కావాలని అంతా ఓ మాట కొచ్చారనిగ్రహించాడు. " సరే!మీ అందరికీ ఓడిపోవాలనుంటే రండి. నేను రేడీ." అన్నాడు రాజు.
అయిదుగురు ఒకవైపున రాజు ఒక్కడూ ఒకవైపు వుండమనటం అన్యాయం అనిపించింది అనుపమకు.
"గెలవలేక కావాలని అంటున్నారు.రాజు ఒక్కడు ఇంతమందితో ఆడొద్దూ?"
"నీకేందుకు బాధ అనూ? రాజు సరే అని ఆడుతుంటే!" అంది ఉమ.
అనుపమ మాట్లాడలేదు.
మళ్ళీ చెడుగుడు మొదలైంది.
ఆటలో రాజు రెట్టింపు వుత్సాహంతో , గెలవాలనే పట్టుదలతో "గుడు గుడు గుడు గుడు గుడ గుడు" గుక్క ఆపుకోకుండా గిరిదాటి ఇవతలికివచ్చి కాలు పట్టుకోటానికి వచ్చిన వెంకట్ మూతిమీద ఫెడీల్ మని తన్ని, వెనుక నుంచి పిల్లి లావస్తున్న అవధాన్ని యీడ్చుకుని తన స్థానంలోకి వచ్చేశాడు.
అవధాన్లు డోక్కుపోయిన మోకాలు వూదుకుంటూ ఆడపిల్లల మధ్య కొచ్చి కూర్చున్నాడు.
రాజు చేతిలో ఒక్కొక్కరు ఓడిపోతున్నప్పుడల్లా కేకలు పెడుతున్నారు. పిల్లలు. "పట్టు !కొట్టు!పరుగెత్తు!" అంటూంటే అందరి తోపాటు అనుపమ చేతులు చరుస్తూ కేరింతలు కొడుతున్నది.
'ఒక్కసారి రాజు ఎలా ఆడుతున్నాడో చూడగలిగింతే'! అనుకుంది అనుపమ
"రాజు భలే బాగా అడతాడు. చూడు చూడు వెంకట్ మూతిపగిలింది." అలివేణి తనే వెంకట్ మూతి పగలకొట్టినట్టు సంతోషపడి పోతూ అంది.
"రాజు బాగుంటాడుకదూ?" గుసగుసలాడుతూ అంది ఉమ కళ్ళార్పకుండా చూస్తు.
"అవును రాజుముందు వీళ్ళెవరూ బాగుండరు." అలివేణి దొంగచూపులతో అంది.
"బాగుండటమంటే ఏమిటో? అందంగా వుండటంకదూ? రాజు అదంగా ఉంటాడు. నేనూ అందంలేకుండావుంటే ఏంపోయింది.?అమ్మని అడగాలి... ఉహూ, అమ్మని అడగకూడదు. కోప్పడుతుంది. ఏడు స్తుంది. ఆ .... రాజుని అడగాలి. రాజు అయితే కోప్పడకుండా నింజ చెపుతాడు. రాజు....."
"రాజు గెలిచాడోచ్చి. అందరూ ఓడిపోయారోచ్చి. రాజు ఒక్కడిముందు అందరూ ఓడిపోయారు."
ఆడపిల్లలంతా గోలుగోలున అరిచారు.
అనుపమ ఉలిక్కిపడి "రాజు గెలిచాడు"అంది పెద్దగావాళ్ళసంతోషంతో తానూ పాలుపంచుకుని.
"గుడ్డిది చూచిచచ్చినట్లు ఎలా అరుస్తున్నదో?" శేఖరంకళిగా అనుపమవైపు చూస్తు అనుకున్నాడు.
ఎవరి ఈర్ష్యతోను,ఎవరిసంతోషంతోను పనిలేదు రాజుకి. అనుపమ తను గెలిచినందుకు ఆనందిస్తుందో లేదో కావాలి. అనుపమ ముఖం వైపుచూచి తృప్తి పడ్డాడు.రాజు.
ఆటలమీద మోజుపోయింది. చెడుగుడుఆడి అలశిపొయ్యరేమో కూర్చుని కధలు, కబుర్లు చెప్పుకోటం మొదలుపెట్టారు.
ఆరుగంటలయింది. నలువైపులా చీకట్లుకమ్మటం చూచి ఇళ్ళకు బైలుదేరారు పిల్లలు.
"అనుపమను వాళ్ళింటిదాకా వెళ్ళి నేదిగడుస్తాను." అంటూ రాజు మెల్లిగా అందరినీ ముందువెళ్ళ నిచ్చాడు. అనుపమ , రాజు మిగిలిపొయ్యారు.
" నువ్వొస్తావని తెలుసు రాజూ! నేనే అందరికన్నా ముందుగావచ్చానని అనుకున్నాను. పోనీలే యితఫా ఆలశ్యం చేయనుగా?"
రాజు మాట్లాడలేదు కాసేపాగి అనూచేతిని తనచేతిలోకి తీసుకుని నిమురుతూ 'అనూ!' అన్నాడు.
" ఊ!"
"నా పరీక్షలయిపోయినయి అనూ!"
"అయిపోయాయా! పరీక్ష పాసయితే ఇంకా పెద్దచదువులు చదువుతావుకదూ?"
ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రాజు.
"మాట్లాడవేం రాజూ? ఇంకా పెద్దచదువులు చదువుకోవా?"
"ఎందుకు చదవను? చదువుతాను మామయ్య చదివిస్తానన్నాడు. నేనెన్ని పెద్ద చదువులు చదివినా వద్దనడు.ఇహనుంచీ పట్నంలోవుండి చదువుకోవాలి కాలేజీ మనకులేదు. పరీక్షపాసయితే పట్నం వెళ్లి పోతాను.
రాజు ఇష్టం లేనట్లు చెపుతున్నాడని గ్రహించింది అనుపమ.