నిర్మానుషంగా వున్న ఆ ప్రదేశంలో నిశ్శబ్ద ప్రకృతి మధ్య నిలబడ్డ ముకుందం నిస్సహాయంగా చుట్టూ చూసాడు.
ఎక్కడా అలికిలేదు.
ఆకాశం కేసి మినుకుమంటున్న నక్షత్రాలకేసి భయపెడుతున్న చీకటికేసి మార్చిమార్చి చూస్తూ చాలా వికృతంగా ఒకార్తనాడం చేశాడు. 'అమ్మా' అని. నవాబులేదు. మళ్ళీ మరింత దీనంగా ఆక్రందన చేసాడు __గూళ్ళలోని పక్షులు కదిలేట్టు నీరవ నిశీధి వణికేట్టూ....
అతడి కళ్ళప్పుడు ఆ ప్రయత్నంగానే నీళ్ళను లేనట్టు నోరు తెరుచుకుని వుండిపోయాడు.
దూరంగా నడచి చేరగలిగేటంత దూరంలో ఏదో చిన్న కాంతిరేఖ.
బలాన్ని కూడగట్టుకుని పరుగెత్తాడక్కడికి.......
ఒక కిలోమీటరు దూరం చేరుకున్నాక తెలిసింది అదో పెట్రోలు బంకవి.
దూరంగా నిలబడే చూసాడు.
హైవే రోడ్డుకు అనుకుని ఉన్న బంకులో అద్దాలతలుపుల వెనుక కూర్చుని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు.
అసలెందుకొచ్చాడిక్కడికి
పెట్రోలు నెత్తిపై పోసుకుని అంటించుకోవడానికా......
దానిక్కూడా డబ్బులు కావాలే......
సరిగ్గా ఇక్కడే 'డబ్బులు' అన్న పదం ఆలోచనల్లో దొర్లినప్పుడే వాడిగా చాలా పదునుగా ఒక విషయం అతడికి జ్ఞప్తికొచ్చింది.
పెట్రోలు బంకులో వున్నవాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా వుంటాయి ఆ డబ్బు తన దగ్గర లేనిది, తనకు చాలా అత్యవసరమైనదీను.
పాతికేళ్ళు జీవితాన్ని చాలావిస్సారంగా నిజాయితీగా గడిపెసిన ఓ పేద యువకుడి అలొచనల్లొ ఇలాంటి అష్టవ్యస్తత చోటు చేసుకుందీ అంటే అ తప్పేవరిది ?
క్షణక్షణనానికీ భయపెడుతున్న పరిస్థితులదా?
లేక.....
వస్థతులపై గెలుపు సాదించాలంటే అందుబాటలో లేని మారణస్రమైన డబ్బుదా?
క్షణాలు గడుస్తున్నాయి __-
సహాసించాలి. నిస్సహాయంగా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునే కంటే అవసరమయితే హత్యకైనా వెనుకాడక డబ్బులు దోచుకోవాలి.
ఇదే ముకుందాన్ని ప్రోత్సహించింది.
వడివడిగా నడిచాడు.
అద్దాల తలుపులు తెరుస్తుంటే "ఏంకావాలి" అన్నాడుబలిష్టంగా ఉన్న యువకుడు .
మరోవ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అలవాటులేని పనికి సిద్దబడి ముకుందం అనాలోచితంగా లోపలి అడుగుపెట్టాక గుర్తుకొచ్చింది తనదగ్గర ఎలాంటి అయూధమూ లేదని.
"ఏంటా చూపు...... ఎవర్నువు " లేచాడు బలంగా వున్న యువకుడు.
"ఏంలేదు. టై మెంత్తైందో తెలుసుకుందామని "గోణికాడు ముకుందం అప్పటికి తాత్కాలికంగా మాట మారుస్తూ.
"పదీ నలభై "
"రాత్రి పదీ నలభై " ఎగతాళిగా రెట్టించాడు రేండో యువకుడు....
ఇప్పుడు చాలా వేగంతో అలోచిస్తున్నాడు ముకుందం.
ఎలా.....
తనకు మూడడుగుల దూరంలో నిఒలబడ్డ వ్యక్తి దగ్గర ఉన్న లెదర్ క్యాష్ బేగ్ లోని డబ్బెలా దోచుకోవడం .....
ఆగిపోయింది నవల అక్కడే.....
"ఎలా వుంది"
ఉలికిపాటుగా వెనక్కీ చూసింది రోషిణినవలని పక్కకు పెడుతూ __
ఎప్పుడు వచ్చాడో వైధేయ ఆమెకు చాలా సమీపంలో నిలబడి వున్నాడు.
"ఏంటీ? నిద్రమాని అంత ఏకాగ్రతగా చదువుతున్నావ్ "
మరో కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.....
అప్పటికీ ఆమె మాట్లాడలేదు. చిర్ననవ్వుని మొహానికి పులుముకుని "నువ్విప్పుడు లేచావ్ " అంది తల మరావుపక్కకి తిప్పుకుంటూ .
"అరె! ఏమిటీ" ఉత్సుకతగా చూసేడు ఆమె కళ్ళలోకి.
విచిత్రంగా దొరికిపొయిందామె.
చెమర్చిన తన కళ్ళని వైధేయ చూడడం ఆమె కిష్టంలేదు.
"వండర్ పుల్' నవ్వేడు వైధేయ "ఓ క్రైంనవలని చదివి కళ్ళనీరు పెట్టుకునే ఆడపిల్లని నిన్నే చూసేను"
గుడ్ గాడ్ అనుకుందామే వైధేయ తననిర్లిప్తకి మరోకారాణాన్నివేడుకకున్నందుకు కాస్త సంతోషిస్తూ.
"పట్టి క్రైం మాత్రమే అయితే నేనింతలా కదిలేదాన్ని కాదు వైధేయా"నిర్వికారంగా చూస్తూ "ఈ నవలలోకూడా ణీ ప్రత్యేకతని నిలుపుకున్నావు" అంది.
"అంటే ___"
"ముకుందం పాత్ర తప్పుచేయడానికి తల్లిని రక్షించుకోవడమే సెంటిమెంటల్ మోటివ్ ని సృస్టించారు. మెచ్చుకోలుగా చూస్తూ"నీకు అమ్మంటే చాలా ఇష్టం, కదూ " అడిగింది.
వెంటనే బదులు చెప్పలేదు వైధేయ.
అతడి కళ్ళలోసన్నని బాదావీచకతారట్లాపడింది. "నిజమే రోషణి. మనం ఆపలేనికాలంకంటే పోయలేని ప్రాణం కంటే కూడా అపురూపమయింది. "అమ్మ" అందుకే నాకు జన్మనిచ్చిదురదృష్టంగా దూరమయిన అమ్మ పాత్రను ప్రతి నవలలో సృష్టింస్తుంటాను. ఆ వూహల్లోనే నన్ను నేను ఓదార్చుకుంటాను ....!!"