Home » Yamini saraswathi novels » అందాల జాబిలి


    "క్షమించండి! మీలాటి గొప్పవారు మా యింటికి వస్తే తగినట్లు ఆతిధ్యం యివ్వలేకపోతున్నాను!"
    "నో! నో! నథింగ్ ఆఫ్ దసార్ట్ - నా ఉద్దేశ్యం మనం యిక్కడే---"
    "మాటాడుకుందాం?" రవి పూర్తిచేశాడు.
    "గుడ్ - యు ఆర్ వెరీ స్మార్ట్!" పైప్ పొగ దులిపేడు ఆయన కారుకి చేరగిలబడ్డాడు.
    రవి ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు.
    "యుసీ! ది సీజ్ టాప్ సీక్రెట్! అందుకే డ్రైవర్ని కూడా తెచ్చుకోలేదు - ఇక్కడికి ఎవరూ రారుకదా! అదర్ వైజ్ కారులో మాటాడుతూ వెళదామా?"
    రవికి యిలాంటివి యింతకు పూర్వం అనుభవంలో లేకపోయినా యిప్పుడిప్పుడు ఈ రెండు రోజలుగా అంతా అనుభవానికి వస్తూనే వుంది. డబ్బుకి ఎంత ఆకర్షణ! ఎంత విలువ!
    "మీ యిష్టం!"
    "అయితే కారులో కూర్చో!"
    "మా పిన్నితో ఒక్కమాట చెప్పి వస్తాను."
    "ఇదిగో అబ్బాయి! అడక్కుండానే ఓ సలహా పారెయ్యనా?"
    "... ... ..."
    "అదో -మౌనం అర్ధంగికారంలే! నాకు తెలిసిపోయింది. చూడు, ఎప్పుడూ ఆడవాళ్ళని సలహా అడక్కు! అడిగాడో! ప్రధానమంత్రి పదవిలో వున్నా మెజారిటీ పడిపోయి రాజీనామా యివ్వాల్సిందే - పార్లమెంటు రద్దుచేసి ఎలక్షన్సికి నిలబడాల్సిందే - అధికారం పోగొట్టుకోవలసిందే అంచేత సుబ్బరంగా నీ అంతకి నువ్వు లోకాన్ని నరుక్కుంటూ వెళ్ళు--- అంతే."
    రవి ముఖం జేవురించింది... ఏదో చెప్పబోయాడు.
    "నాతో వాదించకు - అంతే. అది నా సలహా. దట్సాల్"
    తిరిగొచ్చి డోర్ తెరిచి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ తెరిచి "కమాన్" అన్నాడు ఆయన.
    అయిష్టంగానే ఎక్కేడు రవి.
    తనకిదేం కొత్తా? సభలూ, సమావేశాలూ వుంటే సన్మానపత్రాలకోసం తన చుట్టూ తిరుగుతారు. కార్లలో తిప్పుతారు. ఆ కాస్త పని అవగానే ఎక్కడంటే అక్కడ దించేసి వెళతారు. తన వద్ద సిటీబస్ కి కూడా డబ్బులుండవు. తిట్టుకుంటూ నీరసంగా నయినా నడవాల్సివచ్చేది.
    కారు కాలనీ దాటి రోడ్డుపైకి వచ్చింది.
    "సిగరెట్" గోల్టెన్ కేసు తెరిచాడు ఆయన.
    "నో-థాంక్స్"
    "వెరీగుడ్ - మంచి అబ్బాయివే మంచినీళ్ళు అలవాటా?"
    ప్రశ్నార్ధకంగా చూశాడు రవి.
    "గవర్నమెంటు నీళ్ళు-" పకపక నవ్వాడు.
    రవి ముఖం ఎర్రబడింది.
    "అయాం సారీ - బిజినెస్ టర్మ్ మాటాడుకోబోయే ముందు యివి ఫార్మాలిటీస్ - పోనీ ఎక్కడయినా టిఫిన్, కాఫీ---"
    "అక్కరలేదు" కఠినంగా అన్నాడు రవి.
    "ఆల్ రైట్ --- ఆల్ రైట్---"
    కారు ఊరు వదిలి రోడ్డు పట్టుకుని మిల్క్ డైరీని దాటేసింది. చల్లగా వుంది వాతావరణం. ఎత్తయిన చెట్లు అటు యిటూ పెరిగి వేసవిలోనయినా ఊటీలో ఉన్నట్టుగా అనిపించేట్టుగా వున్నాయి --- అశోకుడు బాట కిరువైపులా చెట్లునాటించే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది. ఇంకా ఈ దేశంలో అది ఆయన కీర్తి చిహ్నంగా వుంది అనుకున్నాడు రవి.
    దగ్గరలోని నారింజతోట పుంతలో వుంది కాబోలు గాలిపై మధురవాసనలు తేలితేలి వస్తున్నాయి.
    ఆయన కారుని ఓ వారకి తీసికెళ్ళి ఆపుచేశాడు.
    "మనం ఇక్కడే మాటాడుకుందాం."
    రవి ఏమీ అనలేదు.
    ఆయన కారులో ఓ వారగా వున్న సీసా తెరిచి రెండు గుక్కలు తాగేడు. "సారీ - ఇవి నా మంచినీళ్ళు అప్పుడప్పుడు గొంతు తడుపుకోకపోతే చచ్చిపోతాను" అన్నాడు.
    రవికి అసహ్యం వేసింది! ముఖం తిప్పుకున్నాడు.
    "ఎంతివ్వాలి?"
    ఏమిటన్నట్టు చూశాడు రవి.
    "మిస్టర్ రవీ!" ఆయన కంఠం ఖంగున మ్రోగింది. ఠీవి, దర్పం వెలార్చే స్వరం అది. "నేను బిజినెస్ మేగ్నిట్ ని. డబ్బు ఎక్కడున్నా ఆకర్షించటం నా స్వభావం. నీకు లాటరీలో డబ్బొచ్చింది. ఆ టికెట్ నాకు కావాలి."
    దృఢంగా అన్న ఆయన మాటలకి ఆశ్చర్యం వేసింది రవికి. "ఎందుకివ్వాలి?" అన్నాడు నిశితంగా చూస్తూ.
    "చూడు! నన్ను ఎదురు ప్రశ్నించకూడదు ఎవరూ! అది నేను సహించలేను. నా తత్త్వం సహించదు. ఆ టికెట్ యిచ్చెయ్ ఎంతివ్వాలో అడుగు!"
    "నో! ఆ టికెట్ యివ్వను"
    "చూడు రవీ! మూర్ఖించకు - నా మాట విను."
    "ఎందుకు వినాలి?"
    "సెన్స్ లెస్ క్వశ్,న్ --- అలా అడక్కు. అది నా అవసరం - అంతే"
    "ఉహుఁ దోపిడీనా?"
    "దోపిడీ కాదు. రాజీ మార్గం"
    "ఇదేం రాజీ?"
    "ఇదిగో రవీ! యాభయ్ వేలిస్తాను. టికెట్ యిచ్చెయ్"
    అసహ్యం వేసింది రవికి. "ఎందుకులెండి ఫ్రీగా యిచ్చేస్తా."
    "అరవై!"
    "వేలంపాటనా?"
    "నిన్ను చూసి జాలిపడాలో - తిట్టాలో - నీకు లోకంలో డబ్బు విలువ తెలియదు ఆఖరిమాట డెబ్బయ్ అయిదు---"
    ఆయన ఉబలాటం, ఆరాటం చూస్తోంటే వింతగా అనిపించింది. మౌనం వహించాడు రవి.
    ఆత్రం అణచుకోలేని వ్యక్తి ఆయన. అందుకే పాటని లక్షకు పెంచేశాడు.
    "నా టికెట్ నేను కేష్ చేసుకోగలను కదా! నా డబ్బు నాకు యిచ్చేస్తే మీకేమిటి లాభం?"
    ఆయన ముఖంలో ఆశ్చర్యం - మనస్సులో ఏదో మెరుపు - వింతగా చూశాడు.
    "చెప్పండి!"
    తను యింతవరకూ టికెట్ వెయ్యికాక పైగా లక్ష యిస్తానన్న విషయం అర్ధంచేసుకోలేని అతని అమాయకత్వానికి జాలిపడ్డాడు ఆయన. దానితో ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. "బాబూ!" అన్నాడు ఆప్యాయంగా.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra