Home » Mainanpati bhaskar » Yama Dootha

 

    ఒక్కముక్కలో చెప్పాలంటే వైశాలి, యూ ఆర్ యాక్టింగ్ మిస్టేరియస్! వెరీ మిస్టీరియస్! అవునా?"
    
    ఆ సమాచారం అంతా ఇప్పుడే నీతో చెప్పేయడం నీకీ క్షేమకరం కాదని అన్నానుగా!" అంది వైశాలి తనని తాను సమర్ధించుకుంటూ.
    
    "చెప్పేశాక, నువ్వెవరికన్నా దొరికిపోయి ఇవన్నీ బయట పెట్టేస్తే నేను అపాయంలో పడతాను. అది అర్ధం చేసుకో! ఐ డోన్ట్ వాన్ట్ టు టేక్ దట్ రిస్క్!"
    
    "సరే! నువ్వు చెప్పినట్లే నేను పోలీసులకి లొంగిపోయి కోర్టుకి వచ్చాననుకుందాం. అప్పుడేం జరుగుతుంది? నువ్వు కూడా కోర్టుకి వస్తావు. చనిపోయిన ఆ స్త్రీ తల్లి కాదని చెబుతావు. అందువల్ల నాకు ఒరిగేదేముంటుంది?"
    
    "కేసు ఊహించని మలుపు తిరుగుతుంది. దానితో ప్రాసిక్యూషన్ వారి వాదన తలకిందులయిపోతుంది! అంతేకాదు! నేను కోర్టులో ఇంకా చాలా విషయాలు చెబుతానన్నానుగా! ఆ తర్వాత నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు. ష్యూర్! నన్ను నమ్ము!"
    
    "కీడెంచి మేలెంచమన్నారు! ఒకవేళ కోర్టులో నువ్వు ఇవన్నీ చెప్పకపోతే! లేదా చెప్పలేకపోతే!" అన్నాడు దినకర్.
    
    "నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తున్న రిస్క్ కంటే అదేం పెద్ద రిస్క్ కాదు. దినకర్! ఈ విషయంలో నేను నిన్ను నమ్మించలేను. నువ్వు నామీద నమ్మకం ఉంచాలి! అంతే! ప్రస్తుత పరిస్థితులలో నువ్వు నన్ను నమ్మకపోవడం అంటే, అది నీకు చాలా, చాలా కాస్ట్ లీ లగ్జరీ అవుతుంది." అంది వైశాలి.
    
    తనలో తనే తర్జన భర్జన పడుతున్నట్లు చాలాసేపు మౌనంగా వుండిపోయి, తర్వాత ఉన్నట్లుండి పెద్దగా నవ్వాడు దినకర్.
    
    ప్రశ్నార్ధకంగా చూసింది వైశాలి.
    
    నవ్వు ఆపుకుని అన్నాడు దినకర్, "ఈ కేసులోనుంచి తప్పించుకోవడానికి నాకు బ్రిలియంట్ అయిడియా ఒకటి తట్టింది వైశాలీ! నువ్వు నాకు చెప్పిన ఆలోచనలో చాలా రిస్క్ వుంది. కానీ ఇప్పుడు నాకు తట్టిన ఐడియా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్! టోటల్లీ రిస్క్ ఫ్రీ!"
    
    నుదురు చిట్లించింది వైశాలి.  

 

    "ఏమిటా రిస్కులేని ఐడియా?"
    
    "నేను నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్ళిపోయి, కాలుమీద కాలేసుకుని కుర్చీలో కూర్చుంటాను. తర్వాత కాలెత్తి ఇన్ స్పెక్టరుతో చూడు మిస్టర్ నేను ఉగ్రవాదిని! ఇప్పటికి ఓ వందమంది మనుషుల్ని చంపాను. అరడజను బస్సులు తగలెట్టాను. నలుగు రైళ్ళు పడేశాను. ఇంకో వెయ్యి మందిని చంపి వందబస్సులు తగలబెట్టాలనుకుంటున్నాను. కానీ ఎందుకోగానీ ఇవాళ లొంగిపోవాలనిపించింది. లొంగిపోతున్నాను. దట్సాల్! నువ్వేం చేస్తావో చేస్కో! అన్నాననుకో! ఇంక తర్వాత కేసులోంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఈ లోకం తీరే అంత వైశాలీ! ఒకడిని చంపితే శిక్ష! వందమందిని చంపితే క్షమాభిక్ష! ఇక్కడ మనం సిద్దాంతాల జోలికీ రాద్దాంతాల జోలికీ పోవడం లేదు. ప్రభుత్వం తాలూకు బలహీనతల గురించి మాట్లాడుతున్నాం మనం! బలవంతుడిదే రాజ్యం అన్న సూక్తిని రోజుకోసారి రుజువు చేయడం లేదూ ఈ ప్రభుత్వాలు? ఇక్కడే కాదు! ప్రపంచంలో ఎక్కడయినా అంతే! ఇంటర్నేషనల్ టెర్రరిస్టు కార్లోస్ నే తీసుకో, అతన్ని పట్టుకోవడం కోసం ఎన్నో దేశాలు ఎన్నో ఏళ్లనుంచి ప్రయత్నిస్తున్నాయి. అతను కొన్నిసార్లు కొన్ని దేశాల్లో దొరికిపోయాడు కూడా! అతన్ని పట్టుకోగలిగారు గానీ అతని మీద చర్య తీసుకోవడానికి గజగజలాడిపోయాయి ఆ దేశాలు! కార్లోస్ ని ఏం చేస్తే ఎటునుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న బెదురుతో ఆ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా భయపడి చివరికి అతన్ని ఏం చెయ్యకుండా మర్యాదగా వదిలి పెట్టెయ్యవలసి వచ్చింది!"
    
    "అంటే.....ఇప్పుడు నువెళ్ళి పోలీసులకు లొంగిపోయి నేనొక తీవ్రవాదిని అని ప్రకటిస్తావా ఏమిటి?" అంది వైశాలి కంగారుగా.
    
    నవ్వాడు దినకర్ "టేకిట్ ఈజీ వైశాలీ! టేకిట్ ఈజీ! ఊరికే సరదాకి అన్నాను. వైశాలీ! నువ్వు చెప్పిన విషయం గురించి బాగా ఆలోచిస్తాను. పోలీసులకి లొంగిపోవాలా వద్దా అన్న సంగతి ఇవాళో రేపో తేల్చుకుంటాను!" అన్నాడు.
    
    "బెటర్ టుడే! టుమారో మే బీ టూ లేట్!" అంది వైశాలి, కాషన్ ఇస్తున్నట్లు.  

 

    నిర్లక్ష్యంగా తల పంకించాడు దినకర్.
    
    అతనికి వీడ్కోలు చెప్పి చీకట్లో కలిసిపోయింది వైశాలి.
    
    ఆమె వెళ్ళాక చిన్నగా దగ్గి, గొంతు సవరించుకుని దినకర్ దగ్గరికి వచ్చాడు వామనరావు.

 

    "చాలా చలాకీ పిల్ల! కదూ! ఏమంటుందే?"
    
    "నన్ను పోలీసులకి లొంగి పొమ్మంటోంది! పోలీసులు నన్ను కోర్టుకి తీసుకెళితే తను కూడా కోర్టుకి వచ్చి, నా తరఫున సాక్ష్యం చెప్పి కేసు లేకుండా చేస్తానంటోంది. ఏమిటి నీ సలహా?"
    
    తక్షణం అన్నాడు వామనరావు.    

 

    "ఆడదాన్నెప్పుడూ నమ్మకు!"

 

    వామనరావు మాటలు పూర్తికాకముందే, వెళ్ళిపోయిన వైశాలి మళ్ళీ తిరిగి రావడం కనబడింది.
    
    సందేహంగా అటే చూస్తూ నిలబడ్డాడు దినకర్.
    
    ఆమె కాస్త దగ్గరికొచ్చాక అర్ధమయింది అతనికి. ఆమె వైశాలి కాదు. డాక్టర్ నిశాంత అని!
    
    అక్కడికి కొద్ది దూరంలో నిశాంత వచ్చిన మారుతీకారు ఆగి వుంది.
    
    "నిశాంతా!" అన్నాడు దినకర్ దిగ్భ్రమతో. "నువ్వా! ఇక్కడా? ఇంత రాత్రప్పుడా? ఎందుకొచ్చావ్?"
    
    నోరు తెరిచి మాట్లాడబోతే పెదిమలు అల్లల్లాడి దుఃఖం పొర్లుకొచ్చేసింది నిశాంతకి. ఒక్క పరుగున వచ్చి దినకర్ ని వాటేసుకుంది.
    
    అది చూస్తున్న వామనరావు వాళ్ళు తనకి కనబడకుండా కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి నిలబడ్డాడు.
    
    వణుకుతున్న గొంతు స్వాధీనంలోకి వచ్చాక అంది నిశాంత.
    
    "దినకర్! నువ్వు నిజంగా నువ్వేనా? నువ్వు నాకు ఇక్కడ కనబడ్డావని అనుకోవడం ఎండమావిలాంటి భ్రాంతి ఏమో, దగ్గరికి రాగానే నువ్వు అదృశ్యమైపోతావేమోనని ఈ కాసేపటిలోనే ఎంత భయపడిపోయానో తెలుసా? ఈ ఒక్కరోజులో అలా ఎన్నిసార్లు జరిగిందో నాకు! నువ్వే వచ్చావనుకున్న ఆరాటంలో నేను దగ్గరికి రావడం, చివరి క్షణంలో అదంతా నా భ్రమ అని తేలిపోవడం.....ఒక్కసారి కాదు....అబ్బ! నరకం అనుభవించాననుకో!"
    
    ఆర్ద్ర్గంగా ఆమె వీపు నిమురుతూ అన్నాడు దినకర్.
    
    "నిశాంత డియర్! నేనిక్కడ వున్నానని ఎలా తెలిసింది నీకు? ఎవరు చెప్పారు?"
    
    "ఇన్ స్పెక్టర్ జలీల్ చెప్పాడు" అంది నిశాంత. "ఇందాక నాకు ఫోన్ చేశాడు అతను. నన్ను ఇంటికి వెళ్ళమని పంపించేసిన తర్వాత అతను నిన్ను తరుముకుంటూ ఇదే రోడ్డుమీద కొంతదూరం వెళ్ళాడుట! నువ్వేమో అతని కళ్ళలో దుమ్ముకొట్టి పారిపోయావుట! దానితో ఇంక నిన్ను పట్టుకోవడం తన ఒక్కడివల్లా అయ్యే పని కాదని గ్రహించాడు జలీల్. నిన్ను వెంటాడే ప్రయత్నం తాత్కాలికంగా మానేసి యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళి అక్కడ నిన్ను గురించిన ఆధారాలేమయినా దొరుకుతాయేమోనని వెదికాడుట. అసలు మన ముగ్గురం కలిసి ఆ స్పాట్ కి వెళ్ళాలనుకుని బయలుదేరాం కదా! అంతలోనే నువ్వు మిస్సయిపోయావు!
    
    "ఆధారాలేమయినా దొరికాయా?" అన్నాడు దినకర్ ఉద్విగ్నంగా.
    
    "అతనికేం దొరకలేదు"
    
    "అంటే?"
    
    "అతనికి దొరకలేదుగానీ నాకు దొరికింది ఒక ఆధారం!" అంది నిశాంత వుత్సాహంగా.
    
    అది వింటున్న దినకర్ మొహంలోకి కాంతి వచ్చింది.
    
    "నీకు దొరికింది? ఏమిటది?"
    
    "దినకర్! నువ్వు నాకు మొదటిసారి వళ్ళంతా గాయాలతో, స్పృహలేని స్థితిలో కనబడ్డ స్పాట్ కి వెళ్ళి వెదికాను నేను. అక్కడ కనబడింది ఇది!" అని పర్సులోనుంచి సగం రూపాయి బిళ్ళతో వున్న లాకెట్ ని తీసి అతని కళ్ళకి ఎదురుగా పట్టుకుని, "ఇది నీదేనా?" అంది.
    
    కళ్ళార్పకుండా చాలాసేపు దానివైపే చూశాడు దినకర్.
    
    తర్వాత నెమ్మదిగా అన్నాడు.
    
    "కాదు!"    

 

    తక్షణం నిరాశ కనబడింది నిశాంత మొహంలో. చాలా చిత్రంగా కనబడుతున్న ఆ లాకెట్ అతనిదే అయి వుంటుందని ఆమె గట్టిగా నమ్మింది అప్పటిదాకా.
    
    "దినకర్! సరిగ్గా చూడు! మర్చిపోయావేమో! గుర్తు తెచ్చుకో! ఇది నీదే అయి ఉంటుంది" అంది బతిమాలుతున్నట్లు.
    
    మళ్ళీ ఆ లాకెట్ వైపు తీక్షణంగా చూశాడు దినకర్.
    
    "ఏమో! ఎప్పుడూ దీన్ని చూసినట్లు గుర్తు లేదు నాకు!" అన్నాడు.
    
    ఒకవేళ అతను దాన్ని అంతకుముందు చూసి ఉన్నా కూడా ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని తేల్చుకుంది నిశాంత.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra