Home » Dr c. ananda ramam » Suryanethram


    ఏ సందర్భంలోనయినా దేవనారాయణ్ ఒక మహారాజులాగ "మా ప్రజలు" అనటం మానడు. కూలీలు అప్పుడే తవ్వకం ఆపేసి యజమానుల ముఖాలు చూస్తున్నారు.
    తవ్వకాలు జరుపుతున్నప్పుడు గ్రామ పెద్దలు కల్పించుకోకుండా వుండరు. తమ కూలీలు తవ్వకాల పనులకి రావటం వాళ్ళకెంత మాత్రం ఇష్టం వుండదు. అందుకు గల కారణాలలో ప్రధానమైనది ఆర్కియాలిజీ డిపార్ట్ మెంట్ కూలీలకిచ్చే రేటు.
    గ్రామ పెద్దలెవరూ గవర్నమెంట్ రేటు ప్రకారం కూలీలకి కూలీలివ్వరు. కూలీల అజ్ఞానం ఆసరాగా తక్కువ కూలీతో పని చేయించుకోవాలని చూస్తారు. ఒకసారి గవర్నమెంట్ కూలీ తీసుకుంటే, మళ్ళీ అదే కూలీ అడుగుతారని పెద్దల భయం. పెద్దల మాట కాదంటే, మళ్ళీ తమని కూలీకి పిలవరని కూలీల భయం!
    అంచేత పెద్దలనే బతిమాలుకోవాలి ఆర్కియాలిజిస్ట్స్ కూలీల కోసం. పెద్దలు కూలీలపైన తామే అనుగ్రహించి ఎక్కువ కూలి (తాత్కాలికంగా) ఇప్పిస్తున్నట్లు కూలీలను పంపిస్తారు. మొదట్లో దేవనారాయణ్, యజ్ఞనారాయణ్ ల ఆమోద ముద్రతో ఏర్పరచుకున్న కూలీలే అందరూ.
    "మీరింకా ఈ కాలంలో కూడా భూతాలనీ ప్రేతాలనీ నమ్ముతున్నారన్నమాట! ఇలాంటి మూఢ నమ్మకాలు వదిలెయ్యాలండీ!" పెద్ద విజ్ఞానిలా అన్నాడు విష్ణు.
    దేవనారాయణ్ షాక్ తిన్నట్లు అయ్యాడు ఆ మాటలకి.
    "రాత్రి అంత జరిగినా ఇంకా మీకు బుద్ధి రాలేదన్నమాట?" అనుకోకుండా మాట జారిపోయాడు. వెంటనే నాలుక కరుచుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
    రవి చాలా నిశితంగా చూస్తున్నాడు అతని ముఖంలోకి. విష్ణు ముఖ కవళికలు కూడా మారాయి. కానీ అతడు చాలా గడుసువాడు. అమాయకత్వం నటిస్తూ "రాత్రి ఏం జరిగింది?" అన్నాడు.
    దేవనారాయణ్ తక్కువవాడు కాడు. అతి త్వరలో తనని తాను కూడదీసుకున్నాడు.
    "రాత్రి మీ టెంట్స్ సమీపం నుంచి చావు కేకలు వినిపించాయి. వాచ్ మెన్ మీలో ఒకడిని భూతం నిలువునా చీల్చిందని చెప్పాడు. ఆనవాలు కూడా మిగల్చకుండా శవాన్ని తినేశాయని కూడా చెప్పాడు. ఈ అనుభవంతో ఇక్కడ భూతాలున్నాయని మీరు నమ్ముతారని అనుకున్నాను. మాకు నమ్మకం ఉంది."
    "ఒకవేళ భూతాలని మేము నమ్మినా వాటికి భయపడి పారిపోము, ఎదుర్కొంటాం" నవ్వుతూ అన్నాడు రవి, చాలా ఛాలెంజింగ్ గా.
    "సరే మీ కర్మ. నా బాధ్యతగా హెచ్చరించాను. మీరే అనుభవిద్దురు గాని..."
    కోపంగా వెళ్ళిపోయాడు దేవనారాయణ్ జీప్ లో.
    ఏం చెయ్యాలో తెలియనివాడిలా నిలబడ్డాడు యజ్ఞనారాయణ్. అప్పుడు విలసిత జీప్ దిగి భర్త పక్కన వచ్చి నిలబడింది. ఎప్పటిలా మేలి ముసుగులోనే వుంది. రవినుద్దేశించి అంది.
    "ధీరులైన వాళ్ళు ప్రారంభించిన పనిని ఎన్ని ఆటంకాలు వచ్చినా మధ్యలో వదిలిపెట్టరని భర్తృహరి చెప్పాడు"
    "మనం పోదాం!" విలసిత మాటలకు భయపడినట్లు అన్నాడు యజ్ఞనారాయణ్.
    "మీరు పని కానివ్వండి" కూలీలను ఉద్దేశించి అంది విలసిత. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టారు. విలసిత భర్తతో వెళ్ళిపోయింది జీప్ లో.
    ఫోర్త్ సెక్షన్ లో ఒక కూజాలాంటి పాత్ర బయటపడింది. అతి జాగ్రత్తగా తీశారు దానిని. పంచ ముఖాలున్నాయి. దానిని పరిశీలించి చూస్తూ అన్నాడు రవి.
    "ఇది గర్భ పాత్ర లాగావుంది. పంచ భూతాలు పంచముఖాల మీద చెక్కి వున్నాయి. పైన వాస్తు పురుషుడు ఉన్నాడు. ఈ పాత్ర గర్భాన్ని చుట్టుకుని వాసుకి, అర్గళ, నాగులు వున్నాయి. ఇవి నిధిని కాపాడే సర్పాలని చెప్పుకుంటారు."
    "అయితే ఈ పాత్రలో నిధి వుందా?"
    ఆ పాత్రని బోర్లించాడు విష్ణు. కొద్దిగా మట్టి రాలింది అంతే.
    "ఈ పాత్ర దొరికింది కాబట్టి, ఈ ప్రాంతంలో నిధి వుండొచ్చు, తవ్వండి. మీకందరికీ బహుమానాలుంటాయి" వాళ్ళని ఊరిస్తూ ప్రోత్సహించాడు విష్ణు. మళ్ళీ తవ్వకాలు సాగాయి.
    ఖనేళ్ మని గునపానికి తగిలింది. అందరూ వంగి చూశారు. రాతిపలక. అడ్డదిడ్డంగా పడినట్లు లేదు. ఎవరో అతి జాగ్రత్తగా పేర్చినట్లుగా వుంది. తొమ్మిదంగుళాల వెడల్పూ, ఏడడుగులు పొడవూ వుంది.
    "ఆగండి. ఈ రాతి పలకని పగలకొట్టొద్దు. అందరమూ కలిసి జాగ్రత్తగా దాన్ని పైకి తీయటానికి ప్రయత్నిద్దాం?" అన్నాడు విష్ణు. రవి ఒప్పుకున్నాడు.
    కూలీలు జాగ్రత్తగా రాతి పలక చుట్టూ వున్న మన్ను తవ్వి తీశారు. పట్టుకోవటానికి వీలిచ్చింది. పదిమంది అటు పదిమంది ఇటు అతి జాగ్రత్తగా పట్టుకుని కష్టంమీద ఆ రాతి పలక పక్కకు లాగారు. దానికింద ఏముందోనని చూశారు అంతా.
    గుండెలవిసిపోయే గావు కేకలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతటా పలుగులూ, పారలూ, తెచ్చుకున్న అన్నాలూ అన్నీ ఎక్కడివక్కడ పారేసి వెర్రిగా అరుచుకుంటూ పరుగులు తియ్యసాగారు జనం.
    రాతిపలక కింద గోతిలో కనిపించిన నిధి మానవ అస్థిపంజరాలు! అవి చాలాకాలం కిందటివి కావనీ, ఇటీవలివేననీ, వాటికి ఇంకా అంటుకుని వేలాడుతున్న మాంస శకలాలూ, పూర్తిగా ఊడిపోని తల వెంట్రుకలూ, ముక్కులు పగలగొట్టే దుర్వాసన చెప్తున్నాయి. పరమ బీభత్సంగా ఉంది ఆ దృశ్యం. పెద్దగా వీస్తున్న గాలి, దెయ్యాలు విరగబడి నవ్వుతున్నట్లే ఉంది.
    గట్టుమీద ఉన్న జెన్నిఫర్ కేకలేసి స్పృహతప్పి పడిపోయింది. అనిలని త్రిసికి ఎప్పుడో, ఎలాగో అక్కడినుంచి తీసుకుపోయింది. మతి తోచని వాడిలా నిలబడిపోయాడు విష్ణువర్ధన్. రవి ఒక్కడే ఒంటరిగా గోతిలో అస్థిపంజరాల మధ్య ఉండిపోయాడు.
    "ప్లీజ్ హెల్ప్ మీ" అని అరిచాడు విష్ణువర్ధన్ ని ఉద్దేశించి. అప్పటికి చైతన్యం తెచ్చుకుని, గోతిలోకి నిచ్చెన దింపి, వదలకుండా పట్టుకున్నాడు విష్ణు. రవి బయటకు వచ్చాడు. ముఖం మీద నీళ్ళు జల్లగానే తేరుకుంది జెన్నిఫర్.
    "మళ్ళీ ఆ గోతిలోకి చూడకండి. తిన్నగా మన టెంట్స్ కి వెళ్దాం, పదండి తర్వాత ఆలోచించుకోవచ్చు" అన్నాడు రవి.
    నిలువునా వణుకుతోంది జెన్నిఫర్. మాటిమాటికీ క్రాస్ గుర్తు గుండెలమీద వేసుకుంటూ విష్ణు చెయ్యి గట్టిగా పట్టుకుని నడిచింది.
    టెంట్స్ చేరుకున్నారు. త్రిసికి అందరికీ కాఫీలు తెచ్చింది. వద్దనకుండా తాగారు. అందరిలో మనిషిలా తిరుగుతున్నది త్రిసికి ఒక్కర్తే! ఎవరి టెంట్స్ లో వాళ్ళు ఒంటరిగా ఉండలేకపోయారు. అందరూ రవి, విష్ణుల టెంట్స్ లోకి వచ్చి కూర్చున్నారు.
    "ఏం చేద్దాం? వెళ్ళిపోదామా?" కొంత అయిష్టంగానే విధిలేక అంటున్నట్లు అన్నాడు విష్ణు.
    రవి సమాధానం చెప్పలేదు. రాను రాను ఈ తవ్వకాలతో మరిన్ని ఇబ్బందుకు ఎదురవుతున్నాయి. కూలీలు రారు, ఆ గొయ్యి తవ్వటానికి! ఒంటరిగా, దుర్వాసన కొడుతోన్న ఆ అస్థిపంజరాలు తీసిపారేస్తూ ఇంకా లోతుకి తవ్వటం సాధ్యమేనా? ఇంతకీ ఆ గోతిలోకి ఆ అస్థిపంజరాలెలా వచ్చాయి? ఆ అస్థిపంజరాలలో కొన్ని నిలువునా రెండుగా చీలి ఉన్నాయి.
    మెరుపులా స్ఫురించింది రవికి. ఆ శరీరాలన్నీ ప్రకాశంలా చంపబడ్డవే? భయంతో జుగుప్సతో శరీరం జలదరించింది. రహస్యం ఛేదించాలనే పట్టుదల ఒకవైపు, మృత్యురూపంలో భయపెడుతున్న ప్రమాదం మరోవైపు.
    అతడి చేతిని అతి చల్లగా ఉన్న మరో చెయ్యి చుట్టింది. తలతిప్పి చూడకుండానే అది అనిల చెయ్యి అని గ్రహించాడు. చమటతో తడిసిన భయంతో వణుకుతున్న ఆ చెయ్యి అతనికి చాలా చెప్పింది. ధైర్యం చెపుతున్నట్టు ఆ చేతిని తన చేత్తో మృదువుగా నొక్కి వదిలేశాడు.
    విష్ణు బలహీనత రవికి తెలుసు, అదే ఉపయోగించుకోవాలనుకున్నాడు.
    "అస్థిపంజరాలని చూశాక ఇక్కడ నిధి ఉందనే నమ్మకం బలపడుతోంది నాకు!" అన్నాడు.
    "ఎలా?" కుతూహలంతో అడిగాడు విష్ణు. అప్పటికప్పుడే వెళ్ళిపోదామన్న అతడి నిశ్చయం సడలిపోసాగింది.
    "నిధి ఉంది కాని రహస్యం. బహుశా కొందరికి తెలిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళెవరైనా ఆ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు హత్యలు జరుగుతున్నాయి. అవే ఆ అస్థిపంజరాలు!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra