అనుపమ ఆడలేకపోయినా చూడలేకపోయినా పిల్లల ఆటల్లో పొందే ఆనందం ఎక్కువ. సూభద్రమ్మ గ్రహించినా మనసుకి నచ్చచెప్పుకోలేకపోతున్నది.
" పెద్దమ్మాయీ! ముందు ముందు వ బైటకువెళ్ళి ఆడుకోకూడదమ్మా? ఆడపిల్లవు, వయసు వస్తున్నది" అంది సుభద్రమ్మ.
" వయసంటే ఏమిటమ్మా?" కూతుహలంగా అడిగింది అనుపమ.
"వయసు అంటే...! పెద్దగావటం"
"ఉమ , శారద వాళ్ళంతా నాకన్నా పెద్దవాళ్ళు కారేమిటీ! వాళ్ళంతా ఆడుకోటానికి రావటం లేదేమిటి?"
"నీ అందం వాళ్ళకు లేదు . వాళ్ళకు చూపు వుంది అది నీకు కరువు" అని చెప్పలేకపోయింది సుభద్రమ్మ.
"నీకు చెపితే అర్థం కాదమ్మా పెద్దమ్మాయీ!" అంది సుభద్రమ్మ ఎలా చెప్పాలో తెలియక.
"ఉమావాళ్లు ఆడుకోవటానికి రావటం మానేస్తే నేనూ అడుకోవటం మానేస్తాను. ఇప్పుడు ఆడుకోటానికి వెళ్ళనాఅమ్మా?అంది అనుపమ
సరేననక తప్పలేదు ,సుభద్రమ్మకు. దానిమ్మ పిందెలకు గుడ్డ ముక్కలు చుట్టటం మరచిపోయి అనుపమ కనుమరుగయిందాకా చూస్తు వుండిపోయింది, దిగాలుగా అనుకుంది " ఆ పై వాడిదే భారం అంతా" అని.
చూపులేకపోయినా ఊరంతా తెలుసు. అనుపమకు. ఏ వీధి నెళితే ఎటుపొవచ్చో అలవాటుపోయింది. పల్లెటూరు కావటంవల్ల బస్సులు. స్కూటర్లు తిరగవు. ఆవులు, గేదేలు ఎదురొచ్చినా ఎవరన్నా చూచినవారు హెచ్చరిక చేయటం అవతలికి గేదెలను తోలటం చేస్తారు.
అలవాటయిన దారమ్మట రోజుకన్నా ఒకడుగు వేగంగా వేస్తు బలరామయ్య గారి దొడ్లి దగ్గరకు వచ్చింది. అనుపమ అప్పటికే పిల్లలంతా ఆట మొదలుపట్టారు. దాగుడుమూతల ఆటలో తల్లిగా వుండటం అంటే కూర్చుని వుండాల్సిందే కాని పరుగెత్తటానికి లేదు. దాక్కోటానికి లేదు. ఎవరికీ ఆటలో తల్లిగా వుండటం యిష్టం లేకపోయింది. నువ్వు తల్లిగా వుండంటే నువ్వుతల్లిగా వుండమని కీచులాడుకున్నారు. చివరికి అవధాన్లుని తల్లిగా వుండమన్నారు.ఏక గ్రీవంగ, "ఛీ, మొగళ్ళక్కడన్నా తల్లిగా వుంటారేమిటి! నేనేం వుండను" అన్నాడు ఏడ్పు మొహం పెట్టి. " నువ్వు తల్లిగా వున్నావా!సరే! లేకపోతే మాతో ఆడొద్దు" అని వెంకట్ గట్టిగా చెపుతుండగా అవధాన్లు అనుపమను చూచాడు. వాడి మొహం చింకిచేటంతయింది. "అనూ, వచ్చిందిరోయ్!" అని కేకపెట్టాడు.
వస్తున్న అనుపమని చూచి " అనూ వచ్చింది తల్లి వచ్చింది అంటూ పిల్లలందరూ గోలగోలున
అరిచారు.
"నువ్వు లేకపోతే ఆటం ఏం బాగుండలేదు. తల్లిగా ఎవరూ వుండనన్నారు." పిల్లందరూ అంటుంటే అనుపమకు ఎంతో సంతోషం వేసింది.
అనుపమ రావటానికి ఎందుకాలస్యం అయిందో తెలుసుకుని తిరిగి ఆటలో పడాడరు పిల్లలు. అనుపమ 'తల్లి' గా బండమీద కూర్చుంది.దాకలి మూచి దండాకోర్! అంటూ తల్లి అలివేణి కళ్లు మూసింది.
పిలల్లంతా గోలు గోలు మంటు పరుగెత్తారు నలువైపులా.
బలరామయ్య గారు ఊరిలో మోతుబరి రైతు. కొత స్థలంలో చుట్టూత కంచెపేసి ఫలవృక్షాలు మాత్రమే రకరకాలవి వివిధ ఫలాలను బలంగా గొప్పగా కాయించాలనుకున్నారు.అకస్ మత్ గా మృత్యుదేవత పిలుపు ఆయనకు రాగా అస్తలం సంగతి పట్టించుకునేవాళ్ళు లేక పిచ్చి మొక్కలతో పాడుపడింది స్తలం. బలరామయ్యగారుపోయి ఎన్నో ఏళ్ళు అయినా స్తలం బలరామయ్యగారి దొడ్డిగా చెలామణి అయింది ఊరిలో.
సాయంత్రం పూట పిల్లలుల ఆడుకోటానికి అనువుగా మారింది. దాగుడుమూతలాడుకోటానికి మరీ బాగుంటుంది.
పిల్లలంతా దాగుడుమూత లాట చాలాసేపు ఆడుకున్నారు.అలిసి పోయి చెమటలు కక్కుతు ఆయాసపడుతు కూర్చున్నారు. శేఖరం, వాళ్ళ బాబాయితో బస్తీ వెళ్ళి చూసొచ్చిన సినిమా కధ చెపుతుంటే పిల్లలంతా ఆతృతగా వింటున్నారు.
ఎంతసేపు చెప్పినా సినిమా అంటే ఏమిటో అర్థం కాలేదు అనుపమకి. "రాజు అయితే బాగా చెపుతాడు" అనుకుంది.వస్తానన్న రాజు రాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది.
"రాజు రాలేదేమిటి అవధాన్లూ?" అంది అనుపమ కాసేపయింతరువాత.
"సాయంత్రం పూట ప్రవేటుకి వెళుతున్నాడు రాడు" చెప్పడు ఆవధాన్లు.
"నాతో వస్తానని చెప్పాడు. రాజు తప్పకుండా వస్తాడు"
"ఉహు, రాడు రాజు రానని చెప్పాడు మాతో"
తగిన కారణం లేకుండా ఫక్కున నవ్వారు పిల్లలంతా.
"నవ్వండి ,నవ్వండి , రాజు రానివ్వండి మీ పని చెపుతా" మనసులో అనుకుంది. అనుపమ.
"అదిగే రాజు వస్తున్నాడు" వెంకట్ గావుకేకపెట్టాడు.
పిల్లలంతా చూచారు. రాజు రావటంలేదు.
"చూచావా! నే చెప్పింది నిజం అయింది!" ఉత్సాహంగా అంది అనుపమ.
"ఉమ తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని పెదవులపైకి రానీక "అనూ! మేం నవ్వామని రాజుకి చెప్పకే, మమ్మల్ని కొడతాడు" అంది భయపడుతున్నట్లు స్వరం మార్చి.