ఆ లాగడంతో అతను తూలి ఆమెమీద పడ్డాడు. ఆ పడడం కరెక్టుగా ఆమె వక్షస్థలం మీద అతని ముఖం ఆనిపోయింది. తనకోసం తుఫాను కూడా లెక్కచేయకుండా దాదాపు పదిహేను కిలోమీటర్లు నడిచి వచ్చిన అతనికి ఏమిచ్చి సంతోషపడేటట్టు చేద్దామా అనే ఆలోచనే ఆమెకి.
అది ప్రేమో, మోహమో, అభిమానమో తెలియదు. తన ఎదమీద వాలిపోయిన అతని ముఖాన్ని బలంగా మరికాస్తంత లోపలికి అదుముకుంది. చలితో బిగుసుకుపోయిన అతని శరీరం ఆ స్పర్శతో ఒక్కసారిగా వేడిని పీల్చుకుని విప్పారింది.
మన్మథుడి ముందు తుఫాను ప్రభావం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది.
ఆమె ఎద నునుపుకి, గుండ్రటితనానికి రక్తనాళాలు మేల్కొంటున్నాయి.
అతని చేయి పట్టుకోసమన్నట్లుగా ఆమె నడుంమీద పడింది.
"బావా! నాకోసం ఇంత వర్షంలో వచ్చిన నీకు ఏమివ్వను బావా?" భావోద్వేగంలో ఏం చేస్తోందో తెలియక నడుంమీద పడ్డ అతని చేతిని అదుముకుంది. పిడికిలిలో ఇమిడిపోయే ఆమె నడుం ఆ పట్టుకు మరింత సన్నబడింది.
"బావా! నాకిచ్చిన మాట కోసం ఈ తుఫానులో వచ్చావా?" ఆమె మళ్ళీ మళ్లీ అదే అడుగుతోంది.
జవాబు చెప్పడానికి తల పైకెత్తాల్సి వుంటుందని గ్రహించిన చంద్రహాస్ ఆ పనిచేయడం ఇష్టంలేక 'ఊఁ' అని మాత్రం అనగలిగాడు.
ఆమె అతని చొక్కాకున్న బటన్ లు విప్పదీస్తోంది. నీటితో తడిసి పోయిన అతని శరీరం ఆమె చేయి తగిలినచోటల్లా నిప్పుల కుంపటి అవుతోంది.
చొక్కా విప్పడానికి అతను అయిష్టంగానే అక్కడినుంచి తల లేపాడు. కొన్ని లీటర్ల నీటిని తనలో దాచుకున్న చొక్కా కిందకి బరువుగా పడింది.
అతని తలనుంచి దూకుతున్న జలపాతాల్లా ధారగా కారుతున్న నీటికింద తను తడిసిపోవాలన్నట్టు ఆమె అతని ఛాతీలో తలపెట్టుకుంది.
స్వర్గంలోకి గిరవాటేస్తున్న ఆమె ఎద స్పర్శ కోసం అతని చుట్టూ చేయివేసి ముందుకి లాక్కున్నాడు.
ఆమె ఇక ఓపలేక అతనిమీదకు వాలిపోయేటట్టు జరిగింది. ఇద్దరికీ ఆ అనుభవం కొత్త. తరువాత ఎలా ప్రొసీడ్ కావాలో తెలియడం లేదు.
కానీ ప్రకృతే కాసేపు ప్రాక్టికల్స్ చేసి చూస్తున్నట్టు అతని ప్రమేయం లేకుండానే అతని చేయి కిందకు సాగింది. ఆమె కళ్ళముందు సినిమాహాల్లో స్క్రీన్ పైకి లేస్తున్న దృశ్యం కనిపించింది.
ఠక్కున అతని చేయి పట్టుకుంది. ఈ ప్రమాదం తప్పించుకునే లోపు మరో ప్రమాదం జరిగిపోయింది. ఆమె పైట కిందకు జారిపోయి యవ్వనం అద్దెకున్న వూపొదరిళ్ళులాంటి ఆమె ఎద ఇప్పుడు అర్థనగ్నంగా కనిపిస్తోంది.
అతని చేయి పైకి పాకింది.
ఇక ఆమె అడ్డు చెప్పలేకపోయింది.
'వి' నెక్ జాకెట్ కాసేపు వియోగం భరించడానికి సిద్ధపడిపోయినట్లు నిశ్శబ్దంగా కిందకి జారిపోయింది.
దాంతోపాటు ఆమె కూడా.
బయట తుఫాను ఇంకా ఉదృతమైంది. వర్షం తబలా నేర్చుకుంటున్నత్తు లయబద్ధంగా విన్పిస్తోంది.
ఇక సయ్యాట ప్రారంభించండని అత్యుత్సాహంతో ఈలవేసి గాలి వేగానికి ఆరినట్టు కిరసనాయిల్ దీప రెపరెపలాడి చీకట్లో కలిసిపోయింది.
అతను ఆమె మీదకి ఒరిగి వేళ్ళతో సుఖాన్ని వడుకుతున్నాడు.
అంతకు ముందు ఒకరికొకరు అన్నట్టు వుండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరూ ఒకటే అన్న భావనకు వచ్చేశారు.
ఇంత జరిగేటప్పటికి అరగంట గడిచింది. వాళ్ళిద్దరూ ఆ తన్మయత్వాన్ని మాటల్లోకి తర్జుమా చేసుకునేటప్పటికి తొలికూడి కూసింది.
అతను తిరిగి వస్తున్నప్పుడు "నా పుట్టినరోజు బహుమానం ఈ అనుభవం" అంది మధుమతి కళ్ళల్లో ఆనందం నీటి చెమ్మయి తేలుతుండగా.
"నిన్ను పెళ్ళి చేసుకుని బదులు తీర్చుకుంటాను" అని వచ్చేశాడు.
ఊరికి వచ్చేసిన తరువాత సూరిబాబు ద్వారా అమ్మా నాన్నలకు తను మధుమతిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పించాడు.
ఇదంతా అనసూయమ్మ దంపతుల కుట్ర అనీ, ససేమిరా మధుమతిని ఇంటి కోడలుగా చేసుకోమని ఖచ్చితంగా చెప్పేశారు. అవతల నుంచి కూడా అదే విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది.
అందుకే ఓరోజు రాత్రి చంద్రహాస్ మధుమతిని వెంట తీసుకొచ్చేశాడు. ఇంట్లోకి రానివ్వరని తెలిసి అటే ఇద్దరూ సిటీకి వెళ్ళిపోయి గుళ్ళో పెళ్ళి చేసుకుని దంపతులైపోయారు.
పెళ్ళి చేసుకున్నట్టు, తమని ఆశీర్వదించమని ఇద్దరూ ఇళ్ళకు ఉత్తరాలు రాసి పడేశారు.
చంద్రహాస్ సిటీలోని ఓ పెద్ద హాస్పటల్ లో కంప్యూటర్స్ ఇన్ ఛార్జీగా ఉద్యోగంలో చేరాడు. సంవత్సరం తిరిగేసరికల్లా చిన్నూ పుట్టింది.
హాస్పిటల్ లో డ్యూటీ కాగానే బయట కనీసం టీ అయినా తాగడానికి ఆగేవాడు కాదు అతను.
నేరుగా ఇంటికి వచ్చేసేవాడు. భార్యా, పాప తప్ప మరే లోకం లేదు.
అయిదేళ్ళు గడిచిపోయాయి. ఓ మూడునెలల క్రితం ఆనందంగా గడిపే ఆ కుటుంబం పెద్ద విషాదపు సుడిగుండంలో చిక్కుకుపోయింది.
ఆరోజు శనివారం. సాయంకాలం షాపింగ్ కని ముగ్గురూ బజారుకి బయల్దేరారు.
"ఆడా మగా మధ్య వేషంలో ఇంత భేదం వుండటం మంచిది కాదు. అందుకే చిన్నూకి ముక్కు, చెవులు కుట్టడాలూ, జడలూ, పూలూ పెట్టడాలూ వద్దు. ఎంచక్కా బాయ్ కట్ చేద్దాం" అని చిన్నూను సెలూన్ కు తీసుకుపోవడానికి ఎత్తుకున్నాడు చంద్రహాస్.
"అయితే నాన్నా నువ్వు గుండు గీయించుకో. గుండులో ఎలా వుంటావో చూడాలని వుంది నాన్నా" అంది చిన్నూ గోముగా.
"ఓస్ అంతే కదా" అంటూ తండ్రీ కూతుళ్ళు సెలూన్ కి పోతే మధుమతి గాజుగ్లాసులు కొనడానికి ఎదురుగావున్న ఫ్యాన్సీ స్టోర్ లోకి వెళ్ళింది.
ఆమె అవీ ఇవీ కొని సెలూన్ మెట్లెక్కుతుండగా తండ్రీ కూతుళ్ళు దిగుతున్నారు. క్షణంసేపు ఆమె వాళ్ళను గుర్తుపట్టలేక పోయింది. నున్నటి బోడిగుండుతో అతను. బాయ్ కట్ లో చిన్నూ.
"కూతురి సరదాకోసం గుండు గీయించుకున్నావా? రేపు క్లినిక్ కి ఎలా వెళతావు బావా?"
"గుండు గీసుకోవడం ఏమిటే నా చిన్నూ కావాలంటే గుండె అయినా పెకిలించి ఇచ్చేస్తా"
బావ సంగతి తెలిసిందే ఆమెకి.
తనకు ఎప్పుడయినా జ్వరమొస్తే ఆయన కంగారు చూడవలసిందే. బ్లడ్ టెస్టు దగ్గర్నుంచి ఇ.సి.జి. వరకు తీయించేస్తాడు. ఆంజనేయుడు అదేదో మూలికకోసం కొండను పెకిలించుకుని వచ్చినట్టు మొత్తం మెడికల్ షాపునే ఇంటికి తెస్తాడు.
పావలా మాత్రబిళ్ళతో పోయే జ్వరానికి ఏ అయిదువేలో, పదివేలో ఖర్చు పెడతాడు.
ఈ మధ్య చిన్నూకు పచ్చరికలు వచ్చాయి.
జాండీస్ వచ్చిందని విన్న దగ్గర్నుంచి ఆయన బాధ వర్ణనాతీతం. అలోపతి మందులు వాడాడు. ఆకుపసరు తాగించాడు. నూనె తలకు అంటించాడు. ఆ పిల్లతోపాటు ఇంటిల్లిపాదీ ఆ పదిరోజులూ ఒట్టి మజ్జిగన్నం తిన్నారు.
అందువల్లే భర్త గుండు గీయించుకుని ఎదురుగా నిలబడ్డా పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆమె.
పెళ్ళి చేసుకుని తల్లిదండ్రులకి దూరమయ్యాడు. మొదటినుంచీ అతనికి సోషల్ కాంటాక్ట్ తక్కువ. ఇల్లు తప్ప మరేదీలేదు. అందుకే అతను భార్యనీ, కూతుర్నీ అంతగా ప్రేమించేవాడు.


