Home » Attuluri vijaya lakshmi » Oka Koyila Gunde Chappudu

    ఎందుకిలా జరిగింది ? ఏమైంది రాహుల్ కి? 
    తన గొంతు పాడవడంతో తను కూడా పనికి రాలేదా? అతను తన గొంతునే ప్రేమించాడా? తనని ప్రేమించలేదా?

                                   ****

    "హాయ్ సరాగా! ఎలా వున్నావు?" శేఖర్ లోపలికి వచ్చాడు.సరాగ కన్నీళ్లు తుడుచుకుని నవ్వింది.
    "ఏమన్నా ఇంప్రూవ్ మెంట్ వుందా?"
    లేదన్నట్టు తలాడించింది.
    శేఖర్ కొన్ని క్షణాలు మౌనంగా వుండి అన్నాడు "రాహుల్ రాలేదా?"
    సరాగ మాట్లాడలేదు. మొహం తిప్పుకుంది.
    శేఖర్ ఆమెనే చూస్తూ అన్నాడు. "శశిరేఖ తెలుసుగా?"
    సరాగ ప్రశ్నార్ధకంగా చూసింది.
    "శశిరేఖ..... తెలియకేం . స్టఫ్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ధర్డ్ క్లాస్ సింగర్" ఆమె ప్రసక్తి ఎందుకు? అన్నట్లు చూసింది.
    "ఈమధ్య ఆవిడ చాలా షైన్ అవుతోంది. ఎక్కడ చూసినా ఆవిడ పాటలే రెండు ఫెయిల్యూర్ సినిమాల్లోకూడా పాడిందిట. ఈమధ్య నువ్విలా సిక్ అవడం ఆవిడకి బాగా అడ్వాంటేజ్ అయి సడెన్ గా పాపులర్ అయింది."
    "హూ....' పేలవంగా నవ్వింది. అది ఆవిడ అదృష్టం అనుకుంది మనసులో.
    ప్రేక్షకులని సీట్లకు కట్టిపడేసే మంత్రదండం లాంటి స్వరం అమెది. జలపాతం లా దూకుతూ, నదిలా పారుతూ సముద్రంలా కేరింతలు కొట్టే గమకాలూ, అమృతపు ధారల్లో తేనెలో ముంచి తీసిన పంచదార చిలక లాంటి మాధుర్యం నిండి వుండే స్వరం . అలాంటిది ఇప్పుడు.... ఇప్పుడు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది దుఃఖం.
    శేఖర్, సరాగ క్లాస్ మెట్. ఆమె అభిమాని. ఎంతో ఆత్మీయుడు. తన స్నేహితురాలు , తనకెంతో ఇష్టమైన సింగర్ ఇలా అయిపోతే అతని హృదయం ద్రవించి పోయింది.
    "నేనో పని చెప్తాను. చేస్తావా సరాగా?"
    ఎంటన్నట్లు చూసింది.
    "కొన్ని మనం మూడనమ్మకాలని తీసి పారేస్తాం గానీ అవే మనకి దివ్య ఔషధాలుగా పనిచేసి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. నాకు తెలిసిన ఒక గొప్ప వైద్యుడున్నాడు. అయన దగ్గరకు తీసుకు వెళ్తాను వస్తావా?"
    ఆశగా చూసింది. "నా గొంతు నాకొస్తుంది అంటే ఎక్కడికైనా వస్తాను" నూతిలోంచి అన్నట్లుగా అంది.
    శేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
    "అయితే వెంటనే లేచి జడేసుకుని చీర మార్చుకురా" అజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు.
    అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రామారావు తో అన్నాడు 'అంకుల్! నేను పదినిమిషాల్లో కారు తీసుకొస్తాను మీరు, సరాగా రెడీగా వుండండి" అంటూ రివ్వున బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. 
    సుమారు గంట ప్రయాణం తరువాత షాద్ నగర్ కి కొంచెం అవతల విసిరేసినట్లున్న ఒక కుటీరంలో కి తీసుకెళ్ళాడు.
    గుండెల దాకా పెరిగిన తెల్లటి గడ్డం, కాషాయ వస్త్రాలు, జింక చర్మం మీద కూర్చున్నాడు ఓ స్వామీజీ.
    అయన కూర్చున్న గది చాలా చిన్నది. గోడలకి ఆనించి రెండు చిన్న రోళ్ళు, ఒక పెద్ద రోలు , ఏవో మూలికలు, మరేవో సీసాలో కొన్ని పసర్లు.
    ఆ వాతావరణం చూడగానే సరాగాకి కాస్త భయం వేసింది.
    ఆమె భయం గమనించిన శేఖర్ భయపడద్దన్నట్లు ఆమె భుజం తట్టి కూర్చోమన్నట్లుగా రామారావు కీ, సరాగాకి కూడా సైగ చేసి ఆ స్వామీకి కొంచెం దూరంగా నేలమీద కూర్చున్నాడు. సరాగ రామారావు కూడా కూర్చున్నారు.
    శేఖర్ క్లుప్తంగా విషయం వివరించాడు.
    అయన అంతా విని సరాగని దగ్గరకు రమ్మని నోరు తెరవమన్నాడు. ఆమె నోరు తెరిచింది.
    స్వామీజీ  చిన్న టార్చి లైటు తీసుకుని తీక్షణమైన కళ్ళతో ఆమె గొంతులోకి చూశాడు.
    ముప్పై సెకన్లు అలా చూసి టార్చి లైటు పక్కన పెట్టాడు.
    గంబీరంగా అడిగాడు "రోజూ ఆహారం ఏం తీసుకుంటావు?"
    "మాములుగా అన్నం, పప్పు, కూర" చెప్పింది సరాగ.
    "ఉదయం ఫలహారం ."
    "ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఏదో ఒకటి."
    "రాత్రి డిన్నర్."
    "అన్నం పడుకునేటప్పుడు పాలు, ప్రోటీన్ పౌడర్ వేసుకుని తాగుతా."
    అయన భ్రుకుటి ముడి పడింది.
    ఆమెతో మాట్లాడుతూనే చిన్న రోలులో యేవో మూలికలు వేసి నూరుతూ , నూరడం పూర్తయ్యాక సరాగని నోరు తెరవమని నోట్లో రెండు చుక్కలు రసం పిండాడు. ఆ మూలికల పేస్టు ఆమె చేతికిచ్చి గొంతు చుట్టూ రుద్దుకోమన్నాడు.
    నోరంతా చేదుగా అయిపోవడంతో వాంతి వచ్చినట్లు అయింది సరాగకి.
    "చూడమ్మా! నీ కిప్పుడిచ్చిన పసరుతో నీకు ఇవాళ అంతా బాగా వాంతులు, అవుతాయి. విరేచనాలు కూడా అవుతాయి. ఈ రోజుకి మజ్జిగ తప్ప మరో ఆహారం తీసుకోవద్దు. రెండు రోజుల తరువాత నీకు నా పద్దతిలో వైద్యం ప్రారంభిస్తాను. ఆ వైద్యం ఆపకుండా నెలరోజులు తీసుకోవాలి. వారానికి రెండు సార్లు నువ్వు నా దగ్గరకు రావాల్సి వుంటుంది. నువ్వు కోల్పోయిన నీ స్వర మాధుర్యం నీకుతప్పకుండా తిరిగి లభిస్తుంది. అది నా పూచి. అయితే ఈ నెలరోజులు నువ్వు తినే ఆహారం నీ చేతుల్తో స్వయంగా నువ్వు చేసుకుని తినాలి.ఏ రోజు ఏం తిన్నావో నాకు రోజు చెప్పాలి. లేదంటే ఈ నెలరోజులు నువ్వు నా ఆశ్రమం లో వుండాలి. ఏం చేయగలవు?" అడిగాడు అయన.
    సరాగ తండ్రి వైపు చూసింది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు ఎన్నో సందేహాలు.
    శేఖర్ ఆత్రంగా చూశాడు సరాగ వైపు.
    రామారావు అడిగాడు "ఏమైంది స్వామీ? ఎందుకలా ?"
    అయన తల పంకించాడు.
    "చెప్పలేను. నాది అనుమానం కావచ్చు. వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా ఈమె స్వరం బాగుపడాలంటే నేను చెప్పినట్లు చేయాలి" అన్నాడు.
    "అంకుల్! ఇలా రండి" శేఖర్ , రామారావును తీసుకుని బయటికి వచ్చాడు.
    "ఏంటయ్యా ఇది?" ఆవేదనగా అడిగాడాయన.
    'అయన అయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్దుడు. ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో కేరళ ప్రాంతంలోని అడవుల్లో తిరిగి ఏవేవో ఔషధ మొక్కలు సంపాదించి  రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు , మా మేనత్త కి ఏ జబ్బో అర్ధం కాక డాక్టరు చేతులేత్తేసినా అయన దగ్గరే వైద్యం చేయించాము. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆరోగ్యంతో తిరుగుతున్నారు. పోయిన ప్రాణాలని  కూడా తిరిగి రప్పించే శక్తివున్న యోగి ఈయన. సరాగ గొంతు తప్పక బాగావుతుంది. తిరిగి సరాగ పాడుతుంది. జీవితాంతం పాడుతూనే వుంటుంది. నా మాట నమ్మండి."
    అప్పుడే సరాగ బయటికి వచ్చి అంది "రాత్రికి ఆయనతో మాట్లాడి రేపు నేను ఇక్కడికి వచ్చి వుంటాను నాన్నా.  శేఖర్!రేపు నన్ను ఇక్కడ దింపగలవా?"
    "ష్యూర్" ఉత్సాహంగా అన్నాడు శేఖర్.
    స్వామీజీ కి తన నిర్ణయం చేప్పింది సరాగ.
    స్వామీజీ నల్లటి మాత్రలు రెండు ఇచ్చి "మరీ వాంతులు ఎక్కువ అయితే ఈ మాత్ర ఒక్కటి వేసుకో. కానీ వాంతులు అవాలి. అప్పుడే నీ కడుపులోకి చేరిన విష పదార్ధాలు బయటికి వస్తాయి. నీ కడుపు మొత్తం శుభ్ర పడాలి. నీళ్ళతో కడిగినట్లు అవ్వాలి. అందుకే బాగా నీళ్ళు తాగు . రేపు రా" అన్నాడు.
    అవి తీసుకుని కారులో కూర్చుంటుండగా సరాగకి పెద్ద వాంతి అయిపొయింది.
    అలా ఆ రోజంతా వాంతులు అవుతూనే వున్నాయి. ఐదారు సార్లు మోషన్ అయింది. నీళ్ళు, మజ్జిగ ఆమె ఆహారం అయింది. రాహుల్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.
    ఆ సాయంత్రానికే రాహుల్ వచ్చాడు.
    తోటకూర కాడలా వడిలి పోయి ఉన్న సరాగనిచూసి అడిగాడు. "ఏంటి...ఏమైంది సడెన్ గా.... ఏం మందులు వాడుతున్నావు?"
    సరాగ జరిగినదంతా చెప్పింది.
    "నీకసలు బుద్దుందా? చదువుకున్నదానివి, అలాంటి నాటు వైద్యానికి వెళ్తావా? నన్ను అడక్కుండా అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను?' అంటూ మావగారి వైపు తిరిగి అన్నాడు "మొగుడనే వాడిని నేనున్నాను, నాతొ సంప్రదించకుండా నా భార్య నిలా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడం మర్యాదేనా?"
    సరాగ అడ్డుపడి "ఇది నా నిర్ణయం మాత్రమే. నాన్నకెం సంబంధం లేదు."
    "అంటే నేను ఒకడిని వున్నానని , నా పర్మిషన్ తీసుకోవాలని ధ్యాస లేదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకునేటప్పుడు నాకెందుకు చెప్పడం?' అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
    సరాగకి ఏడుపొచ్చింది. చిన్న ఓదార్పు లేదు. తనకి ప్రీతిపాత్రమైన భార్య స్వరం దెబ్బ తిన్నదన్న బాధ లేదు. తనకి చెప్పకుండా ఏదో చేసిందన్న కోపం , ఆవేశం.
    "ఎందుకిలా మారాడు రాహుల్?" బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది.
    మజ్జిగ గ్లాసు తో వచ్చిన నాగాలక్ష్మీ రాహుల్ కూర్చుని వెళ్ళిన కుర్చీలో అతను మర్చిపోయిన మొబైల్ తీసి 'అయ్యో మీ అయన ఫోన్ మరచిపోయాడే" అంది.
    సరాగ కళ్ళు తెరిచింది. ఆవిడ ఫోన్ సరాగకి ఇచ్చింది.
    "ఆయనే వస్తాడు లేమ్మా తీసుకెళ్తాడు" అంటూ మంచం పక్కనే వున్న కాబినెట్ మీద ఫోన్ పెట్టబోతుండగా వాట్సప్ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి మెస్సేజ్ బాక్స్ ఓపెన్ చేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra