Home » Kommuri venugopala rao » విరాజి

 

      ఎదురింటి మెడపై _ కిటికీ అవతలనుంచి రెండు కళ్ళు  అతని ఆసక్తి తిలకిస్తున్న సంగతి అతను గమనించలేదు.

                                               *    *    *    *   

    "మీ నవల ఆక్రందన " కు మొదటి బహుమతి లభించినందుకు ధన్యవాదాలు మీ ఫోటో వెంటనే పంపించండి.

    "ఇది  కలా? నిజమా?

    టెలిగ్రాం చేతిలో వుంచుకుని చాలాసేపు స్తబ్దుగా వుండిపోయాడు.

    విరాజి ! ఆమెకు చెప్పాలి.

    బట్టలు మార్చుకుని , విరాజి యింటికి వెళ్ళేందుకు గదిలోంచి బయటకు రాగానే సాక్షాత్తు ఆమె నిలబడి  వుంది.

    "అరే!" అన్నాడు ఆశ్చర్యంగా .

    "ఏమిటి? అప్పుడే కనిపించనని చెప్పి అంతలోనే దాపరించాననా?" అన్నది విరాజి నవ్వుతూ.

    "దాపరించలేదు, అవతరించారు."

    "ఎక్కడ్నుంచి?"

    "దివినుంచి భువికి."
   
    "చాలా పాతపోలిక"

    అవే __ ఒక్కోసారి గొప్పగా వుంటాయి.

    "ఇంతకీ ఎందుకొచ్చామని అడగవేం?"

    "చెప్పండి."

    "చూడాలనిపించచింది. చాలా చిన్న విషయం కదూ అయినా గొప్పది."

    "ఓ గమ్మత్తు చెప్పనా! నేనూ మీ దగ్గరకే బయలుదేరాను."

    "దేనికి?"

    జేబులోవున్న టెలిగ్రాంతీసి ఆమె కందించాడు.

    సంతోషం , సంభ్రమం కలిగినప్పుడు మొగవారి భావప్రకటనలో కన్నా ఆడవారిలో ఓ హొయలుంటుంది. అలాంటి అందమయిన విన్యాసమే విరాజిలో గోచరించింది.

    "కంగ్రాట్స్."

    గౌతమ్ మళ్ళీ లోపలకు దారితీశాడు.

    "గౌతం!" అంది అంది ఆర్ద్రస్వరంతో. "ఇది నీ అభిమానమైన కృషి ఫలితం."

    "కాదు నీ కృషే."

    "ఉహూ, యిద్దరి కృషే!"

    "ఫిఫ్టీ ఫిఫ్టీనా?"

    "ఈ ఫిఫ్టీ ఫిఫ్టీలు మొదట్లో దిగ్విజయ యాత్ర సాగించి, తర్వాత ముక్క చెక్కలయి పోతుంటాయి. చరిత్రలో అలాంటి ఉదంతాలెన్నో వున్నాయి."

    గౌతం ముఖం వెలవెలబోయింది. "వద్దు విరాజీ ? అలా మాట్లాడకు" అన్నాడు.

    "ఏం?"

    "మన మధ్య యీ .... యీ ... బంధం కాదు.... స్నేహం ముక్కలు చెక్కలు కావటానికి వీల్లేదు."

    విరాజి నవ్వింది, వెంటనే మాటమార్చేస్తూ _ "గౌతమ్ ఫోటో తీయించుకోవూ" అంది.

    "తీయించుకోవాలి కాని .... కాని గడ్డం మాసింది."

    ఆమె అతని ముఖంలోకి పరీక్షగా చూసి "నిజమే గడ్డం పెరిగింది పద బయటకు వెడదాం " అంది.

    "ఎక్కడికి ?"

    "సెలూన్ కి"

    "నువ్వుకూడానా?" అన్నాడు ఆశ్చర్యంగా .

    "ఏం? నీతో నేను రాకూడదా! మనమిద్దరం కలసి బయటి కేక్కడికీ వెళ్ళడం లేదా?"
   
    "ఆడవాళ్ళతో సెలూన్ కి ...."

    ఉన్నట్లుండి విరాజి నవ్వసాగింది "ఏం! నువ్వు గాడ్డం చేయించకుంటూ వుంటావు. నేను బయట వెయిట్ చేస్తూ వుంటాను"

    "ఛీ! ఆడవాళ్ళతో అలా సెలూన్ కి వెడితే బావుండదు" అన్నాడు తన సిగ్గుపడుతూ .

    "ఆడవాళ్ళతో సెలూన్ కి" ఈ టైటిల్ చాలా బావుంది గౌతం. ఈ పేరు పేట్టి ఒక కథ రాయకూడదా?

    ఒక్కోసారి టైటిల్ ముందు స్పురించి _ తర్వాత ఇతివృత్తం అల్లబడుతూ వుంటుంది. రచయితకు యిదో వింత అనుభూతి.

    "నిజమే ఇందులోంచి చాలా నిజజీవితం వస్తుంది. సహజమయిన హాశ్యాన్ని కూడా మేళవింప చేయవచ్చు!"

    "భార్యా కాని స్రీతో కూడా సెలూన్ కి వెడితే ....." అంటూ గభాల్న నవ్వేసి మళ్ళీ అతని ముఖంవంక పరీక్షగా చూసి "అవును ఇప్పుడు నువ్వు గడ్డం చేసుకోకపోతే ఏం ?" అంది.

    అతను అర్ధం కానట్టు చూశాడు.

    "ఇలా వుంటేనే చాల సహజంగా వుంది. ఇంకా చెప్పాలంటే ..... చాలా అందంగా కూడా వుంది. అన్నట్టు యీ రోజుల్లో యిది ఫ్యాషన్ కూడా."

                                                         *    *    *    *   

    "ఆక్రందన" ప్రచురణ ప్రారంభమయింది.

    గౌతం ఎందుకో చాలా నెర్వస్ గా ఫీలయ్యాడు . నవల స్క్రిప్టులో వున్న దశలోవున్న ఆత్మవిశ్వాసం అచ్చు అవుతున్నప్పుడు వుండదు. అంతకు ముందు తోచని తప్పులు అనేకం కనిపిస్తూ వుంటాయి కూడా!

    ఒకరోజు అతన్ని వెతుకుంటూ నలుగురయిదుగురు కుర్రాళ్ళు వచ్చారు.

    "నమస్కారమండీ .ఈ వూళ్ళో ఉత్తమసాహితి అని ఒక సాహితీ సమితిని నిర్వహిస్తున్నాం , కధగానీ, నవలగానీ నాటకంగానీ కవిత్వం సాహిత్యంవిలువలు దిగజారిపోతోన్న యీ రోజుల్లో వాటిని నీరసించి ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సాహించటమే మా లక్ష్యం " అన్నాడు వారిలో చురుగ్గా కనిపిస్తోన్న ఓ యువకుడు.

    "చాలా సంతోషం" ఆనందు గౌతం.

    " మీ నవల 'ఆక్రందన' ఉన్నత ప్రమాణాలతో విలసిల్లుతోంది మీకు సన్మానం చేయాలని మా సమితి సంకల్పించింది" అన్నాడు.

    గౌతం చాలా సిగ్గుపడ్డాడు "నేను రచయితగా యింకా చాలా ప్రాధమిక దశలో వున్నాను. ఈ సన్మానాలూ అవీ ఎందుకులెండి" అన్నాడు.

    "అలా అనకండి తెలిగులో చాలాకాలం తర్వాత ఓ మంచి నవల చదవగాలుగుతున్నాం . కేవలం భేదజాలతో, అత్తాహాసాలతో, కృత్రిమపు అవకతవక వాతావరణంలో అట్టుడుకి కాదనలేక పోయాడు.

    ఆ కుర్రాళ్ళు వెళ్ళిపోయాక తప్పు చేశాననే భావన అతనిలో క్రమంగా అధికమయింది. విరజిని కలుసుకోవాలి. ఆమెకు చెప్పాలి.ఆమె చివాట్లు పెడితే పడాలి. అనుకుంటూ ఆ సాయంత్రం విరాజి ఇంటికి వెళ్ళాడు.

    విరాజి యింట్లోనే వుంది కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ తల స్నానం చేయటం వల్ల విరబోసుకుని వున్న జుట్టును చిక్కుతీసుకుంటో౦ది.

    గుమ్మం ఇటుకేసి ఉండటంవల్ల అతను లోపలకు రావడంఆమె చూడలేదు.

    లోపలకు అడుగు పేట్టి క్షణం సేపతను ఆప్రతిభుడై వుండి పోయాడు పొడవాటి శిరోజాలు నడుం క్రిందవరకు వ్యాపించగా, స్వచ్చంగా ఉన్న శారేరం, భుజాల దగ్గర చిన్న వొంపు ఎంత ఆర్టిస్టుక్ గా వుంది.

    అలికిడి విని కాకపోయినా తనతోబాటు యింకో మనిషి వున్న పోకడ తోచి ఆమె వెనుదిరిగింది. అతన్ని చూడగానే ఒక విధమైనకాంతిటో ఆమె కన్నులు తరళితమైనాయి.

    "ఓ ! ఎంత గొప్పగా వొచ్చావు!" ఆమె గొంతులో ఎంతో సంతోషం .

    అతను మూగగా నిలబడి అలాగే చూస్తున్నాడు.

    దగ్గరకు వచ్చి భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా అన్నది _ ఏమిటలా చూస్తున్నావు?"

    "నిన్ను"

    "ఏవుంది నాలో "

    "ఓ అద్భుతం."

    "ఏమిటిది?"

    "ఎలా చెప్పాలో తేలీదు."

    "మరి .....?"

    "నువ్వు ...."

    "ఊ?"

    "నువ్వు....."

    "......"

    "రాలోపలకు అలాగే నిలబడిపోయావు" అంటూ చెయ్యిపట్టుకుని మరి కొంచం లోపలకు తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చో పెట్టింది.        

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra