Home » Merlapaka murali » Nee Meeda Manasaayaraa


    "రేపటినుంచి దేవీ నవరాత్రులు ఆశ్రయం దగ్గర సాయంకాలాలు పూజలు జరుగుతాయి. ఆడపిల్లలంతా వస్తారుగా నువ్వూ వచ్చేయ్ ఆశ్రమం వెనక నీకోసం చూస్తుంటాను" అని, ఇక వస్తానన్నట్లు కళ్ళను అటూ ఇటూ తిప్పి వెళ్ళిపోయాడు.
    
    నేను కిందకి వచ్చేశాను. అతని స్పర్శ తగిలిన వీపుభాగాన్ని తడుముకోవాలని చేయినెంత వెనక్కి తోసినా అందడం లేదు. టీవీలో సినిమా అయినా చూడకుండా ముందు రూమ్ లోకొచ్చి పడుకుండిపోయాను.
    
    నాకు దైవభక్తి తక్కువ. ఆరోజు సాయంకాలం దేవీనవరాత్రుల పూజల కోసం అందరికంటే ముందు బయల్దేరిన నన్ను చూసి మా అక్కయ్య ఆశ్చర్యపోయింది. "ఏమిటే అప్పుడే తయారైపోయావ్! బలవంతంచేసినా ఆశ్రమానికి వచ్చేదానివి కావు"
    
    "సెలవులు కదా అలా వెళితే కాలైనా సాగుతుందని"
    
    "సరే! వీడ్ని ఎత్తుకుని వెళుతూ వుండు వచ్చేస్తాను" అంది అక్కయ్య.
    
    మరో పదినిముషాలకి మా వీధిలోని అమ్మాయిలు వచ్చారు. దేవీ పూజల కోసం కాకుండా పేషన్ పేరేడ్ కి వెళుతున్నట్లు తయారయ్యారు.
    
    మేం ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడున్న ఇద్దరు స్వాములు, మరో ఇద్దరు వృద్ద వితంతువులు హడావిడి ప్రారంభించారు.
    
    దేవీ దండకం అనుకుంటాను పాడడం ప్రారంభించారు. నాకేమీ తెలియదు అందుకే అందరివంకా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. ఆరుకు పైగానే అయి వుంటుంది. ఆశ్రమంలో లైట్లు వెలిగాయి. చిన్నపిల్లల చూపంతా ప్రసాదం మీదే వుంది.
    
    మధ్యలో లేచి ఆశ్రమం వెనకకి ఎలా వెళ్ళడం?
    
    నా ఒడిలో వున్న టింకూని చిన్నగా గిచ్చాను. వాడు ఏడుపు ప్రారంభించాడు. సముదాయించాను. కానీ వాడు ఏడుపు ఆపలేదు. నాకు కావలసింది కూడా అదే.
    
    "బయటకెళ్ళి వాడ్ని ఆడించు" మా అక్కయ్య మెల్లగా చెప్పింది.
    
    వెంటనే పైకి లేచాను. ముందు అటూ ఇటూ తచ్చాడి ఆశ్రమం వెనకకి వెళ్ళాను. ఎప్పుడొచ్చాడో ఏమో అక్కడ ఆదిత్య నిలబడి వున్నాడు.
    
    "టింకూ ఏడుస్తున్నాడా?" అని అడిగాడు.
    
    "అవును"
    
    నాకోసం అతనున్నాడని, అతని కోసం నేనొచ్చానని ఇద్దరికీ తెలుసు. కానీ దాన్ని దాచుకోడానికి ఇలాంటి మాటలు ఉపయోగపడతాయనుకుంటాను.    
    
    "టింకూ! కమాన్" అని వాడ్ని తీసుకోవడానికని రెండు చేతులూ చాచాడు. ఎడమ చేయి నా ఎదను రాసుకుంది. ఒళ్ళంతా ఒక్కసారిగా పూలచెట్టు అయిపోయి, అతని స్పర్శకు పూలన్నీ జలజలా రాలినట్లు అయిపోయింది.
        
    అతను తిమ్కూను పక్కన కూర్చోబెట్టి నా ముందుకు మరింత జైర్గి గట్టిగా వాటేసుకున్నాడు. నాలోని ఏ భాగం అతనికి తగలాలని అలా చేశాడో నాకు తెలుస్తోంది. నేను ఏమీ ఎరగనిదానిలా, తూలిపడ్డట్లు నా ఎదను అతని ఛాతీకి గుచ్చాను. ఎక్కడ జాకెట్ హుక్ లు తెగిపోతాయో, బ్రా ఎలాస్టిక్ సాగిపోతుందో ననిపించింది. నా గుండెలు అంత రియాక్షన్ కు గురయ్యాయన్న మాట. వర్షం పడడక ఏరులన్నీ సాగినట్లు మాధుర్యం ఒంట్లో ప్రారంభమైంది.
    
    అతను ఓ క్షణంపాటు అల అవుమ్చి వదిలేశాడు. అంతకంటే ఎక్కువసేపు కౌగిలించుకోవడానికి భయం కాబోలు, నా పరిస్థితి అంతే. ఏదో తెలియని అలజడి నాలోని రక్తాన్ని తరుముతోంది.
        
    "రోజూ ఇలానే" అని అతను చీకట్లో కలిసిపోయాడు. టింకూను తీసుకుని ఇవతలికి వచ్చేశాను.
    
    ఇక మరుసటి రోజు నుంచీ అంతే భజన మధ్యలో నేను ఆశ్రమం వెనుకకి వెళ్ళడం, ఆదిత్య అక్కడ వుండడం, రెండు కౌగిలింతలు, ఓ ముద్దుతో సాయంకాలాన్ని అద్భుత ఇంద్రజాలంలా మలుచుకోవడం - ఇలా దేవీ నవరాత్రులు అయిపోయాయి.
    
    మరో రెండు రోజులకనుకుంటాను మా నాన్న, ఆయన వెంబడి మరో ముగ్గురూ వచ్చారు "ప్రియాను కాస్త రెడీ చేయమ్మా" రావడంతోనే నాన్న అక్కయ్యకు చెప్పడంతో వాళ్ళెవరో తెలిసిపోయింది.
    
    ముస్తాబు ముగిశాక నేను హాల్లోకి వచ్చాను.
    
    పెళ్ళికొడుకు మరీ కుర్రాడు. ఖచ్చితంగా నా వయసే వుంటుందని పించింది. అతని తండ్రి జబర్దస్తీగా అంత వయసున్న వాడిలా కనిపించడం లేదు. ఎర్లీ మ్యారేజీ వల్ల అంత పెద్ద కొడుకు వున్నట్లున్నాడు.
    
    అబ్బాయి అప్పుడే డిగ్రీ పాసయ్యాడుట. టౌన్ లో సిమెంట్ వ్యాపారము. తండ్రీకొడుకులిద్దరూ చూసుకుంటున్నారు. పక్కనున్న పల్లెలో కాపురం.
    
    ఇద్దరు అక్కయ్యలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి పోయాయి. ఇదీ ఆ కుటుంబం బ్యాక్ గ్రౌండ్.
    
    వాళ్ళు వెళ్ళిపోయాక అక్కయ్య వచ్చి అడిగింది. "ఏమే! పెళ్ళి కొడుకు నచ్చాడా?"
    
    నచ్చినట్లు తలవూపి సిగ్గుతో ముఖం అటువేపుకి తిప్పుకున్నాను. మేం వెళ్ళడం, వాళ్ళు రావడం జరిగిన మరో నెలరోజులకి నా పెళ్ళి మాధవ్ తో జరిగిపోయింది.
    
    అత్తగారింటికి వెళ్ళాను.    

    ఊర్లో వాళ్ళది పెద్ద ఇల్లు. ప్రస్తుతం నేనూ, మావారూ, మామయ్య వుంటున్నాం. మాధవ్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డే. తండ్రంటే మహా భయం అన్న విషయం మొదటిరాత్రే తెలిసిపోయింది.
    
    'మన పెళ్ళి రిసెప్షన్ కి ఊర్లో సీరియల్ బల్బు సెట్ ను వేయించాలనుకున్నాను. నాన్న వద్దన్నాడు. ఆయన ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేదు. అమ్మ అయినా అంతే కానీ నా కోసం అప్పుడప్పుడూ మాట్లాడుతుంది. అందుకే అమ్మకి చెప్పి నాన్నకి చెప్పించాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఊరుకుండి పోయాను. లేకుంటే మనిల్లు ఈ పాటికి కలర్ బల్బులతో అదిరిపోయేది' అన్నాడు.
    
    నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.
    
    'అప్పటికీ ఆ ఖర్చు నేనే పెట్టుకుంటానన్నాను. అంత డబ్బు నీకెక్కడిదిరా అని నన్ను అరిచి అప్పటివరకు దాచుకున్న అయిదొందల రూపాయలు కూడా పెరుక్కున్నాడు'
    
    'మీ నాన్న అంటే అంత భయమా?'
    
    'ఆఁ ఈ మధ్య వరకు నన్ను కొడుతూనే వున్నాడు. పెళ్ళి పెట్టుకున్నాక మానేశాడు. అమ్మనైతే చెప్పనక్కరలేదు. బెల్టుతో తప్ప మరొక దాంతో కొట్టడు'
    
    ఎందుకోగానీ నాకు భయమేసింది, అలాంటి వ్యక్తి వున్న ఇంట్లో ఎలా నెగ్గుకు రావాలో అర్ధం కాలేదు.
    
    రెండోరోజు సాయంకాలం పెరట్లో మల్లెపూలు కుడుతున్నప్పుడు మా అత్తయ్య కూడా ఇవే మాటలను అటూ ఇటూ మార్చి చెప్పింది.
    
    "మీ మావయ్య కాలాంతకుడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం ఆయనకు ఇష్టం లేకుండా పూచిక పుల్లను కూడా పక్కకు పెట్టి ఎరగం. ఈ ఆస్తినంతా తన కష్టం వల్లే సంపాదించానన్న అహంకారం కావచ్చు. తన మాట నెగ్గాలన్న గర్వం కావచ్చు. బలహీనుల్ని బాధ పెట్టాలన్న కిరతహకం కావచ్చు.
    
    ఏది ఏమైనా ఆయన ఈ ఇంటికి రాజు. మనమంతా ఆయన సేవకులం. ఆయన ఆజ్ఞ కాదంటే ఆయన ఏ అవతారమయినా ఎత్తగలడు. ముందుగా ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నువ్వేమీ ప్రమాదంలో చిక్కుకోకుండా హెచ్చరించడానికి"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra