Home » Adivishnu » Adivishnu Kathanikalu


    నాక్కొంచెం సరదాగా వున్నది. కుర్చీలో ముందుకి జరిగి కూర్చున్నాను.
    "కానీ, ప్రస్తుతం మా కంపెనీలో, ఖాళీలేమీ లేవు. ఉంటె గనక మీకు తప్పనిసరిగా ఖబురంపుతాను. సరేనా? పోతే, ఈ పుస్తకం మీ దగ్గిరే వుంచుకోండి. కావలసివొస్తే నేనే అడిగి పుచ్చుకుంటాను. ఓ.కే?" అన్నారు.
    "ఓ.కే." అనేశాను.
    ఆయన లేచి నించున్నారు. నేనులేచి వచ్చేశాను.
    
                                  *    *    *
    

    నెలరోజులు గడిచిం తర్వాత వోరోజున సంగమేశ్వరరావు అర్జంటుగా మా యింటికొచ్చేడు. ఒచ్చీ రావటంతోటే గబగబా నాలుగూ అనేశాడు నిప్పు తొక్కిన కోతిలా -
    "రామనాథంగాడికి ఉద్యోగం వచ్చింది. నాకంటే వాడు జూనియర్. పైగా ఫూల్. అయినా సరే వాడికే ఉద్యోగం యిచ్చేరు పశుపతిగారు. అప్పుడే వారం రోజులైపోయింది గూడాను."
    "నేనడిగితే ఖాళీల్లేవని చెప్పేడే మరి."    
    లేపోతే, ఉన్నాయని చెబ్తారేమిటండీ! మీరు మరీను."
    "అసలింతకీ రామనాథం ఎవడోయ్!"
    "డాన్స్ మాస్టరు సోమయాజుల్లేరండీ వాళ్ళ తమ్ముడు. సోమయాజులు పశుపతిగా రమ్మాయికి డాన్స్ నేర్పుతున్నాడు గదా! ఆ పరిచయంలో ఆయనగారేమో ఈ ఫూల్ గాడికి ఉద్యోగం వేయించేశాడు?" అన్నాడు కసిగా.
    నేనున్నాను. నేను నాటకాలనీ రాస్తాను. నా నాటక మొకటి ఆ మధ్య పశుపతిగారికి కావలసి వచ్చింది. ఆ రకంగా నాకూ ఆయన్తో పశుపతిగారికి కావలసి ఒచ్చింది. ఆ రకంగా నాకూ ఆయన్తో పరిచయమున్నట్టేగా. కానీ, నాకున్న పరిచయంతో ఈ సుబుద్ధికి నేను ఉద్యోగం వేయించలేకపోయాను. అంటే, ఈ మొత్తానికి అర్ధమేమిటి? ఆ డాన్స్ మాస్టారు సోమయాజులు ముందు ఈ నాటకాల రచయిత తీసికట్టన్నమాట. ఇదీ, టూకీగా సంగమేశ్వరరావు గుండెల్లోని అభిప్రాయం.
    దీనికి నేనేం బాధ పళ్ళేదు. సంగమేశ్వరరావు వెళ్ళిపోయిం తర్వాత నిట్టూర్చేను. అంత పరపతీ, అంత హోదా గల పశుపతిగారు చిన్న విషయంలో అబద్దమెందుకు చెప్పాలని మాత్రం బాధపడిపోయేను. పశుపతిగారికి నేను సోమయాజులు కంటే ముందు నుంచీ తెలుసు. ఆయన్లా నాట్యాలు నేర్పలేకపోయినా నేనూ ఆయన్లా ఒక కళా కారుడ్నే? పశుపతిగారీ విలువల్ని గ్రహించే ముందొచ్చిన నన్ను కొట్టి పారేసి వెనకొచ్చిన ఆ సోమయాజుల్ని గౌరవించడమనే విషయంలో చింతించేను. ఆ నాటి నుంచీ పశుపతిగారిమీద విరోధం పెట్టుకోవలసి వచ్చింది.
    ఈ కథ ముఖ్యంగా పశుపతిగారూ, సంగమేశ్వరరావూ, నేనూల మధ్యింతవరకూ జరిగింది. నాకు మావూళ్ళో ప్రాణం సైతం ధారపోసి మిత్రుడు మూర్తి వున్నాడు. అతన్నింతవరకూ ఈ కథలో పరిచయం చేయలేదు. మూర్తి గూడా కథలు రాసే కుర్రాడు మే మెల్లప్పుడూ కలిసే తిరుగుతుంటాం.
    వోనాడతనింటికి వెళ్ళేను. అతనప్పుడు చాలా తొందరగా ఉన్నాడు. నన్ను చూస్తూనే;
    "రా గురూ! రా! నీకోసమే చూస్తున్నాను. లేపోతే ఈవేళకి బస్టాండులో వుండవలసిన పని" అన్నాడు.    
    "ఏమిటో విశేషం?"
    "మా విశ్వమన్నయ్య వస్తున్నాడు. ఉత్తరం రాసేడు. రేపు సాయంత్రం టవున్ హాల్లో మీటింగేదో ఉన్నదట. అదవ్వగానే రాత్రికి మా పల్లెటూరు వెళ్ళిపోవాలి. ఈ వార్త మా వాళ్ళకి చెప్పేందుకు వెడుతున్నాను."
    మూర్తి మా వూరివాడే అని చెప్పాలి. చదువూ, ఉద్యోగం రెండూ ఈ వూళ్ళోనే. వాళ్ళ సొంతవూరు మా వూరుకి పది మైళ్ళలో వున్న పల్లెటూరు. అక్కడే యిల్లూ, పొలం గట్రా వున్నాయి. వారానీకో తడవ అక్కడికి వెళ్ళి వస్తూంటాడతను.
    మూర్తిని బస్సెక్కించి ఇంటి మొహం పట్టేను. దార్లో మూర్తి వాళ్ళన్నయ్య జ్ఞాపకానికొచ్చేడు.
    ఈ భూమ్మీదనుంచి 'టేలంట్' వున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభా విషయం కొన్నాళ్ళకి గాని గమనింపుకి రాదు. మూర్తివాళ్ళ దొడ్డమ్మగా రబ్బాయి ఈ విశ్వం. ఆనర్సు పూర్తయింతర్వాత మదరాసు వెళ్ళిపోయి సినిమాల్లో చేరేడు. నాలుగైదేళ్ళు ప్రముఖ దర్శకుల దగ్గిర పన్జేసి మొన్నీ మధ్యనే విడుదలైన వో తెలుగు సినిమాకి దైరెక్టరయ్యేడు. దాన్లో చాలామంది కొత్తవాళ్ళు నటించేరు. ఆ సినీమాలో ఆకర్షణలు చాలా ఉన్నాయి. పత్రికలు ఆ సినిమాని ఆకాశానికెత్తేశాయి.
    అందుచేత విశ్వం ప్రఖ్యాతి నలుదిశలా ఈనాడు వ్యాపించింది. ఈ సినీమా నాలుగోవారం ఆడుతూండగానే మరో రెండు సినిమాలకి దర్శకుడుగా నియమింపబడినట్లు పత్రికల్లో వార్తలొచ్చేయి. కాబట్టి, ప్రతిభ గల మనిషెప్పటికైనా రాణిస్తాడనే ధర్మసూత్రం ఈ విశ్వం ద్వారా నిజమైంది.
    ఆ సాయంత్రం నాకేం తోచలేదు. మూర్తి ఇంట్లో లేడు. పురమందిరానికి వెళ్ళేడని చెప్పేరు. హోటల్లో యింత కాఫీ తాగి నేనూ టవున్ హాలువైపు వెళ్ళేను.
    మా వూళ్ళో వున్న 'పట్టణ యువజన సంఘం' చాలా చక్కగా పన్జేస్తోంది. తగ్గవాళ్ళకి సన్మానాలూ, అప్పుడప్పుడూ సాంస్కృతిక కార్యకలాపాలు నెలకోతడవైనా ఏర్పాటు చేయడంతో మావూరి జనాభా రిలాక్సవుతోంటుంది.
    నేనొస్తున్న రోడ్డుమీద, రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద అట్టలు కట్టి వుంచేరు. వాటిపైన 'విశ్వానికి స్వాగతమని' ఇంతింత అక్షరాల్తో రాసేరు. కొన్ని అట్టలపైన అభివందనాలూ వున్నాయి.
    టౌన్ హాలు దగ్గిర జనం గుంపుల గుంపులుగా వున్నారు. గ్రామఫోన్ రికార్డులు మార్మోగుతున్నాయి. ఆ పాటలన్నీ విశ్వం సినిమాలోనివే కావడం ఒక ప్రత్యేకత! మధ్య మధ్య రికార్డులు ఆపి టౌన్ హాల్లో చేరిన ప్రేక్షక సమూహాన్ని నిశ్శబ్దంగా వుండాలని ఎవరో కీచుగొంతులో హెచ్చరిస్తున్నారు.
    నేనిక్కడ కాసేపు నించుని తిరిగి వెళ్ళబోయేను. అప్పుడు మూర్తి కనిపించేడు.
    "బలేవాడివి గురూ! ఇంతలేటా" అన్నాడు.    
    "నేనిక్కడికి రావాలని రాలేదు. ఏం తోచక వచ్చేను."
    "తగ్గవోయ్! మీ ఆఫీసుకి కబురంపేను. చేరలేదూ?"
    "లేదే?"
    "ఫర్లేదు. ఆఁ నీ కోసం సీటుంచేను."
    నేనతన్తోపాటు లోపలికెళ్ళేను. రెండో వరుసలో మధ్యగా రెండు కుర్చీలు ఖాళీగా వున్నాయి. తిన్నగా అక్కడికే వెళ్ళి కూర్చున్నాము. మేమెళ్లి కూర్చున్న క్షణమే విశ్వమొచ్చినట్లు మైకులో ఎవరో చెప్పేరు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra