Home » Suryadevara rammohan rao » అక్షరయజ్ఞం

 

      ఆమె ఓ క్షణం ఆగి ఒకింతసేపు ఆలోచనలకు బ్రేక్ వేసి తనెటు వెళుతున్నట్టు? అని ప్రశ్నించుకుంది. సమాధానం దొరకలేదు.
   
    తను తన ధ్యేయాన్ని మర్చిపోయి మాధుర్ గురించి ఎక్కువాలో చిస్తున్నానా అని ప్రశ్నించుకుంది- దానికి సమాధానం తట్టలేదు.
   
    అసలవన్నీ ఇలా వుంచినా, మాధుర్ కి డబ్బున్నవాళ్ళంటే ఎందుకింత ద్వేషం? ఎంతో వివేకంగా ఆలోచించగల మాధుర్ ద్వేషానికి బలమైన కారణమేదో వుండి వుండాలి ఏమిటది?
   
    ఆమె మరోసారి ఉలిక్కిపడింది.
   
    ఇక లాభం లేదన్నట్టు సీట్లోంచి లేచి మాధుర్ రూమ్ లోకి వెళ్ళింది.
   
    మాధుర్ తలవంచి ఏదో రాసుకుంటున్నాడు.
   
    ఆమె అలాగే మౌనంగా అతనికేసి చూస్తుండిపోయింది.
   
    అతన్ని డిస్ట్రబ్ చేయడం ఆమెకిష్టం లేదు.
   
    ఓ పదినిమిషాలకి అతనే తలెత్తి చూసి కూర్చో అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు.
   
    ఎక్కడ కూర్చోను అన్నట్టు ఆమె కనుబొమ్మల్ని విల్లంబులా తిప్పింది.
   
    అతను చప్పున తన పరధ్యానాన్ని గుర్తించి "చూశావా... ఎంత పేదవాళ్ళ దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటున్నానో?" అని నవ్వాడు.
   
    "సారీ... కుర్చీలేదని నీ పేదరికాన్ని ప్రశ్నించాలను కోలేదు... అయినా యిక్కడ కూర్చుంటాగా" అని కొద్దిగా మునికాళ్ళ వేళ్ళపై పైకి లేచి మాధుర్ ముందున్న టేబుల్ మీద కూర్చుంది.
   
    "సరదాగా నీకో చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. పెట్టనా?" అంది తమాషాగా కనులు ఎగురవేసి తలాడిస్తూ.
   
    "నో ప్రాబ్లం...మనకి పెట్టుబడి సమకూరేవరకు పనేముంది? చెప్పు?" అన్నాడు తన ముందున్న సమస్యల్ని మర్చిపోయి క్షణకాలం ఆమెకేసి చూస్తూ.
   
    "నాకిప్పుడు హఠాత్తుగా అంటే... ఓవర్ నైట్ లో దేశవ్యాప్తంగా పేరు రావాలి. ఎలా....? ఓ కండిషన్- పాజిటివ్ గా రావాలి. అదింత వరకు ఎవరు చేయనిది- ఎవరికీ తట్టనిది అయి వుండాలి... బట్ ఆ విషయం కాని, వారిలో ఇన్ వాల్వ్ అయ్యేవాళ్ళు కాని మనకు చిరపరిచితం కావాలి. చెప్పగలవా? అన్ని వర్గాల్లో సంచలనం సృష్టించాలి. చెప్పగలవా? పమెల్లా బోర్డెస్ కథలు చెప్పొద్దు" అని చెప్పవలసింది చెప్పి ఆసక్తిగా మాధుర్ కేసి చూడసాగింది.
   
    మాధుర్ నవ్వాడు ఓ క్షణం.
   
    "ఓ లక్ష ఖర్చుపెట్టేలా అయితే చెప్పగలను. లేదన్నా చెప్పగలను. ఏది కావాలి."
   
    "లక్ష ఖర్చు..."
   
    "అయితే ఓ పని చేయ్" అతనో క్షణం ఆగాడు.
   
    ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
   
    "ఇండియన్ ఎక్స్ ప్రెస్- ఆల్ ఎడిషన్స్, హిందూ ఆల్ ఎడిషన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లో చిన్న ప్రకటన ఇస్తే సరిపోతుంది."
   
    "ఏమిటది?"
   
    "నెహ్రూ కుటుంబంలో విజయలక్ష్మీ పండిట్ స్థానాన్ని ఆక్రమించే దెవరు? భావిభారత ప్రధాని ఎవరు?
   
    నేను మాత్రం ప్రియాంకా గాంధీ అనుకుంటున్నాను.... అని పైన వ్రాసి క్రింద మౌనిక, ప్రియాంకా గాంధీ అభిమాన సంఘం. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు అని ఇవ్వు చాలు- ఇక ఆ తరువాత చూడు- అధికార పార్టీకి నీవంటే అభిమానం పుట్టుకొస్తే- ప్రతిపక్షాలకు నీవో ప్రత్యేకమైన అంశమైపోతావు.
   
    అధికార పార్టీవాళ్ళు దేశాన్ని పాలించే అర్హత నెహ్రూ కుటుంబానికే వుందని అరిస్తే, ఎప్పుడూ వాళ్ళే దేశాన్ని పాలించాలా అని ప్రతిపక్షాలు ఆరుస్తాయి. చిన్న కార్యకర్త దగ్గర్నుంచి జాతీయస్థాయి నాయకుల వరకు నీ గురించే ఆలోచిస్తారు. చేస్తావా?" అతనూ నవ్వుతూనే చెప్పాడు.
   
    ఆమె అలాగే కళ్ళప్పగించి, కనురెప్ప వేయడం కూడా మరిచిపోయి అతనికేసే చూస్తుండిపోయింది.
   
    నిజంగా సంచలనం సృష్టించే వార్తే?
   
    నెగిటివ్ కాదు.....
   
    ఎవరూ హర్ట్ కారు...
   
    కానీ సంచలనం సృష్టిస్తుంది.
   
    "మరో చిన్న పరీక్ష..."
   
    "చెప్పు."
   
    "జె.జె. ఎంఫైర్..."
   
    మౌనిక మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ "దాని గురించెందుకు మనకు?" అసహనంగా అన్నాడు మాధుర్.
   
    "మనకి అవసరం అనికాదు. మనిద్దర్నీ అవమానించిన ఆ సంస్థతో నాకు పనేం వుంటుంది? కానీ చిన్న అనుమానం... మనలో మాటే."
   
    "ఏమిటది?"
   
    "జె.జె. ఆటోమొబైల్ డివిజన్ తయారుచేసిన వ్యాన్స్, ఎక్యుమిలేట్ అయిపోయాయి ఎందుకని?
   
    అంత పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ తయారుచేసిన వ్యాన్స్ గోడౌన్స్ లో మిగిలిపోవడం ఆశ్చర్యంగా వుంది. నాకు ఆ కంపెనీ గతంలో సంపాదించు కున్న ఇమేజ్ అంతా ఏమయిపోయింది? బ్రాండ్ నేమ్, ఇమేజ్, గుడ్ విల్ ఏం వర్కవుట్ కాలేదు. ఇదెలా సాధ్యం? జస్ట్ నా ఆసక్తి కోసమే అడుగుతున్నాను."
   
    అతను కొద్ది క్షణాలు మౌనంగా వుండి అప్పుడు కుర్చీలోంచి లేచాడు.
   
    "వ్యాన్స్ జనరల్ గా ట్రాన్సు పోర్టుకి వాడతాం. ట్రాన్సు పోర్టుకి వాడే వ్యాన్సు స్ట్రాంగ్ గా వుండాలి. ఎలాంటి రోడ్లలోనైనా, ఎలాంటి వత్తిడులకైనా, ఒడిదుడుకులకైనా తట్టుకోగలగాలి. కానీ జె.జె. డివిజన్ తయారుచేసిన వ్యాన్స్ డెలికేట్ గా వున్నాయి. అవి సిటీలో మాత్రమే తిరగగలవు. లాంగ్ డిస్టెన్స్, గతుకుల రోడ్లపై అంతగా నడవలేవు."
   
    "ఎందుకని? క్వాలిటీ లోపించిందా?" ఆమె చటుక్కున అడిగింది.
   
    "క్వాలిటీ వుంది. స్ట్రాంగ్ బాడీ కాదు. మారుతీకారు మంచిదే- పెట్రోల్ కన్ జంప్షన్ కూడా అబాగానే వుంటుంది. కాని లాంగ్ డిస్టెన్స్ కి అంతగా పనికిరావు. సైకిల్ వచ్చి గుద్దినా బాడీ సొట్టబడిపోతుంది. అలాగే ఇది."
   
    "అయితే దాన్ని వాళ్ళు అమ్ముకోలేరా?" ఆమె ప్లాన్డ్ గా మాధుర్ ని తనకు కావాల్సిన వేపుకు డ్రైవ్ చేస్తోంది.
   
    "అమ్ముకోగలరు. కానీ క్వీన్ ఎడ్వర్టయిజింగ్ ఏజన్సీ అనే ఒక స్టుపిడ్ ఏజన్సీకి తను వ్యాన్ పబ్లిసిటీ కేంపైన్ అప్పచెప్పారు. వాళ్ళు స్ట్రెయిట్ కేంపైన్ యిచ్చారు. ఎడ్వర్టయిజింగ్ ఫీల్డులో ఏ మాత్రం కామన్ సెన్స్ వున్నవాళ్ళయినా అలా చేయరు. నాకెందుకో కావాలనే అలా చేసారని అనుమానం."
   
    "అంత సాహసం చేయగలదా ఓ ఏజన్సీ?"
   
    "చేయలేదు. కానీ అందుకు జె.జె. ఎంపైర్ లో ఉన్నత పదవిలో వున్న ఒక వ్యక్తి సహకారం వుందని నా అనుమానం.
   
    మౌనిక ఓ స్కహనం ఉలిక్కిపడింది. తమ ఎంపైర్ లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్ళూ..? భయంతో ఒళ్ళు జలదరించిందో క్షణం.
   
    తనలో రేగిన భావాల తీవ్రతను ముఖంలో కనబడకుండా జాగ్రత్త పడుతూ "వాళ్ళెలాపోతే మనకేమిటి? అసలు మనమైతే ఆ వ్యాన్సుని ఎలా అమ్మగలిగేవాళ్ళం?" ఆమెలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది.
   
    అతను కొద్దిక్షణాలేం మాట్లాడలేదు.
   
    ఆమె గుండెల్లో రాయి పడ్డట్టయింది. మాధుర్ చెప్పడా? చెప్పేందుకు ఇష్టపడడా? ఎందుకని? తనను నమ్మడం లేదా? మొదటి మెట్టుపైనే అపజయం ఎదురవుతుందా?
   
    ఆ కొద్దిక్షణాలలోనే ఆమెలో రేగిన ఉద్రిక్తత, ఉద్వేగం, ఆతృత, ఆసక్తి ఆమెను పిచ్చిదాన్ని చేశాయి.
   
    " నా దగ్గర కూడా రహస్యమా?" ఆమె కావాలనే నిష్టూరాన్ని తన గొంతులో పలికిస్తూ అడిగింది.
   
    "అదేం లేదు. ఒకే ఒక్క స్లోగన్ ఆ కంపెనీ వ్యాన్సుని హాట్ కేక్స్ లా అమ్మిపెట్టగలవు."
   
    "ఏమిటది?" బుల్లెట్ లా వచ్చిందా ప్రశ్న ఆమె నోటినుంచి ఆమెలో తొంగిచూసిన ఏంగ్జయిటీ అతని దృష్టికి రాకుండా తృటిలో తప్పిపోయింది.
   
    అతని దృష్టికి వచ్చినా, అతనికే మాత్రం అనుమానం వచ్చినా ఆ రోజుతో ఆమె చాప్టర్ అతనివద్ద క్లోజ్ అయిపోయేది.
   
    The most spacious car on the road అనే స్లోగన్ ని బాగా ప్రాజెక్టుచేసి క్రింద అందులో కనీసం ఏడెనిమిదిమంది కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనే విషయాన్ని డిఫరెంట్ ఫోటోస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాలి. నలుగురు వెళ్ళే కారు పెట్రోలు ఖర్చు ఎనిమిదిమందిని తీసుకెళ్ళగల జె.జె. వ్యాను ఖర్చూ ఒక్కటే. దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారు?
   
    'At 60 miles per hour, loudest noise in this JJ spacious from the electric crock.
   
    When JJ car engineers tested their autos, they used stethoscopes to listen to the motor, మాధుర్ కొద్ది క్షణాలాగాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra