక అద్బుతాన్ని వినబోతున్నామనీ వాళ్ళకు తెలియదు - అప్పట్లో.
    
                                              34

బలహీనంగా వున్న విశ్వనాధాన్ని నడిపించుకుంటూ గేటుదాకా తీసుకువచ్చిన తోటమాలి, గేటుకి వేసి వున్న తాళాన్ని చూడగానే ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత చటుక్కున ఒక నిశ్చయానికి వచ్చి అక్కడ పూలపాదుల్లో వున్న గద్దపారని అందుకుని తాళం మీద బలంగా ఒక దెబ్బ వేశాడు.
తాళం పగిలి, కిందపడిపోయింది.
అదే సమయంలో -
హాస్పిటల్ నుంచి పరుగు లాంటి నడకతో వస్తున్న వరలక్ష్మి కనబడింది విశ్వనాధానికి.
"వరలక్ష్మి!" అన్నాడు అభిమానంగా. భావోద్వేగంతో బొంగురుగా వస్తోంది అతని గొంతు.
ఎన్నో సంవత్సరాలయింది విశ్వనాధం ఆమెని అలా నోరారా పిలిచి, ఆ పిలుపు వినగానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది వరలక్ష్మికి.
"ఏమండీ!" అంది రుద్దమైన కంఠంతో.
"నేను మహాపాపిని వరలక్ష్మి! నన్ను క్షమించగలవా?"
"అవేం మాటలు! అలా అనకండి!" అంది వరలక్ష్మి అతని నోటికి తన చేతిని అడ్డం పెడుతూ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra