Home » D kameshwari » Aruna

    అప్పుడప్పుడు వస్తూండమంది. తీరుబాటు అయినప్పుడల్లా తనూ వస్తానంది ఆ ఊళ్ళో ఒక్కొక్కరు తనతో స్నేహం చేసేవారు ఎక్కువవుతున్నందుకు ఆనందించింది. పుట్టింటిదగ్గిర నించి పల్లెల్లో ఉండి విసుగెత్తిన విమలకి, భర్త ఇలా ఉన్న ఉద్యోగం వదులుకుని ఈ పల్లెటూరికి రావడం నిజానికి ఇష్టంలేదు. అందులో అత్తమామలు అందరు ఉన్న సమిష్టి కుటుంబం దేనికీ స్వతంత్రం ఉండదు. ఇంక చౌదరిగారి కుటుంబంలో ఆడవారు రోడ్దమ్మటి తిరగడం అది ఇష్టపడరు. అక్కడికీ రమేష్ అవన్నీ పనికిరావని పెళ్ళాన్ని వెంటపెట్టుకుని ఎక్కడికైనా తీసుకు వెడుతూంటాడు.    
    కానీ ఇంట్లో అత్తమామలకి ఇష్టం లేకుండా మొగుడితో పట్టణంలో మాదిరి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళే స్వేచ్చా స్వాతంత్ర్యాలు విమలకి ఇప్పుడు లేవు. ఈ కారణాలన్నింటిచేత విమల ముందు అసలు ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. రమేష్ భార్యతో ముందు ఉద్యోగం వదిలేస్తున్నాని చెప్పినపుడు విమల తెల్లపోయింది. తరువాత వారించింది. వాదించింది. తనెంత మాత్రం ఆ ఊరు రానంది. ఎన్ని విధాల అభ్యంతరం చెప్పినా రమేష్ తన ఉద్దేశ్యం నెరవేర్చుకున్నాడు. ఉద్యోగం రిజైన్ ఈయగానే విమల కోపంగా పుట్టింటికి వెళ్ళిపోయింది.    
    రమేష్ పట్టణంలో కాపురం ఎత్తేసి ఇక్కడకు వచ్చేయగానే ఇంకా చేసేదేంలేక ఓనెల రోజులు పుట్టింట్లో ఉన్నాక ఇక్కడికి రాక తప్పలేదు విమలకి. రమేష్ ఆశయాలు, అతని ఉద్దేశాలు విమల కేమాత్రం రుచించలేదు. భర్త బోధపరచడానికి ప్రయత్నించిన విషయాలు ఆమెతలకెక్కించుకోవడానికి ప్రయత్నించలేదు. పొలాలు దున్నుకు బ్రతికే పాటికి ఆ చదువెందుకని వాదించింది. ఏదో ఉద్యోగం చేస్తున్నారని మానాన్న మీకిచ్చారుగాని, ఇలామీరు పొలం దున్నడానికి, నేనిక్కడ పడి, పేడపిసకడానికి నేను మిమ్మల్ని పెళ్ళాడ లేదని సాధించడం మొదలుపెట్టింది.    
    ఏంచూసి మొగుడు ఆ ఊరు వచ్చాడో ఆమెకి అర్ధం కాలేదు. రోజులు గడిచినకొద్ది రమేష్ నిర్ణయంఇంక మారదని అతని ఆలోచనలు, ఉద్దేశాలు పటిష్టమైనవి గుర్తించింది. ఇంక తను ఇక్కడ నించికదిలే ఉపాయం లేదని తెలిసేసరికి విమలకి ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషం భర్త మీదికి తిరిగి ఏదో వంకన రోజూ సాధించడం మొదలుపెట్టింది. మొత్తంమీద రమేష్ ఈ నిర్ణయం అతని దాంపత్యంలో కలతలు తెచ్చిపెట్టింది. అతని కాపురంలో సుఖ సంతోషాలు లోపించడం మొదలుపెట్టాయి. తనని అర్ధం చేసుకోలేదని భార్యపై విముఖత్వం రమేష్ కి తనని కావాలని ఇలా బాధపెడుతున్నాడని.    
    తనసుఖ సంతోషాలు భర్తకి అక్కరలేదని విమల....... ఇలా ఒకరిపై ఒకరు నిందలుమోపుకుమ్తూ ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరడం మాటా మాట అనుకోవడం, కోపాలు, పంతాలు, విమల ఏడుపులు ..... ఇవన్నీ ఆరంభమయ్యాయి ఆ సంసారంలో. ఇంట్లో ఉన్నంతసేపు భార్య కోసం సాధింపు ఏడుపు విముఖత్వం...... అన్నీ చూసి విరక్తి చెందే రమేష్ వీలయినంత సమయం పొలంలో తోటలోనే గడపడం ఆరంభించాడు. పని మీదే ఏకాగ్రత నిలిపి ఏదో భోజనం టైముకి మాత్రం ఇంటికి రాకపోకలు చేయడం ఆరంభించాడు.    
    అది మరింత కోప కారణమయింది విమలకి. మొత్తంమీద భర్తని తనవైపు తిప్పుకోలేక పోయానని విమల భార్య తనమాట వినడం లేదని భర్త ఇద్దరూ అసంతృప్తిలో రోజులు నెట్టుతున్నారు. ఓ పూట మాట్లాడుకుని కలిస్తే, మరి నాలుగురోజులు ఏదో వాదనతో ఇద్దరికీ మాటలు ఉండవు.    
    రమేష్ కాపురం ఆ స్థితిలో ఉండగా ఊళ్ళో వాళ్ళు అరుణా, రమేష్ ల గురించి అనుకునేమాటలు విమలదాకా రావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.    
    ఆ మాటలు విన్నాక విమల ముందునోట మాట రానంత నివ్వెర పోయింది. అరుణ వెంటనే ఆమెలోకోపం, అసూయ ఉక్రోషం ద్వేషం ఎన్నో భావాలు చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులకి మొగుడు ఈ ఊరికి రావడానికి అసలు కారణం అర్ధం అయిందనుకుంది. పెద్ద ఆశయాలు అంటూ చెప్పే కబుర్ల వెనక ఇంత నాటకం ఉందని కసిగా అనుకుంది.        
    ఇన్నాళ్ళులేని ప్రేమ ఈ ఊరిమీద హఠాత్తుగా ఆయన కెందుకొచ్చిందో అర్ధం చేసుకోలేనంత వెర్రిదాన్ని అని తన తెలివితక్కువతనాన్నితానే నిందించుకుంది. తనకళ్ళు కప్పి, తనని వెర్రి దద్దమ్మను చేసి ఈవిడ కోసమా ఉన్న ఉద్యోగం వదులుకుని వచ్చాడు అని కసిదీరామనసులోనే అరుణని, మొగుడు ని కలిపి తిట్టుకుంది. ఇంతలో ఆవిడగారి మాయలోపడిన తన మొగుడు ఇంక తనకు దక్కడు ఇప్పటికే తన చేయిదాటిపోయాడు. ఏం చెయ్యాలి ఎవరితోచెప్పుకోవాలి అంటూ ఉక్రోషంతో ఏడ్చింది ఈ నాలుగునెలలో జరిగినసంగతులు అన్నీ కళ్ళముందు కదలాడుతూంటే అసూయతో దహించుకుపోయింది.    
    రోజూతోటలో ఇద్దరూ కలుసుకుంటారు. చీకటి పడేవరకూ ఉంటారు. క్రమం తప్పకుండా, ఏ సాయంత్రమూ వదలకుండా భర్త అక్కడికి వెళ్ళడానికి చూపే ఉత్సాహమూ, ఈ ఊరు వచ్చిన దగ్గిర నుంచి మొగుడిలో కనిపిస్తున్న చురుకుదనం, సంతోషం ఉత్సాహం, ఉత్తేజం అన్నీ ఎందుకో ఇప్పటికి అర్ధమయ్యాయి అనుకుంది విమల. ఇన్నాళ్ళూ ఏదో అయింది. ఇంక ఊరుకోకూడదు పెళ్ళయి పిల్లాడున్నా ఈ మగ మహారాజు కీ బుద్ది లేకపోతే చదువుకుందేమో పెద్ద సంస్కర్తేమో, పెద్దపెద్ద ఆశయాలు, ఆదర్శాలు వల్లించే ఆవిడ సంస్కారం ఇదేనా? ఇంకోసాటి ఆడదాని కాపురం కూల్చడమేనా ఆ సంస్కారానికి నిదర్శనం? హువీళ్ళ నిజస్వరూపం తెలిసింది ఇప్పటికైనా నలుగురిలో పెట్టి ముఖం ఈడ్చాలి. పేడనీళ్ళు కొట్టాలి. క్రోధంతో పగబట్టిన త్రాచులా బుసలుకొట్టింది విమల.

    తనేంచెయ్యాలో ఆలోచించేముందు కొన్నాళ్ళు మొగుణ్ణి కనిపెట్టిచూడాలి. అవకాశం రాగానే తగిన బుద్దిచెప్పాలి.    
    ఆ రోజునించి రమేష్ ప్రతి కదలిక నిశితంగా శల్యపరీక్ష చేయడం మొదలు పెట్టింది విమల. అతను తెల్లటిలాల్చీ పంచ తొడుక్కుంటే ఓహో ఆవిడగారికి ఫాంటు షర్టు నచ్చవుగాబోలు పంచలు లాల్చీలు కొత్తగా మొదలు పెట్టారు అన్న అర్ధం వెంటనే తట్టేది విమలకి. ఏ పూట అయినా వర్షం వచ్చి ఇంటికి తొందరగా వచ్చి, తోచక ఏ పుస్తకమో పట్టుకుని కూర్చుంటే...... 'పాపం, ఈవేళ ఆవిడ గారి దర్శనం కాలేదని కాబోలు ఇంత దిగులు' అనుకునేది.    
    అనుమానం పిశాచమన్న నానుడి పూర్తిగా నిజం ఓసారి ఆ జబ్బు పట్టుకోకుండా ఉండాలి గాని, పట్టుకుంటే మనిషినిపీడించి పీడించి వదులుతుంది.    
    విమలలో ప్రవేశించిన అనుమాన పిశాచం విమలని పూర్తిగా వశపరుచుకుంది. నిజంతెలిశాక కూడా ఇంకా ఎందుకు ఊరుకోవాలి అనిపించింది మనసులో మాట ఓ పది రోజులకంటే ఎక్కువ ఊరుకోవాలి అనిపించింది మనసులో మాట ఓ పది రోజులకంటే ఎక్కువ దాచుకోలేకపోయింది, కాని భర్తని ఏమని అడగడమో ఎలా ఆరంభించాలో ఎలా కట్టడి చేయాలో అర్ధం కాలేదు విమలకి.    
    ఆ రోజురమేషు పొలం నించి ఇంటికివచ్చి ట్రాక్టరునడపడానికి తొడుక్కునే ఆ కాకీ బట్టలు విడిచి, స్నానం చేసి తెల్లటిగ్లాస్కో పంచె, లాల్చీ తొడుక్కుని ఉషారుగా అద్దంముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఈ ముస్తాబంతా తోటలోకి వెళ్ళడానికో, అరుణ ఇంటికి వెళ్ళడానికో అని తెలిసి విమల ఉక్రోషంగా ఉరుముతున్నట్టు తీక్షణంగా చూస్తూ ఆ గదిలోనే నిలబడింది. భార్యలో హావభావాలు రమేషు కనిపెట్టలేదు. దువ్వుకోవడం అయ్యాక, అద్దంలో చూసుకుంటూ పౌడరు రాసుకుంటున్న రమేషుని చూసి ఇంక ఊరుకోలేకపోయింది విమల.    
    "ఈ ముస్తబంతా ఆవిడగారికోసమేనా?" ఉక్రోషం అంతా అరుణమాటలోనే ధ్వనించింది. రమేషు భార్యవైపు తిరిగి విచిత్రంగా చూశాడు.    
    "ఏవిడగారికోసం?" అర్ధంకాక అడిగాడు.    
    "అదే...... ఆవిడే...... మీ ఫ్రెండుగారి...... అరుణాదేవిగారు....." నొక్కి మరీ అంది హేళనగా.    
    "బాగుంది తల దువ్వుకోవడం పౌడర్ రాసుకోవడం ఆవిడ కోసమేమిటి? నీవు చెప్పింది చాలా బాగుంది. ఇన్నాళ్ళూ ఎప్పుడూ తల దువ్వుకోలేదేమిటి నేను?" మనసులో ఏ కల్మషమూ లేని రమేషుకి భార్య అన్నమాటలకి అర్ధం తట్టలేదు. అసలా ఆలోచనే తట్టని అతను అతి మామూలుగా జవాబిచ్చాడు.    
    "ఆహ ఏం అమాయకత్వం నటిస్తున్నారు:" ఆమాట పైకి అనలేకపోయింది విమల. ధైర్యంలేక భార్య మొహంలో భావాలు ఆమె మనసులో ఆవేదన అర్ధం చేసుకోలేని రమేష్....." అలా తోటవైపు వెడుతున్నాను" అని చెప్పి మరి వెళ్ళాడు. ఉక్రోషంతో కళ్ళు నిండుకోగా మంచం మీద వాలిపోయి తలగడలో మొహందాచుకుంది విమల.                                                                 * * *    
    ఊళ్ళో ప్రస్తుతం ఎక్కడ చూసినా పంచాయతి ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఎలక్షన్లు ఇంకా చాలారోజులుండగానే ఎవరెవరు, ఏయే వార్డులనించి నిలబడుతున్నది, ఎవరు గెలిచేది ఊహగానాలు, ప్రచారాలు అప్పుడే ఆరంభమై ఊరంతా సందడిగా ఉంది.    
    ప్రెసిడెంట్ బలరామరెడ్డి చనిపోయాక ఆయన స్థానంలో మున్సబు ప్రెసిడెంట్ అయ్యాడు. ఎలాగో మూడు నాలుగునెలల్లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి గనక తాత్కాలికంగా ప్రెసిడెంట్ గా మున్సబు ఉండడానికి తక్కిన మెంబర్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.    
    రాజకీయాలంటే అరుణకి తలనెప్పి ఎలక్షన్లు జరుగుతాయంటే నిర్లిప్తంగా 'ఆహ' అనుకుంది. పంచాయితీలు మినిసిపల్ కౌన్సిల్సు, ఈ ఎన్నికలు......అన్నీ వృధా అనిపిస్తుంది అరుణకి. తమ తమ పదవులు అధికారాలు కాపాడుకోవడానికి తాపత్రయపడడం మినహా, ఊరికి ఉపకారం చేద్దామనేసదుద్దేశం ఏ ఒక్కరికి ఉండదుగనక ఎవరు నెగ్గినా, ఎవరు ఓడినా, ఎవరు ప్రెసిడెంటు అయినా ఒకటే అనుకుంది అరుణ.    
    ఈ ఎలక్షన్లు అంటే అరుణకి ఓ విధంగా భయం సాధారణంగా ఎన్నికలప్పుడు జరిగేగొడవలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు గురించి ఎన్నోసార్లు వింది.    
    ఓ రోజు సాయంత్రం మాటల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ల పోటీలో తనని నిలబడమని చాలామంది బలవంతపెడుతున్నారని, తండ్రి పెద్దవాడి నయిపోయాను...... నా స్థానంలో నా వార్డులోనించి నీవు నించోమని అన్నారని, నిలబడ్డమావద్దా అని ఆలోచిస్తున్నానని అన్నాడు రమేష్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra