Home » Attuluri vijaya lakshmi » Oka Koyila Gunde Chappudu


    "తీయతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా! గోతులు నమ్మవద్దు , తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు....!"
    దొంగల చేతికి దొరకనిది. దానము చేసిన తరగనిది, పదుగురిలోనా పరువును పెంచి పేరు తెచ్చే పెన్నిధది."
    ఏదీ ఆ స్వరం ...ఏదీ ఆ లాలిత్యం.... ఏదీ ఆ మాధుర్యం.... ఏదీ ఆ ఆర్ద్రత.... చిన్నప్పటి నుంచీ తన మనసులో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తూ స్పూర్తి నిచ్చే పాట. 
    ఎంతటి తీయటి పాట.... ఎంత గొప్ప భావం....
    గ్రాడ్యుయేషన్ అవగానే ఉద్యోగంకోసం ప్రయత్నిస్తుంటే దొరికింది అటెండరు ఉద్యోగం .ఇంత చదువుకుని ఈ ఉద్యోగమా? చేయనంటే, "అది కూడా లేనివాళ్ళు ఎంతోమంది వున్నారు నాన్నా... కొంచెం ఓపిక పడితే ఒకనాటికి ఇక్కడే నువ్వు ఆఫీసర్ వి అవుతావు. అయినా,అప్పుడే చదువు అపెస్తావా? పై చదువులకు వెళ్ళవా?'అంటున్న అమ్మవైపు అయోమయంగా చూశాను.
    "ఉద్యోగం చేస్తూ చదువు కోవదమా?"
    నవనీతం మీది నురగలా నవ్వింది  "నేనూ ఉద్యోగం చేస్తూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానురా.... నేను చేయగా లెంది నువ్వు చేయలేవూ.... తప్పకుండా ఇంకా చదువుకుంటావు.... భగవంతుడు మనకిఇరవై నాలుగు గంటలిచ్చాడు. క్షణం కూడా వృధా చేయకపోతే, అంతరిక్షానికి కూడా ఎగిరిపోవచ్చు నాన్నా.."
    అమ్మ మాట గుడి గంట. అదొక దీవనై తనని ఇవాళ ఈ స్థాయికి తీసుకువచ్చింది.
    "ఇప్పుడేక్కడుంది అమ్మ!పలకరించడం పూలరేక్కలు చల్లి తనని దీవించడానికి....
    "సాబ్...."
    తుళ్ళి పడ్డాడు చైతన్య... ఎదురుగా అటెండర్ షరీఫ్..
    "అందరూ వెళ్ళిపోయారు సార్... ఆరు దాటింది , కారురేడీ చేయమంటారా ?"
    "టైం అయిపోయిందా? అందరూ వేల్లిపోయారా?" తెల్లబోయి చూశాడు.
    "అవును సార్" వినయంగా జవాబిచ్చాడు.
    చైతన్య లేచాడు. షరీఫ్ అతని బ్యాగ్ చేతిలోకి తీసుకుని అతని వెనకే వినయంగా కదిలాడు.
    బయట కారు సిద్దంగా వుంది. చైతన్య ని చూడగానే డ్రైవర్ డోర్ తీసిపట్టుకున్నాడు. చైతన్య మౌనంగా కారులో కూర్చున్నాడు. డ్రైవర్ పక్కన ముందు సీట్లో షరీఫ్ కూర్చున్నాడు.కారు కదిలింది. కారుతో పాటుచైతన్య ఆలోచనలు కదిలాయి.
    తిరిగి అమ్మచుట్టు పరిభ్రమించసాగాయి.
    గవర్నమెంటు స్కూల్లో చేర్పించిందని స్కూలు ఎగ్గొట్టి పార్కులో పడుకుంటే, "నీకంటూ స్వతహాగా తెలివితేటలూ, గ్రహణశక్తి చదువు మీద శ్రద్ద వుండాలి. నీ భవిష్యత్తు గురించి ఒక లక్ష్యం వుండాలి. ఏ స్కూలైనా ఒకటే నాన్నా.... నిన్ను కాన్వెంటులో చేర్పించే శక్తి నాకు లేదు" జాలిగా అంది.
    చైతన్య గుండె చెదలు పట్టిన పుస్తకంలా పొట్టు రాలుతున్న భావన, అలలు, అలలుగా సాగుతున్న అమ్మ జ్ఞాపకాలు ఒక్కో పోరనీ చీలుస్తూ అట్టడుగున దాగిన విచక్షణ వివేకాన్నివెలికి తీస్తున్నట్టు....
    ఇంతకాలం ఏమైపోయాయి ఈ భావాలు.... ఎక్కడ దాగాయి అమ్మ ఆత్మని ఆవిష్కరించే ఈ వాస్తవాలు..
    మనిషి దూరమైతే కానీ ఆమనిషి విలువ అర్ధం కాదంటారు. అంతేనా? అంతే అందుకే అమ్మపోయిన ఈ నాలుగు నేల్లుగా తను పడుతున్న మానసిక క్షోభ ఇంతకు ముందు ఎన్నడన్నా అనుభవించాడా? ఆఫీసర్ అయిన రోజున అందుకు ఆలంబన అయిన అమ్మని మర్చిపోయి, స్నేహితులతో అర్ధరాత్రి దాకాపార్టీ చేసుకుని వస్తే "నీ సంతోషమే నాకుబలం'అంది.
    ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు , ఇవాళ్టి కి నాలుగు నెలలు పూర్తీ అయి అయిదో నెల వచ్చింది.
    కారు చైతన్య ఇల్లు సమీపించింది. ఓ చిరుదీపం వేలిగించే చిన్నచేయి కోసం ఎదురు చూస్తున్నచైతన్య చీకటి ఇల్లు అతనికి సానుభూతిగా స్వాగతం పలికినట్టు బయట వరండాలో ఒకలైటు వెలిగింది.
    

                                                              ****

    డైరెక్టర్ చాంబర్ లో అయన టేబులు దగ్గర వేసిన కుర్చీలోని ఒక కుర్చీలో అయన ఎదురుగా కూర్చుని అయన మాటలు వింటున్న సౌమ్య నిర్ఘాంతపోయింది.
    "సర్, మీరు,మీరేమంటున్నారు."
    "నేను కరేక్టుగా మాట్లాడుతున్నానమ్మా! ఆడపిల్లగా చైతన్య గురించి నువ్వలా అనుకోవడం లో తప్పులేదు. కానీ, నాకు తెలిసి అతను నీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనేది నిజం కాదు.
    "అనుచితంగా ప్రవర్తించడం లేదు సార్! కానీ, అసభ్యంగా నా  వైపు చూస్తుంటే నాకు చాలా అన్ బెరబుల్ గావుంది. డిక్టేషన్ కిపిలుస్తారు ఏమీ మాట్లాడరు. నావైపుఅలా చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు. అంతేకాదు అయన చూపులు, మధ్యలో ఆపేసి అంది "నాకు ఎలర్జిటింగ్ గా అనిపిస్తున్నాయి."
    "దయచేసి నన్ను ఇంకెక్కడైనా వేయండి. నాకు ఈపి.ఏ పోస్టు లేకపోయినా ఫర్వాలేదు. సాధారణ క్లర్కుగా చేస్తాను....కానీ...."
    "యూ ఆర్ శాడ్ లీ మిస్టేకన్ హిమ్ సౌమ్యా! అతను నీలో తన తల్లిని చూస్తున్నాడు...."
    "వాట్?"అదిరిపోతూ చూసింది. తల్లిని చూస్తున్నాడా?పరాయి అడదానిలో అమ్మని చూసేంత గొప్ప మనసా? అంత ఉదాత్తుడా? అలాంటప్పుడు అక్కడెందుకు చూస్తాడు? 
    ఆమె మొహంలో భావాలు గమనిస్తూ మళ్ళీ అన్నాడు అయన. "అతనికి తల్లి తప్ప మరెవ్వరూ లేరు. కొద్దిమంది మగపిల్లల స్నేహం తప్ప మరో ఆత్మీయత అతనేరుగడు. అతని జీవితంలో తల్లి తర్వాత సన్నిహితంగా చూసిన స్త్రీవి నువ్వే. అలా అని అడవాళ్ళ ని చూడలేదా అని అడక్కు చూదడం వేరు. ఆత్మీయత పంచుకోవడం వేరు. నా అంచనా తప్పు కాకపొతే అతను నీ సాన్నిహిత్యం కోరుకుంటున్నాడు."
    "సర్..."
    "అవునమ్మా....చైతన్య ఎంతో ఉత్సాహంగా చలాకీగా ఉంటూ ఒక అటెండరు గా నా కంపెనీ లో జాయిన్ అయి, తన తెలివి తేటలతో , సామర్ధ్యంతో నా కంపెనీ అభివృద్ధి చేసి ఆఫీసర్ గా ఎదిగాడు. అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తీ అతని తల్లి. అలాంటి ఆవిడ అనుకోకుండా హటాత్తుగా చనిపోయింది. అప్పటి నుంచీ అతను డిప్రెషన్ లోనయ్యాడు. ఆ చలాకీతనం, ఆ ఉత్సాహం ఏదో దుష్టశక్తి లాక్కుపోయినట్టు పిచ్చివాడిలా అయ్యాడు. అతడిని మామూలు మనిషిని చేయడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ, నావల్ల కాలేదు. అందుకే నేను చేయలేకపోయినపని నువ్వు చేయాలని నా ఆశ."
    "అంటే...." నిర్ఘాంతపోతూ అడిగింది. తనకీ చైతన్య చూపుల నుంచి విముక్తి ప్రసాదించమని అడగడానికి వస్తే అయన ధోరణి అందుకు విరుద్దంగా వుండడంతో సౌమ్య కి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. అరగంట నుంచీ విషయం చెప్పకుండా అతని జీవిత చరిత్ర తనకెందుకు చెబుతున్నాడో కూడా ఆమెకి అర్ధం కావడం లేదు.
    "సౌమ్యా... ఏ మగవాడి కైనా ఈ ప్రపంచంలో ఇద్దరే స్త్రీలు సర్వం తానై సాన్నిహిత్యం కాగలరు . ఒకరు తల్లి.... మరొకరు భార్య.... చైతన్య నిన్ను ఇష్టపడుతున్నాడని పిస్తోంది నీ మాటలు వింటుంటే... అందుకే పెద్దవాడిగా , మీ ఇద్దరి శ్రేయస్సు కోరేవాడిగా చెబుతున్నాను అతడిని నువ్వు వివాహం చేసుకో..."
    "సార్ మీరేం మాట్లాడుతున్నారు! అతనెవరో , అతని కులం, మతం, కుటుంబం, ఏమీ తెలియకుండా అతడిని నేను వివాహం చేసుకోవడం ఏమిటి? అసలు మా పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారనుకున్నారు? అయినా మీరిప్పుడేగా అన్నారు. అతను నాలో తన తల్లిని చూస్తున్నాడని , భార్యగా ఎలా అంగీకరించగలడు...."
    అయన నవ్వాడు.
    "చూడమ్మా.... మగవాడికి తల్లిగా, చెల్లిగా, భార్యగా , ప్రియురాలిగా దగ్గరై అతనికి ఆనందాన్ని, శాంతిని ఇవ్వగలదు ఒక స్త్రీ. తానూ పొందగలదు. భార్య అంటే కేవలం పగలంతా భర్తకి వండిపెట్టి, కావల్సినవి అందిస్తూ , సేవలు చేసి రాత్రి కాగానే శారీరక సుఖం ఇచ్చేది కాదు.భార్యంటే భర్తకు కన్నై, కాలై, చేయై మనసున మనసై బతుకంతా తానై వెలిగిపోయేది,వెలుగునిచ్చేది . భార్యంటే బానిస కాదు అనేది మాత్రమే మీ నినాదం కానీ, భార్యంటే మగవాడి బతుక్కో అర్ధం, పరమర్ధం కల్పించేది అనేది నా నినాదం. ఓ పెద్ద గైడ్. ఆ గైడ్ సాయంతోనే అతనీ స్థాయికి చేరుకున్నాడు. లేకపోతే అతనో బికారి, అతనో యాంటీ సోషల్ యానిమల్..."
    "అంటే....?"
    "పాతికేళ్ళ ప్రాయంలో రెండు పెళ్ళిళ్ళు పీటల మీద చెడిపోయి, పెళ్ళి కావడం కష్టంగా మారింది సరళమ్మకు. అది అమె నూరేళ్ళ జీవితాన్ని కన్నీటి కడలిగా మారిస్తే ఆత్మస్థైర్యంతో మనోబలంతో చెక్కుచెదరని అత్మవిశ్వాసంతో ఒంటరిగా జీవన పోరాటం ప్రారంభించి మా కంపెనీ లోనే ఒక స్వీపర్ గా చేరింది సరళమ్మ. పగలంతా పనిచేసినా అలసట దరికి రానీయకుండా రాత్రంతా కష్టపడి చదివి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ సంపాదించుకుంది. మా కంపెనీ లోనే స్వీపర్ స్థాయి నుంచి క్లర్ గా ఎదిగింది. ఆమె ప్రయాణం అంతటితో ఆపలేదు.విశ్రమించలేదు.మరో మెట్టుఎక్కడానికి పీజీ చేసింది. ఇంతలో ఆమె ఒంటరి జీవితానికి తోడుగాతల్లిదండ్రులను కోల్పోయిన చైతన్య ని పంపించాడు ఆభగవంతుడు. సరళమ్మతో పాటు స్వీపర్ గా పనిచేసిన లక్షమ్మ భర్త తాగుబోతు, సోమరి పోతు . ఓ దురదృష్ట ఘడియలో లక్షమ్మ అతడి చేతిలోనే చనిపోయింది. అతను జైలు పాలయ్యాడు. అమాయకమైన మొహంతో, కంటినిండా నీళ్ళతో , కడుపులో దుఖంతో మిగిలిన చిట్టిని సరళమ్మ చేరదీసి చైతన్య గా మార్చి జీవం పోసింది. ఆమె చేతుల్లో ఎదిగిన చిన్న కలుపు మొక్కే చైతన్య అనే మహావృక్షం. నేడా మహావృక్షం అనురాగపు జల్లులు కురవక ఎండి మాడైపోవడానికి సిద్దంగావుంది. నీ ప్రేమానురాగాల జల్లులు కురుపిస్తే ఆ మహావృక్షం తిరిగి జీవం పుంజుకుంటుంది. పెరిగి పెద్దదై శోఖాపశాఖలుగా విస్తరించి మధురఫలలాతో పాటు, పదిమందికీ నీడను కూడా కల్పించగలదు. ఆలోచించుకో సౌమ్యా! కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు , జాతకాలు , మంచిరోజులు అన్నీ చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా విఫలమై విడాకుల దాకా వెళుతున్నాయంటే అందుకు కారణం పరస్పర అవగాహన లోపమే. అది నువ్వు జయించగలిగితే నీ జీవితం మూడుపూలు ఆరు కాయలుగా కళ కళలాడుతుందని నేను నమ్ముతున్నాను. ఐ విష్ యూ అల్ ది బెస్ట్...."
    సౌమ్య నిశ్చేష్టురాలై కూర్చున్న చోటే శిలలా వుండిపోయింది.
    ఆమె కళ్ళ ముందున్న వస్తువులు, గోడలు, కిటికీ కున్న పరదాలు, డైరెక్టర్ బెనర్జీ అన్నీ అలుక్కు పోయి అసప్ష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ఆర్తిగా తన వైపు చూస్తున్న రెండుకళ్ళు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి .ఆ రెండుకళ్ళు చైతన్యవి.
       
                                                             -----------  
            
     
    

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra