Previous Page Next Page 
ది రైటర్ పేజి 15

    అమె శ్వాస  ఆగిపోయింది గుండె కండరాలు బిగుసుకుపోయిన సూచనగా......
   
    భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో ......
   
    అయిపోయింది......
   
    పధకం అమలు జరిగిపోయింది........
   
    ఒక రచియిత తన రచనతో ప్రపంచానికి తెలియపరిచిన విషయాన్ని సునయాసంగా అమలు చేసిభార్య ప్రాణాల్ని హరింపగలిగాడా వ్యక్తి......
   
    నమ్మకద్రోహానికి నమ్మకంగా ముగింపు ఇవ్వబడింది.....
   
    ఆ వ్యక్తి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.......
   
    ఆమె మరణాన్ని తలుచుకుని కాదు అతడు దుఃఖపడుతున్నది. చావు లాంటి బ్రతుకును తను ఈడ్చుకురావాల్సి వస్తున్నందుకు __
   
    పక్కనే ఇందాక అతడు ప్రేమగా భార్యకు అందించిన కాఫీ గ్లాసు వుంది.
   
    అందులోనూ అతడు అర్సినిక్ ట్రయాక్సైడ్ కలిసింది.
   
    రెండురోజులుగా ఆమెకు ట్రీట్ మెంటు ఇస్తున్న డాక్టర్ సైతం గుర్తించలేడు ఆమె హత్య చేయబడిందని.......
   
    కేవలం జ్వరతీవ్రత వాంతులు మూలంగా కార్డియాక్ అరెస్టు జరిగి ప్రాణాలు పోగొట్టుకుందని అనుభవమున్న డాక్టర్ సైతం పొరపాటు పడగల ప్రశాంతమైనా మరణం.....
   
    అ వ్యక్తి పనిచేస్తున్నది ఓ పెద్ద డ్రగ్స్ అండ్ ఫార్మాన్యూటికల్స్ ఫేక్టరీలో....
   
    అందుకే బజారులో కొనే అవసరం లేకుండానే ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ సంపాదించేడు......
   
    మూడురోజుల క్రిందట చదివేడు వైధేయ రాసిన సీరియల్ ......   
   
    రెండురోజుల క్రితం పథకం వేసాడు.
   
    ఈ రోజు ఆ పథాకాన్ని అమలుచేసాడు.
   
    వేదనరోదనగా మారి అతడ్ని క్రుంగ దీస్తుంటే భార్య శవాన్ని హత్తుకుని పసిపిల్లాడిలా ఏడ్చేశాడు.
   
    అంత గాఢ౦గా అతడామెను ప్రేమించి వుండకపొతే ఈ క్షణంలో కసి తెరచుకున్న ఆనందమైనా దక్కేది.....
   
    ఆ తర్వాత చాలా విచిత్రంగా తానో ప్రమాద భూయిష్టమైనా పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నానని అతడూహించలేకపోవడానికి కారణం అప్పటి అతని మానసిక స్థితి.......
   
    ఆ వ్యక్తి మరెవరో కాదు.....
   
    ఒకనాడు......
   
    తననెవరో అల్లరి చేస్తున్నాడని భార్య చెబితే చీకటిలో మాటువేసినతన భార్యతో మాట్లాడుతున్నది ఆ యువకుడిమో అన్న భ్రమతో పార్కులో వై ధేయపై చేయిచేసుకున్న కౌర్ సింగ్.....
   
    అతనిఅసలు పేరు ఆనందరావు......
   
                     *    *    *    *   
   
    "ఎలా వుంది ఇల్లు"
   
    విడిగా విశాలంగా వున్న ఇంటి గదులన్నీంటిని పరిశీలిస్తూ తిరుగుతున్న రోషిణిని చూస్తూ అడిగాడు వైధేయ....
   
    "ఏర్పనట్టుంది" టక్కున జావాబుచ్చిందామె......." నీ గురించి చాలా ఎక్కువుగా అంచనా వేసాను వైధేయా! రచతితవికదా...... ఇంటి నైనా కళాత్మకంగా వుంచుకుంటావనుకుంటే నువ్వు రాసే క్రై౦ నవలల్లోని విలన్స్ డేన్  లా  తయారు చేసి మరీ వదిలిపెట్టావు"
   
    నిజానికి వైధేయ ఆక్షణంలో ఆమె మాటల్ని తీరుబాటు గా వినే పరిస్థితులో లేడు. ..... తనను క్షణంక్షణం సవాల్ చేస్తున్నా ఆమె అందాన్ని వీలైనంత త్వరగా నంజుకోవాలన్న తృష్ణతో నలిగిపోతున్నాడు......  
   
    అతడి స్థితిని అర్డంచేసుకోనట్టుగా ఆమె డోర్ కర్టెన్లని సర్దుతూంది. బడలికగా కాట్ పై జారగలబడిన వైధేయ దృష్టి వెనకగా నిలబడ్డ రోషిణిసన్నని నడుంపైనా పియానోరీడ్స్ లాంటి అక్కడ అందముగాపరుచుకున్న ముడతలపైనా పడి ఆగిపోయింది.
   
    "నిద్రస్తుందా" వెనక్కి తిరక్కుండానే అడిగింది తన పనిలో నిమగ్నమయ్యే ___
   
    జావాబువ్వలేదు వైధేయ____
   
    "ఇంతలా పనిగట్టుకుని పిలిచావు..... అప్పుడే నిద్రా......" కొద్దిగా తలతిప్పి కవ్వింపుగా అడిగింది.
   
    "ఉన్నదొకటే బెడ్డు ___ నేనెక్కడ పడుకోవాలి" రెక్ వేపు నడిచింది కొద్దిగా.
   
    "ఇక్కడ __" తన పక్క చోటు చూపిస్తూ జరిగాడు ___"మొత్తగా వుంటుందని నీలాంటి వాళ్ళకోసం ప్రత్యేకంగా యిక్కడ ఏర్పాటు చేసాను "
   
    గిరుక్కున వెనక్కి తిరిగింది రోషణి.
   
    "నీలాంటి వాళ్ళకోసమూఅంటూ ఒత్తి మరీ పలుకుతున్న మిస్టర్ వైదేయా! నేను అందరిలాంటి ఆడదాన్ని కాదని ఎంత వేగంగా తెలుసు కుంటే అంత మంచిది."
   
    హాఠాత్తుగా ఆమెలో కలిగిన మార్పును అతడు పూర్తిగా అర్ధం చేసుకోలేదు ___ అదే వైధేయ చేసిన మరో తప్పు.....
   
    'సారీ' అన్నాడు ఖంగుతిన్నట్టుగా "నీ కోసం మరో బెడ్డు రెడీ చేస్తాను."
   
    మరుక్షణం నవ్వింది వెన్నెలసోనలా రగిలే జడివానలా..... "పిరికి.... నేనంటున్నది అదికాదు."
   
    "మరి....."
   
    "ఇద్దరు ఒకరయ్యేవేళ ఇంత పరువుతో పనేముంది ..... ఈ పరుపే మరింత ఇరుకుగా వుంటే ఆ ఒరిపిడి వెచ్చదనం మరెంతో హాయికదా అంటున్నాను."          

 Previous Page Next Page