Previous Page Next Page 
కదానాయికి పేజి 14

    "పరీక్ష పాసుకాకపోతే పెద్దచదువులు చదవటానికి వీలులేదుగా? అప్పుడు పట్నం వెళ్లక్కరలేదుకదూ?"

    "అవును."

    "అయితే రాజూ! నువ్వు పరీక్ష పాసుకావద్దు.  అప్పుడు పెద్దచదువు వు చదవటానికి పట్నం పంపించడు మీమామయ్య.ఇక్కడే ఉండొచ్చు."

    "ఛీ!ఛీ! పరీక్షతప్పితే అందరూ నవ్వుతారు. పాసయితే గొప్ప."

    "ఆటల్లో గెలిచినట్లుగానా?"

    " అవును, ఈ ఊళ్ళో హైస్కూలుచదువే పూర్తిగాలేదు. హైస్కూలు కాంగానే కాలే...

    "అయితే రాజూ! నువ్వు బాగా చదివి అన్నిపరీక్షలు పాసుగా, బాగా అడి  అన్ని ఆటలు  గెలువు" రాజు మాటకు అడ్డువచ్చి అంది అనుపమ.

     రాజు చటుక్కున అనుపమచేతిని ముద్దుపెట్టుకున్నాడు. వెంటనే సిగ్గుగా  ఏదో తప్పుచేనినట్లు అనుపమవైపు దొంగచూపు చూచాడు.  అనుపమ మాములుగానేవుంది. మాటిమాటికి  కనురెప్పలు ఆర్పుతూ రాజు కనపడకపోయినా రాజువైపుచూస్తూ... అమ్మయ్య" అనుకున్నాడు రాజు.

    "ఇంక రెండువారాల్లో పరీక్షలు తెలుస్తాయి. ఆతరువాత పట్నం వెళ్లి పోతాను. నేవెళ్లి  పోతే  మరిచిపోవుగా అనూ! నన్ను?"

    "ఊహు! మరిచిబపోను. మరి ఎప్పటికీ రావా రాజూ! నన్ను చూడటానికి కూడా రావా?"

    "శని ఆదివారాలు కలిసివచ్చినప్పుడు పండగలప్పుడు , శలవుల్లోను వస్తుంటాను. వచ్చినప్పుడు ఎవరిచేతయినా కబురుపంపుతాను  ఇక్కడికిరా. వస్తావుకదూ అనూ?" ఆతృతగా అడిగాడు రాజు.

    "నువ్వు కబురంపగానే వస్తాను. నువ్వేళ్లింతరువాత వీళ్ళెవారితో ఆడుకోటానికి ఆదివారంనాడుకూడా రాను.  అందరూ ముందుఆడతారు. ఏడ్పించి పారిపోతారు." కాస్త కోపంగాను తెలియని బాధతోను అంది  అనుపమ.

    "బాగా చీకటిపడింది వెళదాంలే అనూ! రేపాదివారం  ఆపై ఆదివారంకూడా వస్తాను. తొందగారా" రాజు అనుపమచెయ్యి పుచ్చుకుని  లేస్తూ అన్నాడు.

    " తప్పకుండా వస్తాను. నువ్వు రాకపోతే ఊరుకోను." అంది అనుపమ.

    "ఊ" అన్నాడు రాజు జాగ్రత్తగా అనుపమ చేయిపట్టుకుని ముందుకు అడుగులేస్తూ.

    పట్నంలో పెద్దపెద్ద డాక్టర్లు కళ్లులేనివారికి కళ్లు పెడతారట, అప్పుడు గుడ్డిపోయి బాగా చాపువస్తుందట . గుడ్డివాళ్లుకూడా బాగా చాడగలుగుతారు.డాక్టరుచదవాలంటే చాలాచదవాలి.అన్నీ ఫస్టుక్లాసులో పాస్ కావాలి. నీకోసం కష్టపడి పెద్దచదువులు చదివి అన్నీ ఫస్టుక్లాసులో పాస్ డాక్టరు చదువుతాను. నీకు కళ్ళు పెట్టి చక్కగా ఆందరూ చూచేటట్లు..... నీవూ  చూజగలిగేటట్లు చేస్తాను. మామయ్య ఎంత పెద్దచదువయినా చదివిస్తానన్నాడుగా. డాక్టరు చదవుతాను. నీకు కళ్లు పెడతాను." అని అనుపమ మతో చెపుదామనుకున్నాడు. రాజు. " ఇప్పుడే చెప్పటందేనికి, చదివేటప్పుడు చెప్పొచ్చులే" అనుకున్నాడు. మళ్ళీ. రాజు మాట్లాడకుండా నడవటం చూచి అనుపమ మౌనం వహించింది. రాజు , అనుపమ విడిపొయ్యే మూలతిరుగుడు వచ్చింది. "జాగ్రత్తగావెళతావుగా అనూ?" అన్నాడు  రాజు. అనుపమ చెయ్యి వదిలేసి.
   
    "ఆదివారం వస్తాను. తప్పకుండా రావాలి."  అంది అనుపమ.   

    అనుపమ మామూలుగా నడిచిపోతుంటే చూస్తూ నుంచున్నాడు రాజు.

    "అరె. అందంగా వుండట అంటే ఏమిటో, బాగుండకపోతే పోయిందో! రాజుని అడుగుదామనుకున్నాను. ప్చ్.... మరిచేపొయ్యాను. రేపాదివారం వచ్చినప్పుడు రాజుని అడగాలి." దోవలో అనుకుంది అనుపమ.

                                                                                   7

    ఆదివారంనాడు. సంత. రామభ్రమయ్య ఆరోజు వారానికి సరిపడ కూరలు, కావాల్సిన సరుకులు తెచ్చి ఇంట్లో పడేస్తాడు. ఆదివారం  ఏ రోజూ అని అడక్కుండా  తెలుస్తుంది అనుపమకి.

    రామభద్రయ్య సంతనుంచి తెచ్చిన సరుకులు, కూరలు సంచిలోంచి విడివిడిగా తీసిపెడుతున్నాడు. సుభద్రమ్మ సర్దుతు ధరలెలావున్నాయో. అడుగుతున్నది. జీడీలపొట్లం విప్పి పిల్లలకు తలా రెండు పెట్టి " పెద్దతల్లీ! నీకిష్టం కదా అని యీ వారం జీడీలు తెచ్చాను. బాగున్నాయి. చూడటానికి" అంటూ అనుపమచేతిలో రెండు జీడీలు పెట్టాడు రామభద్రయ్య.
   
    "అమ్మకు , నీకు వున్నాయానాన్నా?" అంది అనుపమ.

    "ఉన్నాయి పెద్దతల్లీ! అవి నువ్వు తినేసెయ్యి." అన్నాడు రామభద్రయ్య. సరదాగావుండి నూటికో, కోటికో చిలిపిపని చెయ్యాలని బుద్ధి పుడుతుంది. కూరలుసర్దుతున్న సుభద్రమ్మనోట్లో  జీడీపెట్టాడు భుజం మీద చేయివేసి.

    భర్తచేసినపని అర్థమయింది. కంగారుగా ,సిగ్గుగా అనుపమవైపు చూచింది. అనుపమ  జీడి చప్పరిస్తున్నది.అనుపమ చూడలేదు. ఎదురుగా ఏపనిచేసినా తెలియదు.అలా అనిపించగానే సుభద్రమ్మ అమిత నీరసపడిపోయింది. భర్తమీద అర్థంలేనికోపం వచ్చింది. సిగ్గులేకపోతే సరి  అన్నట్లు చూచింది.   

 Previous Page Next Page