Home » Yerramsetti sai » Akhari Ghadiyalu

 

    "మనకు ఇప్పుడు రెండు విషయాలు తేలాలి! సంధ్యారాణి ఎవరు? ఆ అడ్రసుల పుస్తకం తాలుకూ రహస్యం ఏమిటి? ఈ రెండూ తేలితే ఆమెను ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారుఅనే విషయం తెలిసి పోతుంది" అన్నాడు భవానీ శంకర్.
    అందరూ నిశ్శబ్దంగా ఆలోచనల్లో మునిగిపోయారు. స్మితారాణికి సహనం నశించిపోయింది. తనవల్ల ఇంతమందికి సమస్యలు ఎదురవటం తనకే మాత్రం ఇష్టం లేదు. తను వెంటనే అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోతే అన్ని చిక్కులూ తొలగిపోతాయ్.
    "నా మాట విని నన్ను బావ వాళ్ళింటికి పంపించేయండి" అందామె దీనంగా.
    భవానీ శంకర్ ఆమె మాటలు వినిపించుకోలేదు. అతని కళ్ళముందు తను చూసిన అనేక తెలుగు ఇంగ్లీష్ సినిమాలు కనబడుతున్నాయ్. చాలా వాటిల్లో హీరో డబలాక్షన్ . కొన్నిట్లో హీరోయిన్ డబలాక్షన్- ఏ డబల్ యాక్షన్ సినిమాకయినా క్లెయిమాక్స్ ఒక్కటే. ఒక్కటే పోలికలున్న హీరోలు లేక హీరోయిన్ లు ఒకరి స్థానంలోకి ఒకరు పొరపాటున వెళ్ళటం. అక్కడి నుంచి అన్నీ థ్రిల్లింగ్ సీన్స్! ఇప్పుడు ఇక్కడా అదే జరగాలి. జరిగితే గానీ మొత్తం కధ వెనుక కధ బయటకు రాదు. అంటే-
    హుషారుగా విజిల్ వేశాడతను.
    "సెన్సేషనల్ ప్లాన్ దొరికింది కామ్రేడ్ శ్యాం! ఇది పకడ్భందీగా అమలు జరపామంటే ఈ అడ్రస్ బుక్ ఫజిల్ సాల్వ్ చేసేయవచ్చు.'
    "ఏమిటది?" అడిగాడు శ్యాం.
    "స్మితారాణిని మనం సంధ్యారాణి స్థానంలో ప్రవేశపెడదాం."
    "అంటే ?" అర్ధంకాక అడిగింది అఖిలభాను.
    'అంటే స్మితారాణి సంధ్యారాణి తొడిగే జీన్స్ లాంటి దుస్తుల్లో అదే గెటప్ లో రేపే కామ్రేడ్ మాధవరావ్ ఇంటికెళుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో మనందరం వేచి చూద్దాం."
    స్మితారాణి ముఖంలో కలవరపాటు కనిపించింది.
    "భవానీశంకర్ గారూ! దయచేసి నా దారిన నన్ను పోనీండి. అనవసరంగా నా వల్ల మీరు మరికొన్ని సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమో.........."అంది ఆందోళనగా.
    "ఇంత దూరం జోరపడ్డాక మధ్యలో వెనక్కు తిరిగి పారిపోవటం ధీరుల లక్షణం కాదని ఎక్కడో చదివాను కామ్రేడ్! అదీగాక మనం వాళ్ళను వదిలేసినా వాళ్ళు మిమ్మల్ని వదులుతారన్న నమ్మకం నాకు లేదు. ఏ క్షణాన్నయినా మీరే సంధ్యారాణి అనుకుని మీ ప్రాణానికి అపాయం కలిగించవచ్చు."
    "కలిగిస్తే కలిగించనీయండి! ప్రాణం మీద నాకు మరీ అంత తీపేమీలేదు --------" నిరాసక్తతతో అందామె.
    భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
    "మీకు లేకపోవచ్చు స్మితాజీ! కానీ మీ ప్రాణాలమీద మాకు చాలా తీపి ఉంది! అంచేత దయచేసి నేను చెప్పినట్లు చేయండి. హాపీగా మనందరం కలిసి గూప్ ఫోటో దిగేయవచ్చు - ఏమంటావ్ కామ్రేడ్ శ్యాం?"
    "ఉపాయం చాలా బావుందనుకో! కానీ ఇందులో స్మితకు ఇంకేమయినా ప్రమాదం ఉందా అని ఆలోచిస్తున్నాను."
    "డోంట్ వర్రీ కామ్రేడ్! మనం స్మితారాణిని బాడీగార్డుల్లా కనిపెట్టుకొనే ఉంటాం! మనమే కాదు కామ్రేడ్ అఖిలభాను వదిన కూడా రంగంలోకి దిగుతుంది."
    "స్మిత కోసమయితే నేను రెడీ" అంది అఖిలభాను ఉత్సాహంగా.
    "నేనూ రడీ" అంది తులసి.
    "ఓ! ఒందర్ పుల్ స్పిరిట్ కామ్రేడ్!" హేవతన్ హేవతన్" అంటూ దేశభక్తి గీతం పాడటం ఒక్కటే తరువాయి - అల్ రైట్! ముందు ప్రోగ్రాం చాకవుట్ చేదాం. ఇవాళ రాత్రికే స్మితారాణి మోడ్రన్ డ్రస్ లో మాధవరావ్ భవనం ముందు టాక్సీ దిగుతుంది. తిన్నగా లోపలకు నడుస్తుంది. దారిలో ఎవరు పలుకరించినా పలక్కూడదు. ఆఖరికి మాధవరావు పలుకరించినా కూడా ముక్తసరిగా "అబ్బా! తలనొప్పి అర్జంటుగా డాక్టర్ ని పిలవండి" అనేయాలి. దాంతో డాక్టర్ రావటం, మందులివ్వటం , ఉదయం వరకూ ఎవ్వరూ డిస్టర్బ్ చేయక పోవటం జరుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఇంచు మించుగా అన్ని విషయాల్ని అందరు వ్యక్తుల్ని గమనించేందుకు పన్నెండు గంటల సమయం దొరుకుతుందన్నమాట. ఈ పన్నెండు గంటల్లో ఒక కుటుంబాన్నే కాదు! ఒక దేశాన్ని కూడా పరిశీలించేయవచ్చునని అన్నారెవరో" వాడ్డూ యూ సే కామ్రేడ్ శ్యామ్?"
    "సింప్లీ సూపర్బ్ అండ్ బ్రిల్లియేంట్ అయిడియా!" అన్నాడు శ్యామ్.
    "మరి నా పాత్ర ఏముందిందులో?" అడిగింది అఖిలభాను.
    "సంధ్యారాణి ఫ్రెండు ననేవంకతో ప్రతి అరగంటకో, గంటకో బయటేక్కడి నుంచయినా ఫోన్ చేసి స్మితారాణి బాగోగులు కనుక్కుంటుండాలి. టెలిఫోన్ సంభాషణలో మనమాడే నాటకం గురించి ఒక్క ముక్క మాట్లాడినా గానీ ఇంటర్ కం ద్వారా , మాధవరావుకి తెలిసిపోయే అవకాశం వుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra