"ఇది గొప్ప శుభవార్తెం కాదుగా! పోగొట్టుకున్న దానిని సంపాదించుకోవటం"
శ్రీకాంత్ కి చిరాకేసుకొచ్చింది "సరే - వస్తావా రావా?"
"బస్ వస్తుంది"
"ఇడియట్" లోపల్లోపల అనుకోని కార్ ముందుకి పోనిచ్చాడు శ్రీకాంత్.
మధ్యాహ్నం బిజిగా వున్న సమయంలో ఫోన్ వచ్చింది.
"హలో - శ్రీకాంత్ హియర్-"
"నమస్కారమండీ!"
"నమస్తే - ఎవరు?"
"నేను రమేష్ ని మాట్లాడుతున్నాను . తరుణ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ ని!"
"చెప్పండి! ఏమిటి విశేషం?"
"రేపే మా లేడీస్ వింగ్ ఫంక్షన్! మీ శ్రీమతి తో రావాల్సిందిగా ఆహ్వానించాం. ఇంట్లో లేకపోవడం వల్ల......"
"ఒక్క నిముషం నేను చెప్పేది వింటారా?" అన్నాడు శ్రీకాంత్.
"ఏమిటండీ........."
"నాకింకా వివాహం కాలేదు. మీరేమో నా శ్రీమతి అంటూ ప్రొసీడ్ అయిపోతున్నారు."
అవతలి వ్యక్తీ ఓ క్షణం నిశ్శబ్దం అయిపోయాడు. "మరి ఆ రోజు మా ఫంక్షన్ కి ఆహ్వానించదానికొచ్చినపుడు......."
"ఆ! అవునవును!అక్కడా మీదే పొరబాటు ! నా పక్కన వున్నామే నా ఫ్రెండ్ మిసెస్! మీ మిసెస్ ఆమెని చూసి నా భార్య అనుకుని మాట్లాడి వెళ్ళిపోయారు.
"ఓ ఆయామ్ సారీ దెన్"
"దట్సాల్ రైట్! ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చారు?"
"అతనెవరో తెలీదు. హాలులో కూర్చుని వున్నారు. మీ బంధువునని చెప్పారు."
"ఒకే - వుంటానిక ------" ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు శ్రీకాంత్.
అతను సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి చలపతి ఇంకా ఇంటికి రాలేదు. శ్రీకాంత్ లోపల గదిలో దీనంగా విచారంగా కూర్చుని వున్న సావిత్రిని గమనించి అక్కడే నిలోఅబదిపోయాడు కొద్ది క్షణాలు. ఆమె ఎందుకలా వుంది? ఏ విషయం గురించి బాధపడుతోంది?
చలపతిలో అంత మర్పెందుకు వచ్చింది? వారిమధ్య ఏదో గొడవ జరుగుతోంది. అదేమిటో తెలియటం లేదు. చలపతి తనకు చెప్పకపోయినా , సావిత్రి నడిగి తెలుసుకోవటం కష్టమేమీ కాదు.
నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడతను.
"సావిత్రిగారూ......"
సావిత్రి త్రుళ్ళిపడి కుర్చీలో నుంచి లేచి నిలబడింది. అతని చూడగానే చటుక్కున చేతితో బుగ్గల మీదకు జారుతున్న కన్నీటినీ తుడిచేసుకుని చిరునవ్వు నవ్వింది.
"మీరు రావటం చూడనేలేదు. టీ తెచ్చిస్తానుండండి" అంది వంటింటి వేపు నడవబోతూ.
ఆమె కంటే వేగంగా నడిచి దారికడ్డంగా నిలబడ్డాడు శ్రీకాంత్. "నాకేం వద్దు అలా కూర్చోండి" మీతో మాట్లాడాలి......" అన్నాడు సీరియస్ గా.
సావిత్రి కలవరపడింది. "ఏమిటి ? ఏం మాట్లాడాలి?" అంది భయంగా.
"ముందు మీరు అలా కూర్చోండి........."
ఆమె నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది.
"ఇప్పుడు చెప్పండి! మీరెందుకు దిగులుగా బాధపడుతూ కనబడుతున్నారు? ఏం జరిగింది? చలపతి కూడా ఏమిటేమిటో అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు. వాడి గొడవంతా వుద్యోగం లేకపోవడం వల్లనేమో అనుకున్నానిన్నాళ్ళు . కానీ ఇవాళ అస్సలు కారణం అది కాదని తెలిసిపోయింది. వాడికి వుద్యోగం వచ్చినా కూడా వాడి ధోరణిలో మార్పేమీ రాలేదు! అంటే దీని అర్ధం .......వుద్యోగం లేకపోవటానికి వాడి ప్రవర్తనకూ ఏమి సంబంధం లేదనేగా?"
సావిత్రి తెల్లబోయింది.
"ఆయనకు వుద్యోగం వచ్చిందా?" అంది నమ్మలేనట్లు.
"అంటే - మీకూ ఈ విషయం చెప్పలేదా?"
ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచినాయ్. జవాబు చెప్పలేకపోయింది.
"బాగుంది! ఇకా నాకొక్కడికే చెప్పకుండా దాచాడేమో అనుకున్నాను."
సావిత్రి కేం మాట్లాడాలో తెలీడం లేదు. బిగ్గరగా ఏడ్చేయాలని ఉంది.
"సావిత్రీ! దయచేసి చెప్పండి! ఏం జరిగింది? మీ మధ్య ఏమయినా....."
"..........."
"మాట్లాడండీ సావిత్రీ! ఏం జరిగిందో తెలుసుకునే స్వాతంత్ర్యం కూడా నాకు లేదా? నా ఎదురుగానే మీరిద్దరూ మసులుతుంటే ఎంత అనీజీగా వుంటుంది నాకు? మీరిద్దరూ నాకేమీ కాకపోతే - నా ఇంట్లో అద్దె కున్నవారయితే నా కనవసరం! నేను పట్టించుకునేవాడిని కాదు......."
ఆమె ఇంక తమాయించుకోలేకపోయింది . దుఖం పొంగుకొచ్చేసింది. చేతులు రెండూ ముఖం మీద కప్పుకుని విలపించసాగింది.
శ్రీకాంత్ నివ్వెరపోయాడు.
"సావిత్రీ! ఏమిటది? దయచేసి ఏడవకండి? జరిగిందేమిటో చెప్పండి. ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆడుకోవడానికి నేనున్నాను కదా?" అన్నాడతను.
కొన్ని క్షణాల తర్వాత గానీ కోలుకోలేకపోయిందామే. అయినా ఏమీ మాట్లాడలేదు.
"నేను పరాయి వ్యక్తీననుకుంటే నాకేమి తెలియగూడదనుకుంటే సరే సావిత్రి గారూ! నేనింకేమీ బలవంతం చేయలేను...."
"ఏం చెప్పనండి! అయన మనసులో దెయ్యం ప్రేవేశించింది. మనిద్దరికీ సంబంధం ఉందన్న అనుమానంతో నన్ను నానా మాటలూ అని హింసిస్తున్నారు. అయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మనిద్దరం భార్యాభర్తల్లా గడిపామట. అందుకే నేను మీ శ్రీమతినయినట్లు ఆహ్వానపత్రికలు కూడా వస్తున్నాయట! ఇదిగో - ఈ ఇన్విటేషన్ అయన కెవరో ఇచ్చారుట - ఇవన్నీ ఎవరికి చెప్పుకోను .........." వెక్కి వెక్కి ఏడ్చేస్తూ అందామె.
శ్రీకాంత్ నిర్ఘంతపోయాడు. అతనికి ఎక్కడి లేని ఆవేశం వచ్చింది.
"ఇడియట్! వాడిలో ఇంత దుర్మార్గం వుందా? ఇన్నేళ్ళుగా నాతొ స్నేహం చేసిన నన్నర్ధం చేసుకుందిదేనా? వాడే ప్రాణంగా చూసుకుంటున్న మిమ్మల్ని ఇంత నీచంగా ట్రీట్ చేస్తాడా? వాడి విషయం తేల్చుకుంటాను .........." అక్కడి నుంచి ఆవేశంగా బయటకు నడిచాడతను.
* * *
నాలుగవుతుండగా నర్సరాజు వచ్చాడు చలపతి దగ్గరికి.
"ఓసారి లారా!......" అన్నాడు నర్సరాజు సీరియస్ గా.
"ఎక్కడికి?" అడిగాడు చలపతి.
"ముందిలారా.........." కోపం అణుచుకుంటూ అన్నాడతను.
చలపతి లేచి అతనిని వెంబడించాడు. ఆఫీసు కెదురుగా ఉన్న హోటల్లోకి నడిచాడు నర్సరాజు. లోపల ఫామిలీ కాబిన్ లోకి వెళుతుంటే చలపతి ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజ్యలక్ష్మి కనిపించేసరికి ఏమి అర్ధం కాలేదు.


