Home » Mainanpati bhaskar » Agnisakshi

 

    అప్పుడు తేజస్వి వైపు చూస్తూ అన్నాడు.

 

    "వింటున్నారు కదా! అడపాదడపా జ్వరం వస్తోంది చిన్నికి. దానితో బాటు వణుకు, తలనొప్పి, గొంతులో బాధ."

 

    "డాక్టర్ దగ్గరికి తీసుకెళితే డబ్బు ఖర్చవుతుందని చెప్పి వార్డెన్ వరదరాజులు ఎప్పటికప్పుడు ఎదురుగా ఉన్న కిళ్ళి షాపులో ఒక అనాల్జిన్ బిళ్ళ కొనుక్కొచ్చి మింగించేవాడు చిన్నీ చేత.

 

    మిస్టర్ తేజస్వి! అనాల్జిన్ ప్రభావం గురించి నేను మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. అనాల్జిన్ వాడితే ఆగ్రాన్యూలో సైటోసిస్ అనే రక్తానికి సంబంధించిన వ్యాధి వస్తుందని గుర్తించి అమెరికా, వెస్ట్ జర్మని, ఆస్ట్రేలియా, ఇటలి, సౌదీఅరేబియా అలాంటి దేశాలన్నో దీన్ని నిషేదించాయి. ఈ డ్రగ్ బ్రిటన్ లో అసలు దొరకనే దొరకదు.

 

    "కానీ ఇండియాలో మాత్రం ఆ అనాల్జిన్ ని ఇంకా బాన్ చెయ్యలేదు. అనాల్జిన్ నవాల్జిన్ లాంటి టాబ్లెట్స్ డాక్టర్ ప్రిసిప్షన్ లేకుండా ఏ కిళ్ళి షాపులో నైనా వక్కపొడి పొట్లం లాగా కొనుక్కుని వేసుకోవచ్చు ఎవరైనా కూడా.

 

    "సాధారణంగా ఒళ్ళు నొప్పులు, జ్వరం , చలి , తలనొప్పి, గొంతునొప్పి- ఇవి వస్తే వాడుతుంటారు అనాల్జిన్ ని . సెల్ఫ్ మెడికేషన్. డాక్టర్ చెప్పకుండానే.

 

    "అది ఒక్కొక్కసారి వికటించవచ్చు. కానీ, చిత్రం ఏమిటంటే అనాల్జిన్ వికటించి ఆగ్రా న్యూలో సైటోసిస్ అనే వ్యాధి వచ్చినా, దాని లక్షణాలు కూడా ఇవే వుంటాయి. - జ్వరం , చలి, ఒళ్ళు నొప్పులు , గొంతు నొప్పి-

 

    "అందుకని ఈ రోగాన్ని డయాగ్నసిస్ చెయ్యడం కష్టం. బహుశా అందుకనే అనాల్జిన్ దుష్ఫలితాలని సరిగా అంచనా వెయ్యలేకపోతున్నారేమో కూడా."

 

    వింటూ , తల పంకించాడు తేజస్వి.

 

    "మిస్టర్ తేజస్వి! ఆ వార్డెన్ వరదరాజులు మళ్ళీ ఈ కుర్రాడికి అనాల్జిన్ టాబ్లెట్లు వెయ్యకుండా చూడండి. ఇతన్ని నా దగ్గరే రెండు, మూడు రోజులపాటు వుండనివ్వండి. మూడు రోజుల్లోగా నార్మల్ అయిపోవాలి చిన్నీ. ఎముకల్లో మూలుగ మళ్ళీ తెల్ల కణాలని తయ్యారు చేసి రక్తంలోకి పంపడం మొదలెట్టాలి.

 

    "ఒకవేళ - ఏ కారణం చేతనన్నా అలా జరగకపోతే - మిస్టర్ తేజస్వి ! చిన్నికి బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ చెయ్యాలి. కొత్త రక్తం ఎక్కించాలి. ఏమంటారు?"

 

    "ఓకె డాక్టర్ - థాంక్యూ వెరి మచ్" అన్నాడు తేజస్వి.

 

    
                                                                   15

 

    బాంబే సన్ అండ్ శాండ్ హొటల్లో పార్టి పాకాన బడుతోంది. తను ముందుకు వంగి నవ్వుతుంటే , తన ఒంపులు అక్కడ ఉన్న మగాళ్ళ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఓరకంట గమనించింది. ఉజ్వల- గర్వంగా మరింత ఉప్పొంగింది ఆమె వక్షం.

 

    "ఇందాక శశికంత్ చెప్పినదానికి తాత లాంటి జోకు నే నొకటి చెబుతాను" అంది.

 

    అందరూ ఆసక్తిగా ఆమెవైపు చూశారు.

 

    చెప్పడం మొదలెట్టింది ఉజ్వల.

 

    "బాగా అమ్ముడుపోయే విటమిన్ "ఇ" కాప్య్సుల్ ఒకటి ఉంది. విటమిన్ "ఇ" లోపిస్తే వరసగా అబార్షన్, టెస్టికల్ దెబ్బతినిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి? విటమిన్ "ఇ" లోపిస్తే ఆడవాళ్ళకి వస్తాయా జబ్బులు? మగవాళ్ళకా? అంది పొడుపు కధలాగా.

 

    అక్కడ ఉన్నవాళ్ళలో గురుదత్ అనే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు. "అబార్షన్, టెస్టికాల్స్ దెబ్బతినడం రెండూ అని అంటున్నారుగా? అందుకని ఈ జబ్బు ఆడా మగా ఇద్దరికీ రావచ్చు."

 

    నవ్వింది ఉజ్వల.

 

    "అవును, ఈ జబ్బులు ఆడకి, మగకి ఇద్దరికీ రావచ్చు"

 

    నవ్వింది ఉజ్వల.

 

    "అవును, ఈ జబ్బులు ఆడకి మగకి ఇద్దరికీ రావచ్చు. కానీ జాగ్రత్తగా వినండి - కానీ - ఈ డిసీజ్ మనుషులకి మాత్రం రాదు. అడ జంతువులకి, మగ జంతువులకి - అంటే పందులకి, పశువులకి వస్తుంది. విటమిన్ "ఇ" లోపిస్తే మనుషులకి రోగాలు వస్తున్నట్లు ఇంతవరకూ రుజువేది లేదు. అయినా కూడా - సంతానం లేక నిరాశపడుతున్న దంపతుల భయాలను కొల్లగొట్టి వాళ్ళకి ఈ కంప్లయింట్స్ వున్నట్లు భ్రమ కలిగించి ఈ మందుని అమ్మి కోట్లు గడిస్తోంది ఒక కంపెని.

 

    "అలాగే ప్లాసెంటాతో తయారుచేసే ఇంజక్షన్లు . డెలివరి తరువాత బిడ్డతో పాటు బయటకి వస్తుందే ప్లాసెంట మాయ అంటారు. దానితో చేస్తారు ఈ ఇంజక్షన్లు. అస్తమా దగ్గర నుంచి టి.బి. దాకా రకరకాల వ్యాధులకు ఇది దివ్యౌషదం అని ప్రచారం. కానీ ఏ మెడికల్ బుక్ లో కూడా , ఏ ఫార్మా కాలేజిలో కూడా ఈ మందువల్ల ఏ విధమైన లాభం గానీ చేరుతుందని రాసిలేదు.

 

    :"కానీ, ఇది దేశంలో విరివిగా ఉపయోగాబడుతున్న ఇంజెక్షనుల్లో ఒకటి.

 

    "గ్లూకోజ్ డి కూడా అదే కేసు. నిరసానికి , జ్వరానికి గ్లూకోజ్ పనికి వస్తుందని అడ్వర్ టేయిజ్ మెంట్ల హోరు. కానీ పన్నెండు రూపాయల గ్లూకోజ్ కు బదులు రూపాయి పావలా పెట్టి ఉత్త చెక్కర జీర్ణం చేసుకుని దాన్ని గ్లూకోజ్ గా మార్చడానికి పదిహేను నిమిషాలు పడుతుంది.

 

    "డిఫరెన్స్ గుర్తించారా ఫ్రెండ్స్?"

 

    "గ్లూకోజ్ కి పావుగంట వ్యవధి, చక్కేరకి పదిహేను నిమిషాల వ్యవధి!

 

    "అంటే రెండూ ఒకటేనన్నమాట.

 

    "కానీ, జనం గ్లూకోజ్ నే చచ్చేంత ఖరీదు పెట్టి తాగుతారు. ఎందుకు?"

 

    "ఎందుకంటె , మల్టి నేషనల్ కంపెనీలు తాము అందమైన పాకింగ్ తో మార్కెట్ మీదకు వదిలిన డ్రగ్స్ ఉపయోగిస్తే తప్ప అనారోగ్యం తగ్గదని చెప్పి చెప్పి ప్రజల మైండ్స్ ని ఒకే విధంగానే ఆలోచించేటందుకు కండిషన్ చెయ్యడం జరిగింది.

 

    "అందుకని ఫ్రెండ్స్! నేను చెప్పేదేమిటంటే - ప్రజలకు ఏ మందులు అవసరమో అవే మనం తయారు చెయ్యాలని ఎక్కడా లేదు. మనం తయారు చేస్తున్నావే ప్రజలకు అవసరం అన్న భ్రమ కలిగించాలి పబ్లిసిటి ద్వారా, మన రిప్రజెంటేటివ్ ల ద్వారా, ఇంకా అనేక విధాలుగా, ఇప్పుడు మార్కెట్ లో ఉన్న డ్రగ్స్ లో ఎనబై అయిదు శాతం ఎందుకు పనికిరాని మందులే. బాగా అమ్ముడు పోతున్న టాప్ ధర్టిడ్రగ్స్ లో పదకొండు మందులు ఎందుకు కొరగానివి ప్రమాదకరమైనవి కూడా.

 

    "ఫ్రెండ్స్! ప్రతి పెద్ద కంపెని కూడా అత్యధికమైన లాభాలను అనవసరమైన మందుల ద్వారా ఆర్జిస్తోంది. లైక్ హెల్త్ డ్రింక్స్........లైక్ టానిక్స్.........అండ్ పెయిన్ కిల్లర్స్ లైక్ అనాల్జిన్...."

 

    "యా! వైనాట్ అనాల్జిన్! మనం అనాల్జిన్ ఎందుకు తయారు చెయ్యకూడదు? అన్నాడు గురుదత్.

 

    నవ్వింది ఉజ్వల.

 

    "ఏ మందు మనకు కనకవర్షం కురిపిస్తుందో ఆలోచిద్దాం. మనకు టైం వుంది. మూడు రోజులపాటు సమావేశాలు జరుపుతాం మనం. ఆ తరవాత ఫైనల్ గా ఏదో ఒక నిర్ణయానికి రావచ్చు. ఫ్రెండ్స్ ఇవాల్టికి ఇంక బిజినెస్ వ్యవహారాలు చాలు! నౌ లెటజ్ ఈట్, డ్రింక్, అండ్ బీ మెర్రి" అంది ఉజ్వల. శశికంత్ గ్లాసులోకి మరికొంత స్కాచ్ ఓంపుతూ.

 

    వద్దన్నట్లు చెయ్యి అడ్డం పెట్టాడు శశికంత్. "ఇప్పటికే చాలా తాగేశాను నేను. ఐ థింక్ ఐ యామ్ గోయింగ్ టూ సిక్. వామిట్ అయ్యేటట్లు ఉంది నాకు" అన్నాడు తడబడుతూ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra