Home » Kommuri venugopala rao » విరాజి

  

    "నాదా?" అన్నాడు గౌతం ఆశ్చర్యంగా .

    "అవును బాబుగారూ! నాకు రచయితలన్నా, మిగతా కళాకారులన్నా ఎంతో గౌరవం. మీరు టీ తాగినప్పుడల్లా యిచ్చిన డబ్బులు నాకు తీసుకోబుద్ధిగాక, అవన్నీ యీ రేకు డబ్బాలో వేస్తూ వొచ్చాను. ఎప్పటికైనా పనికొస్తాయని. మీ డబ్బు మీకు ఉపకరించగలిగితే అంతకంటే సార్దకత్వం ఏముంది బాబుగారూ!"

    ఓ టీకొట్టు ఓనరయి వుండి స్వచ్చమైన భాషతో , అంతకన్న స్వచ్చమైనా హృదయంతో మాట్లాడుతోన్న వరదరాజు వంక ఆశ్చర్యంగా , వినమ్రంగా , పూజ్యభావంతో, అర్ధ నేత్రాలతో చూశాడు గౌతమ్.

                              *    *    *    *

    ఇంజక్షన్లు ఇచ్చాక నొప్పి రాత్రంతా విరాజి నిద్రపోతూనే ఉంది. సెలై న్ ప్లో అవుతూనే వుంది.

    మరునాటి ఉదయం ఎనిమిది గంటలకు విరాజికి మెలుకువ వొచ్చింది.

    బెడ్ ప్రక్కనే వున్న కుర్చీలో గౌతమ్ అలా కూర్చునే వుండటం చూసింది.

    అతని కళ్ళు ఎర్రబడి పోయి జుట్టు రేగిపోయి ముఖం పీక్కుపోయి వుంది.

    'పిచ్చి నాన్నా! నా కోసం రాత్రంతా ఇలాగే మేలుకుని వున్నావా! అనుకుంది ఎంతో జాలిగా, హృదయం అర్ధమై లోపల్నుండి అనురాగం పొంగుకు వొచ్చింది. అతని చేతిని పట్టుకుని గుండెల మీదకు లాక్కొందామని చేతిని చాచబోయింది.   

    "ఆ" అన్నాడు గౌతమ్ కంగారుగా.

    అప్పుడు చూసుకుంది తన చీటికి సెలైన్ బాటిల్ కనెక్ట్ చేయబడి వున్న సంగతి .

    "రాత్రంతా ..... నా కోసం .... ఇలాగే అవునా?" అంది చలించే కంఠంతో

    "అయితే ఏమయింది?" అన్నాడతను .

    "ఏమయిందా? నువ్వెలా వున్నావో చూసుకున్నావా?"

    "చూసుకున్నాను"

    "ఏడీ యిక్కడ అద్దమేమీ వున్నట్లులేదే?"

    "అడ్డమక్కర్లేదు నీ మొహంలో , కళ్ళలో నాకు నేను కనిపిస్తున్నాను."

    విరాజి బాధగా , విషాదంగా నవ్వింది.

    "విరాజీ ! ఇప్పుడెలా వుంది?"

    "నోప్పేమీ లేదు. డాక్టరు గార్నడిగి యింటికి వెళ్ళిపోవచ్చు ననుకుంటాను. ఎక్కువ టైము లేదు గౌతమ్ రోజులు వృధాగా గడిచిపొతే భరించలేదు" అంది ఆవేదనగా.

    గౌతమ్ కూడా యీ విషయమే ఆలోచిస్తున్నాడు. విరాజి ఆరోగ్య పరిస్థితి యిలా వుంది. ఆమె యీ స్ట్రెయిన్ తట్టుకోగలదా?

    "మాట్లాడవేం గౌతమ్?"

    "చేప్పలేకుండా వున్నాను."

    ఓ గంట గడిచాక డాక్టరుగారు వొచ్చారు. ఆమెను ఎగ్జామిన్ చేసి తృప్తిగా తల ఆడించాడు.

    "డాక్టరుగారూ!" ప్రశ్నార్ధకంగా చూశాడు.

    "ఆపదలో వున్నప్పుడు వచ్చే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి అవసరము తీరిపోగానే వెళ్ళిపోతామంటున్న కృతఘ్నల మానుకోకండి. ఇంకో పన్నెండు రోజుల్లో, నా డ్వాన్స్ ఫర్ మారేన్స్ వుంది. కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తూ కలలుకంటూ ఎదురు తెన్నులు చూస్తోన్న అవకాశమిది. ఈ అవకాశం చెయ్యి జారిపోతే భరించలేను.

    ఆమె ముఖంలోని నిజాయితీ , ఆవేదన డాక్టరు గమనించాడు సహాజంగా అతను మృదు స్వభావుడు సానుభూతితో అతని హృదయం, కరిగింది.

    "నీ వేదన నేరర్ధం చేసుకున్నా నమ్మా. కాని సాయంత్రం వరకూ అజ జర్ వేషన్ లో వుంచాలి  ఇది నీకు అల్ రెడీ సెకండ్ ఎటాక్. ఆశ్రద్ధ చెయ్యటం మంచిది కాదు. సాయంత్రం వరకూ తిరిగి ఏ నొప్పి రాకపొతే అప్పుడాలోచిద్దాం అన్నాడు.

    విరాజి అయన మాట కెదురు చెప్పలేకపోయింది.

    మధ్యాహ్నం రెండు గంటలదాకా పరిస్థితి బాగానే వుంది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని విరాజి నిముషాలు లెక్కపెడుతూ కూర్చుంది.

    ఆమె బలవంతం, చేసిన మీదట గౌతమ్ బయటకు వెళ్ళి దగ్గర్లో వున్న హొటలుకు వెళ్ళి భోజనం చేసి వొచ్చాడు.

    తిరిగి అతను గదిలోకి అడుగుపెడుతూ ఉలికిపడ్డాడు. బెడ్ మీద విరాజి బాధతో మెలికలు తిరిగి పోతూ వుంది.

    అతను కంగారుగా వెళ్ళి సిస్టర్ని పిల్చుకొచ్చాడు. సిస్టర్ విరాజి పరిస్థితి చూసి అందోళనపడి హడావుడిగా డాక్టర్ని పిలవటానికి వెళ్ళింది.

    డాక్టరు అంతకు ముందే హాస్పిటల్ వర్క్ పూర్తీ చేసుకుని యింట్లోకి వెళ్ళి లంచ్ కి కూర్చోబోతున్నాడు. సిస్టర్ చెప్పింది వినిభోజనం చెయ్యకుండానే వొచ్చేశాడు.

    విరాజిని ఎగ్జామిన్ పరిస్థితులో కూడా విరాజి చేతులు జోడించి నమస్కారం పెట్టింది.

    "డాక్టరుగారు! ఈ పది పన్నెండు రోజులూ ఎలాగైనా మందులతో యిన్ జక్షన్ల తగ్గేలా చూండి ప్లీజ్ డాక్టరుగారూ. కావాలంటే రోజూ వొచ్చి మీకు కనిపించి ట్రీట్ మెంట్ తీసుకుని వెడుతూ వుంటాను. పోగ్రాం అయిన తర్వాత వొచ్చి ఎడ్మిటయి పోతాను. అప్పుడే మీరు ఒకటి కాదు రెండాపరేషన్లు చేసినా చేయించుకుంటాను __" అంది ప్రాధేయ పడుతూ, ఆమె కళ్ళ నిండా జల జలమని నీళ్ళు కారుతున్నాయి.         

    ఆమె బాధనర్ధం చేసుకున్నాడు. కాని ఒక డాక్టరుగా అతను రాజీ పడలేకపోయాడు.

    "తప్పదమ్మా ఎగ్జామిన్ చాలా రాజిష్ గా వుంది. దురదృష్టవశాత్తూ ఫేర్ ఫేరేట్ అయిందంటే పేరిటనైటిస్ వచ్చి కాంప్లికేట్ అవుతుంది" అన్నాడు.

    అయన మాటల్లోని నిజాన్ని గౌతమ్ అర్ధం చేసుకున్నాడు. "డాక్టరుగారూ ఆపరేషన్ చేసెయ్యండి" అన్నాడు తనే నిర్ణయం తీసుకుంటూ .

    మరో రెండు మూడు గంటల్లో ఆపరేషన్ చేయ్యటానికి నిశ్చయించబడింది.

                           *    *    *    *   

    ఆపరేషన్ చెయ్యమని చెప్పాడే గాని డబ్బు ఎక్కడ్నుంచి వొస్తుంది? సిస్టర్ని సంప్రదించి ఖర్చుల వివరాలు తెలుసుకున్నాడు.

    మొదట మేదిసేన్స్ ఖర్చుల వివరాలు తెలుసుకున్నాడు.

    మొదట మేడిసేన్స్ కు రెండు మూడు వందలవుతాయి.

    ఎవస్థటిస్టుకు వంద రూపాయలు చెల్లించాలి.

    ఆపరేషన్ చార్జెస్ థియేటర్ , ఏనస్టిష్ యా ఎక్స్ పెండిచర్, ట్రీట్  మెంట్, రూం రెంట్ వగైరాలన్నీ కలసి రెండు వేల రూపాయల దాకా అవుతాయి.

    పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

    డబ్బు! ఒక మనిషిని విజ్ఞాన వంతుడు అవనీ కానీ డబ్బుంటే జీవితంలో ఎన్నయినా సాధించగలడు.

    గుండెకు జబ్బు చేస్తే ముప్ఫయి నలభయి వేలు ఖర్చు పేట్టి యీ దేశంలోనో , రెండు మూడు లక్షలు ఖర్చు పేట్టి విదేశాలల్లో ఆపరేషన్ చేయించుకు రాగలడు.

    అయుర్ధాన్ని పెంచుకోగలడు.
   
    అవసరానికి అదుకొని ఆశయాలు ఆదర్శాలు ఉపయోగపడని నైతిక వులువలు:

    ఎం చెయ్యాలి?

    ఒక్కొక్క నిముషం గడుస్తుంటే గుండె దడదడ లాడిపోతున్నది.

    మళ్ళి అదే ప్రశ్న :

    ఏం చెయ్యాలి!

    వరదరాజు తిరిగి అడగటానికి అప్పుగానైన అడగటానికి అతన్లో మొహమాటం అంగీకరించటంలేదు .

    ఆలోచించి, ఆలోచించి 'ఆక్రందన' ప్రచురిస్తున్న పత్రికాఫీసుకి వెళ్ళాడు.

    గేటు దగ్గర ఘూర్ఖా అడ్డుపడి టైమాఫీస్ లో రిపోర్టు చెయ్యమన్నాడు.

    టైమాఫీసులో వుండే అతను గౌతమ్ ని గుర్తుపట్టాడు.

    "వీక్లీ ఎడిటర్ గార్ని చూడాలి" అన్నాడు గౌతమ్,

    "ఆయనెందుకో చాలా చిరాగ్గా వున్నారే యీ వేళ? అందరి మీనా విరుచుకు పడుతున్నారు."

    "చూడాలి తప్పదు"

    అతను లోపలకు ఫోన్ చేసి మాట్లాడాడు రెండో ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నారట . అయిదునిముషాలు వెయిట్ చెయ్యండి " అన్నాడు.

    గౌతమ్ అసహనంగా నిలబడ్డాడు.

    "అన్నట్లు ఆక్రందన రాస్తోంది మీరే కదూ?" అన్నాడతను.

    గౌతమ్ తల ఊపాడు .

    "కష్టపడి రాన్నట్లున్నారు గాని పాఠకులకి ఎక్కటం లేదు. క్లిక్ అవలేదు."

    నవల విజయం ఎవరి తీర్పుమీద ఆధారపడి వున్నదో అడుగడుక్కి తెలుస్తున్నది.

    "ఇప్పటి రోజుల్లో ఇలాంటి నవలలు ఎక్కవు సార్! థ్రిల్లర్స్ సస్పెన్స్ నవలలు ప్రేమ నవలలు, సెక్సు గుప్పించి పారెయ్యాలి" అన్నాడతను సలహానిస్తూ.

    గౌతమ్ ఏమీ జవాబువ్వలేదు.

    లోపల్నుంచి ఫోన్ వొచ్చింది అతను రిసీవ్ చేసుకుని "వెళ్ళండి" అన్నాడు.

    గౌతమ్ లోపలకి వెళ్ళేసరికి సంపాదకుడు నిజంగానే చాలా చికాగ్గా వున్నాడు. టేబుల్ మీద కాగితాలన్నీ చెల్లా చెదురుగా వున్నాయి.

    "ఏమిటలా వొచ్చారు?" అన్నాడు ప్రశ్నార్ధకంగా ముఖం పేట్టి. గౌతమ్ కు వొచ్చిన పని ఎలా చెప్పాలో తెలీలేదు కాని తప్పదు.

    "ఈ మధ్య ఓ చిన్న నవల పంపించాను. అది వెంటనే ప్రచురించమని నేను కోరటం లేదు ..... కాని .... కాని .... చాలా డబ్బు అవసరంగా వుంది .... దయవుంచి మీరు ఆనవాల పారితోషకం గా రెండువేలు అర్జంటుగా ఇప్పిస్తే " _ అన్నాడు ఎలాగో గౌతమ్ పెగుల్చుకుని.

    "అబ్బే ! అలా కుదరదండి" అన్నాడతను  _ కనీసం ఆలోచనకన్నా అవకశమివ్వకుండా.

    "మీ నవల నేను చదవలేదు. పరచిరిస్తామో లేదో తెలీదు. అలా ముందుగా యివ్వటానికి సాధ్యపడదు."

    గౌతమ్ నిరాశగా చూశాడు, అతని వొళ్ళు చల్లబడుతూన్నట్లుయింది.

    "పైగా మీ ఆక్రందన ఏమీ పేలలేదు. మీరు ఏమేమిటో సీరియస్ గా రాస్తేస్తారు. పాఠకులకు మసాల, మెలికలు అందివ్వా గలగాలి __" అంటూంటే మేనేజర్ గదిలోంచి యింటర్ కమ్ ఫోన్ వొచ్చింది.

    "లాభం లేదండి. ఎంతో నచ్చజెప్పి చూశాను. వాళ్ళమ్మాయి త్రిపుర చనిపోయాక ఆయనకు ఎక్కడలేని విరక్తి పుట్టింది . అసలు మూడ్స్ లోకి రావటంలేదు. ఎంత ప్రయత్నించినా రాయలేనంటున్నారు."            

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra