అనూ ఎప్పుడు పెద్దమనిషియింది...... ఎలా కూర్చుంది.... ఎవరెవరు వచ్చింది..... ఎంత పెద్దచిమ్మిలుండలు పెట్టింది వివరంగాచెప్పి జేబులోంచి చిమ్మిలి ఉండ తీశాడు అవధాన్లు కాస్త చిమ్మిలితుంచి రాజుచేతిలో పెట్టాడు.
అవధాన్లు తనచేతిలో చిమ్మిలి పెట్టిందికూడా గమనించలేదు రాజు.
" అనూ ని ఇహ తను చూడలేదా? ఊరినుంచి వచ్చింతరువాతయినా కనపడుతుందా?"
రాజు ఆలోచన చెదిరిపోయింది. " చిమ్మిలి బాగుంది, తినురాజు!"అన్నాడు. అవధానులు తను కాస్త చిమ్మిలి నోట్లోవేసుకుని తింటూ.
"తింటానిగాని అవధాన్లూ! నువ్వు మంచివాడివి. నేచెప్పినపని చేస్తావుకదూ.
నోట్లో చిమ్మిలివుడంటంతో తలవూపాడు అవధాన్లు.
"నేను రేపుఉదయం పట్నం వెళుతున్నాను. మళ్లీ ఎప్పుడోగాని రాను. అనూతో ఒక్కదానితోనే ,ఎవరూలేకుండా చూచి చెప్పు. రాజు వూరికెళ్ళాడు. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి వచ్చాడు. నీవురాలేదని చాలాసేపు చూచాడు అని ఆ.....యీ మాటకూడా చెప్పు." రాజు ఎప్పడయినా ఊరినుంచివస్తే ఎవరిచేతయినా రమ్మని కబురుచేస్తే, బలరామయ్య గారి పెరడుదగ్గరకు రమ్మాన్నాడు" అని రాజు గట్టిగాచెప్పాడని అనూతో చెప్పాలి. చెపుతానా అవధాన్లూ?"
"ఓసే, ఇంతేనా? తప్పకుండా చెపుతాను" అవధాన్లు జారిపోతున్న నిక్కరుని పైకి లాక్కుంటూ అన్నాడు.
రాజు ఇంటికి,అవధానులు వాళ్ళింటికి వెళ్ళటానికి విడిపొయ్యారు.
చేతిలో ఉన్న చిమ్మిలి ఆప్యాయంగాచూచి " అనూ! మళ్ళీ ఎప్పుడు చూస్తానో. నిన్ను. నేను రాకపోయినా చిమ్మిలి తింటున్నాను చూచావా?" అనుకుంటూ చటుక్కున నోట్లోవేసుకున్నాడు. చిమ్మిలిని రాజుకి అనూని చూడకపోయినా కాస్త తృప్తికలిగింది.
"అబ్బ! చిమ్మిలి ఎంతతియ్యగావుంది?" అనుకున్నాడు రాజు.
9
సుభద్రమ్మ ఉదయమే రామచంద్రపురం వెళ్ళింది.
రామభద్రయ్యకు ఇంటిపని , వంటపని పడింది. సుభద్రమ్మ ఊరికి వెళుతు పిల్లలను తీసుకెళ్లింది. అనుపమకు తోడుగా పెద్ద త్తగారిని ఇంట్లో పెట్టింది. ఆవిడకు దగ్గరచూపుతప్ప దూరంచూపు లేదు. పనిచెయ్యకుండానే చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. తొంభై దాటిన ముసలమ్మ.
ఆవిడ రామభద్రయ్య సంసారం చూచి నాలుగురోజులుందామని వచ్చింది సరీగా ఆవిడొచ్చినప్పుడే రామచంద్రపురంలో వున్న సుభద్రమ్మ పినతండ్రి కబురుపంపాడు.
" మా వూళ్ళో రాజమ్మగారని నీళ్లు మో సేఆమె వుంది. మంచి మనిషి. రాజమ్మగారికి ఒకబ్బాయి, ఒకమ్మాయి. అతను బుద్ధిమంతుడు. బడిపంతులు ఉద్యోగం యీ మధ్య నేవచ్చింది. అనావికారీకాడు, రూపసీ కాడు. ఓమో స్తరుగా వుంటాడు.అతని అప్పగారు విధవావిడ. వీళ్లింట్లోనే వుంటుంది. అకుటుంబంలో ముగ్గురూ బుద్దిమంతులు.కట్నంఆశ వుంటుంది. ఆ కుటుంబంలో ముగ్గురూ బుద్ధిమంతులు. కట్నం ఆశ ఎక్కువలేదు. మన అనుపమసంగతి చెప్పాను. అతను ఒప్పుకున్నట్లే కనపడ్డాడు.అనుపమ అందంచూస్తే వెంటనే అంగీకారం తెలపవచ్చు. కాబట్టి అతన్ని అక్కడకు తీసుకురమ్మంటావా? నీవే అనుపమను తీసుకొస్తావా? వెంటనే ఏసంగతీ తెలిజేయి."
రామచంద్రపురం నుంచి తెలిసినంతనువస్తుంటే ఉత్తరంరాసిపంపారు పినతండ్రి.
తిరిగి ఉత్తరంద్వారా కబురుచేయక సుభద్రమ్మ బైలుదేరివెళ్లింది ఊరికి. "ఆడపిల్ల పెళ్లి కావటం కష్టం. అందులో పుట్టంధురాలంటే , పెళ్లి చేసుకోటానికి ఎవరుముందుకువస్తారు? గుడ్డివాళ్ళకు. కుంటి, మూగ, చెముడు ఎందరాడపిల్లలకు పెళ్ళికావటంలేదు? యీ మధ్య అనుపమ పరధ్యానంగా , దిగులుగా మన్నుతిన్నపాములా కూర్చున్నచోట అలానే గంటలతరబడి గడుపుతున్నది. చూపంటేలేదుగాని,ఆకలివుండదా, కోరిక లుండవా? కష్టపడితే ఎవరో ఒకరు ముందుకొచ్చి అనుపమమెడలో మూడు ముళ్లు వేయకపోరు.
తొందరపడి పెళ్లి చేస్తే కొత్తబాధలు కొని తెచ్చుకున్నట్లవుతుందేమో? పిల్ల వాడి గుణాలు ఇంట్లో పెద్దలబుద్ధులు కళ్ళారాచూచి చెవులారా వింటే పిల్ల వాళ్లింట్లో సుఖపడేది లేనిది తెలుస్తుంది. వాళ్ళపై సదభిప్రాయం కలిగితే పిల్లని చూచివెళ్లమని మర్యాదగా ఆహ్వానించవచ్చు. ఆ పై భగవంతుడి దే భారం. ఏదెలాజరగాలో అలా జరుగుతుంది."
ఇదంతా ఆలోచించి సుభద్రమ్మ ఊరికి బైలుదేరివెళ్లింది. రామ భద్రయ్యను పంపితే వెళ్ళినపని నవ్యంగా కాకపోగా సమస్య. ఒకటి నెత్తినేసుకొస్తారు. అందుకే రామభద్రయ్య ఇంటిపట్టున ఉండిపొయ్యాడు. మూడోరాజున తిరిగివస్తానని వెళ్లింది సుభద్రమ్మ.
అనుపమకి ఆడతోడుగా వుంటుందని ముసలమ్మనుంచితే, ఆవిడ చేసేపని "అమ్మాయ్! మంచినీళ్లు తెచ్చిపెట్టు."