Previous Page Next Page 
కదానాయికి పేజి 9

    అనుపమ మాట్లాడలేదు.

    ఎంతసేపయినా రాజు రాలేదు. అప్పుడు అనుమానం చ్చింది. అనుపమకి. వీళ్ళంతా తనని ఏడిపించటానికి అన్నారని."మీరంతా నన్నే డ్పిస్తారు. రాజుమంచివాడు. రాజు రానీండి మీ పని చెపుతాను" ఉక్రోషం  పట్టలేక పైకి అంది.
   
     పిల్లలకి రోషం వచ్చింది. అనుపమకి రాజు అంటే ఇష్టం అని తెలుసు " రాజు కోతిలాగుంటాడు...రాజు మంచివాడు కాదు... రాజు తరాజు. భట్రాజు, కోమటి త్రాసు." అంటూ చప్పట్లు చరుస్తు పాట మొదలు పెట్టారు. వాళ్ళకు మహాహుషారుగావుంది.

    అనుపమ కళ్ళనిండా నీళ్లు నిండాయి, నోరు మెదపకుండా నిస్సహాయురాలిలా కూర్చుండిపోయింది.

    కాసేపు అరిచింతరువాత పిల్లలికి వుషారు చచ్చిపోయింది, పైగా రోజుకన్నా ఆలశ్యం అయింది ఇళ్ళకు వెళ్ళటం. వెళ్ళిపోదామనుకున్నారు. అనూ! మేం వెళ్ళిపోతున్నాము. నీవూ వెళ్లు రాజు రాడు, బాబు రాడు" అన్నారు వెళ్ళబోతు.

    "ఊ"అంది కూర్చున్న బండమీదనుంచి కదలకుండానే ,అందరూ వెళ్ళిపోయారు, చాలాసేపు అలా కూర్చుండిపోయింది  అనుపమ.చీకటి వెలుగుల తేడా తెలియకపోవటంతో.

    " రాజు, రాజూ! నువ్వు రావు" అనుకుంది నిస్పృహగ.నెమ్మదిగా లేచి ఇంటికి బైలుదేరింది. అనుపమ.పదడుగులు వేసేటప్పటికి రాజు ఎదురొచ్చాడు, "అనూ!" అన్నాడు ఆనంద పారవశ్యంతో.   

     రాజుకి ప్రవేటు యింకా పావుగంట వుంది. మాష్టారు ఎదుటనుంచి ఎలా బైటపడాలో తెలియక తికమక పడుతుంటే మాష్టారుకి పనిదగిలి ప్రవేటుచాలని ఇంటికి పంపించాడు.యీ పాటికి పిల్లలంతా ఆడుకుని  ఇళ్ళకు వెళ్ళిపోతారని తెలుసు. ఏదో ఆశ రాజుని బలరామయ్య గారి దొడ్డివద్దకు లాక్కొచ్చింది. అదృష్టం.అనుపమ ఎదురయింది.

    " ఆడుకోటానికి రాలేదేం రాజూ!" అంది అనుపమ.

     మామయ్యకి నేను పెద్ద చదువులు చదవాలని వుదంట. ప్రవేటు పెట్టాడు. ప్రవేటు ఎగగొడితే చంపి పారేస్తానన్నాడు. రోజు ఆడుకోటానికి రాను. ఆదివారం వస్తాను. ప్రతివారం నీవు రా!"  చెప్పాడు రాజు.

    పిల్లలంతా ఏమ్నదీ చెప్పింది. అనుపమ. రోజూ  ఆడుకోటానికి వీళ్లంతీ నన్నేడిపిస్తారు. ఆదివారంనాడు తప్పక నీకోసం వస్తాను నీవురా" అంది.

    "ఆదివారంనాడు రాకపోతే నీమీద ఒట్టు" అన్నాడు రాజు.

     చీకటి పడటం వల్ల కలసి మాట్లాడుతు కొంతదూరం నడిచారు ఇరువురు. రాజు అనూచెయ్యి పుచ్చుకునే వున్నాడు దోవ సగంవరకు

    "జాగ్రత్తగా వెళ్లు అనూ! చీకటి పడింది" చెయ్యి వదిలేసి చెప్పాడు రాజు.

    "ఆదివారం వస్తాను రాజూ!" అని ముందుకు సాగింది అనుపమ

    ఇల్లు దగ్గర పడతుండగా గుర్తొచ్చింది అనుపమకి.   

     "అరె రాజుని అడగటం మరచిపొయ్యాను సినిమా గురించి అనుకుంది.

                                 5


     రాజులా రఘుపతి సాయంత్రం కాగానే బైటకు వెళ్లలేదు. ఆయాసం భార్యకు ఎక్కువ కావటం. దానితో రొప్పుతూ కళ్ల నీళ్లు పెట్టుకోటం చూచి  ఇంట్లోంచి కదలలేదు.

     ఆచార్లుగారి వైద్యాన్ని ఆక్షేపించటానికి  లేదు. ఊరు ఊరు ఆయన చేతిలో బ్రతుకుతున్నది ఆయువుమూడినవాళ్ళ సంగతి  చెప్పలేముగాని ఆయనచేతి రెండు మోతాదులమందు తీసుకుంటేచాలు  ఎంతటిరోగమైనా తీసేసినట్లు పోతుంది.

     రెండు మోతాదుల మందేమిటి ? రెండు వేల మోతాదులమందు.... వేడి నీళ్ళలో అల్లంతో తేనెతో పాలతో మార్చి వాడినా  వ్యాధి నయంకాలేదు. వారానికి ఓ రోజు పట్నం నుంచివచ్చే గవర్నమెంటు డాక్టరుకకి చూపించి చూద్దామని చివరికి నిర్ణయించుకుని రఘుపతి డాక్టరువచ్చాడేమో చూచి రమ్మని  రాజుని పంపించాడు.
   
    రాజు రాకకోసం ఇంట్లోకి బైటకు తిరుగుతున్న రఘుపతి విసుగుపుట్టి భార్యగది లోకివెళ్ళి కాపలాకాచే ముసలయ్య చెప్పాడు." రాజు చూపులు రాజేశ్వరమ్మమీద మాటలు రఘుపతి నుద్దేశించివున్నాయి.


    " ఈవారం ఎందుకురారట రాజూ? డాక్టరుగారు?"

    "డాక్టరుగారి చెల్లెలిపెళ్లిట." ముక్తసరిగ జవాబిచ్చాడు రాజు.

    "అహా!" అన్నాడు రఘుపతి.   

     మామయ్య వెళ్ళమంటే వెళ్ళటానికి సిద్ధంగా నుంచున్నాడు. రాజు

    "ఇలావచ్చి కూర్చోరాజూ!" అంది రాజేశ్వరమ్మ తనపక్కనే వచ్చి కూర్చోమన్నట్లు చేత్తో మంచంవైపు చూపింది.

    మామయ్యను చూచాడు రాజు.   

    "అత్తయ్య చెప్పింది వినిపించిందా?" అన్నాడు రఘుపతి.

     బితుకుబితుకుమంటూ రాజేశ్వరమ్మ తలవైపు కూర్చున్నాడు. రాజు.  అత్తయ్య గదిలో మామయ్యవుండగా కూర్చోవటం ఏమిటోగావుంది. మౌనంగా బొటనవేలు నోట్లోపెట్టుకుని గోరు కొరుకుతున్నాడు చిన్నగా.

 Previous Page Next Page