Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 23

 

    "నో  సర్ .... మీరు కాదన్నా నేను వదిలిపెట్టను."
   
    రెండు శవాల్ని అప్పుడే టౌన్ పంపేశాడు కాబట్టి నిజంగానే చైతన్యతోపాటు రెండు మూడు రోజులపాటు వుండాలనుకున్నాడు.
   
    గుట్టపై వున్న ఫారెస్ట్ బంగళాలో జీపు ప్రవేశించిందోలేదో"నమస్కారమయ్యా" అన్నారెవరో.
   
    ఆశ్చర్యపోయాడు చైతన్య చాలా అసాధారణమైన నిబ్బరంగలవాడనుకున్న స్వామి అప్పటికే రెస్ట్ వుహాస్ కి వచ్చేశాడు.
   
    "గుడ్..." జీపు డిగి అభినందిస్తున్నట్టూ అన్నాడు.
   
    "అయ్యా" పిలిచాడు స్వామి యదాలాపంగా .
   
    "పులులు మనుషుల్నీ చంపాక మొత్తం లేక ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో బోంచేస్తాయా...."
   
    "రెడ్ము రకాలుగా జరగవచ్చు "
   
    "చాలా దారుణంగా ఒంటినిచీలుస్తాయంటారా"
   
    "ఆఫ్ కోర్స్ ..."
   
    ఆడా మగా అన్న తేడా సైతం పట్టించుకోననుకుంటాను"
   
    "ఆసలేమైంది" విసుగ్గా అడిగాడు.
   
    "మరేం లేదయ్యా...." క్షణం ఆగి ఈ చెట్టు దిగువున ఓ పొదలో నాకు ఓ అడదాని శవం కనిపించిందయ్యా..."
   
     ఈ విషయాన్ని అంత స్థిమితంగా చెప్పిన స్వామిని చాచికొట్టే వాడే..... తమాయించుకుని దిగువకి నడిచాడు వేగంగా   
    బొమ్మ జెముడు చెట్లన్న ఓ పోడకి అనుకుని పడి వుంది ఓ యువతి శవం చనిపోయిచాల గంటలు గడిచిన సూచనగా దుర్గాభం వస్తోంది.
   
    అరగంటలో గిరజనుల్నీ రప్పించాడు చైతన్య.
   
    పూర్వ మెప్పుడో తప్పిపోయిన యువతిగా గుర్తించారంతా.
   
    ఆ యువతి తల్లేమో నెలల తర్వాత ఇలా కూతుర్ని చూడాల్సి వచ్చినందుకు గుండెలు ఏడుస్తోంది.
   
    "ఏం చేద్దామంటారు" రమాకాంత్ అడిగాడు.
   
    "పులి కోసం మాటేస్తారా"
   
    తల అడ్డంగా వూపాడు చైతన్య "ఈమె పులిచేత చంపబడిన వ్యక్తికాదు."
   
    "వాట్" ఆప్రతిభుడైనట్టు అడిగాడు రమాకాంత్.
   
    "ఏస్. గుండెల నుంచి కాళ్ళ శరీరం చీల్చబడింది తప్పు పులి పంజా గుర్తులు లేవు సో.... మీ పలుకుబడి వుపయోగించి సాధ్యమైనంత త్వరగా పోస్ట్ మార్టం చేయించి ఆ వివరాలు నాకు తెలియచేయాలి
   
    చైతన్య జీపులోనే ప్రయాణం కట్టాడు రమాకాంత్.
   
    సరిగ్గా మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల్లకల్లా రిపోర్టుతోవచ్చాడు రమాకాంత్.
   
    చైతన్య అంచనా తప్పు కాలేదు.
   
    ఆ యువతి తప్పు కాలేదు.
   
    ఆ యువతి డ్రగ్ అడిక్ట్... రేఫ్ చేయబడింది. చంపబడింది. చినిపోయాక మళ్ళీ సంభోగం జరిగింది. ఆ తరువాత పదునైన ఆయుధంతో నిలువునా చీల్చబడింది.
   
    "ఏమిటిదంతా" అబ్బురంగా అడిగాడు రమాకాంత్.
   
    శవాన్ని చూసిన వెంటనే అనుమానించి ఇంత సమాచారం సేకరించడానికికారుకుడైన చైతన్య మేధస్సు ఎంత పదునైనదో అర్ధమైన రమాకాంత్ అతడ్నే చూస్తున్నాడు.
   
    చైతన్య జవాబు చెప్పలేదు.
   
    ఇక్కడి సంఘటనతోమరేదో సమన్వయపరచి అలోచిస్తున్నాడు.
   
    చీఫ్ కన్వర్వేటార్ ఆఫీసులో చూసిన లాగ బుక్ లో మిస్సయిన జగన్నాధం నాలుగు రోజులకు పూర్వం కొన్ని వాక్యాలు రాశారు.
   
    "మొగలి గుట్టని అనుకుని వున్న వెదురు తోటలో నిలబడ్డ నాకు తరువాత అయిదు గర్భవాటిలా నడుచుకు వెళ్ళడం కనిపించింది. ఆ తరువాత పరుగెత్తి చూస్తె గుట్టపై నుంచి జారిపోయివుందా యువతి. చేయూత నిచ్చి చూస్తె ఇంకేముంది ఆమె గర్బవతి కాదు. అడిగితె గర్బంపోయిందీ అంది కాని బహుశా ఏ కరక్కాయల మూటోఅలా లోపల వుంచుకుని కడుపులో వున్నట్టు నటించి వుండొచ్చు."
   
    అంతా మననం చేసుకున్న చైతన్య ఎనలైతికల్ గా ఆలోచించారు.
   
    ఏ గిరిజన యువతైనా కేవలం కరక్కయాల కోసమే అయితే ఇంత నాటకం ఆడాల్సిన అగత్యం అసలు గిరిజన యువతులు అలాంటి తెలివి ప్రదర్శించే అవకాశం లేదు.
   
    డ్రగ్ డ్.... రేఫ్ డ్..... కిల్డ్... దెన్ రేఫ్ డ్ ....
   
    ఓ గిరిజన యువతి డ్రగ్ అడిక్టుగా ఎలా మారింది.
   
    ఒకటి ... రెండు.. మూడు...
   
    సరిగ్గా అయిదో నిముషంలో స్పురించింది.
   
    "మిస్టర్ రమాకాంత్" సాలోచనగా అన్నాడు చైతన్య "ఈ అరణ్య గర్భంలో ఇప్పటి మేనీటర్ ని మించిన మరో అసాధారణ శక్తి ఏదో పని చేస్తోంది. ఇప్పటికీ పరిష్కారం కాని చాలా ప్రశ్నలకి అదే జవాబునిస్తుంది.
   
    అర్ధం కావడం లేదు.
   
    "నా అంచనా తప్పు కాకపోతే చాలా బలమైన రాకెట్ బహుశా అంతర్జాతీయ స్థాయి నేర వ్యవస్థ కావచ్చు. అది ఈ అడవిలో పనిచేస్తుంది. రమాకాంత్ గిరిజన కన్యలు మిస్ కావడానికి ఆ వ్యవస్తే కారణమై వుంటుంది.
   
                      *    *    *    *
   
    "A delectable scattering of jewel like islands acrooss the indian ocean, an unspoilt paradise of plams and beaches. that is maldives."
   
    ఓ కవితల మాల్దీవుల సౌ౦దర్యాన్ని అభివర్ణించారు. భారత్ దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మిస్టర్ కే.కే. పాణి......
   
    ఆ రోజుఉదయమే ప్రత్యెక విమానంలో మాల్దీవుల ముఖ్యమైన "మాలే" అని చేరుకున్న మిస్టర్ జే.కే అధ్యక్షా భవనంలో అడుగు పెట్టింది అరగంట క్రితమే.

 Previous Page Next Page